paleru reservoir
-
అడుగంటిన పాలేరుకు జీవం
సాక్షి, మహబూబాబాద్: మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించే పాలేరు జలాశయంలో నీరు అడుగంటడంతో నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా నీరు వదిలారు. ఎడమ కాల్వనుంచి రోజుకు 3,300 క్యూసెక్కుల నీటిని పాలేరు జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో నాలుగు జిల్లాలకు పొంచి ఉన్న తాగునీటి ముప్పు తప్పింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ నుంచి ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లోని 2,439 గ్రామాలకు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మహబూబాబాద్, మరిపెడ, డోర్నకల్, తొర్రూరు, నర్సంపేట మున్సిపాలిటీలకు గోదావరి జలాలను సరఫరా చేస్తున్నారు. వీటి పరిధిలోని సుమారు 22లక్షల జనాభాకు పాలేరు నుంచి వచ్చే గోదావరి నీరే ఆధారం. ఇటీవల పాలేరు జలాశయం అడుగంటే పరిస్థితికి చేరుకుంది. 2.55 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో నీరు బుధవారం నాటికి 0.49 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం ఉన్న నీటితో రెండు, మూడు రోజులకు మించి తాగునీరు అందదని అధికారులు భావించి మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు, రాష్ట్ర ఉన్నతాధికారులకు వివరించారు. ఈ నేపథ్యంలో సాగర్ జలాలు విడుదల చేయడంతో ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు విడుదల చేసే నీరు ఏప్రిల్, మే నెలలకు సరిపోనుందని, ప్రస్తుతానికి గండం తప్పినట్లేనని పాలేరు గ్రిడ్ డీఈ మురళీకృష్ణ చెప్పారు. -
భారీ వర్షాల ఎఫెక్ట్.. టెన్షన్ పెడుతున్న మున్నేరు, పాలేరు
సాక్షి, ఖమ్మం: గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రోడ్లు తెగిపోయాయి. రోడ్డు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరు తీవ్రరూపం దాల్చింది. వివరాల ప్రకారం.. మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రస్తుతం మున్నేరు నీటి మట్టం 19 అడుగులకు చేరుకుంది. ఈ క్రమంలో 18 అడుగులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్. దీంతో, బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఇదే సమయంలో అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నాయబజార్ కాలేజీ, స్కూల్‌తో పాటు ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లాలోని పాలేరు పూర్తి స్థాయిలో నిండిపోయింది. పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం పూర్తి స్థాయిలో 23 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత నీటి మట్టం 23.25గా ఉన్నట్టు తెలుస్తోంది. పాలేరుకు ప్రస్తుత ఇన్ ఫ్లో 12,438 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 10, 614 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు.. రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం ఓపెన్ కాస్ట్‌లలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జేవీఆర్ ఓసీలో 60 వేల టన్నులు, కిష్టారం ఓసీలో 16 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం : 23 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 23.5 బేతుపల్లి పెద్దచెరువు పూర్తిస్థాయి నీటిమట్టం : 16 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 16.1 పెదవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం : 19 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 11 కిన్నెరసాని రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం : 407 అడుగులు (8.4 టీఎంసీలు) ప్రస్తుత నీటిమట్టం : 402.2 అడుగులు (7.85 టీఎంసీలు) తాలిపేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం : 74 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం : 72.11 మీటర్లు -
పాలేరు రిజర్వాయర్ షట్టర్లు తనిఖీ
ఖమ్మంఅర్బన్: కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ గాడ్బోల్ గేట్(షట్టర్లు)ను పూణేకు చెందిన ఇంజనీరింగ్ కంపెనీ బృందం సోమవారం సందర్శించింది. అలుగుపై ఉన్న ఆటోమెటిక్ మెటిక్ షట్టర్లను రూ.22 లక్షల వ్యయంతో మరమ్మతు చేయిస్తున్నారు. ఈ నేపథ్యాన మరమ్మతు పనులను నిపుణులైన పూణేలోని డాల్పాల్ కంపెనీ ఇంజనీర్లు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. 2007లో సాగర్ కాల్వల ఆధునికీకరణ సమయాన షట్టర్ల మరమ్మతు చేయగా, మళ్లీ ఇప్పు డు చేపట్టారు. రిజర్వాయర్ పూర్తి స్థాయిలో 23 అడుగుల మేర నీరు నిండితే అలుగుపై ఉన్న గేట్లు వాటికవే కిందకు దిగేలా ఏర్పాటుచేశారు. వీటిని ఎప్పటికప్పుడు జిల్లా జల వనరుల శాఖ అధికారులు పర్యవేక్షిస్తుండగా.. ప్రస్తుతం మరమ్మతులు చేపట్టడంతో నిపుణులను పిలిపించారు. ఈ పరిశీలనలో జల వనరుల శాఖ ఈఈ ఎం.వెంకటేశ్వర్లు, డీఈ రమేష్‌రెడ్డి, ఏఈ కోటేశ్వరరావు, పూణే బృందం సభ్యులు పాల్గొన్నారు. -
పాలేరు రిజర్వాయర్‌కు 100 ఏళ్ళు
-
మంత్రి, ఎమ్మెల్యేకే ఫ్లెక్సీలు కడతారా?
కూసుమంచి: ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యాన ఆదివారం ఏర్పాటుచేసిన చేప పిల్లల విడుదల కార్యక్రమం ప్రొటోకాల్ వివాదానికి దారితీసింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రకు అధికారులు ఆహ్వానం అందించారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు మొదలుకావలసి ఉండగా, పదిన్నర సమయాన హైదరాబాద్ నుండి ఎమ్మెల్సీ, ఎంపీలు రిజర్వాయర్ వద్దకు వచ్చారు. అప్పటికింకా ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి చేరుకోలేదు. దీంతో ఎమ్మెల్సీ తాతా మధు.. ఎమ్మెల్యే ఎక్కడి వరకు వచ్చారంటూ ఆరాతీయగా మార్గమధ్యలో ఉన్నారని డీఎఫ్‌వో ఆంజనేయస్వామి బదులిచ్చారు. సమయపాలన లేకుంటే ఎలా? అంటూ ఎమ్మెల్సీ ఒకింత అసహనానికి గురవుతూనే, పక్కనే ఉన్న ఫ్లెక్సీలలో.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, కలెక్టర్ గౌతమ్ ఫొటోలతో మూడు ఫ్లెక్సీలను గమనించారు. దీంతో ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ‘మీరు ఆఫీసర్లు ఆఫీసర్లుగా ఉండాలి.. పనికిమాలిన పనులు చేయొద్దు. మీరు గవర్నమెంట్ అధికారి కాబట్టి ఎవరికీ ఊడిగం చేయొద్దు.. అందరికీ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టలేదు? ఎమ్మెల్యే, మంత్రికే ఫ్లెక్సీలే ఎందుకు పెట్టారు.. గవర్నమెంట్ మీకు చెప్పిందా?’ అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడి నుండి ఎంపీలు, ఎమ్మెల్సీ ఖమ్మం వెళ్లిపోయారు. కాసేపటికి వచ్చిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి రిజర్వాయర్‌లో చేపపిల్లలను విడుదల చేశారు. అంతకుముందు జరిగిన ఘటనపై అధికారులను మందలించడమే కాక ప్రొటోకాల్ పాటించకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు. కాగా, కార్యక్రమం ముగిశాక ఎంపీ, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని అధికారులు ఏర్పాటు చేయడం కొసమెరుపు. ఇదీ చదవండి: ఈడీ లేకుంటే బీజేపీనే లేదు -
వామ్మో.. పెద్ద చేప చిక్కిందిలా!
సాక్షి, కూసుమంచి: సాధారణంగా ‘వాలుగ’ చేప చిన్నగానే ఉంటుంది. కానీ, మంగళవారం ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లో ఏకంగా 15 కిలోల వాలుగ మత్స్యకారుల వలకు చిక్కింది. ఇక్కడ సోమవారం నుంచి చేపల వేట నిర్వహిస్తుండగా.. మంగళవారం బత్తుల పెద్దఉప్పయ్య అనే మత్స్యకారుడి వలకు ఈ భారీ చేప చిక్కింది. ఆ మత్స్యకారుడు ఈ చేపను కిలో రూ. 120 చొప్పున ఓ స్థానిక వ్యాపారికి విక్రయించాడు. ఈ రిజర్వాయర్‌లో మరికొన్ని చేపలు సుమారు 20 కిలోల వరకు కూడా బరువు ఉంటాయని ఇక్కడి మత్స్యకారులు తెలిపారు. ఇక్కడ చదవండి: అరుదైన ‘ఎర్ర చందనం’ చేప పోలీసుల్ని చూసి.. పరుగో.. పరుగు! -
బాబోయ్.. చేపలకు బదులు మొసళ్లు!
సాక్షి, కూసుమంచి(ఖమ్మం): ఆహ్లాదాన్ని పంచుతూ..మత్స్యసంపదకు నిలయంగా ఉన్న పాలేరు రిజర్వాయర్ మొసళ్లకు ఆవాసంగా మారుతోంది. ఏడాది కాలంగా అప్పుడప్పుడూ మొసలి పిల్లలు నీళ్లపై తేలియాడుతూ కనిపించడం, కొన్నిసార్లు మత్స్యకారుల వలలకు చిక్కడం పరిపాటిగా మారింది. తాజాగా ఈ నెల 26వ తేదీన రిజర్వాయర్ పరిధిలోని సూర్యాపేట జిల్లా మోతె మండలం ఉర్లుగొండ ప్రాంతంలో ఓ మత్స్యకారుడి వలకు భారీ మొసలి చిక్కడంతో ఇప్పుడు మరింత భయాందోళన నెలకొంది. పోయిన సంవత్సరం రిజర్వాయర్‌లో మొసలి పిల్లలు ప్రత్యక్షం కాగా..అవి ఇప్పుడు పెద్దవి అయ్యాయని స్థానికంగా భావిస్తున్నారు. వాటి సంతానం ఉత్పత్తి అవుతుండడంతో రిజర్వాయర్ వాటికి ఆవాసంగా మారి భవిష్యత్‌లో ప్రమాదకరంగా మారే అవకాశముందని జంకుతున్నారు. దాదాపు 50కుపైగానే పిల్ల మొసళ్లు ఉంటాయని కొందరు వాదిస్తున్నారు. తాజాగా 70కిలోల మొసలి చిక్కడంతో..ఆ స్థాయిలోనే పెద్దవి మరికొన్ని ఉంటాయని, వాటని్నంటినీ బయటకు పంపే ప్రయత్నం చేయాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. త్వరలో చేపల వేట.. పాలేరు రిజర్వాయర్‌లో ప్రతి సంవత్సం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో చేపలు, రొయ్యల వేట సాగుతుంది. ఈ సారి మార్చి మొదటి వారంలో చేపల వేట ప్రారంభం కానుంది. ఇప్పుడు రిజర్వాయర్‌లో మొసళ్లు ప్రత్యక్షం కావడం మత్స్యకారుల్లో కలకలం రేపుతోంది. సుమారు 1500 మంది మత్స్యకారులు నెలకుపైగా రిజర్వాయర్‌లో తెప్పలపై వెళుతూ చేపలు, రొయ్యలు వేటాడాల్సి ఉంటుంది. తమపై మొసళ్ల దాడి జరిగితే పరిస్థితి ఏంటని పలువురు వాపోతున్నారు. చేపలకు బదులు అవి చిక్కితే ప్రాణాలతో చెలగాటమేనని భయపడుతున్నారు. మొసళ్లను తరలించాలి పాలేరు రిజర్వాయర్‌లో వందవరకు మొసళ్లు ఉన్నాయి. మేం త్వరలో చేపల వేటకు వెళతాం. మొసళ్లకు మా వాళ్లు భయపడుతున్నారు. గతంలో ఒక్క మొసలి కూడా ఉండేది కాదు. వాటిని పట్టి వేరేప్రాంతానికి తరలించాలని అధికారులను కోరుతున్నాం. లేకుంటే మేం వేటకు వెళ్లడం కష్టమే. – దేశబోయిన ఏడుకొండలు, మత్స్య సొసైటీ కార్యదర్శి -
బ్రిడ్జి పైన మినీ వ్యాన్ దగ్ధం
-
రబీకి సాగర్ నీరు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సాగర్ ఆయకట్టులో ఈ ఏడాది రెండో పంట రబీకి నీటిని పుష్కలంగా అందించనున్నారు. మంగళవారం నుంచి రబీకి నీటి సరఫరాను పాలేరు రిజర్వాయర్ నుంచి ప్రారంభించారు. వారబందీ విధానంలో ఈ నీటిని సరఫరా చేయనున్నారు. 9 రోజుల పాటు జిల్లాలోని ఆయకట్టుకు నీటిని సరఫరా చేయనుండగా.. 6 రోజుల పాటు నిలుపుదల చేయనున్నారు. ఇలా 8 విడతల్లో మార్చి చివరివరకు నీటిని సరఫరా చేస్తారు. అయితే రైతులు ఆరుతడి పంటలనే సాగు చేయాలని, దీంతో కాల్వ పరిధిలోని చివరి భూములన్నింటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు అందించడం సులువుగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు ఖమ్మం జిల్లాలో ఎన్నెస్పీ పరిధిలో 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ మొత్తంలో 17 వేల ఎకరాలు మినహా మిగిలింది జోన్–2 పరిధిలో ఉంది. 17 వేల ఎకరాలు జోన్–3 పరిధిలో ఉండటంతో ఏపీలోని ఆయకట్టు ద్వారా నీరు రావాల్సి ఉంటుం ది. ఈ కారణంగా ఖరీఫ్‌లో జోన్–3లో రెండు, మూడు తడులు మాత్రమే అందించారు. ఇక జోన్–2 పరిధిలో ఉన్న దాదాపు 8 వేల ఎకరాలను ప్లాట్లుగా మార్చారు. ఇక మిగిలిన ఆయకట్టులో ఖరీఫ్‌లో సగం వరి పంటలు వేయగా.. మరో సగం మెట్ట పైర్లను సాగు చేసినట్లు ఎన్నెస్పీ అధికారులు లెక్కలు చూపించారు. అయితే ఈ ఆయకట్టు మొత్తానికి సాగర్ నీరు పుష్కలంగా సరఫరా చేశారు. 20 నుంచి సరఫరా చేయాల్సి ఉన్నా.. సాగర్ నీటి విడుదలపై ఖమ్మం జిల్లా అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలను పంపించారు. ఈనెల 20 నుంచి నీటిని విడుదల చేయాలని కోరారు. అయితే ఖమ్మం డివిజన్ పరిధిలోని బోనకల్, కొణిజర్ల, ముదిగొండ తదితర మండలాల పరిధిలో నీటి అవసరముందని రైతుల నుంచి డిమాండ్ రావడంతో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జోక్యంతో జిల్లా ఆయకట్టుకు షెడ్యూల్ కంటే 10 రోజులు ముందే పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం రోజుకు 600 క్యూసెక్కులు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది సాగర్ ఆయకట్టు ఎడమ కాల్వ మొత్తానికి 60 టీఎంసీలు అవసరముంటుందని అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. జోన్–2లోని ఖమ్మం జిల్లా (టేకులపల్లి సర్కిల్) పరిధిలో రబీకి 29 టీఎంసీలు అవసరముంటుందని లెక్కలు తయారు చేశారు. -
మత్స్యకారులకు చిక్కిన మొసలి
కూసుమంచి : పాలేరు రిజర్వాయర్ ఒడ్డున సోమవారం పట్టుకున్న మొసలిని మత్స్యకారులు ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. పాలేరు రిజర్వాయర్‌లో మొసళ్లు ఉన్నట్లు ఇదివరకే వెలుగులోకి వచ్చింది. కాగా సోమవారం రిజర్వాయర్ ఒడ్డున (స్మశానవాటిక సమీపంలో) నీటి మడుగులు ఉండగా.. అందులో మొసలి కదలికలను కొందరు స్థానికులు గమనించారు. దీంతో వారు అది మొసలిగా భావించి మత్స్యకారులకు సమాచారం అందించారు. వారు మడుగులో నీటిని తోడటంతో మొసలి కనబడగా.. దాన్ని వలల్లో బంధించారు. వలకు చిక్కిన మొసలి సుమారు 12 కిలోలు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా.. వారు వచ్చి మొసలిని స్వాధీనం చేసుకున్నారు. కాగా రిజర్వాయర్‌లో మొసళ్లు పెద్దవి అవుతుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. -
పాలేరు జలాశయంలో మొసళ్లు
-
పాలేరు జలాశయంలో మొసళ్లు
సాక్షి, పాలేరు: ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలో మొసళ్లు కనిపించడంతో కలకలం రేగింది. జలాశయంలో వద్ద మత్స్య శాఖ ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్‌లో జాలర్లకు నాలుగు మొసలి పిల్లలు చిక్కాయి. వీటిలో రెండిని చంపి మరో రెండింటిని బయటకు తీసుకువచ్చారు. ఈ విషయాన్ని జాలర్లు, మత్స్యశాఖాధికారులకు తెలియజేశారు. ఉడుం పిల్లలనుకుని రెండింటిని చంపినట్లు జాలర్లు తెలిపారు. పాలేరు జలాశయంలో మొసళ్లు కనిపించడంతో జాలర్లతో పాటు ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ముమ్మరంగా ‘మిషన్’ పనులు
► 2017 డిసెంబర్ నాటికి 624 గ్రామాలకు నీటి సరఫరా లక్ష్యం ► మాదిరిపురం గుట్టపై రిజర్వాయర్ల ఏర్పాటు ► అక్కడి నుంచి 17 మండలాలకు పంపిణీ మహబూబాబాద్ :మిషన్ భగీరథ పథకం కింద పాలేరు రిజర్వాయర్ నీటిని మరిపెడ మండలం మాదిరిపురం గుట్టపై నుంచి 3 జీఎల్‌బీఆర్, ఒక ఓహెచ్‌బీఆర్ రిజర్వాయర్ల ద్వారా 17 మండలాలకు సరఫరా చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. పాలేరు నుంచి పంప్సెట్ల ద్వారా (నాలుగు రన్నింగ్, నాలుగు స్టాండ్‌బై పంపుసెట్లు) నీరు సరఫరా చేయనున్నారు. మాధురిపురం గుట్ట కింద నిర్మించే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (170 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్ డే)) నుంచి సంప్‌లోకి విడుదల చేస్తారు. ఆ తర్వా త గుట్టపైన 3 జీఎల్‌బీఆర్ (గ్రౌండ్ లెవల్ బ్యాలెన్స్ రిజర్వాయర్లు), ఒకటి ఓహెచ్‌బీఆర్ (ఓవర్‌హెడ్ బ్యాలెన్స్ రిజర్వాయర్) నిర్మించి ఒక జీఎల్‌బీఆర్ నుంచి మరిపెడకు, రెండవ జీఎల్‌బీఆర్ నుంచి కురవి, డోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రం మండలాలకు, మూడవ జీఎల్‌బీఆర్ నుంచి నర్సంపేట, నెల్లికుదురు, తొర్రూరు, రాయపర్తి మండలాలకు నీరు సరఫరా చేయనున్నట్లు మిషన్ భగీరథ ఈఈ రాములు తెలిపారు. ఈ నీటిని నిల్వ చేసేందుకు మానుకోట పట్టణంలోని నిజాం చెరువు సమీపంలో గోపాలపు రం ప్రాంతం దగ్గరలో ఏడెకరాల స్థలంలో రెండు సంప్‌లు నిర్మిస్తున్నా రు. అందులో ఒకటి మహబూబాబాద్ అర్బన్‌కు, రెండవది మహబూబాబాద్ రూరల్‌కు ఉపయోగపడేలా పనులు చేస్తున్నారు. సంప్ నిర్మించే ప్రాంతంలో ఉన్న గుట్టపైన ఓహెచ్‌బీఆర్ ట్యాంకు నిర్మించి, దాని ద్వారా మహబూబాబాద్ రూరల్, కేసముద్రం మండలాలకు నీరందిస్తారు. మూడవ జీఎల్‌బీఆర్ ద్వారా సరఫరా అయ్యే నీటి కోసం నెల్లికుదురులో ఒకటి, రాయపర్తి మండలం మొరిపిరాల వద్ద మరొక సంప్ నిర్మించి ఆయూ మండలాలకు సరఫరా చేస్తా రు. రాయపర్తి మండలం కొండూరు ప్రాంతంలో మరో సంప్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక బొద్దుగొండ ప్రాంతంలో సంప్ నిర్మించి గూడూరు, నెక్కొండ, ఖానాపూర్ మం డలాలకు నీరందిస్తారు. నర్సంపేటలో ని మినీ స్టేడియం సమీపంలోని ఓబీ హెచ్ఆర్ ద్వారా అర్బన్‌కు, రాజ్‌పేట ప్రాంతంలో మరో ఓహెచ్‌బిఆర్ ట్యాం కు నిర్మించి దాని ద్వారా రూరల్‌కు నీటి సరఫరా చేస్తారు. నర్సంపేట గిర్నిబావి దగ్గర మరో సంప్ నిర్మించి దుగ్గొండి మండలానికి నీరందించేలా ప్రణాళిక తయారు చేశారు. రూ. 70 కోట్ల ప్రతిపాదనలు.. మానుకోట ప్రాంతంలో సంప్, ఇతరత్ర నిర్మాణాలు జరుగుతుండగా ము న్సిపాలిటీ అధికారులు అంతర్గత పైపులైన్లు, ఇతర పనులకు రూ.70 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. ఆ దిశగా సంబంధిత అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మానుకోట డివిజన్లో 1706 గ్రామాలకు నీరు.. ప్రాజెక్టు ఈఈ పరిధిలో 1706 గ్రామాలు ఉన్నాయి. సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు 2017 డిసెంబర్ నాటికి 624 గ్రామాలకు నీరందించేలా పనులు ముమ్మరం చేశాం. సంప్ నిర్మాణ, గుట్టలపై రోడ్ల నిర్మాణాలు, ఇతరత్ర పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నాం. అనుకున్న సమయంలో పూర్తి చేస్తామనే నమ్మకం ఉంది. - రాములు, మిషన్ భగీరథ ఈఈ -
పాలేరు నీట..బతుకు ‘వేట’
కూసుమంచి, న్యూస్‌లైన్: పాలేరు రిజర్వాయర్‌లో సోమవారం నుంచి జలపుష్పాలవేట ప్రారంభమైంది. వేకువజామునే వందలాది మంది మత్స్యకారులు జలాశయంలోకి దిగారు. చేపలు, రొయ్యల వేట సాగించారు. తొలిరోజు వేట సందర్భంగా రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. పాలేరులో చేపలవేట ప్రారంభమైందని తెలుసుకున్న పరిసర ప్రాంతాల ప్రజలు తండోపతండాలుగా రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ విపరీతమైన రద్దీ నెలకొంది. కూసుమంచి మండలంలోని నాయకన్‌గూడెం, పాలేరు, ఎర్రగడ్డ, కొత్తూరు, నర్సింహులగూడెం, కిష్టాపురం తదితర గ్రామాలకు చెందిన మత్స్యకారులతో పాటు రిజర్వాయర్ పరిసర ప్రాంతమైన నల్లగొండ జిల్లా మోతె మండలంలోని నర్సింహాపురం, అన్నారుగూడెం, ఉర్లుగొండ, నేరడవాయి, నాగాయిగూడెం, తుమ్మగూడెం గ్రామాలకు చెందిన వందలాది మంది మత్స్యకారులు వేటలో పాల్గొన్నారు. వలలకు చిక్కిన చేపలను వీరు ఒడ్డుకు తీసుకొచ్చారు. వీరి కుటుంబసభ్యులు చేపలను కాంట్రాక్టర్ వద్దకు తీసుకెళ్లి విక్రయించారు. ఒప్పందం ప్రకారం కిలో చేపలను రూ.30 చొప్పున కాంట్రాక్టర్‌కు అమ్మారు. బయటివారికి మాత్రం కిలో రూ. 50 చొప్పున విక్రయించారు. రొయ్యలు ఏ గ్రేడ్ కిలో రూ.250, బీ గ్రేడ్ 100 చొప్పున కాంట్రాక్టర్‌కు అమ్మారు. కాంట్రాక్టర్‌కు దక్కని చేప... పాలేరు రిజర్వాయర్‌లో మత్స్యకారులు పట్టే చేపలను ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్‌కు విక్రయించాలి. ప్రతి సంవత్సరం ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ ఏడాది మాత్రం ఎక్కువ మొత్తం చేపలను కాంట్రాక్టర్‌కు కాకుండా బయటివారికి అమ్మారు. మొత్తం 50 టన్నుల చేపలు దొరకగా కాంట్రాక్టర్‌కు కేవలం 15 టన్నులను మాత్రమే విక్రయించారు. 30 టన్నులకు పైగా చేపలను మత్స్యకారులు బయటి వ్యక్తులకు విక్రయించారని, తమకు నష్టం మిగిల్చారని కాంట్రాక్టర్ విలేకరుల ఎదుట వాపోయాడు. తొలిరోజు జోరు.. రిజర్వాయర్‌లో తొలిరోజు వేట ఆశాజనకంగా సాగింది. సుమారు 50 టన్నుల చేపలు, పది టన్నుల వరకు రొయ్యలు మత్స్యకారుల వలలకు చిక్కాయి. రవ్వ, బొచ్చె చేపలు ఎక్కువగా దొరికాయి. రొయ్యలను ఎప్పటి కాంట్రాక్టరే కొనుగోలు చేయగా, చేపలను మాత్రం హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్ కొనుగోలు చేశాడు. గతేడాది కంటే ఈ ఏడాది చేపల పరిమాణం భారీగా పెరిగింది. ఒక్కో చేప సుమారు ఐదు కిలోల వరకు తూగింది. తొలిరోజు ఒక్కో మత్స్యకారుడు చేపలు, రొయ్యల వేట ద్వారా సగటున రూ.5 వేల వరకు ఆదాయాన్ని పొందాడు. గత సంవత్సరం తొలిరోజే మత్స్యకారులు వంద టన్నులకు పైగా చేపలు పట్టడంతో ఒక్కరోజుతోనే రిజర్వాయర్‌లో అడుగంటిన విషయం విదితమే. -
తగ్గుతున్న పాలేరు
కూసుమంచి, న్యూస్‌లైన్ : మండలంలోని పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. సోమవారానికి 13 అడుగులతో ప్రీ ఫ్లోకు చేరుకుంది. సాధారణంగా రిజర్వాయర్ నీటి మట్టం 18 అడుగులకు తగ్గకుండా చూడాలి. రానురాను మరింత తగ్గిపోయే అవకాశం ఉంది. దీని వల్ల ఎడమ కాల్వకు నీటిప్రవాహం తగ్గనుంది. అదే జరిగితే పంటలకు నీరందక రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం సాగర్ నుంచి రిజర్వాయర్‌కు 3964 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వకు 3841 క్యూసెక్కులు, పాలేరు పాత కాలువకు మరో 200 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది. అలాగే రిజర్వాయర్ ఆధారంగా నిర్మించిన మంచినీటి పథకాలకు కూడా నీటి సరఫరా జరుగుతోంది. దీంతో నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది. పాలేరుకు సాగర్‌నీటి సరఫరాలో అన్యాయం... సాగర్ మెదటి జోన్ పరిధిలో ఉన్న పాలేరు రిజర్వాయర్‌కు సాగర్ నుంచి నీటి విడుదలలో అన్యాయం జరుగుతోంది. వాస్తవానికి రిజర్వాయర్‌కు 5వేల క్యూసెక్కులకు పైగా సాగర్ నీరు రావాల్సి ఉంది. కానీ ఈ సీజన్ లో ఆ స్థాయిలో నీరు చేరేలేదు. సాగర్ నుంచి ఎడమ కాల్వకు 11వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా పాలేరుకు 5వేల క్యూసెక్కులు రావాలి, కానీ 4వేల క్యూసెక్కులకు మించి రావడం లేదు. ఎగువన ఉన్న నల్లగొండ జిల్లా రైతులు అధికంగా నీటిని వాడుకోవడంతో పాలేరుకు వచ్చే సరఫరా తగ్గుతోంది. దీంతో రిజర్వాయర్ నీటి మట్టం తరుచూ పడిపోతుంది. ఇటు రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వ దిగువకు, పాలేరు పాత కాల్వకు లెక్క ప్రకారం నీటిని వదులుతున్నప్పటికీ సాగర్ నుంచి తగినంత నీరు రాకపోవడంతో రిజర్వాయర్ ఫ్రీ ఫ్లోకు చేరింది. ఇ ప్పటికైనా అధికారులు స్పందించి రిజర్వాయర్‌కు సాగర్ నీటిని పెంచాలి. లేకపోతే రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరి పంటలకు, తాగునీటి పథకాలకు సరిపడా నీరు అందకపోవచ్చు.