
మెదక్ రూరల్: ఒకటి, రెండు కాదు ఏకంగా 15 కిలోల బరువున్న చేప గాలానికి చిక్కిన సంఘటన మెదక్ జిల్లా హవేళి ఘణాపూర్ మండలం పోచారం ప్రాజెక్టులో బుధవారం చోటు చేసుకుంది. మెదక్ పట్టణానికి చెందిన బాబర్ అనే వ్యక్తి సెలవు రోజుల్లో చేపలు పట్టడం హాబీగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం పోచారం డ్యామ్‌కు వెళ్లి చేపల కోసం గాలం వేశాడు. దీంతో 15 కిలోల బరువున్న చేప గాలానికి చిక్కడంతో బాబర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అక్కడికి వచ్చిన పర్యాటకులు భారీ చేపను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment