కృష్ణా పుష్కర వైభవం మనోహరం
కృష్ణా పుష్కర వైభవం మనోహరం
Published Sat, Aug 20 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
విజయవాడ కల్చరల్ :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని చాటుతున్నాయి. శనివారం ప్రారంభ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఉషాబాల, వాణిబాల వాగ్గేయకార కీర్తనలు ఆలపించారు. ఆంధ్రనాట్యం ప్రాభవాన్ని ప్రచారం చేస్తున్న నాట్యాకళాకారిణి శారద రామకృష్ణ పుష్కర చరిత్రను నృత్యాంశంగా ప్రదర్శించారు. గుడిసేన విష్ణుప్రసాద్ కథను, కుమార సూర్యానారాయణ సంగీతాన్ని అందించారు. ప్రధాన పాత్రలో శారదా రామకృష్ణ, భరత్, సత్యప్రసాద్,దేవ వర్షిణి తదితరులు నృత్యాన్ని అభినయించారు. కార్యక్రమంలో భాగంగా జ్యోస్యుల రామచంద్రమూర్తి అన్నమయ్య, త్యాగరాజు తదితర వాగ్గేయకారుల కీర్తనలకు నృత్యాన్ని అభినయించారు. కృష్ణనది ప్రారంభంనుంచి హంసలదీవిలో సంగమించే దాకా నదీ పరివాహక ప్రాంతంలోని దేవాలయాలు, చారిత్రక వైభవం, పుష్కర చరిత్ర అంశాలుగా నృత్యరూపం సాగుతుంది.
Advertisement
Advertisement