Class IV student
-
జామెట్రీ కంపాస్‌తో 108 సార్లు దాడి
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థులు తోటి విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. జామెట్రీ కంపాస్‌తో విచక్షణారహితంగా 108 సార్లు దాడి చేసి గాయపరిచారు. నవంబర్ 24వ తేదీన ఇండోర్ నగరంలోని ఏరోడ్రోమ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థుల దాడి ఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(డబ్ల్యూసీ) తీవ్రంగా స్పందించింది. ఘటనపై వెంటనే తమకు నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ‘‘ గొడవ సందర్భంగానే చిన్నారులు ఇలా ప్రవర్తించారని వార్తలొచ్చాయి. నిందితులైన విద్యార్థులకు హింసాత్మకమైన సన్నివేశాలున్న వీడియో గేమ్స్ ఆడే అలవాటు ఉందా? నాలుగో తరగతి విద్యార్థుల్లో ఇంతటి హింసాప్రవృత్తి ఎలా సాధ్యం? దీనికి కారణాలేంటి? ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తాం. పోలీసుల నివేదిక కోరాం’’ అని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ పల్లవి చెప్పారు. ‘‘ మా అబ్బాయి రక్తమోడుతూ ఇంటికొచ్చాడు. అసలేం జరిగిందో తెలీడం లేదు. తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీ ఇచ్చేందుకు స్కూల్ యాజమాన్యం ఒప్పుకోవడం లేదు. వారు బహుశా తమ తప్పును కప్పిపుంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారేమో’’ అని బాధిత విద్యార్థి తండ్రి వాపోయాడు. ‘‘ బాధిత విద్యార్థి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాం. నిందితులైన విద్యార్థుల వయసు పదేళ్లలోపే. సంబంధిత చట్టాల ప్రకారం కేసు దర్యాప్తు జరుగుతోంది’’ అని నగర అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వివేక్ సింగ్ చౌహాన్ చెప్పారు. ‘‘కొంతకాలంగా స్కూలు చిన్నారుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. దీనిపై అందరూ, ముఖ్యంగా తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సిన అవసరముంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. -
Odisha: గుంజీలు తీస్తూ విద్యార్థి మృతి
జాజ్‌పూర్(ఒడిశా): బడి ఆవరణలో స్నేహితులతో ఆడుకుంటున్న విద్యార్థికి టీచర్ వేసిన శిక్ష ప్రాణం మీదకు తెచ్చింది. నాలుగో తరగతి విద్యార్థి గుంజీలు తీస్తూ కుప్పకూలి ఆస్పత్రిలో కన్నుమూసిన విషాధ ఘటన ఒరాలీ గ్రామం దగ్గర్లోని సూర్యనారాయణ్ నోడల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో జరిగింది. రసూల్పూర్ బ్లాక్ విద్యాధికారి(బీఈఓ) నీలాంబర్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం పదేళ్ల పిల్లాడు రుద్ర నారాయణ్ సేథీ బడి ప్రాంగణంలో మధ్యాహ్నం పూట మూడు గంటలకు తోటి విద్యార్థులతో ఆడుకుంటున్నాడు. అది క్లాసులు జరిగే సమయం కావడంతో ‘‘క్లాస్ వదిలేసి ఏంటీ ఆటలు?’’ అంటూ కోప్పడి అక్కడి టీచర్.. సేథీసహా ఐదుగురిని గుంజీలు తీయండని ఆదేశించారు. దీంతో గుంజీలు తీస్తూ సేథీ కొద్దిసేపటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని దగ్గర్లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి, మెరుగైన వైద్యం కోసం కటక్‌లోని ఎస్సీబీ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధృవీకరించారు. ‘ చిన్నారి మరణానికి వీళ్లే కారకులు అంటూ ఎవ్వరూ మాకు ఫిర్యాదు చేయలేదు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని బీఈఓ నీలాంబర్ స్పష్టం చేశారు. -
విషాదంలో మరో భారతీయ కుటుంబం
దుబాయి: దుబాయి ఒమన్ లోని మరో భారతీయ కుటుంబాన్ని విషాదం వెంటాడింది. తండ్రి తన కూతురుతోపాటు వెళ్తున్న వాహానాన్ని ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనాదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. కాగా సెల్‌ఫోన్ ఆధారంగా కుటుంబసభ్యులకు ఫోన్ చేయగా వారు ఎంతకు స్పందించలేదు. దాంతో ఫోన్ నెంబర్ ఆధారంగా చిరునామా సేకరించి... మృతుల ఇంటికి వెళ్లగా అక్కడ మృతుడి భార్య కూడా మృతి చెందిందని తెలిపారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన మృతుడు సోహార్ స్టిల్ కంపెనీలో, అతడి భార్య ఎల్ అండ్ టీలతో పని చేస్తున్నారని తెలిపారు. వారి కుమార్తె స్థానిక భారతీయులకు చెందిన పాఠశాలలో నాలుగో తరగతి చదువుతుందని పోలీసులు వెల్లడించారు. భారత్ లోని వారి బంధువులు వీరి మృతిపై సమాచారం అందిస్తామని తెలిపారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. -
విద్యార్ధిని పై మూడు రోజులుగా అత్యాచారం