ఖమ్మం సహకారనగర్: పీఎంశ్రీ, అమ్మ ఆదర్శ పాఠశాల్లో అభివృద్ధి నెలాఖరులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్‌లోని బుధవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆమె మాట్లాడుతూ పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలల్లో పనులకు రూ.1,04,65,783 విడుదల చేశామని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల్లో కమిటీలు ప్రతిపాదించిన పనులు పూర్తికాగానే బిల్లులు చెల్లించాలని పేర్కొన్నారు. డీఈఓ సోమశేఖరశర్మ, ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, ఏఎంఓ కె.రవికుమార్, జీసీడీఓ తులసి పాల్గొన్నారు.
ఇంటి నిర్మాణం మొదలుపెట్టాలి
బోనకల్: మండలంలోని గార్లపాడులో అదనపు కలెక్టర్ శ్రీజ బుధవారం పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి స్థలాలను పరిశీలించా రు. త్వరగా పనులు మొదలుపెడితే బిల్లులు వస్తాయని అవగాహన కల్పించారు. ఆరత్వాత గ్రామంలోని నర్సరీని పరిశీలించి మొక్కల పెంపకంపై ఆరా తీశారు. ఎంపీడీఓ రమాదేవి, ఎంపీఓ శాస్త్రి, ఏపీఓ కృష్ణకుమారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment