
లండన్ : యూకేలోని పోర్ట్ ల్యాండ్ హార్బర్ సమీపంలో "మోలా-మోలా" అని పిలిచే అరుదైన అతిపెద్ద సముద్రపు చేప దొరికింది. డోర్సెట్ తీరంలో సజీవంగా ఉన్న అత్యంత అరుదైన అతిపెద్ద బోనీ ఫిష్‌ని గుర్తించారు. సాధారణంగా ఉష్ణమండల జలాల్లో ఈ చేపలు సంచరిస్తాయి. ఈ చేపలు 2.3 టన్నుల బరువు, 10 అడుగుల పొడవు ఉంటాయి.
మరియన్ కన్జర్వేషన్ సొసైటీ ట్విట్టర్‌లో మోలా మోలా ఫోటోను పోస్ట్ చేసి, గ్రహం మీద సజీవంగా ఉన్న అతిపెద్ద బోనీ ఫిష్, జెల్లీ ఫిష్‌లను తినడం కోసం వేసవికాలంలో యూకేకి వచ్చిందని కామెంట్ పెట్టారు. మోలా మోలా ఫోటో సామాజిక మాద్యమాల్లో వైరల్ అయింది. ఈ చేపను లిజ్ హేమ్స్లీ చిత్రీకరించారు.
Wow! An Ocean Sunfish (or Mola Mola) spotted off #Portland Harbour yesterday afternoon. #Sunfish are the largest bony fish on the planet and visit UK seas during the summer months to eat jellyfish. Have you ever seen one?
— Marine Conservation Society (@mcsuk) June 15, 2020
Thanks to Liz Hemsley for sending us the picture 📸 pic.twitter.com/HunVjlLpXO
Comments
Please login to add a commentAdd a comment