15 కిలోల వాలుగతో మత్స్యకారుడు పెద్దఉప్పయ్య
సాక్షి, కూసుమంచి: సాధారణంగా ‘వాలుగ’ చేప చిన్నగానే ఉంటుంది. కానీ, మంగళవారం ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లో ఏకంగా 15 కిలోల వాలుగ మత్స్యకారుల వలకు చిక్కింది. ఇక్కడ సోమవారం నుంచి చేపల వేట నిర్వహిస్తుండగా.. మంగళవారం బత్తుల పెద్దఉప్పయ్య అనే మత్స్యకారుడి వలకు ఈ భారీ చేప చిక్కింది.
ఆ మత్స్యకారుడు ఈ చేపను కిలో రూ. 120 చొప్పున ఓ స్థానిక వ్యాపారికి విక్రయించాడు. ఈ రిజర్వాయర్‌లో మరికొన్ని చేపలు సుమారు 20 కిలోల వరకు కూడా బరువు ఉంటాయని ఇక్కడి మత్స్యకారులు తెలిపారు.
ఇక్కడ చదవండి:
అరుదైన ‘ఎర్ర చందనం’ చేప
Comments
Please login to add a commentAdd a comment