ఆర్ధ్ర నక్షత్రం.. మల్లన్న వైభోగం
శ్రీ మల్లికార్జునస్వామి జన్మనక్షత్రం ఆర్ధ్ర. దీనినే ఆరుద్ర నక్షత్రంగా కూడా పిలుస్తుంటారు. పుష్యమాసంలో వచ్చే ఆర్ధ్ర నక్షత్రం రోజున వార్షిక ఆరుద్రోత్సవాన్ని నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం.
-· శ్రీశైలేశుడికి శాస్త్రోక్తంగా జన్మ నక్షత్ర పూజలు
- వైభవంగా గ్రామోత్సవం
శ్రీశైలం: శ్రీ మల్లికార్జునస్వామి జన్మనక్షత్రం ఆర్ధ్ర. దీనినే ఆరుద్ర నక్షత్రంగా కూడా పిలుస్తుంటారు. పుష్యమాసంలో వచ్చే ఆర్ధ్ర నక్షత్రం రోజున వార్షిక ఆరుద్రోత్సవాన్ని నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 10.30గంటల నుంచి గురువారం అర్థరాత్రి ఒంటి గంట వరకు శాస్త్రోక్తరీతిలో ఫలరసాభిషేకం, పంచామృతాభిషేకం, అన్నాభిషేకాలను అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. గురువారం వేకువజామున సుప్రభాత, కాలపూజ, మహామంగళహారతిసేవతో స్వామివార్లను మేల్కొల్పారు. ఆలయ ముఖమండపంలో ఉత్తరముఖంగా ఉత్సవమూర్తులను కొలువుంచి విశేషపూజలు చేశారు. అనంతరం నందివాహనంపై స్వామిఅమ్మవార్లను అధిష్టింపజేసి వాహనపూజలను ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి, అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నందివాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను ప్రధానాలయ రాజగోపురం నుంచి రథశాల వద్దకు చేర్చారు. అక్కడి నుంచి అంకాలమ్మగుడి, నందిమండపం వరకు అత్యంతవైభవంగా గ్రామోత్సవం జరిగింది. భక్తులు నందివాహనాధీశులైన శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను ఉత్తరద్వారంలో దర్శించుకుని పునీతులయ్యారు.
వైభవం