దక్షిణ భారతదేశంలో గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.జలపాతాలు జలకళను సంతరించు కున్నాయి. ముఖ్యంగా దేశంలోనే అత్యంత ఎత్తైన జలపాతంగా పేరొందిన జోగ్ మరింత ఎగిసిపడుతూ దృశ్యమానంగా కనువిందు చేస్తోంది. కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లోని వర్షపు నీరు కిందకి ప్రవహించడంతో జోగ్ జలపాతానికి వరద పోటెత్తింది.