![Pregnant Woman Fired By UK Boss For Morning Sickness Awarded Rs 1 Crore](/styles/webp/s3/article_images/2025/02/18/preg1.jpg.webp?itok=eBkiijjb)
ఓ ప్రెగ్నెంట్ మహిళ వర్క్ ఫ్రమ్ హోమ్‌కి అనుమతి ఇవ్వాల్సిందిగా తన బాస్‌ని అభ్యర్థించింది. అనుమతి మంజూరు చేయకపోగా నిర్థాక్షిణ్యంగా ఉద్యోగంలో తొలగించాడు. కేవలం ఆమె కడుపుతో ఉన్నందుకే ఉద్యోగం లోంచి తీసేశారు. దీంతో ఆమె ఉపాధి ట్రిబ్యూనల్ కోర్టుని ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం సదరు కంపెనీకి దిమ్మతిరిగేలా తీర్పు ఇచ్చింది. ఇంతకీ ఏమని తీర్పు ఇచ్చిందంటే.
యూకేకి చెందిన ప్రెగ్నెంట్ మహిళ పౌలా మిలుస్కా తాను ఇంటి నుంచి పనిచేస్తానంటూ బర్మింగ్‌హామ్‌లోని తన కంపెనీ రోమన్ ప్రాపర్టీ గ్రూప్ లిమిటెడ్‌ని అభ్యర్థించింది. తన కంపెనీ హెడ్ అమ్మర్ కబీర్‌కి టెక్స్‌మెసేజ్‌లో తన సమస్యలను వివరిస్తూ కోరింది. గర్భిణిగా ఉన్నప్పుడూ మహిళలకు ఉండే మార్నింగ్ సిక్‌నెస్(వికారం, వాంతులు) తదిరతర కారణాల దృష్ట్యా మహిళా ఉద్యోగి మిలుస్కా వర్క్ ఫ్రమ్ ఇవ్వాల్సిందిగా తన బాస్‌ని కోరింది.
అందుకు ప్రతిగా కబీర్ నిన్ను ఉద్యోగం నుంచి తక్షణమే తొలగిస్తున్నాం అంటూ జార్జ్ హ్యాండ్స్‌తో కూడిన ఎమోజీలతో అవమానిస్తున్నట్లుగా రిప్లై ఇచ్చాడు. మిలుస్కా తన బాస్ నుంచి వచ్చిన ఈ అనుహ్యమైన ప్రతిస్పందనకి దిగ్బ్రాంతి చెందుతుంది. ఆమె ఆ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ కన్సల్టెంట్. అక్టోబర్ 2022లో తాను ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న తర్వాత నుంచి గర్భిణి మహిళలు సాధారణంగా ఎదుర్కొనే సమస్యలనే ఫేస్ చేసింది.
వీటిని తట్టుకోలేక తాను ఇంటి నుంచే పనిచేయాలని భావించి తన కంపెనీ బాస్‌కి తన సమస్యను వివరిస్తూ..మెసేజ్ పెట్టింది. అయితే అతడి నుంచి ఇలా ఊహించిన విధంగా సమాధానం రావడంతో జీర్ణించుకోలేకపోయింది మిలస్కౌ. దాంతో ఆమె యూకే ఉపాధి ట్రిబ్యునల్‌ని ఆశ్రయించింది. తాను గర్భంతో ఉన్నాన్న కారణంతోనే ఉద్యోగం నుంచి తొలగించినట్లు కోర్టుకి విన్నవించుకుంది.
అయితే న్యాయస్థానం ఈ కేసుని విచారించి ఆమె తగిన పరిహారం మంజురయ్యేలా తీర్పు ఇచ్చింది. ఈ కేసులో కోర్టు ఇరువురి మధ్య జరిగిన సంభాషణను విచారించి.. కేవలం ఆమె గర్భిణి కావడంతోనే ఉద్యోగం నుంచి నిర్థాక్షిణ్యంగా కంపెనీ రోమన్ ప్రాపర్టీ గ్రూప్ లిమిటెడ్ తొలిగించినట్లు తేల్చింది.
అయితే సదరు కంపెనీ వ్యాపార ఇబ్బందులు, కార్యాలయంలో ఉద్యోగి అవసరం తదితరాల దృష్ట్యా టెక్స్ట్ మెసేజ్ ద్వారా తొలగించామే గానీ మరే ఉద్దేశ్యం లేదని వివరణ ఇచ్చింది. అయితే అదంతా కేవలం సాకు మాత్రమే అంటూ కొట్టిపారేసింది ట్రిబ్యూనల్. అంతేగాదు బాధిత మహిళ మిలుస్కాకు అన్యాయానికి పరిహారంగా కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ట్రిబ్యూనల్ పేర్కొంది.
(చదవండి: ఢిల్లీ తొక్కిసలాట ఘటన: ఆ ఐదుగురు మృతికి కారణం ఇదే..! వెలుగులోకి షాకింగ్ విషయాలు)
Comments
Please login to add a commentAdd a comment