big fish
-
క్రేన్ చివర భారీ సముద్రపు జీవి.. చెడుకి సంకేతమా?
వైరల్: మనిషి నమ్మకం ఒక బలం. మూఢనమ్మకం మనిషిలోని బలహీనత. అయితే.. కొన్ని విషయాలను నమ్మితీరాలని వాదిస్తుంటారు పెద్దలు. అందుకు గతంలోని కొన్ని విషయాలను తెరపైకి తెస్తుంటారు. ఓ భారీ సముద్ర జీవి విషయంలోనూ ఇప్పుడు ఇలాంటి ప్రచారమే నడుస్తోంది. భారీ చేపను కొందరు ముచ్చటగా ఫోన్లలో చిత్రీకరిస్తుంటే.. చాలామంది మాత్రం అటువైపు చూడకుండానే వెళ్లిపోతున్నారు. చిలీలో స్థానికులు ఈ మధ్యే పదహారు అడుగుల పొడవున మాన్స్టర్ చేపను పట్టుకున్నారు. అరికా నగరంలో.. ఈ కోలోసాల్ ఓర్ఫిష్(రోయింగ్ ఫిష్) దర్శనమిచ్చింది. సాధారణంగా అవి సముద్రపు లోతుల్లో ఉంటాయి. కానీ, ఇలా పైకి రావడం మంచిది కాదని నమ్ముతున్నారు అక్కడి జనాలు. ఈ మేరకు క్రేన్‌కు వేలాడుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇది చెడుకి సంకేతమని, సునామీ, భూకంపాలు వస్తాయని భయంతో వణికిపోతున్నారు. డిజాస్టర్ ఫిష్.. ఈ తెడ్డు చేపకు విపత్తుల చేప అని పేరు ఒకటి ముద్ర పడింది. ఎక్కడో సముద్ర గర్భంలో ఉండే ఈ రాకాసి చేప.. నీటిలోని భూగర్భ కదలికల తర్వాతే పైకి వస్తాయట. ఆ తర్వాత భారీ భూకంపం, సునామీ ముంచుకొస్తుందని నమ్ముతున్నారు వాళ్లు. అంతేకాదు పట్టుకున్న వాళ్లకు శాపం తగులుతుందనే నమ్మకం ఉంది. చిలీలోనే కాదు.. జపాన్, సముద్రపు తీరం ఉన్న దేశాల్లోనూ ఇలాంటి కథలు జోరుగానే ప్రచారం అయ్యాయి. అంతెందుకు అలా కనిపించిన తర్వాతే.. ఫుకుషిమాలో భూకంపం సంభవించిందని, 20 వేల మందిని బలి తీసుకుందని నమ్ముతున్నారు. పాపం.. చేప వీటిని సముద్రపు భారీ పాములు, సముద్ర రాక్షసి చేప అనే కథలు ఈ ఓర్ఫిష్ మీద ప్రచారం అవుతుంటాయి. కానీ, సైంటిఫిక్ కోణంలో పాపం అవి ప్రమాదకరమైనవి అసలే కావు. ఏనాడూ అవి మనుషులపైగానీ, పడవలపైగానీ దాడి చేసిన దాఖలాలు లేవు. జబ్బు పడినప్పుడు, చనిపోయినప్పుడు, పిల్లలను కనేటప్పుడు మాత్రమే నీటి అడుగు నుంచి పైకి వస్తాయి. ఒక్కోసారి తుఫానులు, బలమైన అలల ధాటికి కూడా కొట్టుకు వస్తాయి. ఓర్ఫిష్ చేపలు నాచు, పాచిని తింటాయి. అంతెందుకు వాటికి నిజమైన దంతాలు కూడా లేవు. బదులుగా.. చిన్న చిన్న చేపలను మింగడానికి గిల్ రేకర్స్ అని పిలువబడే వ్యవస్థ ఉంటుంది. వాటి జీర్ణవ్యవస్థకు చిన్న ద్వారం మాత్రమే ఉంటుంది. పైకి నీటిని చిమ్ముతుంటే.. చూడడానికి మాత్రమే అదొక భయంకరమైన జీవిగా కనిపిస్తుంది అంతే. -
వలకు చిక్కిన భారీ చేపలు
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి చెరువులో మత్స్యకారుల వలలో భారీ చేపలు చిక్కాయి. మినీ ట్యాంకుబండ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నాలుగైదు రోజులుగా చెరువు నుంచి దిగువకు తూముల ద్వారా నీటిని ఖాళీ చేస్తున్నారు. కొన్నేళ్లుగా చెరువులో చేపలు పెంచుతున్న మత్స్యకారులు రెండు రోజులుగా చేపలు పడుతున్నారు. సోమవారం వలలో 30 నుంచి 25 కిలోల చేపలు 30 వరకు వలకు చిక్కాయి. ఇంత పెద్ద చేపలను గతంలో ఎప్పుడూ చూడలేదని మత్స్యకారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్: ఆగేదే లే! ముందుకెళ్లాల్సిందే.. మంత్రి కేటీఆర్ ఆదేశం) -
Uppada: మత్స్యకారుల వలకు ‘బాహుబలి’
కాకినాడ రూరల్(తూర్పుగోదావరి): బంగాళాఖాతం సముద్ర జలాల్లో తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడకు చెందిన మత్స్యకారుల వలకు బాహుబలి చేప చిక్కింది. కంబాల టేకుగా పిలిచే ఈ చేప సుమారు 2 మీటర్ల పొడవు, 4 మీటర్ల మేర వెడల్పు ఉంది. బరువు సుమారు 300 కేజీలు. దీనిని అతి కష్టంపై బోటు నుంచి క్రేన్‌తో ఆటో పైకి ఎక్కించి, కాకినాడకు తరలించారు. అర డజను మంది మత్స్యకారులు తాళ్ల సాయంతో కిందకు దింపి విక్రయించగా వెంకన్న అనే వ్యాపారి రూ.16,500కు కొనుగోలు చేశాడు. చదవండి: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు -
వామ్మో అతి పెద్ద చేప.. పడవ అంత చేప!
-
వామ్మో అతి పెద్ద చేప.. పడవ అంత చేప!
నందలూరు(వైఎస్సార్ జిల్లా): ఈమధ్యకాలంలో అత్యంత భారీ చేపలను చూస్తునే ఉన్నాం. అవి తినడానికి ఎలా ఉంటాయో కానీ చేపల సైజు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. తాజాగా అతి పెద్ద చేప ఒకటి వైఎస్సార్ జిల్లాలో చెయ్యేరు నదిలో తారసపడింది. ఆ చేపను చూస్తే అది పడవ అంత సైజ్‌ను దాటి కనిపించింది. దాన్ని పడవలో వేసినా పట్టదేమో అనేంతంగా ఉంది. నందలూరు సాయిబాబా గుడి దగ్గర చెయ్యేరు నదిలో కనిపించిన ఈ చేప.. అరుదైన చేప అనక తప్పదు. నీటిలో తోకను అలా ఆడిస్తూ ఈదుతుంటే నదిలో అద్భుత దృశ్యం ఆవిషృతమైనట్లే ఉంది. మరి ఈ చేపను మీరు ఓ లుక్కేయండి. -
వలలో 20 కిలోల చేప.. మనోడికి పండగే పండగ
రుద్రంగి (వేములవాడ): ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి, కలికోట శివారులోని సూరమ్మ చెరువు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత అలుగు దూకింది. దీంతో శుక్రవారం సూరమ్మ ప్రాజెక్టులో నుంచి భారీ ఎత్తున చేపలు బయటకు వచ్చాయి. వాటిని పట్టేందుకు రెండు గ్రామాల ప్రజలు పోటెత్తారు. పెద్ద చేపలు పడడంతో జాలరుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కలికోటకు చెందిన ఎల్ల రాజు వలకు దాదాపు 20 కిలోల చేప చిక్కింది. దాన్ని విక్రయించగా రూ.1,600 వచ్చినట్లు రాజు చెప్పాడు. మానేరు అందాలు.. చూడగానే వాహ్.. అనిపించే ఈ సుందర దృశ్యం కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు ప్రాజెక్టుది. ఎగువ నుంచి వస్తున్న వరదకుతోడు స్థానికంగా కురుస్తున్న వానలతో మానేరు డ్యామ్ జలకళతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. భారీగా వరద వస్తుండడంతో అధికారులు గురువారం రాత్రి 12 గేట్లను తెరిచారు. శుక్రవారం మరో ఆరు గేట్లను తెరిచారు. మొత్తం 18 గేట్ల ద్వారా లోయర్ మానేరు డ్యామ్ నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. నిండుకుండలా కనిపిస్తున్న డ్యామ్.. పచ్చని పొలాలు.. ఆ పక్కన కరీంనగర్ నగరం.. ఆకట్టుకునే హైదరాబాద్ హైవే.. తీగల వంతెనను తాకుతూ వరద వెళ్తుండడంతో ఆ దృశ్యం మరింత ఆకర్షణీయంగా మారింది. – కరీంనగర్ సీనియర్ ఫొటోగ్రాఫర్, శైలేంద్రారెడ్డి చెరువు అలుగే జలపాతమై.. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలోని జానకీబాయి చెరువు పూర్తిగా నిండటంతో 40 అడుగుల ఎత్తు ఉన్న అలుగు నుంచి జలపాతాన్ని తలపిస్తూ నీరు కిందికి జాలువారుతోంది. వర్షాకాలం ముగిసేంత వరకు ఈ అలుగు పర్యాటకులను ఆకర్షిస్తోంది. గత రెండేళ్లుగా పర్యాటకులు పెరగడంతో వారి భద్రతకోసం మరిన్ని సౌకర్యాలు కల్పించినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. – ఇందల్వాయి, రాజ్‌కుమార్ -
వామ్మో.. పెద్ద చేప చిక్కిందిలా!
సాక్షి, కూసుమంచి: సాధారణంగా ‘వాలుగ’ చేప చిన్నగానే ఉంటుంది. కానీ, మంగళవారం ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లో ఏకంగా 15 కిలోల వాలుగ మత్స్యకారుల వలకు చిక్కింది. ఇక్కడ సోమవారం నుంచి చేపల వేట నిర్వహిస్తుండగా.. మంగళవారం బత్తుల పెద్దఉప్పయ్య అనే మత్స్యకారుడి వలకు ఈ భారీ చేప చిక్కింది. ఆ మత్స్యకారుడు ఈ చేపను కిలో రూ. 120 చొప్పున ఓ స్థానిక వ్యాపారికి విక్రయించాడు. ఈ రిజర్వాయర్‌లో మరికొన్ని చేపలు సుమారు 20 కిలోల వరకు కూడా బరువు ఉంటాయని ఇక్కడి మత్స్యకారులు తెలిపారు. ఇక్కడ చదవండి: అరుదైన ‘ఎర్ర చందనం’ చేప పోలీసుల్ని చూసి.. పరుగో.. పరుగు! -
బ్రిటన్‌లో అరుదైన చేప లభ్యం
లండన్ : యూకేలోని పోర్ట్ ల్యాండ్ హార్బర్ సమీపంలో "మోలా-మోలా" అని పిలిచే అరుదైన అతిపెద్ద సముద్రపు చేప దొరికింది. డోర్సెట్ తీరంలో సజీవంగా ఉన్న అత్యంత అరుదైన అతిపెద్ద బోనీ ఫిష్‌ని గుర్తించారు. సాధారణంగా ఉష్ణమండల జలాల్లో ఈ చేపలు సంచరిస్తాయి. ఈ చేపలు 2.3 టన్నుల బరువు, 10 అడుగుల పొడవు ఉంటాయి. మరియన్ కన్జర్వేషన్ సొసైటీ ట్విట్టర్లో మోలా మోలా ఫోటోను పోస్ట్ చేసి, గ్రహం మీద సజీవంగా ఉన్న అతిపెద్ద బోనీ ఫిష్, జెల్లీ ఫిష్‌లను తినడం కోసం వేసవికాలంలో యూకేకి వచ్చిందని కామెంట్ పెట్టారు. మోలా మోలా ఫోటో సామాజిక మాద్యమాల్లో వైరల్ అయింది. ఈ చేపను లిజ్ హేమ్స్లీ చిత్రీకరించారు. Wow! An Ocean Sunfish (or Mola Mola) spotted off #Portland Harbour yesterday afternoon. #Sunfish are the largest bony fish on the planet and visit UK seas during the summer months to eat jellyfish. Have you ever seen one? Thanks to Liz Hemsley for sending us the picture 📸 pic.twitter.com/HunVjlLpXO — Marine Conservation Society (@mcsuk) June 15, 2020 -
గాలానికి చిక్కిన 15 కిలోల చేప
మెదక్ రూరల్: ఒకటి, రెండు కాదు ఏకంగా 15 కిలోల బరువున్న చేప గాలానికి చిక్కిన సంఘటన మెదక్ జిల్లా హవేళి ఘణాపూర్ మండలం పోచారం ప్రాజెక్టులో బుధవారం చోటు చేసుకుంది. మెదక్ పట్టణానికి చెందిన బాబర్ అనే వ్యక్తి సెలవు రోజుల్లో చేపలు పట్టడం హాబీగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం పోచారం డ్యామ్‌కు వెళ్లి చేపల కోసం గాలం వేశాడు. దీంతో 15 కిలోల బరువున్న చేప గాలానికి చిక్కడంతో బాబర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అక్కడికి వచ్చిన పర్యాటకులు భారీ చేపను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
మూడడుగల ‘ములంమార్పు’ చేప లభ్యం
రేగిడి : మండలంలో వన్నలి గ్రామానికి చెందిన శాసపు లింగన్నాయుడుకు మడ్డువలస పిల్లకాలువలో మూడడుగుల కంటే పొడవున్న ములంమార్పు జాతి చేప లభించింది. పొలానికి వెళ్తున్న క్రమంలో తొలుత పాము అనుకుని భయపడిన ఈయన తర్వాత పట్టుకుని ఒడ్డుకు తీసుకురాగా ములంమార్పుగా స్థానికులు గుర్తించారు. ఇంతపెద్ద సైజులో లభించిన ఈ చేపను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
కొలాబ్‌నదిలో దొరికిన భారీ చేప
జయపురం : కొరాపుట్ జిల్లా జయపురం సబ్ డివిజన్ పరిధిలోని బొయిపరిగుడ సమితిలో ఉన్న తెంతులిగుమ్మ గ్రామం వద్ద ప్రవహిస్తున్న కొలాబ్ నదిలో పెద్ద చేప ఒకటి శుక్రవారం గ్రామస్తులకు దొరికింది.సుమారు 70 కేజీల బరువున్న ఈ చేపను జెల్లీ రకానికి చెందినదిగా గ్రామస్తులు గుర్తించారు. ఒక నదిలో ఇంత పెద్ద చేప లభించడం ఇదే తొలిసారని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సముద్రం నుంచి నదిలోకి ఈ చేప వచ్చి ఉంటుందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఉదయం నదీ పరిసర ప్రాంతంలో ఉన్న కొంతమంది గ్రామస్తులు నది ఒడ్డున ఉన్న చేపను గుర్తించి, పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ భారీ చేపను చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు పోటీపడుతున్నారు. -
ఏసీబీ వలలో శానిటరీ ఇన్స్పెక్టర్
-
4,500 రూపాయల చేప!
ఇది ఆషామాషీ చేప కాదు. ఎన్నాళ్లు పెరిగిందో తెలీదుగానీ.. ఏకంగా 40 కేజీల బరువుంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలోని కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలో గురువారం మత్స్యకారుల వలకు చిక్కింది. జలాశయంలోకి వేటకు వెళ్లిన గంగాధరరావు, ఘంటశాల లోకేష్ విసిరిన వలలో ఈ భారీ చేప పడింది. సుమారు 3 అడుగుల పొడవున్న ఈ చేప 40 కేజీల బరువు తూగింది. దీనిని కొనేందుకు వినియోగదారులు ఎగబడ్డారు. ఒక ఆసామి రూ. 4,500 చెల్లించి దీనిని దక్కించుకున్నాడు. -జంగారెడ్డిగూడెం రూరల్: