రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలంలోని నందలూరులో బ్రిటిష్ కాలంనాటి రైల్వే లోకోషెడ్‌ను ఎంపీ మిథున్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు.
పాత లోకోషెడ్ స్థానంలో అధునాతన రైల్వే ట్రాక్షన్ లోకోషెడ్ ఏర్పాటు చేయాలని స్థానికులతోపాటు ప్రజాప్రతినుధులూ డిమాడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంపీ మిథున్‌రెడ్డి వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు.