
మూడడుగుల ములంమార్పు
రేగిడి : మండలంలో వన్నలి గ్రామానికి చెందిన శాసపు లింగన్నాయుడుకు మడ్డువలస పిల్లకాలువలో మూడడుగుల కంటే పొడవున్న ములంమార్పు జాతి చేప లభించింది. పొలానికి వెళ్తున్న క్రమంలో తొలుత పాము అనుకుని భయపడిన ఈయన తర్వాత పట్టుకుని ఒడ్డుకు తీసుకురాగా ములంమార్పుగా స్థానికులు గుర్తించారు. ఇంతపెద్ద సైజులో లభించిన ఈ చేపను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.