రిజర్వాయర్ షట్టర్లను పరిశీలిస్తున్న నిపుణుల బృందం, ఇంజనీర్లు
ఖమ్మంఅర్బన్: కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ గాడ్‌బోల్ గేట్(షట్టర్లు)ను పూణేకు చెందిన ఇంజనీరింగ్ కంపెనీ బృందం సోమవారం సందర్శించింది. అలుగుపై ఉన్న ఆటోమెటిక్ మెటిక్ షట్టర్లను రూ.22 లక్షల వ్యయంతో మరమ్మతు చేయిస్తున్నారు. ఈ నేపథ్యాన మరమ్మతు పనులను నిపుణులైన పూణేలోని డాల్‌పాల్ కంపెనీ ఇంజనీర్లు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. 2007లో సాగర్ కాల్వల ఆధునికీకరణ సమయాన షట్టర్ల మరమ్మతు చేయగా, మళ్లీ ఇప్పు డు చేపట్టారు. రిజర్వాయర్ పూర్తి స్థాయిలో 23 అడుగుల మేర నీరు నిండితే అలుగుపై ఉన్న గేట్లు వాటికవే కిందకు దిగేలా ఏర్పాటుచేశారు.
వీటిని ఎప్పటికప్పుడు జిల్లా జల వనరుల శాఖ అధికారులు పర్యవేక్షిస్తుండగా.. ప్రస్తుతం మరమ్మతులు చేపట్టడంతో నిపుణులను పిలిపించారు. ఈ పరిశీలనలో జల వనరుల శాఖ ఈఈ ఎం.వెంకటేశ్వర్లు, డీఈ రమేష్‌రెడ్డి, ఏఈ కోటేశ్వరరావు, పూణే బృందం సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment