Ghibli
-
పోస్ట్‌పార్టం సమస్యలతో శ్రద్ధా ఆర్య, ట్విన్స్ జిబ్లీ ఫోటోలు సూపర్ క్యూట్
నటి శ్రద్ధా ఆర్య ఇటీవల పండంటి కవలల పిల్లలకు జన్మనిచ్చింది. ముద్దుల మూటగట్టే తన కవలల సంరక్షణలో బిజీగా ఉంది. ఇటీవల, శ్రద్ధా తన పిల్లల పేర్లను గిబ్లి-శైలి చిత్రంతో ప్రకటించింది. మరోవైపు తొలి సారిగా ప్రతి స్త్రీ ఎదుర్కొనే ప్రసవానంతర సమస్యల గురించి (Postpartum Problem) మాట్లాడింది.వివాహం పిల్లలతో ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్న శ్రద్ధా ఆర్య (Shraddha Arya) మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ప్రసవానంతర సమస్యలు గురించి మాట్లాడింది. సాధారణంగా మాతృత్వం అనేది మహిళలకు వరం మాత్రమే కాదు.. అనేక సమస్యలకు మూలం కూడా. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రసవానంతర సమస్యలతో మహిళలు చాలా ఇబ్బంది పడతారు. శారీరక సమస్యలతోపాటు,మానసిక ఒత్తిడితో మరికొన్ని ఇబ్బందు లొస్తాయి. దీనినే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (పీపీడీ)అని వ్యవహరిస్తారు. ఈ ఒత్తిడి కారణంగా, ఆత్మన్యూనతా భావంతో కుంగిపోవడం, తానే హాని చేసుకోవడం, శిశువును కూడా గాయ పరచడం వంటి స్థితికి వెళతారు. శరీరంలో మార్పులు, అధిక బరువు , మానసిక స్థితిలో మార్పులు, నిరాశ, తదితర ప్రసవానంతరం వచ్చే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రసవ సమయంలో బిడ్డను ఈ లోకంమీదికి తెచ్చేందుకు తల్లి పడే బాధ,ఆ వేదన వర్ణనాతీతం. వీటి గురించే ఆమె ఇన్‌స్టాలో ప్రస్తావించింది. ముఖ్యంగా జుట్టు రాలడం గురించి తన అభిప్రాయాలను షేర్ చేసింది. విపరీతంగా జుట్టురాలడంపై ఆవేదన వ్యక్తం చేసింది. కుచ్చులుగా రాలిపోతున్న వెంట్రుకల ఫోటోను పంచుకుంది. View this post on Instagram A post shared by Shraddha Arya (@sarya12)శ్రద్ధా ఆర్య, రాహుల్ నాగల్, జిబ్లి ఆర్ట్ ట్రెండ్టీవీ నటిగా అద్భుతమైన నటనతో పాపులర్ అయింది శ్రద్ధా ఆర్యా. 2004లో టీవీ రియాలిటీ షోలో పాల్గొన్న ఈమె.. 2006లో 'కలవనిన్ కదలై' అనే తమిళ సినిమాద్వారా హీరోయిన్గా బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత తెలుగులో గొడవ, రోమియో, కోతిమూక తదితర సినిమాల్లో నటించింది. పాటు పలు సీరియల్స్‌లోనూ యాక్ట్ చేసిన శ్రద్ధా కుండలి భాగ్య సీరియల్‌తో మరింత పాపులర్ అయింది.ఏడాది పాటు డేటింగ్ చేసిన నేవీ ఆఫీసర్ రాహుల్ నగల్ని ,శ్రద్ధా ఆర్యా 2021, నవంబరులో పెళ్లాడింది. ఈ జంటకు 2024 నవంబరు 29న ట్విన్స్( పాప, బాబు) పుట్టారు. కుమారుడికి ‘శౌర్య' అని కుమార్తెకు 'సియా' అంటూ పూర్లు కూడా పెట్టేశారు. తాజాగా జిబ్లి తరహా క్యూట్ ఫోటోలను షేర్ చేయడంతో ఇవి సోషల్ మీడియా ప్రపంచాన్ని విపరీతంగా ఆకర్షించాయి. -
గిబ్లీ–స్టైల్ ఫొటో.. 5 కోట్ల 10 లక్షల వ్యూస్!
Ghibli & style (గిబ్లీ–స్టైల్) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌గా మారింది. అందరూ తమ ఫొటోలను ఏఐకి ఇచ్చి, దాని ద్వారా గిబ్లీ–స్టైల్ ఫొటోలను పొందుతున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ కారణంగా చాలామంది OpenAI దగ్గరయ్యారు. ఈ ట్రెండ్ ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే, చివరకు OpenAI సీఈవో శామ్ ఆల్ట్మాన్ వచ్చి ‘మీరు కాస్త నిదానించండి. ఇవతల మా ఉద్యోగులు పనిభారంతో చాలా ఒత్తిడికి గురవుతున్నారు’ అని యూజర్లను అభ్యర్థించేంత. మరి బొమ్మలకు ఇంత ప్రచారం కల్పించిన వ్యక్తి గురించి మీకు తెలుసా? ఆయనే సీటల్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ గ్రాంట్ స్లాటన్.మార్చి 26న స్లాటన్ తన భార్య, కుక్కపిల్లతో కలిసి దిగిన ఫొటోను OpenAI ద్వారా గిబ్లీ–స్టైల్ బొమ్మగా మార్చి ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన వెంటనే ఆ ఫొటో వైరల్‌గా మారింది. అందరూ దాని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తమకూ అలాంటి ఫొటోలు తయారు చేసుకోవాలని ఉందన్నారు. 50 మిలియన్ల మందిపైగా ఆ పోస్ట్ చూశారంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గంటల్లోనే ఈ విషయం ట్విట్టర్లో ట్రెండ్‌గా మారింది. ఇప్పటివరకు 5 కోట్ల 10 లక్షల వ్యూస్ వచ్చాయి.చదవండి: జిబ్లీ ట్రెండ్.. చిక్కులు తెలుసుకోండి!కొందరు ఆ ఫొటోను మెచ్చుకోగా, మరికొందరు దాన్ని విమర్శిస్తూ.. ‘అది చిత్రకారుల గౌరవాన్ని దెబ్బతీస్తోందని’ కామెంట్లు చేశారు. మొత్తానికి ఆ ఫొటో ట్రెండ్ సృష్టించడంతో OpenAI ఆ విషయాన్ని గుర్తించి వెంటనే చర్యలు చేపట్టింది. అందరు యూజర్లు గిబ్లీ–స్టైల్ ఫొటోలు తయారు చేసుకునే అప్డేట్ తీసుకొచ్చింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇది అందరికీ అందుబాటులోకి వచ్చింది. అలా మనం తయారుచేస్తున్న ఫొటోల వెనుక గ్రాంట్ స్లాటన్ చేసిన పని ఉందన్నమాట! tremendous alpha right now in sending your wife photos of yall converted to studio ghibli anime pic.twitter.com/FROszdFSfN— Grant Slatton (@GrantSlatton) March 25, 2025 -
జిబ్లీ ట్రెండ్.. చిక్కులు తెలుసుకోండి!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘జీబ్లీ తరం’ కొనసాగుతుందా..? ఎప్పటికప్పుడు కృత్రిమ మేధ వేదికగా పుట్టుకొస్తున్న కృత్రిమ ఆవిష్కరణలే ఈ తరం ట్రెండ్‌గా మారుతున్నాయా..? రానున్న రోజుల్లో ప్రతీదీ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌పైనే ఆధారపడి పనిచేస్తుందా..? ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. విషయానికొస్తే.. గతంలో ఒక పోట్రేట్(ముఖ చిత్రం) వేయించు కోవాలంటే ఒక మంచి ఆరి్టస్టు దగ్గరికో, ఈ మధ్య కాలంలోనైతే ఆన్లైన్లోనే ఆర్టిస్టులకు ఆర్డర్ ఇస్తే వారే అందమైన చిత్రాన్ని వేసి ఇంటికి పంపించేవారు. అయితే కొన్ని రోజుల నుంచి జీబ్లీ ఏఐ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓపెన్ ఏ1 సంస్థ తన చాట్ జీపీటీ–40 మోడల్లో ఈ కొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ ట్రెండ్ మరింత వేగంగా వ్యాపించింది. ప్రతి ఒక్కరూ తమ ఫొటోలను ఈ వేదికగా సబ్మిట్ చేసి క్షణాల్లో వారి జీబ్లీ ఫొటోలను పొంది.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోపేస్బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్స్ వినియోగం పెరిగిన తర్వాత.. వ్యక్తిగత ఫొటోలను వివిధ సందర్భాలను మిత్రులు, తెలిసినవారికి పంచుకోవాలనే ఆసక్తి బాగా పెరిగిన విషయం విధితమే. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా అందంగా, వినూత్నంగా తమ ఫొటోలను చూసుకోవాలన్న కుతూహలం పెరిగింది. గతంలోనైతే నగరంలోని ట్యాంక్ బండ్ పైనో, అలా శిల్పారామంలోనో పోట్రేట్ వేసే కళాకారులు ఉండేవారు.. వారి వద్ద లైవ్‌గా వేయించుకునేవారు. కానీ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని.. వినూత్న, కళాత్మక యానిమేటెడ్ ఫొటోలు క్షణాల్లో వచ్చేస్తున్నాయ్.. ఇంకేముంది.. వెంటనే డౌన్లోడ్ చేసుకోవడం, షేర్లు, పోస్టులు చేయడం చకచకా జరిగిపోతున్నాయి. దీనికి సామాన్యులు మొదలు సెలబ్రెటీల వరకు మినహాయింపు లేకుండా వాడేస్తున్నారు. ఐతే ఇందులోనూ చిక్కులు లేకపోలేదు. ఈ ట్రెండ్‌లో ప్రైవసీ, కాపీరైట్ సమస్యలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాపీరైట్స్ మాత్రం జపాన్‌కు చెందిన స్టూడియో జీబ్లీ.. ప్రస్తుతం వైరల్‌గా మారిని జీబ్లీ ఫొటోలు.. చాట్‌జీపీటీలో సరికొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్. కానీ ఈ ఫొటోలు జపాన్‌లో ప్రసిద్ధి పొందిన స్టూడియో జీబ్లీకి చెందిన యానిమేషన్ శైలిలోకి మారుస్తున్నాయి. ఈ ట్రెండ్‌తో కొన్ని ప్రైవసీ, కాపీరైట్ సమస్యలు తలెత్తే అవకాశముంది. వినియోగదారులు తమ వ్యక్తిగత ఫొటోలను యాప్ సాధనాలకు అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ డేటా నిల్వ చేస్తారు. విభిన్న విధాలుగా ఉపయోగించవచ్చనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రధానంగా స్టూడియో జీబ్లీ ప్రత్యేక శైలిని అనుకరించడంతో ఆ సంస్థ కాపీరైట్ హక్కుల ఉల్లంఘన జరుగుతుందా అనే చర్చ కూడా కొనసాగుతుంది. మిలియన్ల కొద్దీ మంది ఈ సాంకేతికతను ఒకేసారి వినియోగిస్తున్న నేపథ్యంలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సందర్భమే గతంలోనూ జరిగింది. ‘హ్యాపీ బర్త్ డే టూ యూ’ అంటూ ప్రతీఒక్కరి బర్త్ డే రోజు వాడుకునే ఈ పాట వార్నర్/చాపెల్ అనే మ్యూజిక్ పబ్లిషర్ది. అప్పట్లో ఇది కూడా వైరల్ కావడంతో దీనిపై కూడా కాపీరైట్ కేసు కూడా ఫైల్ చేశారు యాజమాన్యం. కానీ అనంతరం అధికారికంగా పబ్లిక్ డోమైన్లోకి ఉచితంగా అందుబాటులోకి వచ్చింది.ఇది అనైతికం..: హయావో మియాజాకి తమ సాంకేతికత శైలిని పోలిన కళాత్మక ఫొటోలను సృష్టించడం అనైతిక చర్యగా గతంలో స్టూడియో జీబ్లీ సహ వ్యవస్థాపకుడు హయావో మియాజాకి తెలిపారు. 2016లోనే ఏఐ ద్వారా సృష్టించబడిన చిత్రాలను జీవితానికే అవమానంగా ఆయన అభివరి్ణస్తూ ఈ కళపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇలాంటి ఆధునిక సాంకేతికత వలన పెయింటింగ్, డ్రాయింగ్, పోట్రేట్ పెయింటింగ్ వంటి కళలపైన జీవనం సాగిస్తున్న కళాకారులకు కష్ట–నష్టాలను తెచ్చిపెడుతుంది. -
జిబ్లీ స్టైల్ ఫోటోపై ఆనంద్ మహీంద్రా రియాక్షన్
సోషల్ మీడియాలో జిబ్లీ ట్రెండ్ కొనసాగుతోంది. ఎక్కడ చూసినా అవే ఫోటోలు. తాజాగా ఆనంద మహీంద్రా జిబ్లీ ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. దీనిపై వ్యాపార దిగ్గజం స్పందించారు.బైకుపై ఉన్నట్లు కనిపిస్తున్న ఈ ఫోటో ఆనంద్ మహీంద్రాను ఎంతగానో ఆకట్టుకున్నట్టు ఉంది. దీనిపై స్పందిస్తూ.. ఈ జిబ్లీ ఫోటోలను ఎలా చేయాలో నేర్చుకోవాలి అంటూ.. ఒక స్మైమ్ ఎమోజీ యాడ్ చేశారు. ఇంజినీర్స్ వ్యూ అనే ఎక్స్ యూజర్ ఆనంద్ మహీంద్రా బైకుపై ఉన్నట్లు క్రియేట్ చేసి జిబ్లీ స్టైల్లోకి మార్చాడు. ఇప్పుడిది పర్ఫెక్ట్ అంటూ క్యాప్షన్స్ ఇచ్చాడు.😄Have to learn how to do this Ghibli stuff… https://t.co/XnDJArGyWv— anand mahindra (@anandmahindra) April 3, 2025జిబ్లీ స్టూడియోజిబ్లీ అనేది జపనీస్ యానిమేషన్ స్టూడియో. చేతితో గీచే యానిమేషన్, బ్యాక్గ్రౌండ్స్, భావోద్వేగపూరితమైన కథనాలకు ఇది బాగా పాపులర్ అయింది. కాబట్టి ఈ ఫోటోలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలామంది ఫిదా అయిపోయారు. ఇప్పుడు యూత్ మొత్తం తమ ఫోటోలను జిబ్లీ స్టైల్లోకి మార్చుకుని వినియోగించుకుంటున్నారు.జిబ్లీ వినియోగం ఎక్కువ కావడంతో ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ స్పందించారు. జిబ్లీ వినియోగం ఎక్కువగా ఉంది. యూజర్లు ఫోటోలను రూపొందించడంలో కొంత విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే మా సిబ్బందికి కూడా నిద్ర అవసరం కదా అంటూ ట్వీట్ చేశారు. -
మీకు దండం పెడతా ఆ ఫొటోలు ఆపండ్రా బాబు
మార్కెట్లోకి ఏ కొత్త ప్రాడక్ట్ వచ్చినా జనం ఊరుకోరు.. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా వచ్చే అప్డేట్స్.. మార్పులు.. కొత్తకొత్త ఆవిష్కరణలు వంటివి జనాన్ని మరింతగా ఆకట్టుకుంటాయి. ఎంతలా అంటే కొత్త ఆవిష్కరణ తీసుకొచ్చిన కంపెనీకి సైతం నిద్రపట్టని స్థాయిలో మనోళ్లు వాడకం ఉంటుంది. ఐ ఫోన్ కొత్త మోడల్ వచ్చిందంటే చాలు తిండి నిద్రమానేసి దానికోసం లైన్లో నిలబడి చివరకు దాన్ని దక్కించుకునేవరకూ ఊపిరిసలపని వాళ్ళు కొందరు. దానికోసం ఏకంగా కిడ్నీలు అమ్ముకునేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఫోన్ కొనకపోతే ఉరేసుకుంటాను అని తల్లిదండ్రులను బెదిరించిన కేసులూ ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా చాట్‌జీపీటీలో వచ్చిన కొత్త ఆవిష్కరణ జిబ్లీ స్టూడియో ఫోటోలు.. అంటే మనం ఏదైనా ఫోటోను దానిలోకి అప్లోడ్ చేస్తే అది కార్టూన్ మాదిరి మార్చేసి మనకు తిరిగి ఇస్తుందన్నమాట. అంటే ఒక చిత్రకారుడు పెన్సిల్.. కుంచెతో వేసినట్లు ఆ ఫోటోలు ఉంటాయి.ఈ కొత్త ఫీచర్ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం ఐంది. ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఫోటోలు అప్లోడ్ చేసేసి వాటిని జిబ్లీ స్టూడియో ఫొటోలుగా మార్చేసుకుని ఫేసుబుక్ ట్విట్టర్.. ఇన్‌స్టాలో పోస్టు చేసుకుంటున్నారు. మనిషికి తనని తాను చూసుకోవడం ప్రతిసారీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందేమో..అద్దంలో ఒకసారి ఫోటోలో ఒకసారి.. బొమ్మ గీయించుకొని ఒకసారి..చూసుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు కొత్తగా కార్టూన్ లో ఎలా ఉంటానో అనే కుతూహలంతో.. చాట్‌జీపీటీలో అందరూ స్టూడియో గిబ్లీ ఆర్ట్ స్టైల్ లో తమ ఫొటోలు మారుస్తూ సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ ఫోటోల పిచ్చి ఏకంగా ఆ చాట్‌జిపిటి సంస్థను సైతం కుదిపేసింది.మనం అప్లోడ్ చేసిన మన మామూలు ఫోటోలను ఏకంగా జపానీస్ యానిమేషన్ స్టూడియో డైరెక్టర్లు హయావో మిజజాకి, ఇసావో టకహట రూపొందించిన పాపులర్ సినిమాలు స్పిరిటెడ్ అవే , ప్రిన్సెస్ మోనోనొకే వంటి సినిమా క్యారెక్టర్లను పోలి ఉండేలా మార్చేసి మనకు అందిస్తోంది. . ఈ కార్టూన్ చిత్రాలు మంచి జనాదరణ పొందడంతో కోట్లకొద్దీ ఫోటోలు చాట్‌జీపీటీలోకి వచ్చి పడుతున్నాయి. దీంతో అక్కడి సిబ్బందికి తిండి నిద్ర కూడా లేదంట. దీంతో ఈ ట్రేండింగ్ ను చూసి విసుగెత్తిపోయిన చాట్ జిపిటి వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్మాన్ బాబూ కాస్త గ్యాప్ ఇవ్వండి.. మా సిబ్బంది కూడా కాస్త నిద్రపోవాలి కదా అని ట్విట్టర్లో పోస్ట్ చేసారు. అంటే కొత్త ట్రెండ్ మొదలైతే జనం ఎంతలా వేలం వెర్రిలా ఉంటారన్నదానికి ఇదో ఉదాహరణ అన్నమాట.- సిమ్మాదిరప్పన్న -
చాట్‌జీపీటీ యూజర్లకు గుడ్‌న్యూస్
ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఇటీవల చాట్‌జీపీటీ వినియోగదారుల కోసం కీలక అప్డేట్ను ప్రకటించారు. ఇటీవల చాట్‌జీపీటీలో వైరల్‌గా మారిన ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్ జీబ్లీ సర్వీసును సబ్స్క్రిప్షన్ తీసుకోని వినియోగదారులకు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.‘చాట్‌జీపీటీ ఇమేజ్ జనరేషన్ ఇప్పుడు ఉచిత వినియోగదారులకూ అందుబాటులోకి వచ్చింది’ అని శామ్ ఆల్ట్‌మన్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు జీపీటీ-4ఓ యూజర్లకు అందుబాటులో ఉండేది. దాన్ని ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోనివారికి కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఏఐ ఇమేజ్ జనరేషన్‌ను యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేలా ఇటీవల విభిన్న సామాజిక మాధ్యమాల్లో డిమాండ్ వెల్లువెత్తింది. దాంతో ఈమేరకు ఆల్ట్‌మన్ స్పందించడంపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఆమెకు మూడు చేతులు..!chatgpt image gen now rolled out to all free users!— Sam Altman (@sama) April 1, 202526 నెలల క్రితం చాట్‌జీపీటీ ప్రారంభించిన సమయంలో అత్యంత క్రేజ్‌తో క్షణాల్లో ఈ ప్లాట్‌ఫామ్ వైరల్ అయి ఐదు రోజుల్లో 10 లక్షల మంది యూజర్లను సంపాదించుకున్నట్లు ఆల్ట్‌మన్ ఇటీవల చెప్పారు. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన బీజ్లీ స్టూడియో ద్వారా చాట్‌జీపీటీ గతంలో కంటే మరింత వైరల్ అయి కేవలం గంటలోనే 10 లక్షల మంది యూజర్ల బేస్‌ను సంపాదించిందని వివరించారు. ప్రస్తుతానికి కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్యను విడుదల చేయలేదు. ఈ కొత్త ఫీచర్‌ను ఓపెన్ఏఐ గత వారం జీపీటీ-4ఓలో ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఎలాంటి ఎక్స్టర్నల్ టూల్స్ అవసరం లేకుండా నేరుగా చాట్‌జీపీటీలోనే టెక్ట్స్, యూజర్ ఫొటోలు అప్లోడ్ చేసి బీజ్లీ ఇమేజ్‌లను పొందవచ్చు. -
ఆమెకు మూడు చేతులు..!
సోషల్ మీడియాలో ఏఐ ఆర్ట్ స్టూడియో జీబ్లీ ట్రెండ్ కొనసాగుతోంది. చాట్‌జీపీటీ, గ్రోక్ వంటి జనరేటివ్ ఏఐ చాట్బాట్ల ద్వారా టెక్ట్స్ ఇచ్చి ఇమేజ్ను అప్లోడ్ చేస్తే అందుకు తగ్గుట్టుగా గ్రాఫిక్ ఇమేజ్ జనరేట్ అవుతుంది. దాంతో చాలామంది వినియోగదారులు దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఒక డెంటిస్ట్ తాను అప్లోడ్ చేసిన ఇమేజ్‌కు చాట్‌జీపీటీ అందించిన జీబ్లీ గ్రాఫిక్ ఇమేజ్ను చూసి కంగుతిన్నారు.స్నిగ్ధ శర్మ అనే డెంటిస్ట్ చాట్‌జీపీటీలో తన ఫొటోను అప్లోడ్ చేసి బీజ్లీ ఇమేజ్ జనరేట్ చేయాలనుకున్నారు. తాను గడ్డం కింద చేతులు పెట్టినట్లు పోజిచ్చిన ఫోటోను అప్లోడ్ చేశారు. కానీ చాట్‌జీపీటీ మాత్రం మూడు చేతులతో యూజర్ ఫోటోను జీబ్లీ వర్షన్లో అందించింది. రెండు చేతులు ఒరిజినల్ ఫొటోలో మాదిరి గడ్డం కింద చేతులు పెట్టుకున్నట్లుగా ఉంటే.. మరో చేతితో ఐస్‌క్రీమ్ తింటున్నట్లు ఇమేజ్ జనరేట్ అయింది. దీనిపై డెంటిస్ట్ స్పందిస్తూ ‘మీరెప్పుడూ ఇలా చేసి ఉండరు’ అని పోస్ట్ చేశారు. దీన్ని కాస్తా ఆ డెంటిస్ట్ సరదాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. దాంతో అది వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Snigdha Sharma (@drsnigdhasharma)ఇదీ చదవండి: 60 నిమిషాల్లో కొత్తగా 10 లక్షల మంది యూజర్లుఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. మూడు చేతులున్న తన ఫొటో చూసిన వారు నవరాత్రి ఉత్సవాల్లో కాళిమాతగా కొందరు కామెంట్ చేశారు. ‘ఒకేసారి రెండు మొబైల్ ఫోన్లలో చాటింగ్ చేయొచ్చు’ అని కొందరు తమ అభిప్రాయాలను పోస్ట్ చేశారు. ఏఐ జనరేట్ చేసే ఫోటోలు కేవలం సరదాకోసం మాత్రమేనని గ్రహించాలి. ఏఐ కూడా చాలాసార్లు పొరపాటు చేస్తుందనడానికి ఇదో ఉదాహరణ. అందుకే ఏఐ కంటెంట్‌పై పూర్తిగా ఆధారపడకుండా మ్యానువల్‌గా క్రాస్ చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్ఏఐకు చెందిన గ్రోక్ చాట్‌బాట్, గూగుల్ జెమినీ వంటి ప్రత్యామ్నాయాలు కూడా ఇలా ఏఐ ఇమేజ్ను సృష్టిస్తున్నాయి. -
Ghibli ఫొటోలు ట్రై చేస్తున్నారా?.. ఇది మీకోసమే!
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్.. ఇలా ఏ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా ఫీడ్ మొత్తం జిబ్లీ(Ghibli) ఫొటోలతో నిండిపోతోంది. సామాన్యులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు.. ఇలా అంతా కార్టూన్ తరహా ఫొటోలను పంచుకుంటూ మురిసిపోతున్నారు. ఎడాపెడా ఫొటోలు అప్లోడ్ చేస్తుండడంతో.. నెట్టింట ఈ నయా ట్రెండ్ ఊపేస్తోంది. అయితే అలా అప్లోడ్ చేసే ముందు ఇది ఎంతవరకు సురక్షితం అనే ఆలోచన మీలో ఎంతమంది చేస్తున్నారు?.. ఏఐ బేస్డ్ చాట్‌బాట్ యూజర్లను ఆకర్షించేందుకు ఆయా కంపెనీలు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే.. ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్‌జీపీటీలో (ChatGPT) జిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. తమకు కావాల్సిన ఫొటోను ఎంచుకుని.. ఫలానా స్టైల్లో కావాలని కోరితే చాలూ.. ఆకర్షనీయమైన యానిమేషన్ తరహా ఫొటోలను సృష్టించుకోవచ్చు. ఈ ట్రెండ్ విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడంతో ఇతర ఏఐ ప్లాట్‌ఫామ్‌లు సైతం ఇవే సదుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే ఆ వాడకం పరిధి దాటి శ్రుతిమించి పోతోంది. ఎంతవరకు సురక్షితం?ఏదైనా మనం ఉపయోగించినదాన్ని బట్టే ఉంటుంది. అది సాంకేతిక విషయంలో అయినా సరేనని నిఫుణులు తరచూ చెబుతుంటారు. అలాగే జిబ్లీ స్టైల్ ఏఐ ఇమేజ్ జనరేటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సృజనాత్మకత మరీ ఎక్కువైపోయినా.. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. మరోవైపు వ్యక్తిగతమైన ఫొటోలను ఏఐ వ్యవస్థల్లోకి అడ్డగోలుగా అప్లోడ్ చేస్తే.. అవి ఫేషియల్ డాటాను సేకరించే ప్రమాదమూ లేకపోలేదని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఇలాగే కొన్ని కంపెనీలు వ్యక్తిగత డాటాను తమ అల్గారిథమ్‌లలో ఉపయోగించుకుంటున్న పరిస్థితులను నిపుణులు ఉదాహరిస్తున్నారు.అలాంటప్పుడు ఏం చేయాలంటే..వ్యక్తిగత ఫొటోలను అప్లోడ్ చేసేటప్పుడు.. ఆ జనరేటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రైవసీ పాలసీల విషయంలో నమ్మదగిందేనా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోండి. అందుకోసం సదరు జనరేటర్ గురించి నెట్లో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానికి యూజర్లు ఇచ్చే రివ్యూలను చదవాలి. అన్నికంటే ముఖ్యమైన విషయం.. సున్నితమైన అంశాల జోలికి పోకపోవడం. చిన్నపిల్లల ఫొటోలను ప్రయత్నించకపోవడమే మంచిది. మరీ ముఖ్యమంగా ప్రముఖుల ఫొటోలను ప్రయత్నించకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇది చట్టపరమైన చర్యలకు అవకాశం కూడా ఇచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ప్రస్తుతానికి.. ఛాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, ఎక్స్ గ్రోక్, డీప్‌ఏఐ, ప్లేగ్రౌండ్‌ఏఐలు.. పరిమితిలో ఉచితంగా,అలాగే పెయిడ్ వెర్షన్లలోనూ రకరకాల ఎఫెక్ట్‌లతో ఈ తరహా ఎఫెక్ట్‌లను యూజర్లకు అందిస్తున్నాయి. వీటితో పాటు జిబ్లీ ఏఐ కూడా స్టూడియో జిబ్లీస్టైల్ ఆర్ట్ వర్క్‌తో ఫొటోలను చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. నోట్: పర్సనల్ డాటా తస్కరణ.. సైబర్ నేరాలు పెరిగిపోతున్న రోజుల్లో ఏ టెక్నాలజీని అయినా.. అదీ సరదా కోణంలో అయినా ఆచితూచి.. అందునా పరిమితంగా వాడుకోవడం మంచిదనేది సైబర్ నిపుణుల సూచన.