నందలూరు(వైఎస్సార్ జిల్లా): ఈమధ్యకాలంలో అత్యంత భారీ చేపలను చూస్తునే ఉన్నాం. అవి తినడానికి ఎలా ఉంటాయో కానీ చేపల సైజు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. తాజాగా అతి పెద్ద చేప ఒకటి వైఎస్సార్ జిల్లాలో చెయ్యేరు నదిలో తారసపడింది. ఆ చేపను చూస్తే అది పడవ అంత సైజ్‌ను దాటి కనిపించింది. దాన్ని పడవలో వేసినా పట్టదేమో అనేంతంగా ఉంది.
నందలూరు సాయిబాబా గుడి దగ్గర చెయ్యేరు నదిలో కనిపించిన ఈ చేప.. అరుదైన చేప అనక తప్పదు. నీటిలో తోకను అలా ఆడిస్తూ ఈదుతుంటే నదిలో అద్భుత దృశ్యం ఆవిషృతమైనట్లే ఉంది. మరి ఈ చేపను మీరు ఓ లుక్కేయండి.
Comments
Please login to add a commentAdd a comment