పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహించొద్దు
నేలకొండపల్లి: జిల్లాలోని గ్రామపంచాయతీల్లో పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా పంచాయతీ అఽధికారి(డీపీఓ) పి.ఆశాలత హెచ్చరించారు. నేలకొండపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం నేలకొండపల్లి, కూసుమంచి మండలాల పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా డీపీఓ మాట్లాడుతూ జిల్లాలో రూ.2 కోట్ల పన్ను డిమాండ్‌కు గాను 62 శాతం వరకు వసూలయ్యాయని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు వివిధ సర్వేల్లో నిమగ్నమైనా గత ఏడాది కంటే ఎక్కువగా వసూలు చేశారని, ఈనెలాఖరుకు నూరు శాతం వసూలు చేయాలని సూచించారు. అలాగే, తాగునీటి ఇబ్బందులు, పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలని డీపీఓ తెలిపారు. కాగా, ప్రతీ పంచాయతీలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించిన డీపీఓ.. నేలకొండపల్లిలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈసమావేశంలో డీఎల్‌పీఓ రాంబాబు, ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఎంపీఓలు సీ.హెచ్.శివ, రాంచందర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment