జంగారెడ్డిగూడెం రూరల్/కామవరపుకోట: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో బుధవారం నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వెలవెలబోయింది. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి నుంచి పుట్లగట్లగూడెం మీదుగా గురవాయిగూడెం వరకు యాత్ర సాగింది. పాదయాత్ర షెడ్యూల్‌లో పుట్లగట్లగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ హైవే రైతులతో లోకేశ్ ముఖాముఖి ఏర్పాటు చేశారు.
అయితే.. రైతుల వద్దకు లోకేశ్ రారని.. రైతులనే లోకేశ్ వద్దకు తీసుకు రావాలని చెప్పడంతో నాయకులు హైరానా పడ్డారు. లోకేశ్ వద్దకు రావాలని రైతులను బతిమాలుకోగా.. తాము రాబోమని రైతులు తెగేసి చెప్పారు. దీంతో టీడీపీ నేతలు తమ బంధువులను, పరిచయం ఉన్న వారిని తీసుకెళ్లి వాళ్లే రైతులని లోకేశ్‌కు చెప్పారు. వారితో ముక్తసరిగా మాట్లాడిన లోకేశ్ యాత్రను ముందుకు సాగించారు.
చదవండి: 15 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల విధానం
Comments
Please login to add a commentAdd a comment