Water Resources Department
-
పాలేరు రిజర్వాయర్ షట్టర్లు తనిఖీ
ఖమ్మంఅర్బన్: కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ గాడ్బోల్ గేట్(షట్టర్లు)ను పూణేకు చెందిన ఇంజనీరింగ్ కంపెనీ బృందం సోమవారం సందర్శించింది. అలుగుపై ఉన్న ఆటోమెటిక్ మెటిక్ షట్టర్లను రూ.22 లక్షల వ్యయంతో మరమ్మతు చేయిస్తున్నారు. ఈ నేపథ్యాన మరమ్మతు పనులను నిపుణులైన పూణేలోని డాల్పాల్ కంపెనీ ఇంజనీర్లు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. 2007లో సాగర్ కాల్వల ఆధునికీకరణ సమయాన షట్టర్ల మరమ్మతు చేయగా, మళ్లీ ఇప్పు డు చేపట్టారు. రిజర్వాయర్ పూర్తి స్థాయిలో 23 అడుగుల మేర నీరు నిండితే అలుగుపై ఉన్న గేట్లు వాటికవే కిందకు దిగేలా ఏర్పాటుచేశారు. వీటిని ఎప్పటికప్పుడు జిల్లా జల వనరుల శాఖ అధికారులు పర్యవేక్షిస్తుండగా.. ప్రస్తుతం మరమ్మతులు చేపట్టడంతో నిపుణులను పిలిపించారు. ఈ పరిశీలనలో జల వనరుల శాఖ ఈఈ ఎం.వెంకటేశ్వర్లు, డీఈ రమేష్‌రెడ్డి, ఏఈ కోటేశ్వరరావు, పూణే బృందం సభ్యులు పాల్గొన్నారు. -
‘జల విద్యుత్’కు గ్రీన్ సిగ్నల్ వచ్చేనా ?
అశ్వాపురం: అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ బ్యారేజీని జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు సోమవారం సందర్శించారు. జలవనరుల శాఖ అధికారులు మ్యాప్ ద్వారా బ్యారేజీ నిర్మాణ వివరాలను ఆయనకు తెలియజేశారు. సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ బ్యారేజీకి అనుబంధంగా 280 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బ్యారేజీ పనులు పిల్లర్ల వరకు పూర్తయినా జల విద్యుత్ కేంద్రం నిర్మాణంపై ఇంతవరకూ గ్రీన్ సిగ్నల్ రాలేదు. కాగా, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే జెన్కో సీఎండీ సీతమ్మ సాగర్ బ్యారేజీని సందర్శించారని సమాచారం. రాష్ట్రంలోనే కీలకం.. సీతమ్మ సాగర్ బ్యారేజీ వద్ద నిర్మించనున్న 280 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం రాష్ట్రంలోనే కీలకంగా మారనుంది. సీతమ్మ సాగర్ జల విద్యుత్ కేంద్రంలో ఏడు బల్బ్ టర్బైన్ల యూనిట్లు ఉంటాయి. ఒక్కో యూనిట్ ద్వారా 40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. ఈ కేంద్రం నుంచి ఏడాదికి సుమారు 1016.88 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. రాష్ట్రంలో ఇప్పటి వరకు జల విద్యుత్ కేంద్రాలన్నీ కృష్ణా నదిపైనే ఉన్నాయి. వీటి సామర్థ్యం 2,369 మెగావాట్లు. గోదావరిపై పోచంపాడు వద్ద 36 మెగావాట్లు, నిజాంసాగర్ వద్ద 10 మెగావాట్లు, సింగూరు వద్ద 15 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. సీతమ్మ సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి నదిపై 280 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్ కేంద్రం నిర్మిస్తే ఇదే కీలకం కానుంది. బీటీపీఎస్‌ను సందర్శించిన సీఎండీ మణుగూరు రూరల్ : జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు సోమవారం మణుగూరులోని బీటీపీఎస్‌ను సందర్శించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా బీటీపీఎస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు, జీవకోటి మనుగడకు మొక్కలే ఆధారమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ చర్యలను చేపట్టాలన్నారు. అనంతరం బీటీపీఎస్ రైల్వేలైన్ నిర్మాణ పనులు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో జెన్కో డైరెక్టర్లు టీఆర్కే.రావు, ఎం.సచ్చిదానందం, వెంకటరాజం, అజయ్, లక్ష్మయ్య, విద్యుత్ సౌధ సీఈ రత్నాకర్, బీటీపీఎస్ సీఈ బిచ్చన్న, జలవనరులశాఖ ఎస్ఈ వెంకటేశ్వరరెడ్డి, ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈ రాంబాబు, ఏఈ నవీన్, విజిలెన్స్ అధికారులు వినోద్‌కుమార్, ముత్యంరెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు రాంప్రసాద్, పార్వతి, రమేష్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ,తెలంగాణ నీటి కేటాయింపులపై కేఆర్ఎంబీ కీలక సమావేశం
-
కేంద్రం నుంచి పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం జగన సమీక్ష
-
ప్రాజెక్ట్ ఫలాలు వీలైనంత త్వరగా అందించాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిపై అధికారులతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. 91 శాతం స్పిల్‌వే కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని.. జూన్ 15 నాటికి మిగిలిన పనులు పూర్తిచేస్తాం అని అధికారులు తెలిపారు. ఈ నెలాఖరుకు స్పిల్ ఛానల్ పనులు పూర్తవుతాయని వెల్లడించారు. ఎగువ కాఫర్ డ్యామ్‌లో ఖాళీలను పూర్తిచేశామని.. జూన్ నెలాఖరుకు కాఫర్ డ్యామ్‌లో 1, 2 రీచ్‌లు పూర్తవుతాయన్నారు అధికారులుజులై ఆఖరుకు కాఫర్ డ్యామ్ 3, 4 రీచ్ పనులు నిర్ణీత ఎత్తుకు పూర్తి అవుతాయని తెలిపారు. దిగువ కాఫర్ డ్యాం పనులు కూడా వేగవంతం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం సమీక్ష కేంద్రం నుంచి రావాల్సిన పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. 1600 కోట్ల రూపాయల బిల్లులు వేర్వేరు దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు సీఎం. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ‘‘పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తిచేయాలనే తలంపుతో ఉన్నాం. అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుగా డబ్బులు ఇస్తున్నాం. ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాలనే తపనతో ఉన్నాం. ఆర్థికంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా.. ప్రాజెక్టు పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నాం అని సీఎం జగన్ తెలిపారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన ఖర్చుకు సంబంధించి ..కేంద్రంలో బిల్లులు పెండింగులో ఉండడం సరికాదు . అధికారులు వెంటనే దీనిపై దృష్టిపెట్టాలి చేసిన ఖర్చు వెంటనే రీయింబర్స్ అయ్యేలా చూడాలి. వచ్చే మూడు నెలలకు కనీసం 1400 కోట్ల రూపాయలు ఖర్చు అని అధికారులు చెప్తున్నారు. ఢిల్లీ వెళ్లి పెండింగ్ బిల్లులు క్లియర్ అయ్యేలా చూడాలి’’అని సీఎం జగన్ ఆదేశించారు. నేరడి బ్యారేజీ నిర్మాణంపై సమీక్ష వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నేరడి బ్యారజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే చర్చలకు ఒడిశా సీఎస్‌కు లేఖరాశామని..వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నామన్న సీఎస్ ఆదిత్యనాథ్.. త్వరలోనే నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశాతో మాట్లాడతామని సీఎస్ తెలిపారు. జూలై 31 నాటికి నెల్లూరు బ్యారేజీ నిర్మాణం నెల్లూరు బ్యారేజీ నిర్మాణం జూలై 31 నాటికి పూర్తవుతుందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. సంగం బ్యారేజీ పనులు 84 శాతం పూర్తయ్యాయని.. జులై 31 నాటికి మొత్తం పనులు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. అవుకు టన్నెల్లో రెండువైపుల నుంచి పనులు చేస్తున్నామని.. ఇంకా 180 మీటర్ల పని ఉందని..వచ్చే 3 నెలల్లో పనులు పూర్తిచేయగలుగుతామని అధికారులు సీఎంకు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్‌పై సీఎం సమీక్ష వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్ –1 పూర్తిగా సిద్ధమైందన్న అధికారులు.. టన్నెల్ –1 హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా దాదాపుగా పూర్తియ్యాయన్నారు. టన్నెల్ –2 పనులు వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పనులు ఆలస్యంకాకుండా, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న సీఎం.. రెండో టన్నెల్ పనుల్లో కచ్చితంగా పురోగతి కనిపించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వచ్చే సమావేశానికి కార్యాచరణ ప్రణాళికతో రావాలని తెలిపారు. వంశధార స్టేజ్ 2, ఫేజ్ 2 పనులపైనా సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. వీటిని ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా తీసుకున్నామని.. పనులు ఆలస్యంకావడానికి వీల్లేదన్నారు. పనులు వేగంగా నడవాల్సిన అవసరం ఉందన్నారు. వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులు సత్వరమే పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. బ్రహ్మసాగర్, పైడిపాలెం ప్రాజెక్టుల మరమ్మతులను సత్వరమే చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బ్రహ్మసాగర్ సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో నిల్వచేయడానికి.. అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలానే రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టులు.. గోదావరి కృష్ణా సలైనటీ మిటిగేషన్, వాటర్ సెక్యూరిటీ ప్రాజెక్టులు.. పల్నాడు ప్రాంత కరువు నివారణా ప్రాజెక్టులు..ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులపైనా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. -
ఏపీ, వాటర్ రిసోర్స్ విభాగంలో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్.. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 07 ► పోస్టుల వివరాలు: హైడ్రాలజిస్ట్–01, కెమిస్ట్ ఎక్స్పర్ట్–03, అకౌంటెంట్–01, డేటా ఎంట్రీ ఆపరేటర్–02. పోస్టులు–అర్హతలు ► హైడ్రాలజిస్ట్: అర్హత: బీటెక్(సివిల్) ఉత్తీర్ణతతోపాటు హైడ్రాలజీ విభాగంలో రెండేళ్ల అనుభవం/ఎంటెక్(వాటర్ రిసోర్సెస్) ఉత్తీర్ణతతోపాటు హైడ్రాలజీలో ఏడాది అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.56,000 చెల్లిస్తారు. పని ప్రదేశం: చీఫ్ ఇంజనీర్, హైడ్రాలజీ, విజయవాడ. ► కెమిస్ట్ ఎక్స్పర్ట్: అర్హత: కెమిస్ట్రీలో బీఎస్సీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల ల్యాబ్ అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.24,500 చెల్లిస్తారు. పని ప్రదేశం: కడప, గుంటూరు వాటర్ క్వాలిటీ ల్యాబ్స్. ► అకౌంటెంట్: అర్హత: ఎంకాం/బీకాం ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.17,500 చెల్లిస్తారు. పని ప్రదేశం: చీఫ్ ఇంజనీర్, హైడ్రాలజీ, విజయవాడ. ► డేటాఎంట్రీ ఆపరేటర్: అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు. పని ప్రదేశం: చీఫ్ ఇంజినీర్, హైడ్రాలజీ, విజయవాడ. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఈమెయిల్: cehydrology@ap.gov.in ► దరఖాస్తులకు చివరి తేది: 15.04.2021 ► వెబ్సైట్: https://irrigationap.cgg.gov.in/wrd/home ఏపీ పౌరసరఫరాల శాఖలో ఖాళీలు.. దరఖాస్తు చేసుకోండి -
హరితాంధ్రకు పంచశీల
సాక్షి, అమరావతి: సముద్రంలో కలుస్తున్న గోదావరి, కృష్ణా, వంశధార వరద జలాలను గరిష్టంగా వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రాన్ని హరితాంధ్రగా మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పంచశీల ప్రణాళికను రూపొందించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయడంతోపాటు 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి దోహదం చేసేలా కొత్త వాటికి రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సుమారుగా రూ.66,519 కోట్లు అవసరమని జలవనరుల శాఖ అంచనా వేసింది. నిధుల కొరత తలెత్తకుండా ఐదు స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ) ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తీసుకుని ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు. ధాన్యాగారం పేరును శాశ్వతం చేసేలా.. ప్రస్తుత నీటి సంవత్సరంలో జూన్ 1 నుంచి ఇప్పటిదాకా ప్రకాశం బ్యారేజీ నుంచి 798.29 టీఎంసీల కృష్ణా వరద జలాలు, ధవళేశ్వరం నుంచి 3782.48 టీఎంసీల గోదావరి జలాలు, గొట్టా బ్యారేజీ నుంచి 119.89 టీఎంసీల వంశధార జలాలు వెరసి 4,700.66 టీఎంసీలు కడలిలో కలిశాయి. గత ప్రభుత్వం ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచకపోవడం, నిర్మాణంలో ఉన్నవాటిల్లో మిగిలిన పనులను పూర్తి చేయకపోవడం వల్ల వరద జలాలను ఒడిసి పట్టలేని దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేయడంతోపాటు వరదను గరిష్ట స్థాయిలో వినియోగించుకునేలా కొత్త ప్రాజెక్టులు చేపట్టి దేశ ధాన్యాగారంగా ఆంధ్రప్రదేశ్ పేరును సుస్థిరం చేయాలని సీఎం జగన్ సంకల్పించారు. ఎస్పీవీలు వీటి కోసమే.. రాయలసీమ కరవు నివారణ ప్రణాళిక కింద 28 ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర నీటిపారుదల పథకం కింద 2, కృష్ణా–కొల్లేరు సెలైనిటీ మిటిగేషన్(చౌడు నివారణ) ప్రణాళిక కింద 7, పల్నాడు కరవు నివారణ ప్రణాళిక కింద 4, రాష్ట్ర సమగ్ర నీటిపారుదల అభివృద్ధి పథకం ద్వారా 2 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఐదు ఎస్పీవీలను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి ఆమోదం లభించగానే ఎస్పీవీల సారధ్యంలో కొత్త ప్రాజెక్టుల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఎస్పీవీల సమగ్ర స్వరూపం ఇదీ.. ► శ్రీశైలానికి వరద వచ్చే 40 రోజుల్లోనే రాయలసీమ ప్రాజెక్టులను నింపి ఆయకట్టుకు అందించడం ద్వారా దుర్భిక్షాన్ని తరిమికొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో రూ.27,360 కోట్లతో 28 ప్రాజెక్టులను రాయలసీమ కరవు నివారణ ప్రణాళిక కింద చేపట్టనున్నారు. ► రాయలసీమ డ్రౌట్‌మిటిగేషన్ ప్రాజెక్ట్స్ కార్పొరేషన్ లిమిటెడ్(ఆర్డీఎంపీసీఎల్) ఏర్పాటు ద్వారా నిధులు సమకూర్చుకునేలా జలవనరుల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ► పల్నాడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం వరికపుడిశెల ఎత్తిపోతల–1, వరికపుడిశెల ఎత్తిపోతల–2, వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం–1, వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం–2లను రూ.7,770 కోట్లతో చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పల్నాడు డ్రౌట్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీడీఎంపీసీఎల్) ద్వారా నిధులు సమకూర్చుకుంటారు. ► గోదావరిలో 63.20 టీఎంసీల వరద జలాలను మళ్లించి ఎనిమిది లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేలా ఉత్తరాంధ్ర సుజలస్రవంతి ప్రాజెక్టు, తాండవ ప్రాజెక్టు కింద ఆయకట్టు స్థిరీకరణకు ఎత్తిపోతల పథకం కోసం రూ.15,988 కోట్లు అవసరం. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(యూఐపీడీసీఎల్) ద్వారా నిధులు సేకరిస్తారు. ► సముద్రం నీరు ఉబికి రావడంతో కృష్ణా డెల్టా, కొల్లేరు చౌడు బారి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదిపై రెండు బ్యారేజీలు, ముక్త్యాల ఎత్తిపోతల, ఉప్పుటేరుపై రెండు ప్రాంతాల్లో క్రాస్ రెగ్యులేటర్ కమ్ బ్రిడ్జి కమ్ లాక్‌ల నిర్మాణం, పడతడికపై స్ట్రెయిట్ కట్ ఫోర్షన్ వద్ద రెగ్యులేటర్ నిర్మాణం, పెదలంక మేజర్ డ్రెయిన్‌కు అవుట్ ఫాల్ స్లూయిజ్ నిర్మాణం ద్వారా చౌడు బారకుండా నివారిస్తారు. ఈ ఏడు ప్రాజెక్టులు చేపట్టడానికి రూ.3,299 కోట్లు అవసరం. కృష్ణా, కొల్లేరు సెలైనిటీ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ కార్పొరేషన్ లిమిటెడ్(కేకేఎస్‌ఎంపీసీఎల్) ద్వారా నిధులు సమీకరిస్తారు. ► గోదావరి వరద జలాలను గరిష్టంగా వినియోగించుకునేందుకు పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 50 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు జలాశయం నుంచి కుడి కాలువకు నీటిని సరఫరా చేసే జంట సొరంగాల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. ఈ నీటిని కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టు, పల్నాడు, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాలకు అందించనున్నారు. ఇందుకు రూ.12,102 కోట్లు అవసరం కాగా ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఐఐడీపీఎల్) ద్వారా నిధులు సమకూర్చుకుంటారు. -
నీటి వనరులపై సర్వే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జల వనరుల లెక్క తేల్చేందుకు యంత్రాంగం సిద్ధమైంది. చిన్న తరహా సాగునీటి వనరుల సర్వే చేపట్టేందుకు కసరత్తు మొదలు పెట్టింది. బోర్లు, బావులు, ఉపరితల నీటి నిల్వలకు ఆధారమైన కొలనులు, కుంటలు, చెరువులు, చెక్‌డ్యాంలు, రిజర్వాయర్లు, ఊట కుంటల సంఖ్యను లెక్కిస్తారు. రెండు వేల హెక్టార్లలోపు భూములకు సాగు నీరందించే వనరుల సమగ్ర సమచారాన్ని ఈ సర్వే ద్వారా సేకరిస్తారు. సదరు నీటి వనరు ఎప్పుడు ఏర్పాటైంది.. ఆ కాలంలో చేసిన ఖర్చు, నీటి సామర్థ్యం, దాని కింద ఖరీఫ్, రబీ సీజన్లలో సాగవుతున్న భూ విస్తీర్ణం, పండుతున్న పంటలు, ప్రస్తుత నీటి నిల్వలు, వినియోగంలో లేకుంటే అందుకు గల కారణాలు.. ఇలా సంపూర్ణ వివరాలు రాబడుతారు. ఈ సర్వే వారం రోజుల్లో మొదలు కానుంది. ఈనెల 30వ తేదీలోగా పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని యంత్రాంగం నిర్దేశించుకుంది. సర్వే ఉద్దేశం ఇదీ.. ప్రతి ఐదేళ్లకోసారి చిన్నతరహా సాగునీటి వనరుల సర్వేను కేంద్ర జల వనరుల శాఖ చేపడుతోంది. 1986–87లో తొలిసారి శ్రీకారం చుట్టగా.. ప్రస్తుతం జరిగేది ఆరో సర్వే. 2017–18 సంవత్సరానికి సంబంధించిన ఈ సర్వే నిర్వహణకు ఆదేశాలు జారీకావడంతో దీనికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. ప్రతి ఐదేళ్ల వ్యవధిలో నీటి వనరుల పరిస్థితి ఎలా ఉంది? నీటి వినియోగం తగ్గిందా.. పెరిగిందా? పంటల సాగు విస్తీర్ణం ఎలా ఉంది? ఆయా పంటలకు వినియోగమవుతున్న నీటి పరిమాణం, గతానికి..ప్రస్తుతానికి నీటి నిల్వలు పెరిగాయా..తగ్గాయా? తదితర వివరాలను విశ్లేషిస్తారు. జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వర్షాలు లేకపోవడంతో భూగర్భ నీటి మట్టం పెరగడం లేదు. ఒక్కోసారి విస్తృతంగా వర్షాలు కురిసినా ఆశించిన స్థాయిలో నీటిని భూమిలోకి ఇంకించే ప్రయత్నాలు పెద్దగా జరగడం లేదు. మరోపక్క భూగర్భ జలాలపై ఆధారపడే పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నీటి వనరుల గణన ప్రాధాన్యత సంతరించుకుంది. నీటి నిల్వలు ఆందోళనకరంగా ఉంటే అందుకు గల కారణాలను కూలంకషంగా విశ్లేషించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారు. అంతేగాక భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక పథకాలను రూపొందించే అవకాశమూ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సర్వేలో గుర్తించిన ప్రతి నీటి వనరుని జియోట్యాగ్ చేస్తారు. భవిష్యత్ అవసరాల కోసంతోపాటు సర్వేలో పాదర్శకతకు పెద్దపీట వేసేందుకు ఈ విధానాన్ని వినియోగిస్తున్నారు. 18లోపు అధికారులకు శిక్షణ గ్రామీణ, పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రతి నీటి వనరుల లెక్క తేల్చేందుకు యంత్రాంగం ఉద్యోగులను రంగంలోకి దించుతోంది. పల్లెల్లో వీఆర్ఓలు ప్రతి రైతు వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. మండల స్థాయిలో తహసీల్దార్ ఈ సర్వేను పర్యవేక్షిస్తారు. ఇక మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు లేదా వర్క్ ఇన్స్పెక్టర్లు సర్వేలో పాల్గొంటారు. ఈ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు వీరిని సమన్వయం చేస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సర్వే ఎలా చేయాలన్న అంశంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. సర్వేపై అవగాహన కల్పించారు. ఈనెల 18లోపు మండల, మున్సిపాలిటీల్లో కిందిస్థాయి ఉద్యోగులకు సర్వే నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్లి గణన చేపడతారు. ఈనెల 30వ లోపు సర్వే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. -
18 రోజులు.. 500 మి.యూ. విద్యుదుత్పత్తి!
దోమలపెంట (అచ్చంపేట): శ్రీశైలం ప్రాజెక్టులోని ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రం చరిత్ర సృష్టించింది. శ్రీశైలం జలాశయంలోకి సరిపడా నీటి వనరులు ఉండటంతో జూలై 23 నుంచి ఈ నెల 2వ తేదీ ఆదివారం వరకు టీఎస్జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రంలోని 6 యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఒక్కో యూనిట్ నుంచి 150 మెగావాట్ల చొప్పున మొత్తం 900 మెగావాట్లతో 500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు కేంద్రం చీఫ్ ఇంజనీర్ మంగేశ్‌కుమార్, ఎస్ఈ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. భూగర్భ కేంద్రం నిర్మాణం తర్వాత నిర్విరామంగా 18 రోజులు పాటు 6 యూనిట్లు ఆగకుండా విద్యుదుత్పత్తి చేయడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్విరామంగా ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నా.. లోడ్ డిస్పాచ్‌లో డిమాండ్ లేనందున అడిగినప్పుడే విద్యుదుత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, కార్మికులను అభినందించిన సీఈ, ఎస్ఈలు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఈఈ రవీందర్, డీఈలు శ్రీకుమార్‌గౌడ్, చంద్రశేఖర్, ఆనంద్, వెంకటేశ్వర్‌రెడ్డి, ఏవో రామకృష్ణ, ఏడీఈలు కుమారస్వామి, మదన్‌మోహన్‌రెడ్డి, కృష్ణదేవ్ తదితరులు పాల్గొన్నారు. -
కాఫర్ డ్యాంకు అనుమతి లేదు
- డిజైన్ల సమీక్షా కమిటీతో చర్చించి ముందుకెళ్తున్నాం - జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడి సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాఫర్ డ్యాం నిర్మాణానికి కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి లేదని, ఇకపై తీసుకోవాల్సి ఉందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. డిజైన్ల సమీక్షా కమిటీకి తమ ప్రతిపాదనలన్నీ సమర్పించి చర్చించాకే దీనిపై ముందుకెళ్తున్నామన్నారు. ‘మట్టికట్టతో కనికట్టు’ శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీడబ్ల్యూసీ డిజైన్లకు అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టును చేపడతామన్నారు. జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు మెయిన్ డ్యాంకు సంబంధించి 1983లో ప్రతిపాదించిన ఒరిజినల్ డిజైన్‌లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. కాఫర్ డ్యాం అంటే తాత్కాలిక కట్టడమేనని, ఈ ప్రాజెక్టులో దాన్ని క్రస్ట్ లెవెల్‌ను 41 మీటర్లకు పెంచి కాఫర్ డ్యాంను నిర్మిస్తున్నామని, తద్వారా 28 లక్షల క్యూసెక్కుల నీటిని మళ్లించే అవకాశం ఉందన్నారు. మెయిన్ డ్యాం పూర్తయ్యాక ఈ డ్యాంను తొలగిస్తామన్నారు. కాఫర్ డ్యాంలో 60 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందన్నారు. జలవనరుల శాఖ చరిత్రలో కాఫర్ డ్యాంను ప్రధానంగా చేపట్టిన సందర్భాలెక్కడైనా ఉన్నాయా? అని అడిగిన ప్రశ్నకు మంత్రి దేవినేనిగానీ, ఈఎన్సీ గానీ సూటిగా సమాధానం చెప్పలేదు.