సాక్షి, పాలేరు: ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలో మొసళ్లు కనిపించడంతో కలకలం రేగింది. జలాశయంలో వద్ద మత్స్య శాఖ ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్‌లో జాలర్లకు నాలుగు మొసలి పిల్లలు చిక్కాయి. వీటిలో రెండిని చంపి మరో రెండింటిని బయటకు తీసుకువచ్చారు.
ఈ విషయాన్ని జాలర్లు, మత్స్యశాఖాధికారులకు తెలియజేశారు. ఉడుం పిల్లలనుకుని రెండింటిని చంపినట్లు జాలర్లు తెలిపారు. పాలేరు జలాశయంలో మొసళ్లు కనిపించడంతో జాలర్లతో పాటు ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment