వైభవం.. సౌమ్యనాథుని బ్రహ్మోత్సవం
నందలూరు:
జిల్లాలో ప్రసిద్ధి చెందిన నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు అయిన ఆదివారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మోహిని అలంకారంలో దర్శనమిచ్చిన స్వామికి శేషవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. 11 గంటలకు స్నపన తిరుమంజనం కార్యక్రమం చేశారు. రాత్రి 8–30 గంటలకు గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
వెండి బిందె వితరణ:
సౌమ్యనాథస్వామికి అమెరికాలో ఉన్న గాదెంశెట్టి రాజేష్, ఆయన సతీమణి గాయత్రి వెండి బిందెను వితరణగా అందించారు. వారు ఉత్సవ కమిటీ సభ్యులకు వెండి బిందెను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు సునీల్‌కుమార్‌శర్మ, ఈవో సుబ్బారెడ్డి, ఆలయ ట్రస్ట్ చైర్మన్ యెద్దుల సుబ్బరాయుడు, కార్య నిర్వాహకులు పల్లెం సుబ్రమణ్యం, గంటా వాసు, కొండపల్లి సుబ్బరాయుడు, లంకయ్యగారి సుబ్బరామయ్య, నందలూరు ఎస్సై భక్తవత్సలం, కోర్టు కానిస్టేబుల్ హేమాద్రి తదితరులు పాల్గొన్నారు.