కేవీకేలో శాసీ్త్రయ సలహా సంఘం సమావేశం
వైరా: వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం శాసీ్త్రయ సలహా సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే ఆధ్వర్యాన గత ఏడాది కాలంగా చేపట్టిన కార్యక్రమాలపై చర్చించి భవిష్యత్ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థఽ మధ్య తెలంగాణ మండలి సహాయ పరిశోధనా సంచాలకుడు డాక్టర్ ఉమారెడ్డి, హైదరాబాద్ అటారీ జోన్–10 ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏఆర్.రెడ్డి హైదరాబాద్ పీజీటీఏయూ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయలక్ష్మి, డీఏఈ ధనసరి పుల్లయ్య, జిల్లా ఉద్యాన శాఖాఽధికారి మధుసూదన్ పాల్గొని పలు అంశాలపై చర్చించారు. మండల పశు వైద్యాధికారి రాకేష్, ఏడీఏలు విజయచంద్ర, కె.వెంకటేశ్వరరావు, కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్, శాస్త్రవేత్త విచైతన్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment