పోలీసు కుటుంబాలకు ఉచిత కంటి పరీక్షలు
ఖమ్మంక్రైం: ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు కుటుంబాల కోసం బుధవారం ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. వాసన్ ఐ కేర్ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ శిబిరాన్ని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ ప్రారంభించి మాట్లాడారు. ఈ శిబిరంలో 200మందికి పరీక్షలు చేయగా, సమస్యలు ఉన్నవారికి రాయితీపై శస్త్ర చికిత్సతో పాటు కంటి అద్దాల పంపిణీ ఉంటుందని తెలిపారు. ఏఆర్ ఏసీపీలు నర్సయ్య, సుశీల్‌సింగ్, వైద్యబృందం శివరామ్, రాజేష్, ఇతేందర్, అప్సర్, సాయికృష్ణ పాల్గొన్నారు.
సౌర విద్యుత్ ప్లాంట్లకు 139 దరఖాస్తులు
ఖమ్మంవ్యవసాయం: బీడు, బంజర భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రైతులు ముందుకొస్తున్నారు. భూముల్లో ప్లాంట్లు ఏర్పాటుచేయడం ద్వారా ఆదాయం పొందేలా రైతులను కేంద్రప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. పీఎం కుసుమ్ పథకం కింద 500కిలోవాట్లు మొదలు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశముండగా, ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(టీజీఈఆర్‌సీ) నిర్ణయించిన టారిఫ్‌తో డిస్కంలు కొనుగోలు చేస్తాయి. ఈ పథకం కోసం దరఖాస్తు గడువును 10వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యాన బుధవారం వరకు 139 దరఖాస్తులు అందాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 38, ఖమ్మం జిల్లా నుంచి 101దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందాయని రెడ్‌కో ఉమ్మడి జిల్లా మేనేజర్ పోలిశెట్టి అజయ్‌కుమార్ తెలిపారు.
కూడళ్ల ఆధునికీకరణకు అడుగులు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కూడళ్ల అభివృద్ధికి యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనతో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, హైదరాబాద్ నుంచి ఐఎఫ్‌ఎస్ అధికారి కృష్ణ బుధవారం కూడళ్లను పరిశీలించి అభివృద్ధికి ఉన్న అవకాశాలపై చర్చించారు. ప్లాంటేషన్‌తోపాటు క్లాక్‌టవర్ ఏర్పాటు, భారీ విద్యుత్ లైట్ల ఏర్పాటుకు చర్చించారు. ఈమేరకు త్వరలోనే నగర సుందరీకరణ, కూడళ్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిసింది.
పోలీసు కుటుంబాలకు ఉచిత కంటి పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment