glory
-
జోగ్ జలపాతం ఉరకలు : రెండు కళ్లూ చాలవు! వైరల్ వీడియో
భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని షిమోగ జిల్లాలోని సాగర తాలూకాలో ఉన్న జోగ్ జలపాతం నిండు కుండలా కళకళలాడుతోంది. దేశంలోని ఎత్తైన జలపాతాలలో ఒకటి జోగ్. సహజ సౌందర్యంతో, నీటి ప్రవాహం హోరు, పాల నురుగు లాంటి లయలతో అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడతారు. తాజా వర్షాలతో పూర్తి జలకళను సంతరించుకుని నయాగరాను మించిన సోయగాలతో ఆకట్టుకుంటోంది. Jogfalls as seen today in its full glory!#jogfalls #2024 #karnataka #KarnatakaRains pic.twitter.com/NhAWrScft4— Raj Mohan (@rajography47) August 3, 2024జోగ్ జలపాతం విశేషాలు జోగ్ జలపాతం 253 మీటర్ల (829 అడుగులు) ఎత్తు. ఇది భారతదేశంలోని ఎత్తైన జలపాతాలలో ఒకటి. జోగ్ జలపాతం ఒక ట్రెయల్లో పడుతుంది. అందుకే ఇది “ట్రెయిల్ జలపాతం” గా పాపులర్ అయింది.The mighty Jog 😍 Raja, Rani, Roarer and Rocket all came together!!#jogfalls #karnataka #IncredibleIndia #KarnatakaRains pic.twitter.com/tXlGffcWKy— Raj Mohan (@rajography47) August 3, 2024 -
Makar Sankranti 2024: సంక్రాంతి వైభవాన్ని కనుమా!
భారతీయులు అందులోనూ దాక్షిణాత్యులు, ముఖ్యంగా తెలుగువారు సంక్రాంతిని ఎంతో వైభవోపేతంగా చేసుకుంటారు. ఆడపడుచులు, అల్లుళ్లతో సహా సంక్రాంతికి మాత్రం తమ స్వగ్రామాలకి చేరుకుంటారు అందరు. సంక్రాంతి వైభవం అంతా పల్లెలలో చూడాలి. సంక్రాంతి పండుగ సమయానికి పంటలు ఇంటికి వచ్చి రైతులు, వ్యవసాయ కూలీలు గ్రామంలో ఉన్న అందరు కూడా పచ్చగా ఉంటారు. ప్రకృతి కూడా పచ్చగా కంటికి ఇంపుగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ΄పొలం పనులు పూర్తి అయి కాస్త విశ్రాంతి తీసుకునే వీలుండటంతో సందడి, సంబరాలు. తమకి ఇంతటి భద్రత కలగటానికి మూలమైన భూమిని, రైతులను, కూలీలను, పాలేర్లను, పశువులను, పక్షులను అన్నింటికి కృతజ్ఞతను తెలియచేయటం, తమ సంపదను సాటివారితో బంధుమిత్రులతో పంచుకోవటం ఈ వేడుకల్లో కనపడుతుంది. భారతీయులు చాంద్రమానంతో పాటు కొన్ని సందర్భాలలో సూర్యమానాన్ని కూడా అనుసరిస్తారు. అటువంటి వాటిల్లో ప్రధానమైనది మకరసంక్రమణం. మకరసంక్రమణంతో సూర్యుడి గమనం దిశ మారుతుంది. అప్పటి వరకు దక్షిణదిశగా నడచిన నడక ఉత్తర దిక్కుగా మళ్ళుతుంది. అందుకే ఆ రోజు నుండి ఆరునెలలు ఉత్తరాయణం అంటారు. అప్పటికి ఆరునెలలనుండి దక్షిణాయనం. ఈ పుణ్య సమయంలో చేయవలసిన విధులు కూడా ఉన్నాయి. వాటన్నింటిని సంక్రాంతి సంబరాల్లో మేళవించటం జరిగింది. ► విధులు అంతరిక్షంలో జరిగే ఖగోళవిశేషాల ననుసరించి ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనుషులు చేయవలసిన పనులను పండుగ విధులుగా చెప్పటం మన ఋషుల ఘనత. అవి మనిషి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగాను ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞాన్ని అందించేవిగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయికి ఎదగటానికి సహాయం చేసేవిగా ఉంటాయి. మన పండుగలు బహుళార్థసాధక ప్రణాళికలు. అన్నింటిని సమీకరించి ఎప్పుడేం చెయ్యాలో చక్కగా చె΄్పారు. ► పెద్దపండగ సంక్రాతిని పెద్దపండగ అంటారు. చాలా పెద్ద ఎత్తున చేసుకోవటంతో పాటు ఎక్కువ రోజులు చేసుకుంటారు. సంక్రమణం జరిగే రోజు పండుగ, ముందురోజు భోగి, మూడవరోజు కనుము. నాలుగవ రోజు ముక్కనుము. నిజానికి పండుగ వాతావరణం నెలరోజుల ముందు నుండే నెలకొంటుంది. ► నెల పట్టటం సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15వ తేదీ కాని, 16 వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14వ తేదీ వరకు కాని, 15 వ తేదీ వరకు కాని ఉండే ధనుర్మాసం అంతా ప్రత్యేకంగానే కనపడుతుంది. దీనిని ‘నెలపట్టటం’ అని అంటారు. అంటే ఈ నెల అంతా ఒక ప్రత్యేక మైన పద్ధతిని పాటిస్తామని చెప్పటం. ఇళ్ల ముందు ఆవుపేడ కళ్ళాపిలో అందంగా తీర్చి దిద్దిన రంగవల్లికలు, ఆకాశంలో నుండి క్రిందికి దిగి వచ్చినట్టు కనపడే చుక్కల ముగ్గుల మధ్యలో కంటికింపుగా దర్శనమిచ్చే గొబ్బెమ్మలు, గొబ్బెమ్మల పైన అలంకరించ బడి పలకరించే బంతి, చేమంతి, గుమ్మడిపూలు, వాటిని తొక్క కుండా ‘హరిలో రంగ హరి’ అంటు అందరిని తన మధురగానంతో మేలుకొలుపుతున్న హరిదాసులు, వారు వెళ్ళగానే ‘అయ్యగారికీ దండం పెట్టు, అమ్మగారికీ దండం పెట్టు’ అంటు గంగిరెద్దుల నాడించేవారు, జంగంవారు, బుడబుక్కలవారు ...... తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించే ఎంతోమంది జానపద కళాకారులు – అదొక కలకలం, అదొక కళావిలాసం. ఈ నెల అంతా విశిష్టాద్వైత సంప్రదాయాన్ననుసరించే వారు తిరు΄్పావై లేక శ్రీవ్రతం లేక స్నానవ్రతం అనే దాన్ని ఆచరిస్తారు.ద్వాపరయుగం చివరలో గోపికలు ఆచరించిన ఈ వ్రతాన్ని గోదాదేవి ఆచరించి శ్రీరంగనాథుని వివాహం చేసుకుని ఆయనలో సశరీరంగా లీనమయింది. వైష్ణవదేవాలయాల్లో తెల్లవారుజామునే కృష్ణుని అర్చించి బాలభోగంగా నివేదించిన ప్రసాదాన్ని తెల్లవారక ముందే పంచిపెడతారు. ప్రకృతిలో భాగమైన సర్వజీవులు స్త్రీలు. వారు పరమపురుషుని చేరుకోవటం కోసం చేసే సాధన మధురభక్తి మార్గం. దానికి ప్రతీక అయిన గోదాదేవి చేసిన వ్రతాన్ని ఈ నెలరోజులు సాధకులు, భక్తులు అందరు ఆచరిస్తారు. ఆండాళు తల్లి ఆ రోజుల్లో గోపికలుగా భావించుకున్న తన చెలులను వ్రతం చెయ్యటానికి స్నానం చేద్దాం రమ్మని మేలు కొలుపుతుంది. ఇప్పుడు ఆపని హరిదాసులు చేస్తున్నారు. ► సంక్రాంతి అసలు ప్రధానమైనది సంక్రాంతి, అంటే సంక్రమణం జరిగే రోజు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే రోజు. ఈ పుణ్య కాలంలో దానాలు, తర్పణాలు ్రపాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం, పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయని వారు ఈ రోజు చేస్తారు. అసలు మూడు రోజులు పేరంటం చేసే వారున్నారు. దక్షిణాయణం పూర్తి అయి పితృదేవతలు తమ స్థానాలకి వెడితే మళ్ళీ ఆరునెలల వరకు రారు కనుక వారికి కృతజ్ఞతా పూర్వకంగా తర్పణాలు ఇస్తారు. కొంతమంది కనుము నాడు తర్పణాలిస్తారు. ► కనుము తమ ఇంటికి పంట వచ్చి ఆనందంగా ఉండటానికి కారణభూతమైన భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి కూడా తమ కృతజ్ఞతలని తెలియ చేయటం ఈ పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి, పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె΄పొటేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు. పాలేళ్ళకి ఈరోజు సెలవు. వాళ్ళని కూడా తలంటు పోసుకోమని కొత్తబట్టలిచ్చి పిండి వంటలతో భోజనాలు పెడతారు. సంవత్సరమంతా వ్యవసాయంలో తమకు సహాయం చేసిన వారి పట్ల కతజ్ఞత చూపటం నేర్పుతుంది ఈ సంప్రదాయం. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవ మర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పక్షులు వచ్చి తమ పంట పాడుచేయకుండా ఉండేందుకు, పురుగులని తిని సహాయం చేసినందుకు వాటికి కూడా కృతజ్ఞతను ఆవిష్కరించేందుకు వరి కంకులను తెచ్చి చక్కని కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ్రపాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’, ‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’ అనే సామెతలు కనుముకి పితదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. ► ముక్కనుము ముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలిసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని మాంసాహారం తినటానికి కేటాయిస్తారు. ఒక పండుగ, అందులోనూ ప్రధానమైన పండుగను చేసుకోవటంలో ఎన్ని అంశాలను మిళితం చేసి, వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని పెంపొందించే విధంగా ప్రయోజనాత్మకంగా రూ΄పొందించారో మన పెద్దలు! – డా. ఎన్.అనంతలక్ష్మి -
బాలాత్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు వేద పండితులు, అర్చకుల సుప్రభాత సేవతో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. తొలిరోజు స్నపనాభిషేకం అనంతరం బాలా త్రిపుర సుందరీ దేవీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.40గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. ఆదివారం, దసరా సెలవులు కావడంతో తొలి రోజు నుంచే ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బంది లేకుండా తాగునీటి సౌకర్యం కల్పించారు. స్నానఘాట్లల్లో ప్రత్యేకంగా షవర్లు, తలనీలాలు సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల దర్శనానికి ఎటువంటి అంతరాయం కలుగకుండా వీవీఐపీల సమాచారం ముందుగా తెలియజేస్తే ప్రొటోకాల్‌కు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు చెప్పారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తులతో నగరోత్సవం నిర్వహించి, పంచహారతులను సమర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండోరోజైన సోమవారం నాడు శ్రీ కనకదుర్గమ్మవారు భక్తులకు శ్రీ గాయత్రీదేవీగా దర్శనమివ్వనున్నారు. దుర్గమ్మ సేవలో గవర్నర్ దంపతులు ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా మహోత్సవాల్లో భాగంగా తొలి రోజైన ఆదివారం బాలత్రిపుర సుందరిదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులు దర్శించుకున్నారు. దర్శనానికి విచ్చేసిన గవర్నర్‌కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. గవర్నర్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, చైర్మన్ కర్నాటి రాంబాబు అందజేశారు. గవర్నర్ వెంట కలెక్టర్ ఢిల్లీరావు తదితరులున్నారు. అలాగే, మంత్రులు ఆర్కే రోజా, విశ్వరూప్ కూడా దుర్గమ్మను దర్శించుకున్నారు. -
యుద్ధంలో ఒక్కసారిగా మారిన సీన్.. రష్యా బలగాల గజగజ
Ukraine War: రష్యా, తూర్పు ఉక్రెయిన్‌ని బాంబులతో దద్దరిల్లేలా చేసింది. వరుసగా ఒక్కొక్క నగరాన్ని కైవసం చేసుకుంటూ దాదాపు 70 శాతం నియంత్రణలో తెచ్చుకోవడమే కాకుండా నిరాటంకంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. రష్యా బలగాలు డోనెట్స్ నదిపై ఉన్న మూడు బ్రిడ్జిలను కూల్చి ఉక్రెయిన్ బలాగాలను నగరంలో ప్రవేశించకుండా అడ్డుకున్నాయి. పైగా లొంగిపోండి లేదా చచ్చిపోండి అంటూ రష్యా బలగాలు నినాదాలు చేశాయి. ఈ తరుణంలో ఇవాళ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఉక్రెయిన్ తన యుద్ధ వ్యూహాన్ని మార్చేసింది. శత్రుదేశాన్ని మట్టికరిపించేలా మెదటి ప్రపంచ యుద్ధం తరహాలో ఆపరేషన్ చేపట్టింది. శత్రు దాడులనుంచి రక్షణకోసం ఏర్పాటు చేసుకునే కందకాలానే(దాడుల నుంచి రక్షణ కోసం భూమిలో ఏర్పాటు చేసుకునే ఇరుకైన గుంత) లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం మొదలు పెట్టాయి ఉక్రెయిన్ బలగాలు. ఈ మేరకు ఉక్రెయిన్ బలగాలు కందకంలో ఉంటున్న రష్యా బలగాలపై డ్రోన్లతో నేరుగా దాడులు చేసింది. ఈ దాడులు విజయవంతం కావడంతో ఉక్రెయిన్ దళాలు జోష్‌తో ముందుకు వెళ్తున్నాయి. ఊహించని ఈ దాడులతో రష్యా బలగాలు అతలాకుతలం అవుతున్నాయి. కింగ్ డేనియల్ పేరుతో 24వ మెకనైజ్డ్ బ్రిగేడ్ ఉక్రెయిన్ సైనికులు ఆక్రమణదారులకు చుక్కలు చూపిస్తాం అంటూ... 'స్లేవ్ ఉక్రెయిన్'(ఉక్రెయిన్ బానిస)... 'గ్లోరి టూ ఉక్రెయిన్' (ఉక్రెయిన్ కీర్తీ) వంటి నినాదాలతో దాడులు చేశారు. రష్యా ఫిబ్రవరి 24న ఉక్రెయిన పై దాడులకు తెగబడటంతో ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి. అతి చిన్న పోరుగు దేశం పై ఎందుకు యుద్ధం అన్నా వినలేదు. కానీ ఇప్పుడు ఆ చిన్నదేశం ఉక్రెయిన్‌తో ఊహించని ప్రతిఘటనను రష్యా ఎదుర్కొంటోంది. అంతేకాదు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా మేజర్ జనరల్ వంటి ఆర్మీ అధికారుల నుంచి దిగ్గజ షూటర్ల వరకు పెద్ద సంఖ్యలో యుద్ధవీరులను కోల్పోయింది కూడా. ఈ మేరకు ఉక్రెయిన బలగాలు డ్రోన్లతో రష్యా కందకాలపై దాడుల నిర్వహిస్తున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 24th Mechanized Brigade dropping the VOG-17 grenade straight in the Russian trench pic.twitter.com/kRsudUj7px — ТРУХА⚡️English (@TpyxaNews) June 11, 2022 (చదవండి: ఇంత దారుణమేంటి పుతిన్.. స్పెషల్ బాడీగార్డుతో అలాంటి పనేంటి..?) -
ఇటలీ అథ్లెట్ స్ప్రింట్ చాంపియన్
‘జమైకన్ థండర్’ బోల్ట్ లేని ఒలింపిక్స్‌లో ఎవరా పందెం కోడి అనే చర్చకు ఆదివారం తెరపడింది. టోక్యో ఒలింపిక్స్‌లో అనూహ్యంగా ఇటలీ స్ప్రింటర్ మార్సెల్ జాకబ్స్ దూసుకొచ్చాడు. ఎవరి ఊహకందని విధంగా 1992 తర్వాత తొలిసారి ఒలింపిక్స్ పురుషుల 100 మీటర్ల రేసులో యూరోపియన్ అథ్లెట్ విజేతగా నిలిచాడు. చిత్రంగా జమైకన్ అథ్లెట్లు ఎవరూ ఫైనల్స్కే అర్హత సాధించలేకపోయారు. టోక్యో: ఒలింపిక్స్‌లో కొన్నేళ్లుగా స్ప్రింట్‌ను శాసిస్తున్న జమైకాకు టోక్యోలో చుక్కెదురైంది. 100 మీటర్ల విభాగంలో బోల్ట్ వారసుడు బ్రోమెల్... బ్రోమెల్... అనే ప్రచారం చివరకు ప్రదర్శనకు వచ్చేసరికి తుస్సుమంది. పురుషుల ఈవెంట్లో ఎవరూహించని విజేత 100 మీటర్ల చిరుత అయ్యాడు. ఇటలీకి చెందిన మార్సెల్ జాకబ్స్ సరికొత్త చాంపియన్‌గా అవతరిం చాడు. ఆదివారం జరిగిన పురుషుల వంద మీటర్ల పరుగులో జాకబ్స్ పోటీని అందరికంటే ముందుగా 9.80 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. అమెరికన్ ఫ్రెడ్ కెర్లీ 9.84 సెకన్ల టైమింగ్‌తో రజతం... కెనడాకు చెందిన అండ్రీ డి గ్రేస్ (9.89 సెకన్లు) కాంస్యం గెలిచారు. నిజానికి గత ఒలింపిక్స్ ముగిసే సమయానికి అసలు జాకబ్స్ పూర్తిస్థాయి స్ప్రింటరే కాదు. లాంగ్‌జంప్‌లో పోటీపడే ఈ ఇటాలియన్ గత రెండేళ్లుగా షార్ట్ డిస్టెన్స్ రన్‌పై కన్నేశాడు. అదేపనిగా ప్రాక్టీస్ చేశాడు. చివరకు ఇక్కడికొచ్చి స్వర్ణమే సాధించాడు. జమైకా కంటే ముందు ఏళ్ల తరబడి అమెరికన్ల గుప్పిట ఉన్న స్ప్రింట్ ‘బీజింగ్’లో జమైకా చేతుల్లోకి వెళ్లింది. తీరా టోక్యోకు వచ్చేసరికి అసలు ఒక్క జమైకన్ అథ్లెట్ లేకుండానే ఫైనల్ జరగడం మరో విశేషం. జమైకాలో బోల్ట్ తర్వాత అంతటివాడుగా పేరొందిన యోహాన్ బ్లేక్ సెమీస్‌తోనే సరిపెట్టుకున్నాడు. అతని సహచరుడు ఒబ్లిక్ సెవిల్లే కూడా అక్కడితోనే ఆగిపోయాడు. అందరి దృష్టిని ఆకర్షించి, వంద మీటర్ల పరుగులో అమెరికా ఆశాకిరణమైన బ్రోమెల్ అసలు పతకం బరిలోనే లేడు. ఈ అ‘మెరిక’ పని రెండో సెమీస్‌లోనే కంచికి చేరింది. -
సంగీత జ్ఞానికి ఘన సత్కారం
సంగీతజ్ఞాని ఇళయరాజాకు శనివారం సాయంత్రం చెన్నైలో ఘనసత్కారం జరిగింది. 1000కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించి రికార్డుకెక్కిన ఇళయరాజా 75 వసంతాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ సంగీత రాజాకు తమిళ నిర్మాతల మండలి చెన్నైలో అభినందన సభ నిర్వహించింది. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు, చెన్నై నందనంలోని వైఎంసీఏ మైదానంలో బ్రహ్మాండమైన సంగీత విభావరిని తలపెట్టారు. అందులో భాగంగా శనివారం సాయంత్రం జరిగిన ఈ సంగీత కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘1996లో ‘అన్నక్కిళి’ చిత్రంతో తన సంగీత పయనాన్ని ప్రారంభించిన ఇళయరాజా గ్రామీణ, తమిళ సంప్రదాయ పాటలకు ప్రాణప్రతిష్ట చేశారు. 13 రోజుల్లో సింపోనికి బాణీలు కట్టి ప్రపంచ రికార్డు సాధించిన ఘనత ఇళయరాజాది. ప్రపంచస్థాయిలో అభిమాన గణం కలిగిన ఇళయరాజా ఇంకా పదికాలాల పాటు సంగీత దర్శకుడిగా కొనసాగాలి’’ అన్నారు. సంగీత సామ్రాజ్యానికి ఏకైక రారాజు ఇళయరాజానే అని తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నటుడు విశాల్ సంగీతజ్ఞానిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఆర్ రెహమాన్ తన మార్గదర్శి ఇళయరాజానే అని పేర్కొన్నారు. కాగా ఈ వేదికపై సినీ పరిశ్రమ తరఫున ఇళయరాజాకు బంగారంతో చేసిన వయోలిన్‌ను బహూకరించి ఘనంగా సత్కరించారు. -
కనువిందు చేస్తున్న జోగ్ జలకళ
గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యంగా దేశంలోనే అత్యంత ఎత్తైన జలపాతంగా పేరొందిన జోగ్ మరింత ఎగిసిపడుతూ దృశ్యమానంగా కనువిందు చేస్తోంది. కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లోని వర్షపు నీరు కిందకి ప్రవహించడంతో జోగ్ జలపాతానికి వరద పోటెత్తింది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జోగ్ జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తోంది. శరావతి నది ఉప్పొంగి ప్రవహించడంతో దేశంలోనే అతిపెద్ద జలపాతం జోగ్ నుంచి నీళ్లు కిందకు దుముకుతుంటే ఆ ప్రాంతంమంతా ఆహ్లాదకరంగా మారింది. లింగనమక్కి డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో సముద్రమట్టానికి 250 మీటర్ల (830 అడుగుల) ఎత్తులో ఉన్న ఈ అద్భుతదృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. ఈ రిజర్వాయర్ నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత, పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేయడం ఇదే మొదటిసారట. కాగా దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు పలు రాష్ట్రాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా వరద బీభత్సానికి విలవిల్లాడుతున్న కేరళలో ఇంకా విపత్కర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 42మంది మృత్యువాత పడ్డారు. పెద్దఎత్తున సహాయ, రక్షకసేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముళ్ల పెరియార్ డ్యామ్‌లో నీటిస్థాయి ప్రమాద స్థాయికి చేరుకోవడంతో పలు జిల్లాల్లో తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. -
కనువిందు చేస్తున్న జోగ్ జలకళ
-
దేవుడి మహిమంటే ఇదేనేమో?
దేవుడి మహిమలంటే అంతే మరి. మనల్ని పుట్టిస్తాడు. మన తోడును మనకోసం ఇంకెక్కడో పుట్టిస్తాడు. దేవుడు ఆడే ఈ ఆటలో... ఒక్కొసారి మనతో జీవితాంతం కలిసి ఉండే వ్యక్తి మన పక్కనే ఉన్న తెలుసుకోలేకపోతాం. మళ్లీ ఎప్పటికో కలుస్తాం. అదే విధి. దేవుడు ఆడే చదరంగం. భూమి గుండ్రంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా...తిరిగి రావాల్సిన చోటుకే వస్తారు. ఇప్పుడీ వేదాంతం అంతా ఎందుకు అనుకుంటున్నారా? ఆ కథేంటో ఓసారి చూద్దాం చైనాలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఒక యువకుడు (యే) చైనాలో క్వింగ్డావోలోకి ఒక కట్టడం ముందు ఫోటో దిగాడు. అక్కడే పక్కన ఒక అమ్మాయి (జియు) కూడా ఫోటో దిగింది. ఇది జరిగింది 2000 సంవత్సరంలో. సరిగ్గా 11 ఏళ్ల తర్వాత అంటే 2011లో వీరిద్దరికి పెళ్లి జరిగింది. ఆ దంపతులిద్దరూ తమ జ్ఞాపకాలకు సంబంధించిన అప్పుడెప్పుడో దిగిన ఫోటోలు చూసి ఆశ్చర్యపోయారు. జియు దిగిన ఫోటోలో తన భర్త కూడా ఉండటాన్ని ఆమె గమనించింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనపై ఆశ్చర్యపోవడం వారివంతు అయింది. పదకొండు సంవత్సరాలక్రితమే విధి వారిని దగ్గర చేసింది. అయితే అప్పుడు వారికి తెలియదు. మళ్లీ పదకొండు సంవత్సరాల తరువాత ఇద్దరు కలిసి జీవితాన్ని పంచుకుంటారనీ. ఇప్పుడు వారిద్దరు తమ కవల పిల్లలతో మళ్లీ అదే ప్రదేశాన్ని సందర్శించాలనుకుంటున్నారట. ఈ పిల్లలు పెరిగి పెద్దయ్యాక కూడా మళ్లీ అక్కడికి వెళ్లి ఫోటోలు దిగాలనుకుంటున్నామని తెలిపారు. ఇంతకీ ఆ ప్రదేశం ఏంటో చెప్పలేదు కదూ...చైనా దేశంలోని క్వింగ్డావోలోని ఫోర్త్ స్క్వేర్. -
కర్ణిసేన యూటర్న్.. ‘పద్మావత్ ఓ అద్భుతం’
సాక్షి, ముంబై : పద్మావత్ చిత్రంపై శ్రీరాజ్‌పుత్ కర్ణి సేన ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఈ చిత్రంపై ఆందోళనలను విరమించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో పద్మావత్ అమోఘం అంటూ విపరీతమైన పొగడ్తలు గుప్పించింది. శుక్రవారం ముంబైలో పలువురు కర్ణిసేన నేతలు ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం కర్ణిసేన ముంబై చీఫ్ యోగంద్ర సింగ్ కటార్ మీడియాతో మాట్లాడారు. ‘‘చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఏం లేవు. ఇందులో రాజ్‌పుత్‌ల గురించి చాలా గొప్పగా చూపించారు. పద్మావత్ చూశాక ప్రతీ రాజ్‌పుత్ కూడా గర్వపడతారు’’ అంటూ కటార్ తెలియజేశారు. ఇక కర్ణిసేన జాతీయాధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామడి ఆదేశాలను అనుసరించి కర్ణిసేన ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ‘‘సినిమాలో రాణి పద్మినీ, ఖిల్జీ మధ్య ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు కూడా లేవు. రాజ్‌పుత్‌ల మనోభావాలు చిత్రం దెబ్బతీయలేదు. పైగా చాలా గొప్పగా చూపించారు. అందుకే ఆందోళనలు విరమిస్తున్నాం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలతోపాటు మిగతా చోట్ల కూడా చిత్రం ఆడేందుకు దోహదం చేస్తాం’’ అని పేర్కొంది. కాగా, చిత్ర షూటింగ్ ప్రారంభం నుంచే అభ్యంతరాలు లేవనెత్తుతూ విడుదలను అడ్డుకునేందుకు కర్ణిసేన శతవిధాల ప్రయత్నించింది. ఆందోళనలు, ధర్నాలు, దాడులు, నిరసనలు, భన్సాలీ-దీపిక తలలపై నజరానాల ప్రకటనలు, పలు రాష్ట్ర ప్రభుత్వాల(బీజేపీ పాలిత) నిషేధం... ఇలా ఏవీ కూడా చిత్ర విడుదలను అడ్డుకోలేకపోయాయి. చివరకు న్యాయస్థానాలు కూడా పద్మావత్ విడుదలకు క్లియరెన్స్ ఇవ్వటంతో కాస్త వెనక్కి తగ్గింది. ఇప్పుడు సినిమాలో అలాంటి అంశాలేవీ లేవని నిర్ధారణ కావటంతో యూటర్న్ తీసుకుని మద్ధతు ప్రకటించింది. -
రామదాసుకు అంతర్జాతీయస్థాయి కీర్తి కోసం కృషి
సాక్షి, నేలకొండపల్లి: రామయ్య పరమ భక్తాగ్రేసరుడు కంచర్ల గోపన్న(రామదాసు)కు అంతర్జాతీయస్థాయిలో కీర్తిని తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక రామదాసు ధ్యాన మందిరంలో భక్త రామదాసు జయంత్యుత్సవాలను ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం రామదాసు ధ్యాన మందిరం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రసంగించారు. ఈ మందిరం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గత ఏడాది మాట ఇచ్చారని, దానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. భక్త రామదాసు ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసినట్లే ఆయన స్మృతి భవనాన్ని కూడా త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రామదాసు వంటి మహనీయుడి చరిత్రను ప్రపంచమంతా తెలుసుకునేలా ప్రచారం చేయాలని తుమ్మల సూచించారు. ఇక్కడ బౌద్ధ క్షేత్రంతోపాటు బాలసముద్రం చెరువును కూడా పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. effort for International glory to Ramadas:Tummala -
ముగిసిన పెద్దగట్టు జాతర
వైభవంగా మకరతోరణం తరలింపు సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతులస్వామి జాతర (పెద్దగట్టు) ముగిసింది. గురువారం యాదవపూజారులు మకరతోరణం తరలింపు కార్యక్రమం నిర్వహించారు. జాతరకు తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి యాదవ కులస్తులతోపాటు, ఇతర భక్తులు తండోప తండాలుగా వచ్చారు. ఐదురోజుల్లో సుమారు 20 లక్షల మందికి పైగా భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఐదు రోజుల పాటు కళకళలాడిన దురాజ్‌పల్లి, సూర్యాపేట ప్రాంతాలు గురువారం భక్తులు తిరుగుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే ఖాళీ అవుతున్నాయి. -
ఆర్ధ్ర నక్షత్రం.. మల్లన్న వైభోగం
-· శ్రీశైలేశుడికి శాస్త్రోక్తంగా జన్మ నక్షత్ర పూజలు - వైభవంగా గ్రామోత్సవం శ్రీశైలం: శ్రీ మల్లికార్జునస్వామి జన్మనక్షత్రం ఆర్ధ్ర. దీనినే ఆరుద్ర నక్షత్రంగా కూడా పిలుస్తుంటారు. పుష్యమాసంలో వచ్చే ఆర్ధ్ర నక్షత్రం రోజున వార్షిక ఆరుద్రోత్సవాన్ని నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 10.30గంటల నుంచి గురువారం అర్థరాత్రి ఒంటి గంట వరకు శాస్త్రోక్తరీతిలో ఫలరసాభిషేకం, పంచామృతాభిషేకం, అన్నాభిషేకాలను అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. గురువారం వేకువజామున సుప్రభాత, కాలపూజ, మహామంగళహారతిసేవతో స్వామివార్లను మేల్కొల్పారు. ఆలయ ముఖమండపంలో ఉత్తరముఖంగా ఉత్సవమూర్తులను కొలువుంచి విశేషపూజలు చేశారు. అనంతరం నందివాహనంపై స్వామిఅమ్మవార్లను అధిష్టింపజేసి వాహనపూజలను ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి, అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నందివాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను ప్రధానాలయ రాజగోపురం నుంచి రథశాల వద్దకు చేర్చారు. అక్కడి నుంచి అంకాలమ్మగుడి, నందిమండపం వరకు అత్యంతవైభవంగా గ్రామోత్సవం జరిగింది. భక్తులు నందివాహనాధీశులైన శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను ఉత్తరద్వారంలో దర్శించుకుని పునీతులయ్యారు. వైభవం -
కృష్ణా పుష్కర వైభవం మనోహరం
విజయవాడ కల్చరల్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని చాటుతున్నాయి. శనివారం ప్రారంభ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఉషాబాల, వాణిబాల వాగ్గేయకార కీర్తనలు ఆలపించారు. ఆంధ్రనాట్యం ప్రాభవాన్ని ప్రచారం చేస్తున్న నాట్యాకళాకారిణి శారద రామకృష్ణ పుష్కర చరిత్రను నృత్యాంశంగా ప్రదర్శించారు. గుడిసేన విష్ణుప్రసాద్ కథను, కుమార సూర్యానారాయణ సంగీతాన్ని అందించారు. ప్రధాన పాత్రలో శారదా రామకృష్ణ, భరత్, సత్యప్రసాద్,దేవ వర్షిణి తదితరులు నృత్యాన్ని అభినయించారు. కార్యక్రమంలో భాగంగా జ్యోస్యుల రామచంద్రమూర్తి అన్నమయ్య, త్యాగరాజు తదితర వాగ్గేయకారుల కీర్తనలకు నృత్యాన్ని అభినయించారు. కృష్ణనది ప్రారంభంనుంచి హంసలదీవిలో సంగమించే దాకా నదీ పరివాహక ప్రాంతంలోని దేవాలయాలు, చారిత్రక వైభవం, పుష్కర చరిత్ర అంశాలుగా నృత్యరూపం సాగుతుంది. -
వైభవ కాంతులు
-
వైభవ కాంతులు
సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక నగరి సాంస్కృతిక వైభవంతో మురిసింది. పంద్రాగస్టు వేడుకలో భాగంగా గోల్కొండ కోటలో కళాకారులు వివిధ ప్రదర్శనలతో సందడి చేశారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాజన్న డోలు, ఒగ్గుడోలు, గుస్సాడి, కొమ్ముకోయ, పేరిణి, నగర కళా పేరి–బాజా, భాంగ్రా, రాజస్థానీ, దాండియా, కథక్, ముజ్రా వంటి 22 కళారూపాలు ఒకే వేదికపై కనువిందు చేశాయి. సిటీలోని పలు వారసత్వ కట్టడాలు విద్యుద్దీపాల వెలుగుల్లో కాంతులీనాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిన్నారుల దేశభక్తి కళా ప్రదర్శనలు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది విన్యాసాలు ఆకట్టుకున్నాయి. -
వైభవం.. సౌమ్యనాథుని బ్రహ్మోత్సవం
నందలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు అయిన ఆదివారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మోహిని అలంకారంలో దర్శనమిచ్చిన స్వామికి శేషవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. 11 గంటలకు స్నపన తిరుమంజనం కార్యక్రమం చేశారు. రాత్రి 8–30 గంటలకు గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వెండి బిందె వితరణ: సౌమ్యనాథస్వామికి అమెరికాలో ఉన్న గాదెంశెట్టి రాజేష్, ఆయన సతీమణి గాయత్రి వెండి బిందెను వితరణగా అందించారు. వారు ఉత్సవ కమిటీ సభ్యులకు వెండి బిందెను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు సునీల్‌కుమార్‌శర్మ, ఈవో సుబ్బారెడ్డి, ఆలయ ట్రస్ట్ చైర్మన్ యెద్దుల సుబ్బరాయుడు, కార్య నిర్వాహకులు పల్లెం సుబ్రమణ్యం, గంటా వాసు, కొండపల్లి సుబ్బరాయుడు, లంకయ్యగారి సుబ్బరామయ్య, నందలూరు ఎస్సై భక్తవత్సలం, కోర్టు కానిస్టేబుల్ హేమాద్రి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా సదర్ ఉత్సవాలు
-
విద్యార్థుల జీవన ప్రయాణం
హరీశ్, జై, విష్ణు, కీర్తి, గీతాంజలి, స్వప్న, కావేరి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం - ‘టెన్త్‌లో లక్.. ఇంటర్లో కిక్.. బి.టెక్‌లో...’. మంచి వెంకట్ దర్శకుడు. సురేందర్ యాదవ్ సమర్పకుడు. జె.ఎస్. రాజ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. టెన్త్ నుంచి బీటెక్ వరకూ విద్యార్థుల పయనం ఎలా ఉంటోంది? వారి నిర్ణయాలు భవిష్యత్తుపై ఏ విధమైన ప్రభావం చూపిస్తున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ అనీ, సందేశం, వినోదం మిళితమైన సినిమా ఇదనీ దర్శకుడు చెప్పారు.