awarded
-
గర్భిణి అని జాబ్‌లోంచి తీసేశారు..! కట్‌చేస్తే..
ఓ ప్రెగ్నెంట్ మహిళ వర్క్ ఫ్రమ్ హోమ్‌కి అనుమతి ఇవ్వాల్సిందిగా తన బాస్‌ని అభ్యర్థించింది. అనుమతి మంజూరు చేయకపోగా నిర్థాక్షిణ్యంగా ఉద్యోగంలో తొలగించాడు. కేవలం ఆమె కడుపుతో ఉన్నందుకే ఉద్యోగం లోంచి తీసేశారు. దీంతో ఆమె ఉపాధి ట్రిబ్యూనల్ కోర్టుని ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం సదరు కంపెనీకి దిమ్మతిరిగేలా తీర్పు ఇచ్చింది. ఇంతకీ ఏమని తీర్పు ఇచ్చిందంటే.యూకేకి చెందిన ప్రెగ్నెంట్ మహిళ పౌలా మిలుస్కా తాను ఇంటి నుంచి పనిచేస్తానంటూ బర్మింగ్‌హామ్‌లోని తన కంపెనీ రోమన్ ప్రాపర్టీ గ్రూప్ లిమిటెడ్‌ని అభ్యర్థించింది. తన కంపెనీ హెడ్ అమ్మర్ కబీర్‌కి టెక్స్‌మెసేజ్‌లో తన సమస్యలను వివరిస్తూ కోరింది. గర్భిణిగా ఉన్నప్పుడూ మహిళలకు ఉండే మార్నింగ్ సిక్నెస్(వికారం, వాంతులు) తదిరతర కారణాల దృష్ట్యా మహిళా ఉద్యోగి మిలుస్కా వర్క్ ఫ్రమ్ ఇవ్వాల్సిందిగా తన బాస్‌ని కోరింది. అందుకు ప్రతిగా కబీర్ నిన్ను ఉద్యోగం నుంచి తక్షణమే తొలగిస్తున్నాం అంటూ జార్జ్ హ్యాండ్స్‌తో కూడిన ఎమోజీలతో అవమానిస్తున్నట్లుగా రిప్లై ఇచ్చాడు. మిలుస్కా తన బాస్ నుంచి వచ్చిన ఈ అనుహ్యమైన ప్రతిస్పందనకి దిగ్బ్రాంతి చెందుతుంది. ఆమె ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్. అక్టోబర్ 2022లో తాను ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న తర్వాత నుంచి గర్భిణి మహిళలు సాధారణంగా ఎదుర్కొనే సమస్యలనే ఫేస్ చేసింది.వీటిని తట్టుకోలేక తాను ఇంటి నుంచే పనిచేయాలని భావించి తన కంపెనీ బాస్‌కి తన సమస్యను వివరిస్తూ..మెసేజ్ పెట్టింది. అయితే అతడి నుంచి ఇలా ఊహించిన విధంగా సమాధానం రావడంతో జీర్ణించుకోలేకపోయింది మిలస్కౌ. దాంతో ఆమె యూకే ఉపాధి ట్రిబ్యునల్‌ని ఆశ్రయించింది. తాను గర్భంతో ఉన్నాన్న కారణంతోనే ఉద్యోగం నుంచి తొలగించినట్లు కోర్టుకి విన్నవించుకుంది. అయితే న్యాయస్థానం ఈ కేసుని విచారించి ఆమె తగిన పరిహారం మంజురయ్యేలా తీర్పు ఇచ్చింది. ఈ కేసులో కోర్టు ఇరువురి మధ్య జరిగిన సంభాషణను విచారించి.. కేవలం ఆమె గర్భిణి కావడంతోనే ఉద్యోగం నుంచి నిర్థాక్షిణ్యంగా కంపెనీ రోమన్ ప్రాపర్టీ గ్రూప్ లిమిటెడ్ తొలిగించినట్లు తేల్చింది. అయితే సదరు కంపెనీ వ్యాపార ఇబ్బందులు, కార్యాలయంలో ఉద్యోగి అవసరం తదితరాల దృష్ట్యా టెక్స్ట్ మెసేజ్ ద్వారా తొలగించామే గానీ మరే ఉద్దేశ్యం లేదని వివరణ ఇచ్చింది. అయితే అదంతా కేవలం సాకు మాత్రమే అంటూ కొట్టిపారేసింది ట్రిబ్యూనల్. అంతేగాదు బాధిత మహిళ మిలుస్కాకు అన్యాయానికి పరిహారంగా కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ట్రిబ్యూనల్ పేర్కొంది.(చదవండి: ఢిల్లీ తొక్కిసలాట ఘటన: ఆ ఐదుగురు మృతికి కారణం ఇదే..! వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
26 ఏళ్ల పాటు కారవాన్‌లో బానిసగా..ఏకంగా రూ. 3.75 కోట్లు..!
సంపన్న కుటుంబాలు బలహీనులను బానిసలుగా చేసుకుని ఇష్టరాజ్యంగా వారిచేత వెట్టిచాకిరీ చేయించుకునేదని కథకథలుగా విన్నాం. అలా బానిసలుగా బంధీలై కొందరూ ప్రాణాలు కూడా కోల్పోయేవారు. అచ్చం అలాంటి దారుణమైన క్రూరత్వానికి ఓ సంపన్న కుటుంబం ఒడిగట్టింది. అందుకుగానే ఏళ్ల పాటు శిక్షలు కూడా అనుభవించింది. చాలామంది న్యాయం పొందేలోపు మరణించగా ఓ వ్యక్తి పరిహారంగా కోట్లు పొందాడు. ఈ దిగ్బ్రాంతికర ఘటన యూకేలో చోటు చేసుకుంది.అసలేం జరిగిందంటే..రెండు దశాబ్దాలుగా రూనీస్ అనే సంపన్న కుటుంబ బలహీన వ్యక్తులను తమ బానిసలుగా బంధీలను చూసి ఇష్టారాజ్యంగా వారి జీవితాలతో ఆడుకున్నారు. వారి అవసరాల కోసం వీళ్లని పనివాళ్లగా నియమించుకుని తక్కువ వేతనాలు ఇవ్వడమే గాక క్రూరంగా హింసించేవారు. కొంతమందిని అయితే వారి డిమాండ్లను నెరవేర్చకపోతే చంపేస్తామని బెదిరించేవారు కూడా. అలా వారి చేతిలో బానిసగా బంధీ అయ్యి ఏకంగా 26 ఏళ్లుపాటు మురికి కారావాన్లో చిత్రహింసలకు గురైన వ్యక్తికి ఇప్పటకీ న్యాయం లభించింది. ఆ సంపన్న కుటుంబం దాష్టికానికి 15 మంది వ్యక్తులు న్యాయం పొందక ముందే మరణించారు. అందుకు గాను 2017లో ఆ రూనీ కుటుంబ సభ్యులు 11 మంది ఏకంగా 79 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. కానీ ఆ బాధితుల్లో ఒకే ఒక్క వ్యక్తి ఎట్టకేలకు న్యాయం జరిగి ఏకంగా రూ. 3.75 కోట్లు నష్టపరిహారం అందుకోనున్నాడు. వారి హేయమైన చర్యలు ఆ బాధితుల జీవితాల్లో నీలి నీడల్లా వెంటాడుతూనే ఉండటం బాధకరం. అంతేగాదు సదరు బాధితుడు ఆ ఆర్థిక భద్రతకు తగిన సంరక్షణను పొందే అవకాశం కూడా యూకే ప్రభుత్వం అందించింది. అయితే చాలామంది ఆ బాధితుడు అపరిశుభ్రమైన కార్వాన్లో అనుభవించిన దారుణమైన నరకానికి ఈ నగదు ఏ మాత్రం సరితూగదని అనడం గమనార్హం. (చదవండి: మరణాంతరం భద్రపర్చడానికి ఏకంగా రూ. 1.8 కోట్లు..!) -
వీకే నరేష్‌కి డాక్టరేట్ ప్రదానం
నటుడు వీకే నరేష్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ‘ఐఎస్ సీఏహెచ్ఆర్’ నుంచి ఆయన ‘సార్’ అనే బిరుదుతోపాటు డాక్టరేట్‌ని అందుకున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తాజాగా జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్ సమావేశాల్లో వీకే నరేష్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ సమావేశాలను ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్’ సంస్థతో పాటు ‘ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్)’ కలిసి నిర్వహించాయి. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా.. అక్కడ నరేష్‌కు మరో గౌరవం దక్కింది. మిలటరీ ఆర్ట్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌తో పాటు లెఫ్టినెంట్ కల్నల్‌గా ఆయన్ను నియమించినట్లు సన్నిహితులు తెలిపారు. ఇకపై నరేష్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. ఉగ్రవాదం, సామాజిక సమస్యలు వంటి అంశాలపై అనేక అంతర్జాతీయ వేదికలపై నరేష్ ప్రసంగించినందుకు గుర్తింపుగా ఈ గౌరవాలు దక్కాయి. -
ఆర్థిక శాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ పురస్కారం
స్టాక్‌హోమ్: 2023 ఏడాదికి గాను ఆర్థిక శాస్త్రంలో అమెరికాకు చెందిన క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ పురస్కారం లభించింది. మహిళల లేబర్ మార్కెట్ ఫలితాలపై విశేష కృషి చేసినందుకుగాను ఆమెకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ బహుమతిని కేటాయించింది. క్లాడియా గోల్డిన్ అమెరికాకు చెందిన ప్రముఖ లేబర్ ఎకనమిస్ట్. హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మహిళా శ్రామిక శక్తి, సంపాదనలో లింగ వ్యత్యాసం, ఆదాయ అసమానత, సాంకేతిక మార్పు, విద్య, వలసలతో సహా అనేక రకాల అంశాలపై ఆమె పరిశోధన చేశారు. 1990ల్లోనే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్ధిక విభాగంలో పనిచేసిన ఏకైక మహిళ క్లాడియా గోల్డిన్. మహిళా ఆర్థిక శక్తిపై ఆమె ఎనలేని పరిశోధన చేశారు. BREAKING NEWS The Royal Swedish Academy of Sciences has decided to award the 2023 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel to Claudia Goldin “for having advanced our understanding of women’s labour market outcomes.”#NobelPrize pic.twitter.com/FRAayC3Jwb — The Nobel Prize (@NobelPrize) October 9, 2023 నోబెల్ బహుమతుల విజేతలను ప్రకటించే క్రమంలో ఇప్పటికే వైద్య, భౌతిక రంగంలోని అవార్డు గ్రహీతలను ప్రకటించిన కమిటీ బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం నోబెల్ శాంతి రంగాల్లో బహుమతుల విజేతలను ప్రకటించనుంది. చివరిగా ఈ నెల 9న అర్థశాస్త్రంలో విజేతను ప్రకటించింది జ్యురీ. నోబెల్ విజేతలకు డిసెంబర్ 10న బహుమతులను ప్రదానం చేస్తారు. గత ఏడాది నోబెల్ గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు అందజేశారు. ఈసారి ఆ బహుమతిని మరింత పెంచుతూ 11 మిలియన్ల క్రోనర్లు ఇవ్వనున్నారు. ఇదీ చదవండి: Nobel Prize 2023 In Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం -
రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డులు లభించాయి. రవీంద్ర భారతిలో జరిగిన బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమంలో సాక్షి ఫొటోగ్రాఫర్లు యాకయ్య(సూర్యాపేట), కే.శివకుమార్(యాదాద్రి భువనగిరి), వీ భాస్కరా చారి(మహబూబ్ నగర్), శ్రీకాంత్(సిరిసిల్ల), సతీష్(సిద్ధిపేట), రాజేశ్ రెడ్డి(హైదరాబాద్), శివప్రసాద్(సంగారెడ్డి), వేణు(జనగాం), ఎస్ఎస్ థాకూర్(హైదరాబాద్) అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు పాల్గొన్నారు. యాకయ్య, సూర్యాపేట భాస్కరా చారి, మహబూబ్ నగర్ ఈ సంద్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఫోటో జర్నలిస్ట్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఒక అద్భుతమైన ఫోటో తీయడంలో డే తపన, చేసే కృషి గొప్పదని అన్నారు. ఒక్క ఫోటో ఒక చరిత్రను తిరగరాస్తుంది.. చరిత్ర సృష్టిస్తుందని చెప్పారు. ఉద్యమమైనా, సామాజిక విప్లవమైనా, చరిత్ర గతిని మార్చిన ఏ సంఘటనలో ఆయినా జర్నలిస్టుల పాత్ర కీలకమని అన్నారు. ఠాకూర్, హైదరాబాద్ నోముల రాజేశ్, హైదరాబాద్ సతీష్, సిద్ధిపేట్ శివ కుమార్, యాదాద్రి 'నాడు జాతీయోద్యమంలో జర్నలిస్టుల పాత్ర గురించి విన్నాం. నేటి తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కళ్ళ నిండా చూశాం. 14 ఏళ్ల పాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు ప్రత్యక్షంగా, ఇంత ఉత్సాహంగా పాల్గొన్న దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా ఉండదనుకుంటా. తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని గుర్తించిన ఎంతో మంది జర్నలిస్టులు నాడు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది. జర్నలిస్టులందరితో ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. అలాంటి మీడియాను, జర్నలిస్టును, ఫోటో జర్నలిస్టులను కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం భుజానికి ఎత్తుకున్నది.' అని హరీష్ రావు అన్నారు. శివ ప్రసాద్, సంగారెడ్డి శ్రీకాంత్, సిరిసిల్ల ఇదీ చదవండి: 86 స్థానాల్లో ‘కారు’ ఖరారు! -
లీడింగ్ మ్యాన్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ (ఫొటోలు)
-
స్వాతిముత్యం: ఆరోగ్యం ఆనందం
చాలామంది వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని రెండు ప్రపంచాలు చేసుకుంటారు. సరిహద్దులు గీసుకుంటారు. స్వాతి పిరామల్‌కు మాత్రం అలాంటి సరిహద్దులు లేవు. తనకు వైద్యరంగం అంటే ఎంత ఇష్టమో, ఇష్టమైన వంటకాలను చేయడం అంటే కూడా అంతే ఇష్టం. స్వాతి ఆధ్వర్యంలో జరిగే బోర్డ్ మీటింగ్‌లలో హాట్ హాట్ చర్చలే కాదు, ఆమె వండిన హాట్ హాట్ వంటకాలు కూడా దర్శనమిస్తాయి. ‘ఉరుకులు, పరుగులు వద్దు. కూల్‌గా, నవ్వుతూ పనిచేద్దాం’ అని తరచు చెప్పే శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త స్వాతి పిరామల్ తాజాగా ఫ్రాన్స్ అత్యున్నత పౌరపురస్కారం ‘ది షెవాలియే డి లా లీజియన్ దానర్ ఆర్ నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్’ అందుకున్నారు. అంతగా పరిచయం అక్కర్లేని పేరు స్వాతి పిరామల్. సంప్రదాయ గుజరాతీ కుటుంబానికి చెందిన స్వాతి తొలిసారి అడుగుపెట్టింది మాత్రం తనకు ఎంతమాత్రం పరిచయం లేని రంగంలోకి! ఆస్ట్రేలియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నికోలస్ లేబోరేటరీస్ కొనుగోలు చేసినప్పుడు తనకు, భర్త అజయ్ పిరామల్‌కు బొత్తిగా ఏమీ తెలియదు. తన చేతిలో మాత్రం ఎంబీబీయస్ డిగ్రీ ఉంది. నడుస్తూ నడుస్తూనే, ప్రయాణిస్తూనే ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. రాత్రనకా, పగలనకా కష్టపడ్డారు. ఆ కష్టం వృథా పోలేదు. అనతి కాలంలోనే కంపెనీ అగ్రస్థానంలోకి వెళ్లింది. ఈ రంగానికి సంబంధించిన పనితీరు విషయానికి వస్తే ‘ఇలాగే’ అన్నట్లుగా ఉండేది. ‘ఇలా కూడా చేయవచ్చు’ అని కూల్‌గా నిరూపించింది స్వాతి పిరామల్. ‘వ్యక్తిగత, వృత్తిజీవితాలకు మధ్య ఉండే సరిహద్దు రేఖను స్వాతి చెరిపేశారు’ అనే మాట వినబడుతుంటుంది. అయితే ఈ కామెంట్‌ను ఆమె ప్రశంసగానే స్వీకరిస్తుంది. ఇంట్లో వంట చేస్తూనే, టీ తయారు చేస్తూనే క్లయింట్స్‌తో స్వాతి మాట్లాడే దృశ్యం సా«ధారణం. చాలా సందర్భాల్లో క్లయింట్స్ ఆమె ఆతిథ్యం స్వీకరిస్తూనే వ్యాపార విషయాలు మాట్లాడుతుంటారు. ఈ దృశ్యాన్ని చూస్తుంటే స్వాతి తన బంధువులు, స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్నట్లు అనిపిస్తుంది తప్ప క్లయింట్స్‌తో కలిసి బిజినెస్ విషయాలు చర్చిస్తున్నట్లుగా ఉండదు! ‘ఔషధాలను అమ్మడానికి మాత్రమే మా పని పరిమితమైనది కాదు. సమస్యలకు పరిష్కారాలు అన్వేషించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ముందు జాగ్రత్తలు సూచించి, ఆచరించేలా చేయడం కూడా’ అంటుంది స్వాతి పిరామల్. ఇండియా అపెక్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ తొలి మహిళా ప్రెసిడెంట్‌గా చరిత్ర సృష్టించిన స్వాతి పిరామల్ సైన్స్, ఔషధరంగాల్లో సేవలు, భారత్–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి చేస్తున్న కృషికి తాజాగా ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం అందుకుంది. ‘మీ ఖాతాలో ఇన్ని విజయాలు ఉన్నాయి కదా, మీరు ఏ విజయాన్ని చూసి ఎక్కువ గర్వపడతారు?’ అని అడిగితే – ‘ఏదీ లేదు’ అని గలగలమని నవ్వుతుంది స్వాతి. మనం ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే ఇలా అంటుంది... ‘నా మనవరాలు తన రిపోర్ట్ కార్డ్‌తో నవ్వుతూ నా వైపు పరుగెత్తుకు వస్తున్న దృశ్యాన్ని చూస్తున్నప్పుడు, ఈ ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉన్నట్లు గర్వపడతాను’. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న పిరామల్ గ్రూప్ వైస్–చైర్పర్సన్ స్వాతి పిరామల్ ఎన్నో విజయాలు దక్కించుకున్న పారిశ్రామికవేత్త మాత్రమే కాదు. ‘సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్న వ్యక్తి. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టక ముందు మెడికల్ స్కూల్ ఫ్రెండ్స్‌తో కలిసి ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించేది. ఆరోగ్య విషయాలపై వీధి నాటికలు తయారు చేసి ఫ్రెండ్స్‌తో కలిసి వాటిలో నటించేది. ప్రస్తుతం ‘పిరామల్ ఫౌండేషన్’ తరపున సామాజికసేవా కార్యక్రమాలు చేపడుతోంది. ‘ప్రజల ఆరోగ్యం, ఆవిష్కరణలు, కొత్త ఔషధాలపైనే నా ప్రధాన దృష్టి’ అని చెబుతుంది స్వాతి పిరామల్. -
ఐదుగురు తెలంగాణవాసులకు శ్రమ్‌శ్రీ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి శ్రమ్ అవార్డులను 2018 సంవత్సరానికి కేంద్రప్రభుత్వం గురువారం ప్రకటించింది. డిపార్ట్మెంటల్ అండర్ టేకింగ్స్–పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు వారి విశిష్ట పనితీరు, వినూత్న సామర్థ్యాలు, ఉత్పాదకత రంగంలో అత్యుత్తమ సహకారం, అసాధారణమైన ధైర్యానికి గుర్తింపుగా ఈ అవార్డులను అందజేస్తారు. శ్రమ్ భూషణ్ అవార్డ్, శ్రమ్వీర్ అవార్డ్, శ్రమ్‌శ్రీ అవార్డులుగా ప్రధానమంత్రి శ్రమ్ అవార్డులను మూడు కేటగిరీల్లో అందించనున్నారు. ఈ సంవత్సరానికి ప్రకటించిన మొత్తం శ్రమ్ అవార్డుల సంఖ్య 33 ఉండగా, అవార్డులను 69 మంది కార్మికులు అందుకుంటున్నారు. శ్రమ్‌శ్రీ అవార్డును అందుకునే వారిలో తెలంగాణ నుంచి కొరివి రమేశ్, పట్లూరి రాజశేఖర్, కొట్టె రాజు (హైదరాబాద్– బీహెచ్ఈఎల్), చాడ సురేందర్‌రెడ్డి, పూస రాము (బ్రహ్మోస్ ఏరో స్పేస్ ప్రై.లి.) ఉన్నారు. కాగా, అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా 2017–18, 2018–19 సంవత్సరాలకు జాతీయ యువ పురస్కారాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ ప్రదానం చేశారు. వ్యక్తిగత కేటగిరీలో 2017–18 సంవత్సరానికి గాను తెలంగాణకు చెందిన మహ్మద్ ఆజంకు జాతీయ యువ పురస్కారాన్ని అందించారు. -
హైదరాబాద్ వర్సిటీకి అరుదైన గౌరవం
సాక్షి హైదరాబాద్, రాయదుర్గం: ప్రసవ సమయంలో ఆచితూచి సిజేరియన్ ఆపరేషన్లు (సీ సెక్షన్) చేసే అంశంపై ప్రతిష్టాత్మక బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ రీసెర్చి గ్రాంట్ కోసం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్) స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్‌లోని ఫెర్నాండెజ్ ఫౌండేషన్‌ను భాగస్వాములుగా గుర్తించారు. యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంకషైర్ (యూసీలాన్) ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ప్రొ. సూ డౌనీ ఈ రెండు సంస్థలను ఎంపికచేశారు. గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగంగా బ్రెజిల్, కెనడాలలో రీ–జెడ్జ్ అనే వినూత్న ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు జెనీవాలోని డబ్ల్యూహెచ్‌వోతో కలిసి హైదరాబాద్ వర్సిటీ పనిచేస్తోంది. ‘రెడ్యూసింగ్ రేట్స్ ఆఫ్ నాన్–మెడికల్లీ ఇండికేటెడ్ సిజేరియన్ సెక్షన్స్ త్రూ ఓపెన్ యాక్సెస్ మల్టీ ఎవిడెన్స్ అండ్ బిహేవియర్ చేంజ్ ప్రోగ్రాం ఫర్ లాయర్స్ అండ్ జడ్జెస్’ వంటి అంశాలపై ఈ ప్రాజెక్ట్ దృష్టి సారించనుంది. ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న ఐదు ప్రాజెక్టుల్లో ఇదొక ప్రాజెక్ట్ కాగా, వాటిలో 120 దరఖాస్తులకు 80 వేల డాలర్ల విలువైన బిల్, మెలిండా గేట్స్ రీసెర్చి గ్రాంట్ అవార్డు లభించనుంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రధానంగా యూసీ లాన్, వర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఫెర్నాండేజ్ ఫౌండేషన్ అమలు చేయనున్నాయి. దీనికి సంబంధించిన మల్టీ మీడియా ప్రోగ్రామ్స్ పూర్తయ్యాక వాటిని భారత్‌లోని నాలుగు రాష్ట్రాల్లోని జడ్జీలు, లాయర్లకు అందజేస్తారు. వీటిని ఏ మేరకు ఉపయోగించవచ్చు, సిజేరియన్ ఆపరేషన్ల కారణంగా ఉత్పన్నమయ్యే కేసుల్లో తలెత్తే న్యాయపరమైన అంశాలు, వాటిపై తీసుకోవాల్సిన నిర్ణయాలను గురించి ఈ జడ్జీలు, న్యాయవాదులు పరిశీలిస్తారు. హైదరాబాద్ వర్సిటీ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్æ పరిశోధకుల సేవలను వీసీ ప్రొఫెసర్ పి.అప్పారావు ప్రశంసిస్తూ, ప్రతిష్టాత్మకమైన భాగస్వామ్యానికి ఎంపిక కావడం ద్వారా తమ వర్సిటీ అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా తన ప్రతిష్టను నిలుపుకుంటుందన్నారు. తమ పరిశోధక బృందాన్ని హైదరాబాద్ వర్సిటీ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డీన్ ప్రొ.పి.ప్రకాశ్‌బాబు అభినందించారు. ప్రతిష్టాత్మక ఈ రీసెర్చి గ్రాంట్ కోసం యూఓహెచ్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరఫున దరఖాస్తుదారుగా ఉన్న ఫ్యాకల్టీ డా.బీఆర్ శమన్న ఈ అధ్యయనం పట్ల తాము ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై తమ పరిశోధనలు ప్రభావం చూపిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. -
కరోనా నుంచి కోలుకున్న 93 ఏళ్ల వ్యక్తి
న్యూఢిల్లీ : 93 ఏళ్ల పద్మశ్రీ అవార్డు గ్రహీత కేవలం 8 రోజుల్లోనే కరోనాను జయించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ప్రముఖ కవి, సాహిత్య విభాగంలో పద్మశ్రీ అందుకున్న ఆనంద్ మోహన్ జుష్తీ గుల్జార్ దెహల్వి శ్వాసకోశ సమస్యతో జూన్ 1న నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఐసీయాకి తరలించి డాక్టర్ అభిషేక్ దేశ్వాల్ నాయకత్వంలోని ప్రత్యేక బృందం ఆయనకు చికిత్స అందించింది. ఆదివారం నిర్వహించిన పరీక్షలో కరోనా నెగిటివ్ అని తేలడంతో ఆయన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. అంతేకాకుండా జుష్తీ కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనకు సహకారం అందించిన వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన జుష్తీ.. ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నాక మీరంతా మా ఇంటికి విందుకు రావాలి అంటూ వైద్య సిబ్బందిని ఆహ్వానించారు. 93 ఏళ్ల వయసులోనూ చాలా త్వరగా కోలుకున్న జుష్తీకి అభినందనలు అంటూ హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ అజిత్ కుమార్ ట్వీట్ చేశారు. జుష్తీ రికవరీపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. రచనలతోనే కాదు అతి తక్కువ రోజుల్లోనే కరోనాపై విజయం సాధించి ఎంతోమందికి ప్రేరణగా నిలిచారు. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మరింత కాలం జీవించాలని కోరుకుంటున్నాం’ అంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు. (కేజ్రీవాల్‌కు రేపు కరోనా పరీక్షలు? ) -
అర్థికశాస్త్రంలో భారత సంతతి అభిజిత్ బెనర్జీకి నోబెల్ పురస్కారం
-
ప్రాణవాయువు గుట్టు విప్పినందుకు..
తిన్న ఆహారం శక్తిగా మారాలంటే మనిషితోపాటు అన్ని రకాల జంతువులకూ ఆక్సిజన్ అవసరం. సూక్ష్మస్థాయిలో కణాలూ ఆక్సిజన్ తగ్గిపోతే ఇబ్బంది పడతాయి. ఈ సూక్ష్మ కణాలు తమ పరిసరాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉందని ఎలా గుర్తిస్తాయి? అందుకు తగ్గట్లుగా తమను తాము ఎలా మలచుకుంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కున్న శాస్త్రవేత్తలు కెలీన్, రాట్క్లిఫ్, సెమెన్జాలకు ఈ ఏడాది వైద్యనోబెల్ దక్కింది. కణస్థాయిలో ఆక్సిజన్ స్థాయికి తగ్గట్లుగా జన్యువులను ప్రేరేపించే ఓ కణ యంత్రాంగాన్ని వీరు గుర్తించారు. ఆక్సిజన్ మోతాదుల్లో వచ్చే తేడాలు జీవక్రియలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునేందుకు, రక్తహీనత మొదలుకొని కేన్సర్ వరకూ అనేకవ్యాధులకు సరికొత్త, మెరుగైన చికిత్స కల్పించేందుకు ఈ పరిశోధనలు ఉపయోగపడతాయని స్వీడెన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ సోమవారం ప్రకటించింది. వాతావరణంలో 20 శాతం... భూ వాతావరణంలో 20 శాతం వరకూ ఉన్న ఆక్సిజన్ జీవక్రియల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. కణాల్లోని మైటోకాండ్రియా.. ఆక్సిజన్‌ను ఉపయోగించుకొని ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. ఎంజైమ్‌ల ద్వారా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుందని 1931 నోబెల్ గ్రహీత ఒట్టో వార్బర్గ్ గుర్తించారు. మెడకు ఇరువైపులా రెండు పెద్ద రక్తనాళాల పక్కనే ఉండే కరోటిడ్ బాడీలో... రక్తంలో ఆక్సిజన్ మోతాదును గుర్తించే ప్రత్యేక కణాలు ఉంటాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగాన్ని నియంత్రించేందుకు ఈ కరోటిడ్ బాడీలు మెదడుకు సంకేతాలు పంపుతాయని 1938 నో»ñ ల్ గ్రహీత కార్నైయిల్ హేమన్స్ గుర్తించారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు శరీరం చేపట్టే ఇంకో పని... ఎరిథ్రోపొయిటిన్ అనే హర్మోన్‌ను ఉత్పత్తి చేయడం. ఈ హార్మోన్ ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ఎక్కువ చేస్తుంది. అయితే ఈ ప్రక్రియను ఆక్సిజన్ ఎలా నియంత్రిస్తుందన్నది ఇటీవలి వరకూ తెలియదు. జన్యు ప్రహేళిక... ఈ ఏడాది నోబెల్ అవార్డుగ్రహీతలు సెమెన్జా, రాట్క్లిఫ్లు ఎరిథ్రోపొయిటిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసే జన్యువుపై పరిశోధనలు చేశారు. ఈ జన్యువులో మార్పులు చేసిన ఎలుకలను ఉపయోగించినప్పుడు ఆక్సిజన్ కొరతకు ఈ జన్యువు స్పందిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా ఈ ఎరిథ్రోపొయిటిన్ కిడ్నీ కణాల్లో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కానీ శరీరంలోని దాదాపు అన్ని కణజాలాల్లోనూ ఎరిథ్రోపొయిటిన్ ఉత్పత్తిని నియంత్రించే జన్యువు ఉన్నట్లు స్పష్టమైంది. దీంతోపాటు అనేక ఇతర ప్రొటీన్లు, (హెచ్ఐఎఫ్–1, ఏఆర్ఎన్టీ), ఒక రకమైన కేన్సర్‌ను నిరోధించే హార్మోన్‌ను ఉత్పత్తి చేసే జన్యువు వీహెచ్ఎల్కు కూడా కణాల ఆక్సిజన్ నియంత్రణలో తమదైన పాత్ర ఉన్నట్లు తెలిసింది. వీటన్నింటి మధ్య జరిగే చర్యలు ఆక్సిజన్ మోతాదుకు తగ్గట్లుగా కణాలు మార్పులు చేసుకునేందుకు కారణమవుతున్నట్లు తెలిసింది. వీటిల్లో కొన్ని పరిశోధనలను కెలీన్ వేరుగా చేశారు. ఏతావాతా... శరీరంలో ఆక్సిజన్ మోతాదు తక్కువగా ఉన్నప్పుడు హెచ్ఐఎఫ్–1 ప్రొటీన్ కణ కేంద్రకంలో ఎక్కువగా పోగుపడుతుంది. ఇక్కడ అది ఏఆర్ఎన్టీతో కలసి ఆక్సిజన్ లేమి, కొరతను నియంత్రించే జన్యువులకు అతుక్కుంటుంది. ఆక్సిజన్ సాధారణ స్థితిలో ఉన్నప్పుడు హెచ్ఐఎఫ్–1 వేగంగా నశిస్తూ టుంది. కొన్ని అణువులను జత చేయడం ద్వారా ఆక్సిజన్ దీనిని నియంత్రిస్తుంటుంది. ఎన్నో వ్యాధులకు హేతువు.. కణాలు ఆక్సిజన్ లేమి, కొరతలను గుర్తించకపోవడం రకరకాల వ్యాధులకు కారణమవుతుంది. కిడ్నీ వైఫల్యం ఉన్న వారిలో ఎక్కువ మంది రక్తహీనతతోనూ బాధపడుతుంటారు. ఎరిథ్రోపొయిటిన్ హార్మోన్ జన్యువు సక్రమంగా పనిచేయకపోవడం దీనికి కారణం. ఆక్సిజన్ మోతాదులను గుర్తించే వ్యవస్థ కేన్సర్ విషయంలోనూ కీలకంగా ఉంటుంది. కేన్సర్ కణితుల్లో ఈ వ్యవస్థ జీవక్రియలను మార్చేందుకు, కొత్త రక్తనాళాల ఏర్పాటు, కేన్సర్ కణాలు శరీరంలో వేగంగా వ్యాప్తి చెందేందుకూ ఉపయోగపడుతూ ఉంటాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మోదీకి యూఏఈ అవార్డు
అబుధాబి/మనామా: భారత ప్రధాని మోదీ తన సోదరుడంటూ రెండు దేశాల సంబంధాల్లో సౌహార్థతను చాటిచెప్పారు యూఏఈ రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్. యూఏఈలో మోదీ పర్యటనను పురస్కరించుకుని విడుదల చేసిన సందేశంలో ఆయన.. ‘మరోసారి రెండో సొంతింటికి వస్తున్నందుకు నా సోదరుడికి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత మోదీకి రాజప్రసాదంలో ఆయన స్వాగతం పలికారు. ఇరువురు నేతలు వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీని యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ పురస్కారంతో గౌరవించారు. 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎన్నడూ లేనంత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేసిన మోదీ ని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు యూఏఈ రాజు అల్ నహ్యాన్ ఏప్రిల్‌లో ప్రకటించిన విష యం తెలిసిందే. అనంతరం జరిగిన కార్యక్రమం లో ప్రధాని మోదీ భారతీయ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానం రూపే కార్డును ప్రారంభించారు. దీనివల్ల ఏటా యూఏ ఈ సందర్శించే 30 లక్షల మంది భారతీయులకు లాభం కలగనుంది. కశ్మీర్ దేశ చోదకశక్తి రాజకీయ స్థిరత్వం, సానుకూల విధానాల కారణంగానే భారత్ పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త చోదకశక్తిగా మారనున్న కశ్మీర్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని పేర్కొన్నా రు. అబుధాబిలో ప్రవాస భారతీయ పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. ‘రాజకీయ స్థిరత్వం, అనుకూల విధానాల వల్లే పెట్టుబడిదారులు భారత్‌వైపు ఆకర్షితులవుతున్నారు. దేశంలో వృద్ధికి ప్రోత్సాహం, ఉద్యోగ కల్పన, ‘మేక్ ఇన్ ఇండియా’కు తోడ్పాటుకు అనుకూలంగా ప్రభుత్వం విధానాలను రూపొందిస్తోంది. వీటితోపాటు పెట్టుబడిదారులకు తగు ప్రతిç ఫలం కూడా దక్కేలా చూస్తోంది. అందుకే భారత్ లో ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోండి’ అని కోరారు. ‘ఎన్నో ఏళ్లుగా వెనుకబాటుకు గురైన జమ్మూకశ్మీర్‌లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయి. అక్కడి యువతకు ఉపాధి కల్పించేందుకు, అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించాం. భారత్ అభివృద్ధికి కశ్మీర్ ప్రాంతం చోదకశక్తిగా మారనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారేందుకు కూడా జమ్ము, కశ్మీ ర్, లదాఖ్‌లకు ఎన్నో అవకాశాలున్నాయి. అక్కడి కి రావాలని ఆహ్వానిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నా రు. ఖలీజ్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ‘కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370తో కొందరు మాత్రమే లాభపడ్డారు. అక్కడి యువతపై తీవ్రవాద భావాలను నూరిపోశారు. ఉగ్రవాదం, హింసాత్మక చర్యలకు పాల్పడేలా తయారు చేశారు.’ అని తెలిపారు. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు మేం తీసుకున్న చర్యలకు యూఏ ఈ ప్రభుత్వం మద్దతు ప్రకటించిందన్నారు . బహ్రెయిన్ చేరుకున్న మోదీ శుక్రవారం యూఏఈ చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి పర్యటన ముగించుకుని శనివారం సాయం త్రం బహ్రెయిన్ చేరుకున్నారు. రాజప్రసాదంలో రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మోదీకి ఘనస్వాగతం పలికారు. ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్‌తో భేటీ అయి ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై మోదీ చర్చలు జరిపారు. అంతరిక్ష విజ్ఞానం, సౌరశక్తి, సాంస్కృతిక సంబంధాలపై రెండు దేశాలు పలు ఎంవోయూలపై సంతకాలు చేశాయి. ఇస్రోతో బహ్రెయిన్ నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ పరస్పర సహకారం వీటిల్లో ఒకటి. కాగా, భారత ప్రధాని ఒకరు బహ్రెయిన్ దేశంలో పర్యటించడం ఇదే ప్రథమం. ఆదివారం ఆయన గల్ఫ్ ప్రాంతంలోనే అతిపురాతన శ్రీనాథ్జీ ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం మోదీ ఇక్కడి నుంచి తిరిగి ఫ్రాన్సు రాజధాని పారిస్‌లో జరిగే జీ–7 సమ్మిట్‌లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. -
సుందర్ పిచాయ్‌కు గ్లోబల్ లీడర్షిప్ అవార్డు
వాషింగ్టన్: గూగుల్ సీఈఓ, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్‌కు అరుదైన గౌరవం దక్కింది. టెక్నాలజీ రంగంలో ఈయన చేసిన విశిష్ట సేవలను గుర్తించిన అమెరికా–భారత వాణిజ్య మండలి (యూఎస్ఐబీసీ).. ప్రతి ఏడాది ఇచ్చే గ్లోబల్ లీడర్షిప్ అవార్డుకు పిచాయ్‌ను ఎంపికచేసినట్లు ప్రకటించింది. ఈయనతో పాటు నాస్డాక్ ప్రెసిడెంట్ అడెనా ఫ్రైడ్మాన్ పేరును ప్రకటించిన యూఎస్ఐబీసీ.. ఇరువురి నేతృత్వంలోని కంపెనీలు, అంతర్జాతీయ టెక్నాలజీ రంగ ప్లాట్‌ఫాంను ఏర్పాటుచేయడంలో తమవంతు కృషిచేసినట్లు కొనియాడింది. ఇరు సంస్థల కారణంగా భారత్, అమెరికా మధ్య వస్తు, సేవల ద్వైపాక్షిక వాణిజ్యం గడిచిన ఐదేళ్లలో 150 శాతం పెరిగి గతేడాదినాటికి 142.1 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపింది. ఇక వచ్చేవారం జరగనున్న ఇండియా ఐడియాస్ సదస్సులో ఇరువురికి అవార్డులను అందించనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఆరేళ్లలో 8.8 కోట్లకు 5జీ కనెక్షన్లు..! జీఎస్ఎంఏ అంచనా న్యూఢిల్లీ: భారత మొబైల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2025 నాటికి 92 కోట్లకు చేరనుందని గ్లోబల్ టెలికం పరిశ్రమ సమాఖ్య (జీఎస్ఎంఏ) అంచనావేసింది. ఇదేసమయంలో 5జీ కనెక్షన్లు 8.8 కోట్లకు చేరనున్నట్లు పేర్కొంది. 2018 చివరినాటికి మొత్తం సబ్స్క్రైబర్ల సంఖ్య 75 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ఈ రంగ ఆదాయం 2016 నుంచి 20 శాతం తగ్గిపోయినట్లు వెల్లడించింది. -
తెలంగాణకు మూడోసారి స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ ఆవార్డ్
-
అప్లైడ్ జియోకెమిస్ట్రీలో డాక్టరేట్ ప్రదానం
శాలిగౌరారం: మండలంలోని ఇటుకులపహాడ్ గ్రామానికి చెందిన అక్కెనపల్లి సుధాకర్ హైద్రాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అప్లైడ్ జియోకెమెస్ట్రీ విభాగంలో డాక్టరేట్‌ను పొందారు. ప్రొఫెసర్ ప్రవీణ్రాజ్సక్సేనా పర్యవేక్షణలో ‘ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అసెస్మెంట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఎలాంగ్ గ్రానైట్–బసాల్ట్ కాంట్యాక్ట్(అగ్నిశిలల్లో భూగర్భ జలాల అన్వేషణ– భూగర్భ జలాల నాణ్యత) అరౌండ్ నారాయణఖేడ్, మెదక్ డిస్ట్రిక్ట్ ’ అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి సమర్పించిన పరిశోధనా గ్రంథాన్ని పరిశీలించిన ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు సుధాకర్‌కు డాక్టరేట్(పీహెచ్డీ) పట్టాను అందజేశారు. ఈ మేరకు సుధాకర్ శనివారం ఇక్కడ విలేకరులకు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సుధాకర్‌ను గ్రామస్తులు, పలువురు బందువులు అభినందించారు. వ్యవసాయ కూలీ కుటుంబంలో అక్కెనపల్లి యల్లయ్య–సోమమ్మ దంపతుల ఆరుగురి కుమారుల సంతానంలో చివరి సంతానం సుధాకర్. పాఠశాల విద్యను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే అభ్యసించాడు. ఇంటర్మీడియట్‌ను నకిరేకల్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో, డిగ్రీ నల్లగొండలోని ఎన్జి కళాశాలలో, పీజీని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివాడు. వివాహితుడైన సుధాకర్ ఒక పక్క పరిశోధన కొనసాగిస్తునే ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖలో జియాలజిస్టుగా ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. -
రాష్ట్ర స్థాయి ఫొటోగ్రాఫర్లకు బహుమతుల ప్రదానం
నల్లగొండ రూరల్ : ఉత్తమ ఫొటోగ్రాఫర్లుగా రాష్ట్రస్థాయిలో రాణించడం అభినందనీయమని మంత్రి కేటీఆర్, ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. శుక్రవారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఫొటోగ్రఫీ పోటీల్లో రాణించిన వారికి అవార్డులు అందజేసి సన్మానించారు. అవార్డు పొందిన వారిలో ఆర్.ఆకాశ్ (నమస్తే తెలంగాణ), ముచ్చర్ల శ్రీనివాస్‌గౌడ్ (హన్స్ ఇండియా), సింగం వెంకటరమణ (ది హిందూ), నరేందర్ (సూర్య), భవానీప్రసాద్ (ఆంధ్రభూమి) బహుమతులను అందుకున్నారు. -
ఉరిశిక్ష అమలు సూర్యోదయానికి ముందే ఎందుకు?
న్యూఢిల్లీః ఇండియాలో తీవ్ర నేరాల్లోనూ అత్యంత అరుదుగా విధించే శిక్షల్లో ఉరిశిక్ష ఒకటి. ఇటీవలి కాలంలో పాకిస్తానీ టెర్రరిస్ట్ అజ్మల్ అమిర్ కసబ్, పార్లమెంట్ దాడుల్లో కీలక నిందితుడైన అఫ్జల్ గురు కేసుల్లో ఉరిశిక్షను అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే అసలు మరణ శిక్షను సమర్థించాలా లేదా అన్న అంశంపై చర్చలు కొనసాగడం అలా ఉంచి.. ఈ ఉరిశిక్షను తెల్లవారు జామునే ఎందుకు అమలు చేస్తారు? అన్న అంశం మాత్రం ఆసక్తిని రేపుతుంది. సూర్యోదయానికి ముందే ఉరిశిక్షను అమలు చేస్తారన్న విషయం అందరికీ తెలిసినదే. అయితే అలా తెల్లవారుజామునే ఈ శిక్ష ఎందుకు అమలు చేస్తారన్న విషయంపై ఆరాతీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ఉరిశిక్ష అమలు చేయడం మనం సినిమాల్లోనే చూస్తాం. ఓ ఖైదీకి ఉరిశిక్ష అమలు చేసే సమయంలో అక్కడ సాక్ష్యంగా ఓ తలారి, మెజిస్ట్రేట్ లేదా ఆయన ప్రతినిధి, ఓ వైద్యుడు మరి కొందరు పోలీసులు మాత్రం ఉన్నట్లు చూపిస్తారు. అయితే భారతదేశంలో సూర్యోదయాన్నే ఎందుకు మరణ శిక్షను అమలు చేస్తారు అన్నదానికి మరిన్ని కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉండటంతో పాటు ఎంతో శక్తిని కలిగి ఉంటుందని, జైలు అధికారులు అన్ని రకాలుగా పూర్తి దృష్టిని కేంద్రీకరించగల్గుతారని, వారి ఇతర రోజువారీ కార్యక్రమాలపై కూడా ఆ ప్రభావం పడకుండా ఉంటుందని తెల్లవారుజామునే ఉరిశిక్షను అమలు చేస్తారని తెలుస్తోంది. అంతేకాక శిక్షను అమలు చేసేందుకు ముందు, తర్వాత ఎన్నో విధానాలను పాటించాల్సి రావడం, వివిధ రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించడం, వాటిని పలురకాల రిజిస్టర్లలో నమోదు చేయడం వంటి పనులన్నీ చేపట్టాల్సి ఉంటుంది. దీనికితోడు.. అమలు అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించి, అదేరోజు వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేపట్టేందుకు వీలుగా భౌతిక కాయాన్ని అప్పగించాల్సి ఉంటుంది. మరోవైపు సూర్యోదయానికి ముందే... అంటే రోజు ప్రారంభం కాకముందే మరణ శిక్షను అమలు చేయకుంటే.. శిక్ష అనుభవించాల్సి వ్యక్తి రోజంతా మానసిక ఒత్తిడి అనుభవించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాన్ని నిరోధించేందుకు కూడా తెల్లవారుజామున ఉరిశిక్షను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సమాజంనుంచీ ఎదురయ్యే అకస్మాత్ పరిణామాలను నిరోధించేందుకు, వారినుంచీ ఎదురయ్యే వ్యతిరేక సమస్యలు నిరోధించేందుకు అంతా నిద్రలో ఉండే సమయంలో.. సూర్యోదయానికి ముందే ఉరిశిక్షను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
'వైన్' లోపంతో జాక్‌పాట్
ముంబై: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఓపెన్ ప్రోగ్రాం 'వైన్' లో ఉన్న లోపాన్ని కనిపెట్టిన ఓ ఇండియన్ హ్యాకర్ జాక్ పాట్ కొట్టేశాడు. వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం వైన్ లోని 'బగ్' ను భారత సంతతికి చెందిన బగ్ హ్యాకర్ అవినాశ్ సింగ్ గుర్తించాడు. ఈ భద్రతా లోపం కనిపెట్టిన అతనికి ప్రోత్సాహకాన్ని ప్రకటించింది ట్విట్టర్. సుమారు 6.7 లక్షల రూపాయల (10,080 డాలర్ల) బహుమతి ప్రకటించింది. వైన్ కు సంబంధించిన సోర్స్ కోడ్ పబ్లిక్ గా అందరికీ అందుబాటులో ఉండడాన్ని గమనించిన అవినాశ్ .. సాఫ్ట్ వేర్ లోపం కారణంగా ఇలా జరుగుతోందని గుర్తించి సంస్థకు వివరించాడు. ఈ సైట్ లో ప్రయివేటు వీడియోలను పబ్లిక్ గా షేర్ చేయడానికి వీల్లేదు. అయితే వైన్ లోని వీడియోలను నిఫ్టీ ఇంటర్నెట్ వైడ్ స్కానింగ్ టూల్ సెన్సిస్.ఎస్ ఐ అనే సెర్చ్ ఇంజిన్ లో వెతకినపుడు ప్రయివేట్ వీడియోలు సైతం పబ్లిక్ గా దర్శనమిస్తున్నాయి. ఇలా దాదాపు 80 ఇమేజెస్ ను డౌన్ చేయగలిగాడు. దీనికి 'డాకర్' అనే బగ్ ది బాధ్యత అని కనిపెట్టాడు. ఈ విషయాన్ని సంస్థ దృష్టికి తీసుకురావడంతో దాన్ని 5 నిమిషాల్లోనే సవరించుకుంది. సోషల్ మీడియా దిగ్గజాలు బగ్ నేరస్థులను వేటాడే నిపుణులైన బగ్ హ్యాకర్స్ పై దృష్టి పెట్టాయి. బిగ్ బగ్ హంటింగ్ కుర్రాళ్ళకు భారీగా నజరానాను ప్రకటిస్తున్నాయి ఈ నేపథ్యంలో భారత్ లో హ్యాకర్స్ కు మంచి అవకాశాలు లభిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఇటీవల, ఆనంద్ ప్రకాష్ అనే బెంగుళూర్ ఆధారిత ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగి, ఫేస్బగ్ బగ్ ను కని పెట్టి వార్తలలోకెక్కిన సంగతి తెలిసిందే. కాగా 2012 లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం వైన్ లో ఇటీవల వీడియోల నిడివిని పెంచింది. గతంలో 30 సెకండ్లకు మాత్రమే పరిమితమైన దీన్ని 140 సెకండ్లకు పెంచింది. -
శ్రీ శ్రీ రవిశంకర్ కు బ్రిటన్ లో ప్రత్యేక గౌరవం!
ఆధ్యాత్మిక సేవా రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గురు శ్రీ శ్రీ రవిశంకర్ కు బ్రిటన్ లో అరుదైన గౌరవం దక్కింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 37 కోట్లమంది ప్రజలకు చేరువైన ఆయన్ను ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు వరించగా ప్రస్తుతం బ్రిటన్ లోని నేషనల్ ఇండియన్ విద్యార్థులు, పూర్వ విద్యార్థి యూనియన్ ప్రత్యేక హానరరీ ఫెలోషిప్ ను అందించి సత్కరించింది. హింసలేని సమాజాన్ని సృష్టించడంకోసం, ప్రపంచశాంతికోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్న గురు శ్రీ శ్రీ రవిశంకర్ కు బ్రిటన్ లోని నేషనల్ ఇండియన్ విద్యార్థులు, పూర్వ విద్యార్థి సంఘం (ఎన్ఐఎస్ఏయు) ప్రత్యేక గౌరవాన్ని అందించింది. ప్రపంచవ్యాప్తంగా యోగా, మెడిటేషన్, ఆధ్యాత్మిక విద్యను అభివృద్ధి పరచేందుకు కృష్టి చేస్తున్నందుకు గాను ఆయనకు ఈ ప్రత్యేక సత్కారాన్ని అందించినట్లు ఎన్ఐఎస్ఏయు ఓ ప్రకటనలో తెలిపింది. రవిశంకర్ కృషి ప్రపంచ శాంతికి మరింత సహకరించాలని ఈ సందర్భంగా విద్యార్థులు కోరారు. వసుదైక కుటుంబం, సత్యమేవ జయతే అన్న సూత్రంతో, ప్రపంచదేశాలను ఒకే కుటుంబంగా మార్చాలన్న శ్రీ శ్రీ అసాధారణ ప్రయత్నాన్ని అక్కడి విద్యార్థులు కొనియాడుతున్నారు. ఆయనకు ప్రత్యేక గౌరవాన్ని అందిస్తూ.. అదే మార్గంలో మరింత అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా యువత శ్రీ శ్రీ రవిశంకర్ మార్గదర్శకత్వంలో నడవాలని బ్రిటన్ లో నివసిస్తున్న భారత విద్యార్థులంతా ఆశిస్తున్నట్లు ఎన్ ఐ ఎస్ ఏ యు అధ్యక్షుడు సనం ఆరోరా తెలిపారు. -
'బాలు'కు స్వర కళా సామ్రాట్ బిరుదు