
ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఇటీవల చాట్‌జీపీటీ వినియోగదారుల కోసం కీలక అప్‌డేట్‌ను ప్రకటించారు. ఇటీవల చాట్‌జీపీటీలో వైరల్‌గా మారిన ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్ జీబ్లీ సర్వీసును సబ్‌స్క్రిప్షన్ తీసుకోని వినియోగదారులకు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
‘చాట్‌జీపీటీ ఇమేజ్ జనరేషన్ ఇప్పుడు ఉచిత వినియోగదారులకూ అందుబాటులోకి వచ్చింది’ అని శామ్ ఆల్ట్‌మన్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు జీపీటీ-4ఓ యూజర్లకు అందుబాటులో ఉండేది. దాన్ని ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ తీసుకోనివారికి కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఏఐ ఇమేజ్ జనరేషన్‌ను యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేలా ఇటీవల విభిన్న సామాజిక మాధ్యమాల్లో డిమాండ్ వెల్లువెత్తింది. దాంతో ఈమేరకు ఆల్ట్‌మన్ స్పందించడంపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆమెకు మూడు చేతులు..!
chatgpt image gen now rolled out to all free users!
— Sam Altman (@sama) April 1, 2025
26 నెలల క్రితం చాట్‌జీపీటీ ప్రారంభించిన సమయంలో అత్యంత క్రేజ్‌తో క్షణాల్లో ఈ ప్లాట్‌ఫామ్ వైరల్ అయి ఐదు రోజుల్లో 10 లక్షల మంది యూజర్లను సంపాదించుకున్నట్లు ఆల్ట్‌మన్ ఇటీవల చెప్పారు. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన బీజ్లీ స్టూడియో ద్వారా చాట్‌జీపీటీ గతంలో కంటే మరింత వైరల్ అయి కేవలం గంటలోనే 10 లక్షల మంది యూజర్ల బేస్‌ను సంపాదించిందని వివరించారు. ప్రస్తుతానికి కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్యను విడుదల చేయలేదు. ఈ కొత్త ఫీచర్‌ను ఓపెన్‌ఏఐ గత వారం జీపీటీ-4ఓలో ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఎలాంటి ఎక్స్‌టర్నల్ టూల్స్ అవసరం లేకుండా నేరుగా చాట్‌జీపీటీలోనే టెక్ట్స్, యూజర్ ఫొటోలు అప్‌లోడ్ చేసి బీజ్లీ ఇమేజ్‌లను పొందవచ్చు.