
4,500 రూపాయల చేప!
ఇది ఆషామాషీ చేప కాదు. ఎన్నాళ్లు పెరిగిందో తెలీదుగానీ.. ఏకంగా 40 కేజీల బరువుంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలోని కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలో గురువారం మత్స్యకారుల వలకు చిక్కింది.
జలాశయంలోకి వేటకు వెళ్లిన గంగాధరరావు, ఘంటశాల లోకేష్ విసిరిన వలలో ఈ భారీ చేప పడింది. సుమారు 3 అడుగుల పొడవున్న ఈ చేప 40 కేజీల బరువు తూగింది. దీనిని కొనేందుకు వినియోగదారులు ఎగబడ్డారు. ఒక ఆసామి రూ. 4,500 చెల్లించి దీనిని దక్కించుకున్నాడు.
-జంగారెడ్డిగూడెం రూరల్: