నందలూరు: రాష్ట్రపర్యాటకశాఖ ఆధ్వర్యంలో బౌద్దరామాల అభివద్దికి రూ.1.30కోట్లతో అభివద్ది చేయనున్నట్లు ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఆదివారం రాయలసీమలోనే చారిత్రాత్మక కట్టడాలైన నందలూరులోని ఆడపూరు ముక్తి కనుమ వద్దగల బౌద్ధరామాలను ఆయన సందర్శించారు. నందలూరులోని బౌద్దరామాలను పర్యాటకశాఖ అధికారులతో కలిసి అభివద్ధికోసం అవసరమైన స్థలాన్ని ఆయన పరిశీలించారు. బౌద్ధరామాల గురించి ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్లి వీలైతే ఆయనను ఇక్కడికి పిలుచుకువస్తానని ఆయన తెలిపారు. బౌద్దరామాలచుట్టూ రోడ్లను, ముఖద్వారం ఏర్పాటచేయాలని అధికారులకు సూచించారు. బౌద్దరామాలవద్దగల గజేంద్రమడుగును నీరు–చెట్టు కార్యక్రమం ద్వారా అభివద్దిచేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటకశాఖ అధికారి ఖాదర్‌భాష, తహసీల్దార్ దార్ల చంద్రశేఖర్, ఈవొఆర్డీ భానుప్రసాద్, ఆడపూరు సర్పంచ్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.