మత్స్యకారులకు చిక్కిన మొసలి
కూసుమంచి : పాలేరు రిజర్వాయర్ ఒడ్డున సోమవారం పట్టుకున్న మొసలిని మత్స్యకారులు ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. పాలేరు రిజర్వాయర్‌లో మొసళ్లు ఉన్నట్లు ఇదివరకే వెలుగులోకి వచ్చింది. కాగా సోమవారం రిజర్వాయర్ ఒడ్డున (స్మశానవాటిక సమీపంలో) నీటి మడుగులు ఉండగా.. అందులో మొసలి కదలికలను కొందరు స్థానికులు గమనించారు.
దీంతో వారు అది మొసలిగా భావించి మత్స్యకారులకు సమాచారం అందించారు. వారు మడుగులో నీటిని తోడటంతో మొసలి కనబడగా.. దాన్ని వలల్లో బంధించారు. వలకు చిక్కిన మొసలి సుమారు 12 కిలోలు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.
ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా.. వారు వచ్చి మొసలిని స్వాధీనం చేసుకున్నారు. కాగా రిజర్వాయర్‌లో మొసళ్లు పెద్దవి అవుతుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment