భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి చెరువులో మత్స్యకారుల వలలో భారీ చేపలు చిక్కాయి. మినీ ట్యాంకుబండ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నాలుగైదు రోజులుగా చెరువు నుంచి దిగువకు తూముల ద్వారా నీటిని ఖాళీ చేస్తున్నారు.
కొన్నేళ్లుగా చెరువులో చేపలు పెంచుతున్న మత్స్యకారులు రెండు రోజులుగా చేపలు పడుతున్నారు. సోమవారం వలలో 30 నుంచి 25 కిలోల చేపలు 30 వరకు వలకు చిక్కాయి. ఇంత పెద్ద చేపలను గతంలో ఎప్పుడూ చూడలేదని మత్స్యకారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్: ఆగేదే లే! ముందుకెళ్లాల్సిందే.. మంత్రి కేటీఆర్ ఆదేశం)
Comments
Please login to add a commentAdd a comment