
విద్యార్థుల జీవన ప్రయాణం
హరీశ్, జై, విష్ణు, కీర్తి, గీతాంజలి, స్వప్న, కావేరి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం
హరీశ్, జై, విష్ణు, కీర్తి, గీతాంజలి, స్వప్న, కావేరి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం - ‘టెన్త్‌లో లక్.. ఇంటర్‌లో కిక్.. బి.టెక్‌లో...’. మంచి వెంకట్ దర్శకుడు. సురేందర్ యాదవ్ సమర్పకుడు. జె.ఎస్. రాజ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. టెన్త్ నుంచి బీటెక్ వరకూ విద్యార్థుల పయనం ఎలా ఉంటోంది? వారి నిర్ణయాలు భవిష్యత్తుపై ఏ విధమైన ప్రభావం చూపిస్తున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ అనీ, సందేశం, వినోదం మిళితమైన సినిమా ఇదనీ దర్శకుడు చెప్పారు.