ఎల్‌ అండ్‌ టీకి భారీ ఆర్డర్‌ | L&T wins Rs3,375-crore contract from Mauritius govt to build Metro Express | Sakshi
Sakshi News home page

ఎల్‌ అండ్‌ టీకి భారీ ఆర్డర్‌

Published Wed, Aug 2 2017 2:27 PM | Last Updated on Tue, Oct 16 2018 5:16 PM

ఎల్‌ అండ్‌ టీకి భారీ ఆర్డర్‌ - Sakshi

ఎల్‌ అండ్‌ టీకి భారీ ఆర్డర్‌

ముంబై:  ఇంజనీరింగ్‌ మేజర్‌  లార్సన్‌ అండ్‌ టర్బో భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది.  విదేశీ ప్రభుత్వంనుంచి  వేలకోట్ల  విలువైన ప్రాజెక్టును సాధించింది. మారిషస్‌ ప్రభుత్వం  ఆధ్వర్యంలోని  మెట్రోఎక్స్‌ప్రెస్‌  లిమిటెడ్‌ నుంచి ఈ భారీ ఆఫర్‌ కొట్టేసింది.   రైలు ఆధారిత పట్టణ రవాణా వ్యవస్థ రూపకల్పన,మరియు నిర్మాణానికిగాను రూ. 3,375 కోట్ల రూపాయల కాంట్రాక్టును గెలుచుకుంది. ఇది తమకు  చాలా కీలకమైన ఆర్డర్‌ని ఎల్‌ అండ్‌ టీ బిఎస్ఇ  ఫైలింగ్‌ లో తెలిపింది.

ఆఫ్రికన్ ద్వీప దేశంలో సమీకృత లైట్  రైలు ఆధారిత రవాణా వ్యవస్థకు ప్రధాన పురోగతి  ఈ ఒప్పందమని పేర్కొంది. 26 కిలోమీటర్ల మార్గం క్యూరీపైప్‌ తో పోర్ట్ లూయిస్లోని ఇమ్మిగ్రేషన్ స్క్వేర్‌ కు అనుసంధానిస్తుందని, 19 స్టేషన్లను కలిగి ఉంటుందని తెలిపింది.  మారిషస్ ప్రధాన మంత్రి ప్రవీంద్ కుమార్ జుగ్నౌత్ సమక్షంలో జూలై 31 న ఒప్పందంపై సంతకాలు జరిగాయని కంపెనీ తెలిపింది.

తమ నైపుణ్యంపై విశ్వాసం ఉంచిన  మారిషస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు  తెలిపింది. అలాగే ఈ కొత్త లైట్‌సిస్టం ద్వారా  రూటు అభివృద్ధితోపాటు  పరిపుష్టమైన ఆర్థిక లాభాలను గణనీయంగా  ఆర్జించనుందని ఎల్‌ అండ్‌ ఎండీ, సీఈవో  ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్  తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement