bangalore company
-
డేటా సెంటర్ మార్కెట్లో బెంగళూరు కంపెనీ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: రియల్టీ రంగంలో ఉన్న బెంగళూరు కంపెనీ ఆర్ఎంజడ్ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. డేటా సెంటర్ ఆపరేటర్ కోల్ట్ డేటా సెంటర్ సర్వీసెస్‌తో సమాన వాటాగా సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆర్ఎంజడ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ ద్వారా భారత డేటా సెంటర్ మార్కెట్లో 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆర్ఎంజడ్ వెల్లడించింది.ఈ నిధులతో తొలుత నవీ ముంబై, చెన్నైలోని అంబత్తూర్లో ఇప్పటికే ఉన్న కేంద్రాల్లో అభివృద్ధిని వేగవంతం చేస్తారు. భవిష్యత్తులో అదనంగా మూడవ కేంద్రాన్ని జోడిస్తారు. అన్ని దశలు పూర్తి అయితే డేటా సెంటర్ల పూర్తి సామర్థ్యం 250 మెగావాట్లు ఉంటుందని కంపెనీ తెలిపింది. యూరప్, జపాన్‌తోపాటు భారత్‌లో కోల్ట్ డేటా సెంటర్ సర్వీసెస్ 25 ఏళ్లుగా డేటా సెంటర్ల అభివృద్ధి, నిర్వహణలో నిమగ్నమై ఉంది. -
Sakshi Cartoon: ఆఫీసులో నిద్రపోయి, ఇక్కడ మేల్కోని ఉండటం ఏంటో!
ఆఫీసులో నిద్రపోవడం, ఇక్కడ మేల్కోని ఉండటం ఏం బాగోలేదండీ! -
మహిళా ఉద్యోగులపై ఎండీ అఘాయిత్యం
ఆయన ఓ కంపెనీకి ఎండీ. దేశంలోని వివిధ ప్రాంతాలకు అధికారిక పర్యటనల కోసం తనతో పాటు కొంతమంది ఉద్యోగినులను కూడా తీసుకెళ్లేవాడు. అలా వెళ్లినపుడు మత్తు మందు ఇచ్చి వారిపై అత్యాచారం చేయడమే కాక, దాన్ని వీడియో కూడా తీసేవాడు. ఈ విషయమై కంపెనీ ఉద్యోగినులు ముగ్గురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైంది. బెంగళూరులోని మైకో లే అవుట్ ప్రాంతానికి చెందిన భానుప్రకాష్.. ఎంజీ రోడ్డులో ప్రైవేటు హెల్త్ కన్సల్టెన్సీ నిర్వహిస్తాడు. టెలి మార్కెటింగ్ ఉద్యోగాలంటూ అతడు అమ్మాయిలను నియమించుకుంటాడు. శిక్షణ పేరు చెప్పి వాళ్లను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. వాళ్లకు మత్తుమందు ఇచ్చి తన హోటల్ గదిలో అత్యాచారం చేసేవాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వాళ్లు అంటే.. వాళ్లకు వీడియో చూపించి.. దాన్ని ఇంటర్నెట్లో పెడతానని తమను బెదిరించేవాడని బాధిత యువతులు వాపోయారు. ఆ తర్వాత కూడా పదే పదే వాళ్లను బెదిరిస్తూ తన కోరిక తీర్చుకునేవాడట. ఎట్టకేలకు ధైర్యం చేసిన బాధితులు.. నగర పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.