మండుతున్న ఎండలు
● 35డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల నమోదు
ఖమ్మంవ్యవసాయం: మహాశివరాత్రి తర్వాత జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. నెల మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయిలో నమోదవుతున్నాయి. గతనెల 28 వరకు జిల్లాలో గరిష్టంగా 36 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈనెల 5కల్లా 39 డిగ్రీలకు పెరిగింది. దీంతో మధ్యాహ్నం వేళ బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు, మార్కెట్, ఇతర ప్రాంతాల్లో పనిచేసే కార్మికులు ఎండ తీవ్రతతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కాగా, ఖమ్మం ప్రకాశ్‌నగర్‌లో బుధవారం అత్యధికంగా 39.2 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆతర్వాత ఖానాపురం, సత్తుపల్లి, ముదిగొండ మండలం పమ్మిలో 39.1, బాణాపురంలో 39 సెల్సియస్ డిగ్రీలుగా నమోదవగా, అతి తక్కువగా తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో 32.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment