ముమ్మరంగా ‘మిషన్’ పనులు | Intensively 'Mission' works | Sakshi
Sakshi News home page

ముమ్మరంగా ‘మిషన్’ పనులు

Published Mon, Mar 7 2016 2:07 AM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM

ముమ్మరంగా ‘మిషన్’ పనులు

ముమ్మరంగా ‘మిషన్’ పనులు

2017 డిసెంబర్ నాటికి 624 గ్రామాలకు నీటి సరఫరా లక్ష్యం
మాదిరిపురం గుట్టపై రిజర్వాయర్ల ఏర్పాటు
అక్కడి నుంచి 17 మండలాలకు పంపిణీ

 
మహబూబాబాద్ :మిషన్ భగీరథ పథకం కింద పాలేరు రిజర్వాయర్ నీటిని మరిపెడ మండలం మాదిరిపురం గుట్టపై నుంచి 3 జీఎల్‌బీఆర్, ఒక ఓహెచ్‌బీఆర్ రిజర్వాయర్ల ద్వారా 17 మండలాలకు సరఫరా చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. పాలేరు నుంచి పంప్‌సెట్ల ద్వారా (నాలుగు రన్నింగ్, నాలుగు స్టాండ్‌బై పంపుసెట్లు) నీరు సరఫరా చేయనున్నారు. మాధురిపురం గుట్ట కింద నిర్మించే వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (170 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్ ఫర్ డే)) నుంచి సంప్‌లోకి విడుదల చేస్తారు. ఆ తర్వా త గుట్టపైన 3 జీఎల్‌బీఆర్ (గ్రౌండ్ లెవల్ బ్యాలెన్స్ రిజర్వాయర్లు), ఒకటి ఓహెచ్‌బీఆర్ (ఓవర్‌హెడ్ బ్యాలెన్స్ రిజర్వాయర్) నిర్మించి ఒక జీఎల్‌బీఆర్ నుంచి మరిపెడకు, రెండవ జీఎల్‌బీఆర్ నుంచి కురవి, డోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రం మండలాలకు, మూడవ జీఎల్‌బీఆర్ నుంచి నర్సంపేట, నెల్లికుదురు, తొర్రూరు, రాయపర్తి మండలాలకు నీరు సరఫరా చేయనున్నట్లు మిషన్ భగీరథ ఈఈ రాములు తెలిపారు. ఈ నీటిని నిల్వ చేసేందుకు మానుకోట పట్టణంలోని నిజాం చెరువు సమీపంలో గోపాలపు రం ప్రాంతం దగ్గరలో ఏడెకరాల స్థలంలో రెండు సంప్‌లు నిర్మిస్తున్నా రు.

అందులో ఒకటి మహబూబాబాద్ అర్బన్‌కు, రెండవది మహబూబాబాద్ రూరల్‌కు ఉపయోగపడేలా పనులు చేస్తున్నారు. సంప్ నిర్మించే ప్రాంతంలో ఉన్న గుట్టపైన ఓహెచ్‌బీఆర్ ట్యాంకు నిర్మించి, దాని ద్వారా మహబూబాబాద్ రూరల్, కేసముద్రం మండలాలకు నీరందిస్తారు. మూడవ జీఎల్‌బీఆర్ ద్వారా సరఫరా అయ్యే నీటి కోసం నెల్లికుదురులో ఒకటి, రాయపర్తి మండలం మొరిపిరాల వద్ద మరొక సంప్ నిర్మించి ఆయూ మండలాలకు సరఫరా చేస్తా రు.  రాయపర్తి మండలం కొండూరు ప్రాంతంలో మరో సంప్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ఇక బొద్దుగొండ ప్రాంతంలో సంప్ నిర్మించి గూడూరు, నెక్కొండ, ఖానాపూర్ మం డలాలకు నీరందిస్తారు. నర్సంపేటలో ని మినీ స్టేడియం సమీపంలోని ఓబీ హెచ్‌ఆర్   ద్వారా అర్బన్‌కు, రాజ్‌పేట ప్రాంతంలో మరో ఓహెచ్‌బిఆర్ ట్యాం కు నిర్మించి దాని ద్వారా రూరల్‌కు నీటి సరఫరా చేస్తారు. నర్సంపేట గిర్నిబావి దగ్గర మరో సంప్ నిర్మించి దుగ్గొండి మండలానికి నీరందించేలా ప్రణాళిక తయారు చేశారు.

 రూ. 70 కోట్ల ప్రతిపాదనలు..
 మానుకోట ప్రాంతంలో సంప్, ఇతరత్ర నిర్మాణాలు జరుగుతుండగా ము న్సిపాలిటీ అధికారులు అంతర్గత పైపులైన్లు, ఇతర పనులకు రూ.70 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. ఆ దిశగా సంబంధిత అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
 
మానుకోట డివిజన్‌లో 1706 గ్రామాలకు నీరు..
 ప్రాజెక్టు ఈఈ పరిధిలో 1706 గ్రామాలు ఉన్నాయి. సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు 2017 డిసెంబర్ నాటికి 624 గ్రామాలకు నీరందించేలా పనులు ముమ్మరం చేశాం. సంప్ నిర్మాణ, గుట్టలపై రోడ్ల నిర్మాణాలు, ఇతరత్ర పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నాం. అనుకున్న సమయంలో పూర్తి చేస్తామనే నమ్మకం ఉంది.  - రాములు, మిషన్ భగీరథ ఈఈ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement