nandaluru
-
తమిళ ముల్లె.. అరవ పల్లె.. ‘నందలూరు.. రొంబవూరు’
రాజంపేట: దేశంలోనే అతిపెద్ద రవాణా సంస్థ భారతీయరైల్వే. అటువంటి రైల్వేతో అనేక ప్రాంతాలకు గుర్తింపు వచ్చింది. అలాంటివాటిలో అన్నమయ్య జిల్లా నందలూరు ఒకటి. అందునా.. ఇక్కడ ఉన్న అరవపల్లె.. ప్రత్యేక గుర్తింపు పొందింది. దశాబ్దాల క్రితం తమిళనాడు నుంచి వచ్చిన అనేకమందికి ఈ ప్రాంతం నిలయమైంది. ఆవాసాల ఏర్పాటుతో మొదలై క్రమంగా పెద్దగ్రామంగా రూపుదిద్దుకుంది. కాలానుగుణంగా మారిన పరిస్థితుల్లో కూడా తన ఉనికిని నిలుపుకుంది. ఇది ద్రవిడ జీవన సంస్కృతికి పట్టం కడుతోంది. అమ్మ తల్లి ఆరాధన ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఆధునికతను, అభివృద్ధిని సాధించినప్పటికీ ఆత్మను మాత్రం వదులుకోనంటోంది. రైల్వే కేంద్రం ఏర్పాటుతో.. నందలూరు రైల్వే కేంద్రం ఒకప్పుడు సదరన్ రైల్వేలో ఉండేది. ఇక్కడ స్టీమ్ ఇంజన్ రైల్వే లోకో షెడ్ కూడా ఉండేది. ముంబాయి–చెన్నై రైలుమార్గం ఏర్పాటులో భాగంగా స్టీమ్ రైలింజన్లను నడిపేందుకు నందలూరును కేంద్రంగా బ్రిటిషు రైల్వేపాలకులు ఎంచుకున్నారు. చెయ్యేరు నది నీటి నాణ్యత స్టీమ్ ఇంజన్ల నిర్వహణకు ఉపయోగపడుతుందనేది ప్రధాన కారణం. గుంతకల్ రైల్వే జంక్షన్ నుంచి తమిళనాడులోని చెన్నై వరకు నడిచే రైళ్లన్నింటికీ నందలూరులో ఇంజన్ మార్పిడి జరిగేది. సిబ్బంది కూడా అటూ, ఇటూ మారేవారు. ఈ నేపథ్యంలోనే రైల్వేపరంగా నందలూరుకు గుంతకల్ రైల్వేడివిజన్‌లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇక్కడి నుంచి నేరుగా మద్రాసుకు ప్యాసింజర్ రైలు కూడా నడిచేది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి నందలూరుకు ఉద్యోగ, ఉపాధి పనుల నిమిత్తం అనేకమంది వచ్చారు. అయితే వీరిలో అగ్రభాగం తమిళులదే. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, అరకోణం, పెరంబూరు, తిరుత్తిణి తదితర ప్రాంతాలకు చెందిన వారు వివిధ రకాలలో అధికారులు, ఉద్యోగులు, కార్మికులుగా పనిచేసేందుకు నందలూరు రైల్వే కేంద్రానికి తరలివచ్చారు. వీరిని స్థానికులు అరవోళ్లు అని పిలిచేవారు. ఈ క్రమంలో నందలూరు రైల్వేస్టేషన్‌కు సమీపంలో వారు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. క్రమేణా అది అరవపల్లె పేరిట గ్రామంగా మారింది. ప్రస్తుతం నాగిరెడ్డిపల్లె అర్బన్ పరిధిలో ఈ పల్లె ఉంది. తొమ్మిది వార్డులకు విస్తరించింది. నందలూరు రైల్వేస్టేషన్ జోన్ మారడంతో.. 1977లో సదరన్ రైల్వే నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి నందలూరు మారింది. ఫలితంగా వందలాది మంది తమిళనాడుకు చెందిన వారు చెన్నై సెంట్రల్తో పాటు ఇతర ప్రాంతాలకు బదిలీ చేసుకొని వెళ్లిపోయారు. కొందరు నందలూరు నీళ్లు, వాతావరణం, స్థానికుల మంచితనంతో ఇక్కడే ఉండిపోయారు. చెన్నై, కంచి, సేలం, అరక్కోణం, మధురై తదితర ప్రాంతాలకు చెందినవారు పెద్దసంఖ్యలో అరవపల్లెలోనే నివాసముండేవారు. కాలక్రమేణా 1000 తమిళ కుటుంబాలున్న గ్రామంలో ఆ సంఖ్య ఇపుడు 30కి చేరింది. ఈ పల్లెలో తమిళులతో పాటు ఇపుడు ఇతరులు కూడా ఉంటున్నారు. కాగా, బదిలీలపై ఇక్కడి నుంచి తమ రాష్ట్రాలకు వెళుతూ వెళుతూ తమిళనాడువాసులు ‘నందలూరు.. రొంబవూరు’ అని సర్టిఫికెట్ ఇచ్చారు. ఆరాధ్యదైవం..ముత్తుమారెమ్మ తమిళనాడు ప్రాంతంలో ముత్తుమారెమ్మను ఆరాధ్యదైవంగా కొలుచుకుంటారు. తమ సంప్రదాయంలో భాగంగా అరవపల్లెలో కూడా వారు ముత్తుమారెమ్మ గుడి నిర్మించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారి ఆలయంగా కొలవబడుతోంది. ఈ గుడి మొదలియార్ కుటుంబీకుల ఆధ్వర్యంలో నడుస్తోంది. యేటా జాతర కూడా నిర్వహిస్తుంటారు. రైల్వేకార్మికులతో ఒకప్పుడు కళకళ రైల్వేస్టీమ్ ఇంజన్ లోకోషెడ్ ఏర్పడినప్పటి నుంచి రైల్వేకార్మికులతో అరవపల్లె ఒకప్పుడు కళకళలాడేది. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. పాల్ఘాట్ నుంచి వచ్చిన మా పూర్వీకులు 1955లో ఏర్పాటుచేసిన శ్రీ లక్ష్మీవిలాస్ హోటల్ ఎంతో ఆదరణ పొందింది. అప్పట్లో రైల్వే స్టాఫ్‌లో తమిళులు అధికంగా ఉండేవారు. ముత్తుమారెమ్మ ఆలయం అభివృద్ధికి నా తండ్రి నారాయణస్వామి అయ్యర్ తన వంతు కృషిచేశారు. –బాలసుబ్రమణ్యంస్వామి, శ్రీలక్ష్మీవిలాస్, అరవపల్లె నందలూరుతో విడదీయరాని అనుబంధం సదరన్ రైల్వే జోన్ వల్ల తమిళులతో నందలూరు రైల్వేకేంద్రానికి విడదీయ రాని అనుబంధం ఏర్పడింది. తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ విధులు నిర్వహించే వందలాది కార్మికుల కుటుంబాలు ఉండేవి. 1976లో నందలూరు కార్యాలయంలో పనిచేసేటప్పుడు విధుల నిర్వహణకు సంబంధించి సదరన్ రైల్వే జోనల్ కేంద్రమైన మద్రాసు(చెన్నై)కు వెళ్లేవారం. రైల్వే జోన్ మార్పిడిలో చెన్నైకు వెళ్లకుండా చాలా మంది మంది తమిళ కుటుంబీకులు నందలూరులో కొనసాగుతున్నారు. –ఆనంద్‌కుమార్, రిటైర్డ్ ఎస్ఎంఆర్, న్యాయవాది, నాగిరెడ్డిపల్లె పూర్వీకుల నుంచి ముత్తుమారెమ్మ కోవెల మా పూర్వీకుల నుంచి ముత్తుమారెమ్మ కోవెల ఏర్పాటైంది. అప్పటి నుంచి గుడి నిర్వహణ చేపడుతూ వస్తున్నాం. నందలూరు రైల్వేస్టేషన్ సమీప ప్రాంతంలోనే మా పల్లె ఉంది. రైల్వేతోనే జనజీవనం ముడిపడింది. అది అలాగే కొనసాగింది. –వెంకటరమణ మొదలియార్, ధర్మకర్త, ముత్తుమారెమ్మకోవెల, అరవపల్లె -
వామ్మో అతి పెద్ద చేప.. పడవ అంత చేప!
-
వామ్మో అతి పెద్ద చేప.. పడవ అంత చేప!
నందలూరు(వైఎస్సార్ జిల్లా): ఈమధ్యకాలంలో అత్యంత భారీ చేపలను చూస్తునే ఉన్నాం. అవి తినడానికి ఎలా ఉంటాయో కానీ చేపల సైజు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. తాజాగా అతి పెద్ద చేప ఒకటి వైఎస్సార్ జిల్లాలో చెయ్యేరు నదిలో తారసపడింది. ఆ చేపను చూస్తే అది పడవ అంత సైజ్‌ను దాటి కనిపించింది. దాన్ని పడవలో వేసినా పట్టదేమో అనేంతంగా ఉంది. నందలూరు సాయిబాబా గుడి దగ్గర చెయ్యేరు నదిలో కనిపించిన ఈ చేప.. అరుదైన చేప అనక తప్పదు. నీటిలో తోకను అలా ఆడిస్తూ ఈదుతుంటే నదిలో అద్భుత దృశ్యం ఆవిషృతమైనట్లే ఉంది. మరి ఈ చేపను మీరు ఓ లుక్కేయండి. -
పోలీస్ అయితే పెళ్లి సంబంధాలు రావన్నారు..
పోలీసు కుటుంబంలో జన్మించారు సుప్రజ. విధి నిర్వహణలో తన తాత, తండ్రి ఎదుర్కొన్న కష్టాలను చూసి కూడా భయపడలేదు. ఆడపిల్ల పెద్ద చదువులు చదివితే, అందులోనూ పోలీసు అయితే పెళ్లి సంబంధాలు రావని ఎవరెంతగా నిరుత్సాహపరిచినా లక్ష్య పెట్టకుండా కష్టపడి చదివారు. 2015లో గ్రూప్–1 అధికారిగా విధుల్లో చేరారు. చేరిన తొలి రోజు నుంచే సామాన్యులకు రక్షణగా నిలిచారు. ఏడు నెలల వ్యవధిలో 74 మందిపై రౌడీషీట్లు తెరిచి నేరస్థులకు సింహస్వప్నంగా నిలిచారు. ఉత్తమ పిసిఆర్ అవార్డు విజేత అయ్యారు. కడప జిల్లా నందలూరుకు చెందిన కోర్లకుంట సుప్రజ.. గర్భిణిగా ఉండి కూడా కరోనాకు వెరవకుండా సుప్రజాసేవ నిర్వహించినందుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ నవాంగ్ నుంచి ఉత్తమ డీఎస్పీగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు. ► మీ విధి నిర్వహణలోని సవాళ్లు, ఒత్తిళ్లు ఎలాంటివి? రెండు ఘటనల గురించి చెబుతాను. కర్నూలు జిల్లాలో పనిచేసేటప్పుడు గ్రామ సర్పంచ్ తన భార్య తప్పిపోయిందని ఫిర్యాదు చేశాడు. నాకెందుకో అతని మీద అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయించాను. అతనికున్న రాజకీయ పలుకు బడితో అధికారులు, నాయకులు నాపై వత్తిడి తెచ్చినప్పటికీ, అతని నేరాలను నిరూపించి అరెస్టు చేశాము. గుంటూరు ఈస్ట్‌లో విధులు నిర్వహించేటప్పుడు నా కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న ఓ కాల్‌మనీ మోసగాడిని అరెస్టు చేసి అతడి దగ్గర నుంచి 40 లక్షలు రికవరీ చేసాను. అప్పుడు అనేక వత్తిళ్లు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ► ట్రైనింగ్ సమయంలోని ఫిజికల్ ట్రైనింగ్ విధి నిర్వహణలో ఉపయోగపడిందంటారా? అవును. గుంటూరు ఈస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నప్పుడు ఐదు నెలల గర్భిణిని. పెద్ద మొత్తంలో గంజాయి రవాణా జరుగుతున్న బస్సు గుంటూరు దాటి వెళ్లిపోతోందని విన్నాను. వాహనంలో వేగంగా ఛేజింగ్ చేసి బస్సు ఆపించి, కిటికీలో నుంచి దూకి పారిపోతున్న నిందితులను వెంటాడి పట్టుకున్నాము. నలభై కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాము. కర్నూలు జిల్లాలో అడవుల్లో పలు నక్సలైట్ డంప్‌లు స్వాధీనం చేసుకునే సమయంలోనూ కొన్ని సాహసాలు చేయాల్సి వచ్చింది. ► మహిళగా మహిళలకు జరిగే అన్యాయాలపై మీ స్పందన ఎలా ఉంటుంది? జాప్యం అయితే జరగదు. నా ప్రసవం అనంతరం ఓ రాత్రి పదిన్నర సమయంలో కార్యాలయంలో ఉండగా ‘బాబు పాల కోసం ఏడుస్తున్నాడు (బాబుకు నా పాలే ఫీడ్ చేస్తాను). వెంటనే రమ్మని’ అమ్మ ఫోన్ చే యడంతో బయటకు వచ్చాను. ఓ యువతి ఏడుస్తూ వాకిట్లో కనిపించింది. లోపలకు పిలిచాను. భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింట్లో ఉన్నానని, అయినా నిఘా పెట్టి వేధిస్తున్నాడని ఆమె చెప్పడంతో లోతుగా విచారణ జరిపి ఆమె భర్తను అరెస్ట్ చేశాం. అలాగే ఓ 80 సంవత్సరాల వృద్ధుడు ఒకటిన్నర సంవత్సరాల బాలికపై దారుణంగా లైంగిక దాడి చేసిన ఘటనలో అతడిని అరెస్టు చేశాము. దిశా పోలీస్టేషన్ డిఎస్పీగా పలువురు మహిళలకు అండగా నిలబడ్డ సంఘటనలు కూడా అనేకం సంతృప్తినిచ్చాయి. ► లాక్డౌన్ సమయంలో గర్భిణి అయి ఉండీ మీరు విధులు నిర్వహించిన విషయాన్ని డిపార్ట్మెంట్లో గొప్పగా చెబుతుంటారు! (నవ్వుతూ..) ఆ సమయంలో గర్భిణిగా ఉండడంతోపాటు ఇంట్లో రెండు సంవత్సరాల కుమార్తె ఉన్నా ఎన్నో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలోనూ పని చేశాను. ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ వార్డులు, అనాథల షెల్టర్ ల ఏర్పాట్ల పర్యవేక్షణ, నిర్వహణ నా దేశానికి చేసిన సేవగా భావిస్తున్నాను. ఇక నేను నా విధులను సక్రమంగా నిర్వర్తించగలుగుతున్నానంటే అదంతా నా భర్త ఐఆర్ఎస్ ప్రేమ్‌కుమార్, కుటుంబ సభ్యుల సహకారం వల్లనే అన్నది నిజం. డీజీపి గౌతమ్ సవాంగ్ నుండి పిసిఆర్ అవార్డు అందుకుంటున్న డిఎస్పీ సుప్రజ తల్లి , తండ్రి, భర్తతో సుప్రజ – కోలుకొండ శ్రీకర్, సాక్షి, గుంటూరు ఈస్ట్ -
పురాతన ఆలయం.. సౌమ్యనాథ క్షేత్రం
నందలూరులోని సౌమ్యనాథాలయం ఎంతో పురాతనమైనది.. దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ ఆలయంగా పేరుగాంచింది. విశాలమైన, సుందర మనోహర క్షేత్రం.. శిల్ప సౌందర్య సోయగం.. స్వామి భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ భక్తులు ఉన్నారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. సాక్షి, రాజంపేట(కడప) : దక్షిణ భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయాల్లో నందలూరులోని సౌమ్యనాథాలయం ఒకటి. శ్రీ సౌమ్యనాథునికి చొక్కనాథుడని, చొక్కనాథ పెరుమాళ్ అని, కులోత్తుంగచోళ ఎంబరుమన్నార్ విన్నగర్ అనే పేర్లు గలవు. దీన్ని బట్టి చూస్తే తమిళనాడుతో ఈ ఆలయానికి చారిత్రాత్మక అనుబంధం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. సౌమ్యనాథుడన్నా.. చొక్కనాథుడన్నా సౌందర్యవంతుడని అర్థం. సౌమ్యనాథుడనగా సౌమ్యకు(శ్రీలక్ష్మీదేవికి) నాథుడని అర్థం. స్వామి మూలవిరాట్ ఏడడుగుల ఎత్తు ఉండి చాలా సౌమ్యంగా అభయముద్రాలంకితమై ఉంటుంది. ప్రత్యేకత బ్రహ్మమానసపుత్రుడు.. తిలోకసంచారి.. లోకకల్యాణకారకుడు.. కలహాప్రియుడు నారదుడు నందలూరు గ్రామంలో వెలసిన సౌమ్యనాథాలయంలో సౌమ్యనాథస్వామి మూలవిరాట్‌ను ప్రతిష్టించారని శాసనాలు ధ్రువీకరిస్తున్నాయి. ఎటువంటి దీపం లేకున్నా.. ఎటువంటి దీపం లేకున్నా సౌమ్యనాథస్వామి ఉదయం నుంచి సాయంకాలం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయం నిర్మించడం అద్భుతం. గర్భగుడి ప్రధాన ద్వారానికి వంద గజాల దూరం నుంచి కూడా స్వామి చాలా స్పష్టంగా కనిపిస్తారు. ఏడాదిలో ఏదో ఒక రోజు సూర్యకిరణాలు స్వామి పాదాలపై ప్రసరించే విధంగా శిల్పులు నిర్మించారు. దేవాలయంలో మరో ఆలయం ఆలయంలో లోపలికి ప్రవేశించగానే రాతి మంటపంపై నుంచి గర్భాలయంలో ప్రవేశించాల్సి ఉంది. ఈ మంటపం ముందు భాగం శిఖరంలో సింహం తల ఆకారంలో ఇరువైపులా ఉన్నాయి. ఏ దేవాలయానికి అయినా ఆలయ పైభాగంలో సింహం తలలు అమర్చిబడివుంటాయి. కానీ సౌమ్యనాథస్వామి ఆలయంలో లోపలి మంటపంలోని ఓ భాగమంతా సింహం తలలతో నిండి ఉండటం కనిపిస్తుంది. కాబట్టి ఆలయ పైభాగంలో ఉండే ఈ సింహం తలలు ఆలయ లోపల ఉండటం వల్ల.. భూగర్భలో మరో ఆలయం ఉన్నట్లుగా గోచరిస్తోంది. రాతి మంటపం అడుగున ఉన్న శివాలయంగా చెప్పుకుంటున్నారు. మత్స్య, సింహం చిహ్నాలు ఆలయ కుడ్యాలపై (లోపల)పై భాగంలో మత్స్య, సింహం చిహ్నాలు ఉన్నాయి. మత్స్య ఆకారాన్ని మలిచి ఉన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఆలయాన్ని ముంచెత్తినప్పుడు.. ఆలయానికి పైభాగంలో ఉండే మత్స్యకు ప్రాణం వచ్చి వరదలలో కలిసిపోతుందని స్థానికుల నమ్మకం. అంటే అప్పటికి కలియుగం అంతమైపోతుందనే అర్థం వస్తుందని చెబుతుంటారు. చరిత్ర 11వ శతాబ్దంలో చోళవంశరాజు కుళోత్తుంగచోళుడు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చోళ, పాండ్య, కాకతీయ, విజయనగరాజులచే 17వ శతాబ్దం వరకు ఆలయ నిర్మాణం కొనసాగింది. పతిరాజులు కాలంలో ఆలయం ప్రసిద్ధి చెందింది. 12వ శతాబ్దంలో కాకతీయప్రతాపరుద్రుడు రాజగోపురం కట్టించారు. ప్రసిద్ధ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్య జన్మస్థలమైన తాళ్లపాక గ్రామం నందలూరుకు సమీపంలో ఉన్నందున.. అన్నమాచార్యులు సౌమ్యనాథాలయాన్ని దర్శించుకునేవారు. స్వామిపై శృంగార కీర్తనలు రచించారు. ఆలయ నిర్మాణం ఆలయాన్ని దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 180 స్తంభాలతో వైఖానస, వైష్ణవగామ ఆర్షపోక్త వాస్తుయుక్తముగా సువిశాలంగా నిర్మించారు. ఈ దేవాలయానికి 120 ఎకరాల మాన్యం ఉన్నట్లు శాసనాలలో ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. రాజంపేట మండలంలోని ఆడపూరు, మన్నూరు, మందరం, హస్తవరం అనే ఐదు గ్రామాలను బహుమానంగా ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి. అధికంగా తమిళ శాసనాలు కనిపిస్తాయి. సింహద్వారంలో గాలిగోపురం ఉత్తరగోపురం, దక్షిణగోపురం ద్వారాలు ఉన్నాయి. ఆలయంలో రాతిదీపస్తంభం, బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడమందిర, మత్స్యమంటపం, ఆంజనేయమంటపం, చిన్నకోనేరు, జయవిజయాలు, అంకుర్పారణ మంటపం, వంటశాల, శ్రీ యోగనరసింహస్వామి, శిల్పకళ, అంతరాళం ఉన్నాయి. దేవాలయ ఆవరణలో పెద్ద కోనేరు ఉంది. శాసనాలు ఆలయంలో 54 శాసనాలు ఉన్నాయి. తొలిశాసనం క్రీస్తు శకం 1078 లోనిది గాను, క్రీ.శ 1619లో శాసనం చివరి శాసనంగా గుర్తించారు. ఇందులో దాన శాసనాలే అధికంగా ఉన్నాయి. ఈ శాసనాలలో ఉన్న వాటికి సంబంధించి ఇప్పుడైతే ఏమీ లేవనే స్పష్టమవుతోంది. క్రీ.శ 11వ శతాబ్దం మధ్యలో నందలూరులోని సౌమ్యనాథస్వామి దేవస్థానం మొదటి వైష్ణవ ఆలయంగా గుర్తించారు. ఆళ్వారుల విగ్రహాలు ఒకే రాతిపీఠంపై ఉండేవి.. ఇప్పుడు లేవు. వీటిలో కొన్ని ధ్వంసం అయ్యాయి. మరికొన్ని పురావస్తు శాఖ మ్యూజియంకు తరలించారని అంటున్నారు. కోర్కెలు తీర్చే దేవుడు కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా సౌమ్యనాథస్వామి ప్రసిద్ధి చెందారు. గర్భగుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే కోర్కెలు నెరవేరుతాయనే విశ్వాసం భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. కోర్కెలు తీరిన తర్వాత గర్భగుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయడం క్షేత్ర సంప్రదాయంగా వస్తోంది. సంతానం కలగని వారు స్వామిని ప్రార్థిస్తే కలుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. స్వామిని దర్శించి స్మరిస్తే పాపాలు తొలిగిపోతాయట. మనసారా పూజించే వారికి భూత, ప్రేత, పిశాచాల బాధలు తొలిగిపోవడమే కాక చెడు కలలు రావడం ఉండవని చెబుతున్నారు. విదేశీయానానికి సిద్ధమవుతున్న వారు ఇక్కడికి వచ్చి.. స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతోంది. ఎలా వెళ్లాలి కడప–రేణిగుంట జాతీయ రహదారిలో జిల్లా కేంద్రమైన కడపకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందలూరులో సౌమ్యనాథాలయం ఉంది. ఈ ఆలయానికి కడప, తిరుపతి, రాజంపేట నుంచి బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అలాగే జిల్లాలో రైల్వే పరంగా ప్రసిద్ధి చెందిన నందలూరుకు.. ముంబయి–చెన్నై మార్గంలో వెళ్లే ఏ రైలు ద్వారానైనా చేరుకోవచ్చును. విమానాశ్రయం అయితే రేణిగుంటకు చేరుకొని.. అక్కడి నుంచి నేరుగా రైల్వేకోడూరు, రాజంపేట మీదుగా నందలూరుకు చేరుకోవచ్చు. -
అమ్మా.. ఇక సెలవు
ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ముగ్గురు కూతుళ్లకు పెళ్లిల్లయ్యాయి. ఇక.. అమ్మకు తోడెవరంటూ కుమిలిపోయిన ఆ కొడుకు పెళ్లి చేసుకోకుండా అమ్మ సేవలో తరిస్తూ వచ్చాడు.. తల్లీ కొడుకుల బంధాన్ని చూసి విధికి సైతం కన్ను కుట్టింది. తన ఆలనా పాలనా చూసుకుంటున్న కొడుకు ప్రాణాల్ని గుండె జబ్బు కబళించింది. తల్లికి తల కొరివి పెట్టాల్సిన కొడుకుకు తల్లే తలకొరివి పెట్టాల్సి రావడాన్ని చూసిన ప్రతి ఒక్కరి హృదయం చలించిపోయింది. ఈ సంఘటన మంగళవారం నందలూరులో చోటుచేసుకుంది. సాక్షి, నందలూరు (వైఎస్సార్ జిల్లా) : నవమాసాలు మోసిన కన్నతల్లే చివరకు తన కుమారుడికి తలకొరివి పెట్టిన సంఘటన నందలూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగిరెడ్డిపల్లె పంచాయతీలోని స్థానిక ఆర్అండ్బీ బంగ్లా వెనుక వైపున నివాసం ఉన్న గుళ్ల అనసూయమ్మకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెలకు వివాహాలు అయ్యాయి. కుమారుడు గుళ్ల విజయ్‌కుమార్ (మద్రాసు బాబు) (49) తన అక్క, ఇద్దరు చెల్లెళ్లకు వివాహాలు కావడంతో తన తల్లిదండ్రులను చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో తాను వివాహం కూడా చేసుకోలేదు. ప్రేమానురాగాలకు ప్రతీక నాగిరెడ్డిపల్లె పంచాయతీ పరిధిలో మద్రాసు బాబు అంటే తెలియనివారు లేరు. మంచి గుణాలు, వ్యక్తిత్వం ఉండి, ప్రతిఒక్కరినీ నవ్వుతూ పలకరిస్తాడు. సమస్య ఉందని తన వద్దకు వస్తే చేతనైన సాయం చేస్తూ అందరి మనసులో చోటు సంపాదించుకున్నాడు. కబళించిన కష్టాలు తన అక్క, ఇద్దరు చెల్లెళ్లకు వివాహాలు చేసిన అనంతరం తన తండ్రి సూర్యప్రభాకర్ రైల్వే డ్రైవర్‌గా పదవీవిరమణ పొందిన తర్వాత కిడ్నీ వ్యాధితో బాధపడుతుండేవాడు. తండ్రిని ఆస్పత్రిలో చూపిం చేందుకు ఉండే నగదు అంతా ఖర్చుకావడంతో మద్రాసు బాబుకు కష్టాలు ప్రారంభమయ్యాయి. తల్లి సేవలో తనయుడు తన తండ్రి మరణించిన తర్వాత తన తల్లి గుళ్ల అనసూయమ్మకు వచ్చే పెన్షన్ నగదుతోనే సంసారాన్ని నెట్టుకొస్తూ తన తల్లి ప్రతి కోరికను నెరవేరుస్తూ వచ్చాడు. తనలో తనే మదనపడుతూ తన స్నేహితులే తన బంధువులుగా అందరి మనసుల్లో మెలుగుతూ తన కష్టాలనుసైతం ఎవరికీ తెలియకుండా తనకు ఉన్నటువంటి గుండె జబ్బుకు చికిత్స చేయించుకునేందుకు నిరాకరిస్తూ ఆ పెన్షన్ నగదుతోనే తన తల్లి బాగోగులను చూసేవాడు. తనయుడిని దూరం చేసిన మరణం మద్రాసు బాబు గుండెజబ్బుతో బాధపడుతూ కొన్నాళ్ల క్రితం గుండెకు ఆపరేషన్ చేయించుకున్నాడు. కానీ తన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగినంత సంపాదన లేకపోవడంతో తన తల్లికి వచ్చే పెన్షన్ నగదుతోనే సంసారాన్ని నెట్టుకొచ్చేవాడు. అంతలోనే విధి చిన్నచూపు చూసింది. తన తల్లి అనసూయమ్మకు పెరాలసిస్ వచ్చి కాలు, చెయ్యి పనిచేయలేదు. దీంతో అతనే తల్లికి తానే అన్నీ అయ్యాడు. స్నానం చేయిస్తూ.. బట్టలు కూడా వేసేవాడు. తల్లిసేవలోనే నిమగ్నమైన మద్రాసు బాబును చూసి ఆ దేవుడు ఓర్వలేకపోయాడు. గుండె జబ్బుతో ఉన్న మద్రాసు బాబుకు ఒక్కసారిగా ఊరికి ఆడక మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కాటికి చేరిన మద్రాసు బాబు మంగళవారం సాయంత్రం అక్కాచెళ్లెల్లు, బంధువులు, స్నేహితుల కన్నీటి వీడ్కోల మధ్య రాజంపేటకు చెందిన మావనతా స్వచ్ఛంద సేవాసంస్థ శాంతిరథంలో మద్రాసు బాబు భౌతికకాయం కాటికి చేరింది. కన్న కొడుక్కు తలకొరివి పెట్టిన తల్లి సంప్రదాయబద్ధంగా మద్రాసు బాబు భౌతికకాయాన్ని కాటికి చేర్చి వివాహం కాకపోవడంతో తన సోదరి దహన సంస్కారాల కార్యక్రమాన్ని చేయగా.. తన తల్లి అనసూయమ్మ కుమారుడు మద్రాసుబాబుకు విలపిస్తూ తలకొరివి పెట్టింది. మద్రాసుబాబు తల్లి అనసూయమ్మ తన కుమారుడు తనకు చేసిన సేవలకు ప్రతిఫలంగా అల్లారుముద్దుగా పెంచుకున్న తన బిడ్డకే తలకొరివి పెట్టే పరిస్థితి వచ్చింది. ఏ తల్లీకి రాకూడదని బోరున విలపిస్తున్న దృశ్యాన్ని చూసిన బంధువులు, స్నేహితులు రోదించారు. -
పుట్టెడు దుఃఖంతో పరీక్షకు హాజరు
నందలూరు: తండ్రి మరణాన్ని తలచుకుంటూ మరోవైపు జీవితానికి సంబంధించిన పరీక్ష ఒకేసారి రావడంతో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుతూ పదో తరగతి పరీక్ష రాశాడు ఓ విద్యార్థి. వివరాలల్లోకి వెళితే.. మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అరవపల్లె తోటపాళెంకు చెందిన షేక్ అబ్దుల్ రెహమాన్ సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఇతడు నందలూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షలు రాస్తున్నాడు. విద్యార్థి తండ్రి షేక్ అహమ్మద్ పీర్ (57) అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్‌లో చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. అదే రోజు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. తండ్రి మరణంతో దుఖఃసముద్రంలో మునిగిపోయిన ఆ విద్యార్థిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. పెద్దలు ఆ విద్యార్థిని ఓదార్చి శనివారం సైన్స్ పరీక్షకు హాజరు అయ్యేలా చూశారు. పరీక్ష కేంద్రం తనిఖీ నిమిత్తం వచ్చిన ఆర్ఐపీ భానుమూర్తిరాజు విషయం తెలుసుకుని ద్యార్థికి ధైర్యం చెప్పారు. పరీక్ష అనంతరం ఆ విద్యార్థి తండ్రి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లాఅధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి అహమ్మద్పీర్ మృతదేహానికి నివాళులర్పించి విద్యార్థి అబ్దుల్ రెహమాన్‌ను ఓదార్చి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
► ఇద్దరు అరెస్టు నందలూరు: ఎర్రచందనాన్ని అక్రమరవాణా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను నందలూరు పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి రెండు ద్విచక్రవాహనాలు, నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు నందలూరు యస్ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4–30 గంటల సయమంలో చింతలకుంట అటవీ ప్రాంతంలో తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన సెల్వం, అన్నామలైతోపాటు మరికొంతమంది ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం అందిందన్నారు. పక్కా సమాచారంతో దాడి చేశామని, ఇద్దరు దొరకగా మిగిలిన వారు పరారయ్యారని ఆయన తెలిపారు. నాలుగు ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.2లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసి ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆ సొమ్ము నిరుద్యోగులకు అందేనా..!
► ఫార్చ్యూన్ కంపెనీ పేరుతో నిరుద్యోగులకు శఠగోపం ► దరఖాస్తు రుసుం పేరుతో రూ.3లక్షలు వసూలు ► కటకటాల్లో నిందితుడు ► తమ సొమ్ము తిరిగి ఇవ్వాలంటున్న నిరుద్యోగులు నందలూరు: నందలూరులో ఆల్విన్ కర్మాగారం ఏర్పాటు చేయడానికి స్థల పరిశీలన జరిగినప్పుడు మండలంలోని ఎంతోమంది రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఆల్విన్ కర్మాగారం ఏర్పాటుకు ఇచ్చారు. మండల వాసులకు ఉద్యోగాలలో మొదటి ప్రాధాన్యత ఇచ్చి భూములకు నష్టపరిహారం ఇస్తామని చెప్పిన హామీ అమలుకే నోచుకోలేదు. ఆ తర్వాత కొంతకాలానికి ఆల్విన్ కర్మాగారం మూత పడింది. 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఫార్చ్యూన్ కంపెనీ ఏర్పాటు చేస్తామని, రూ.250 కోట్లతో 12 పరిశ్రమలు వస్తాయని వెంకటకృష్ణ అలియాస్ సోలార్ వెంకట్, అలియాస్ వెంకటసుబ్బయ్య నమ్మబలికాడు. దీనికితోడు ఒక్క రోజులోనే రూ.100 చొప్పున సుమారు 3వేల దరఖాస్తులు విక్రయించి రూ.3లక్షల వరకు సొమ్ము చేసుకున్నాడు. దీంతో అతనిపై ఐపీసీ 420, 406 కేసులు నమోదు చేసినట్లు రాజంపేట డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. అయితే వెంకటకృష్ణ నుంచి రూ.2.10 లక్షల నగదు మాత్రమే రికవరీచేసి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఆల్విన్ పరిశ్రమను కొనుగోలు చేసిన రాజేంద్ర కన్స్ట్రక్షన్ అధినేత కుమారుడు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీరేంద్రరెడ్డికి తన పరిశ్రమలో ఫార్చ్యూన్ కంపెనీ ఏర్పాటు చేయడానికి వెంకటకృష్ణ చేసిన భూమిపూజ, హోమాలు, అతను నిర్వహించిన జాబ్‌మేళా గురించి తెలియదా? అతనికి తెలియకుండానే సుమారు నెలరోజుల నుంచి అక్కడ ఇన్ని పనులు చేయడం సాధ్యమా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు వెంకటకృష్ణ ఏం చేయాలనుకున్నాడో పోలీసులు సమాచారం రాబట్టాల్సి ఉంది. దరఖాస్తు రుసుం పేరుతో వెంకటకృష్ణ తీసుకున్న నగదును తమకు ఎవరు చెల్లిస్తారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వవిప్ మేడా మల్లికార్జునరెడ్డి సొంత మండలంలో ఆయనకు తెలియకుండానే ఇంత తతంగం జరిగిందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా ఫార్చ్యూన్ కంపెనీ పేరుతో నిరుద్యోగులను బురిడీ కొట్టించిన ఘరానా మోసగాడి నిజస్వరూపాన్ని బట్టబయలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అలాగే నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన సొమ్మును వారికి తిరిగి అప్పగించాలని పలువురు కోరుతున్నారు. -
అంతా మోసం!
ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టర్ మాటలు ఖాళీమూటలేనా? ► అరుణహోమంలో ప్రభుత్వ విప్ మేడా..జనంలో పెరిగిన నమ్మకం ► ఒక్కరోజు దరఖాస్తులు ఇచ్చి తిరిగి కనిపించని డైరెక్టర్ ► కంపెనీ గేటుకు ‘టుడే హాలిడే’ బోర్డుతో రెచ్చిపోయిన యువత ► నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఎంతవరకు సబబు నందలూరు: నిరుద్యోగుల ఆశలు అడియాశలయ్యేలా ఉన్నాయి. ఫార్చ్యూన్ కంపెనీ ఏర్పాటుతో తమ 14 ఏళ్ల నిరీక్షణ ఫలించి తమకు ఉపాధి దొరుకుతుందని ఆశపడ్డ వారికి నిరాశే ఎదురైంది. దరఖాస్తుల దగ్గరే వ్యవహారం ఆగిపోవడంతో చివరకు తామంతా మోసపోయామని వారు రోడ్డెక్కాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... తాను ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టర్‌నని, మండలంలో మూసివేసిన ఆల్విన్ కర్మాగార స్థానంలో తమ కంపెనీ ఆధ్వర్యంలో 12 సంస్థలు ఏర్పాటుచేస్తున్నామని వెంకటక్రిష్ణ తెలిపారు. అదేవిధంగా ఈ 12 సంస్థల్లో సుమారు 2 వేల నుంచి 3వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని, అందులో 60 శాతం స్థానికులకు కేటా ఇస్తున్నట్లు తెలపడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. భూమిపూజపై పలు అనుమానాలు: ఫార్చ్యూన్ కంపెనీ ఏర్పాటులో భాగంగా చేసిన భూమిపూజ ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేశారు. స్థానిక ఆల్విన్ మాజీ కార్మికుడు(భారత్‌గ్యాస్ శంకర్), ప్రముఖ పారిశ్రామికవేత్త దుర్గాప్రసాద్‌లతో కలిసి ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టర్ వెంకటక్రిష్ణ ఆయన సతీమణితో కలిసి కార్యక్రమం పూర్తిచేశారు. ఆ వార్త పలు పత్రికల్లో రావడంతో ఎటువంటి హడావుడి లేకుండా ఇంత రహస్యంగా భూమిపూజ చేయడం ఏమిటని అప్పట్లోనే నిరుద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అరుణ హోమంలో మేడా.. నిరుద్యోగుల్లో నమ్మకం ఫార్చ్యూన్ కంపెనీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన అరుణహోమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ మేడా మల్లికార్జునరెడ్డి స్వయంగా పాల్గొనడంతో ఫార్చ్యూన్ కంపెనీపైన నిరుద్యోగుల్లో ఆశలు ఒకస్థాయిలో పెరిగాయి. అంతేకాక మేడా ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టర్ వెంకటక్రిష్ణతో మాట్లాడుతూ మండలంలోని నిరుద్యోగులకు మొదటిప్రాధాన్యత ఇవ్వాలని కోరడంతో వారి ఆశలకు హద్దులేకుండా పోయింది. అందరిలో నమ్మకం పెరిగింది. జాబ్‌మేళాలో వేలమంది నిరుద్యోగులు ఫార్చ్యూన్ కంపెనీ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీ నుంచి 5వ తేదీవరకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని తెలుపడంతో మండలం నుంచే కాక ఇతర జిల్లాల నుంచి కూడా వేలసంఖ్యలో నిరుద్యోగులు హాజరై, «ఒక్కొక్క దరఖాస్తు రూ.100ల చొప్పున తీసుకున్నారు. ఈనెల 1వతేదీ ఒక్కరోజు మాత్రమే 2,500 దరఖాస్తులతో రూ.2.50లక్షలు ఫార్చ్యూన్ కంపెనీకి ఆదాయం వచ్చింది. ఇంకా దరఖాస్తులు అందక సుమారు వేయిమంది నిరుద్యోగులు వెనుతిరిగారు. కానీ దరఖాస్తుకు ధర పెట్టినప్పుడే చాలామంది నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేశారు. నిరుత్సాహంతో వెనుతిరిగిన నిరుద్యోగులు ఈనెల 2వ తేదీ గురువారం తిరిగి రెండవరోజు నిరుద్యోగులు దరఖాస్తులకోసం వేలసంఖ్యలో రాగా ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టర్ వెంకటక్రిష్ణ అత్యవసర సమావేశం కోసం హైదరాబాద్‌కు వెళ్లారని, అక్కడ ఇన్చార్జిగా చెప్పుకుంటున్న స్థానిక వ్యక్తి (నాగేంద్ర) తెలిపారు. దరఖాస్తులు అయిపోయాయని డైరెక్టర్ వచ్చిన తర్వాతే దరఖాస్తులు ఇస్తారని తెలుపడంతో నిరుత్సాహంతో వేలసంఖ్యలో వచ్చిన నిరుద్యోగులు వెనుతిరిగారు. రోడ్డుపై బైఠాయించిన నిరుద్యోగులు ఫార్చ్యూన్ కంపెనీకి సంబంధించి డైరెక్టర్ వెంకటక్రిష్ణ, ఇక్కడ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న స్థానిక వ్యక్తి నాగేంద్ర అందుబాటులో లేకపోవడంతో ఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నందలూరు కోటేశ్వరరెడ్డి అక్కడకు చేరుకున్నారు. నిరుద్యోగులకు మోసంచేసిన ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టర్‌ను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేస్తూ కడప–చెన్నై జాతీయ రహదారిలో బైటాయించారు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న స్థానిక ఎస్ఐ ప్రతాప్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఉందని నచ్చజెప్పి అక్కడి నుంచి అందరినీ పంపివేశారు. ఐకేపీఎస్ హెచ్చరిక పరిశ్రమల పేర్లతో నిరుద్యోగులతో చెలగాటం ఆడే వారు ఎవరైనా ఎంతటివారైనా సహించేది లేదని ఐకేపీఎస్ (ఐక్యపోరాట సమితి) అధ్యక్షుడు పోతురాజు మస్తానయ్య హెచ్చరించారు. వేలసంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఒక్కరోజు మాత్రమే దరఖాస్తులు అమ్మి రూ.2.50 లక్షలు తీసుకుని ఇంతవరకు పత్తాలేకుండా పోవడం ఏమిటని? ప్రశ్నించారు. అతను నిజంగానే ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టరా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అంతలోనే ఆల్విన్ కర్మాగారాన్ని గతంలో కొనుగోలు చేసిన రాజేంద్ర కన్స్ట్రక్షన్స్ అధినేత సత్యనారాయణరెడ్డి, కుమారుడు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వీరేంద్రారెడ్డి అక్కడికి రావడంతో ఆయనపై మస్తానయ్య విరుచుకుపడ్డారు. మీకు తెలియకుండా ఫారŠూచ్యన్ కంపెనీ పేరుతో ఎటువంటి లోగో లేకుండా కార్యాలయాలు పూర్తిగా ఏర్పాటుచేయకుండానే దరఖాస్తులు విక్రయిస్తుంటే మీరేమి చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై సత్యనారాయణరెడ్డి సమాధానమిస్తూ శుక్రవారం మధ్యాహ్నం 2–30కు స్థానిక్ ఆర్అండ్బీ బంగ్లా ఆవరణలో ప్రెస్‌మీట్ పెడతానని, అన్ని విషయాలు అక్కడ తెలుపుతానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తిరిగి అనేక పర్యాయాలు ఆయన (వీరేంద్రారెడ్డి)కు ఫోన్‌చేసినా స్పందనలేదు. దీంతో ఐకేపీయస్ అధ్యక్షుడు మస్తానయ్య మాట్లాడుతూ ఈ విషయంపై తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం అడేవారికి తగిన గుణపాఠం చెపుతామని ఆయన హెచ్చరించారు. స్థానికంగా పుకార్లు షికార్లు ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టర్ వెంకటక్రిష్ణ (సోలార్ వెంకట్)గా చెప్పుకుంటున్న వ్యక్తి అసలు పేరు వెంకటసుబ్బయ్య అని, అతను అనేకచోట్ల ఐపీ (బాకీలు ఎగ్గొట్టి)లు పెట్టి ఉడాయించారని, అదేవిధంగా ఆల్విన్ కర్మాగారాన్ని ఆయన కొనుగోలు చేయలేదని, కొంత స్థలాన్ని లీజుకు మాత్రమే తీసుకోవడం జరిగిందని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ రాజకీయ నాయకులను చేతిలో ఉంచుకుని సుమారు రూ.250 కోట్లు పరిశ్రమల శాఖ (ఎస్ఎఫ్సీ)లో రుణంకోసం దరఖాస్తు చేసుకుని ఉన్నారని చెప్పుకుంటున్నారు. అందుకే ప్రముఖ నాయకులను తమ కంపెనీ ఏర్పాటుకు పిలిచి ఆ రుణాన్ని మంజూరు చేయించుకుని ఉడాయించేందుకు ఈ పథకం పన్నారని నందలూరులో పుకారు షికార్లు చేస్తున్నాయి. కట్టలు తెంచుకున్న ఆగ్రహం 3వ తేదీ శుక్రవారం తిరిగి నిరుద్యోగులు దరఖాస్తుల కోసం రాగా ‘‘టు డే హాలిడే’’ అనే బోర్డు దర్శనమిచ్చింది. దీంతో ఒక్కసారిగా వారిలో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. బోర్డును చించివేసి గేటును నెట్టుకుంటూ ఒక్కసారిగా లోపలికి వెళ్లారు. దీంతో కంపెనీ ఇన్చార్జిగా ఉన్న స్థానిక వ్యక్తి అక్కడినుంచి మెల్లగా జారుకున్నాడు. ఫోన్ స్విచ్ఆఫ్ చేయడంతో లోపలికి వెళ్లిన నిరుద్యోగులు ఎవరిని అడగాలో..? తమ సమస్యలు ఎవరికి తెలపాలో అర్థంకాని సందిగ్ధంలో పడ్డారు. -
బౌద్ధరామాల అభివద్ధికి రూ.1.30కోట్లు
నందలూరు: రాష్ట్రపర్యాటకశాఖ ఆధ్వర్యంలో బౌద్దరామాల అభివద్దికి రూ.1.30కోట్లతో అభివద్ది చేయనున్నట్లు ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఆదివారం రాయలసీమలోనే చారిత్రాత్మక కట్టడాలైన నందలూరులోని ఆడపూరు ముక్తి కనుమ వద్దగల బౌద్ధరామాలను ఆయన సందర్శించారు. నందలూరులోని బౌద్దరామాలను పర్యాటకశాఖ అధికారులతో కలిసి అభివద్ధికోసం అవసరమైన స్థలాన్ని ఆయన పరిశీలించారు. బౌద్ధరామాల గురించి ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్లి వీలైతే ఆయనను ఇక్కడికి పిలుచుకువస్తానని ఆయన తెలిపారు. బౌద్దరామాలచుట్టూ రోడ్లను, ముఖద్వారం ఏర్పాటచేయాలని అధికారులకు సూచించారు. బౌద్దరామాలవద్దగల గజేంద్రమడుగును నీరు–చెట్టు కార్యక్రమం ద్వారా అభివద్దిచేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటకశాఖ అధికారి ఖాదర్‌భాష, తహసీల్దార్ దార్ల చంద్రశేఖర్, ఈవొఆర్డీ భానుప్రసాద్, ఆడపూరు సర్పంచ్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైభవం.. సౌమ్యనాథుని బ్రహ్మోత్సవం
నందలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు అయిన ఆదివారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మోహిని అలంకారంలో దర్శనమిచ్చిన స్వామికి శేషవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. 11 గంటలకు స్నపన తిరుమంజనం కార్యక్రమం చేశారు. రాత్రి 8–30 గంటలకు గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వెండి బిందె వితరణ: సౌమ్యనాథస్వామికి అమెరికాలో ఉన్న గాదెంశెట్టి రాజేష్, ఆయన సతీమణి గాయత్రి వెండి బిందెను వితరణగా అందించారు. వారు ఉత్సవ కమిటీ సభ్యులకు వెండి బిందెను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు సునీల్‌కుమార్‌శర్మ, ఈవో సుబ్బారెడ్డి, ఆలయ ట్రస్ట్ చైర్మన్ యెద్దుల సుబ్బరాయుడు, కార్య నిర్వాహకులు పల్లెం సుబ్రమణ్యం, గంటా వాసు, కొండపల్లి సుబ్బరాయుడు, లంకయ్యగారి సుబ్బరామయ్య, నందలూరు ఎస్సై భక్తవత్సలం, కోర్టు కానిస్టేబుల్ హేమాద్రి తదితరులు పాల్గొన్నారు. -
నందలూరు లోకోషెడ్‌ను పరిశీలించిన ఎంపీ మిధున్‌రెడ్డి
రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలంలోని నందలూరులో బ్రిటిష్ కాలంనాటి రైల్వే లోకోషెడ్‌ను ఎంపీ మిథున్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. పాత లోకోషెడ్ స్థానంలో అధునాతన రైల్వే ట్రాక్షన్ లోకోషెడ్ ఏర్పాటు చేయాలని స్థానికులతోపాటు ప్రజాప్రతినుధులూ డిమాడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంపీ మిథున్‌రెడ్డి వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు. -
లోకోషెడ్‌ను పరిశీలించిన ఎంపీ మిధున్‌రెడ్డి
రాజంపేట : వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మండలం నందలూరులోని బ్రిటిష్ కాలం నాటి రైల్వే లోకోషెడ్‌ను రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిధున్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ లోకోషెడ్ స్థానంలో అధునాతన రైల్వే ట్రాక్షన్ లోకోషెడ్ ఏర్పాటు చేయాలని గతం నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మిధున్రెడ్డితోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ ఈ లోకోషెడ్ పరిశీలించారు. -
రైతు ఉసురు తీసిన లంచం
పాసుపుస్తకం ఇవ్వడానికి రూ.4 లక్షలు డిమాండ్ చేసిన తహశీల్దార్ ఆత్మహత్య చేసుకుందామని సెల్ టవర్ ఎక్కుతూ గుండెపోటుతో మృతి చెందిన రైతు మగ్బూల్ నందలూరు (వైఎస్సార్ జిల్లా): రెవెన్యూ అధికారుల ధనదాహానికి మరో రైతు బలయ్యాడు. పట్టాదారు పాసుపుస్తకం కోసం మూడేళ్లు తిప్పుకుని... చివరకు రూ.4 లక్షలు లంచం అడగడంతో... దిక్కుతోచక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని సెల్ టవర్ ఎక్కుతూ గుండెపోటుకు గురై సోమవారం మృతి చెందాడు. దీంతో అధికారుల తీరుపై మృతుడి బంధువులు భగ్గుమన్నారు. ఆర్డీఓను చుట్టుముట్టారు. ఓ దశలో మృతదేహాన్ని తీసుకెళ్లి పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించారు. వైఎస్ఆర్ జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లెకు చెందిన సయ్యద్ మగ్బూల్(52) ,అతని సోదరులంతా వేరుపడి వేర్వేరుగా జీవిస్తున్నారు. వారికి ఉమ్మడిగా వేర్వేరు చోట్ల 5.13 ఎకరాల భూమి ఉంది. అలా తన వాటాపై వచ్చిన భూమి పట్టాదారు పాసుపుస్తకం కోసం మగ్బుల్ మూడేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో రాజంపేట ఆర్డీఓగా ప్రభాకర్ పిళ్లై, నందలూరు తహశీల్దార్‌గా నరసింహులు ఏడాది క్రితం బాధ్యతలు చేపట్టారు. తన సమస్య తీర్చాలని మగ్బూల్ వారిద్దరినీ ప్రతీ సోమవారం కలిసేవాడు. ఈ నేపథ్యంలో తహశీల్దార్ అతన్ని రూ.4 లక్షలు ఇస్తేనే రికార్డులు సరిచేసి భాగపరిష్కారం చేస్తానని తేల్చి చెప్పారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని మగ్బూల్ సోమవారం ఉదయం 10 గంటలకు అరవపల్లెలోని సెల్‌టవర్ ఎక్కాడు. అలా అక్కడే మృతి చెందాడు.తహశీల్దార్‌ను సస్పెం డ్ చేసేవరకు మృతదేహాన్ని కిందకు దింపనివ్వమని బంధువులు బైఠాయించారు. బదిలీ సమాచారం రావడంతో అధికారులు వారికి నచ్చజెపిప మృతదేహాన్ని కిందకు దింపారు.