సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డులు లభించాయి.
రవీంద్ర భారతిలో జరిగిన బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమంలో సాక్షి ఫొటోగ్రాఫర్లు యాకయ్య(సూర్యాపేట), కే.శివకుమార్(యాదాద్రి భువనగిరి), వీ భాస్కరా చారి(మహబూబ్ నగర్), శ్రీకాంత్(సిరిసిల్ల), సతీష్(సిద్ధిపేట), రాజేశ్ రెడ్డి(హైదరాబాద్), శివప్రసాద్(సంగారెడ్డి), వేణు(జనగాం), ఎస్‌ఎస్ థాకూర్(హైదరాబాద్) అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు పాల్గొన్నారు.
యాకయ్య, సూర్యాపేట
భాస్కరా చారి, మహబూబ్ నగర్
ఈ సంద్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఫోటో జర్నలిస్ట్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఒక అద్భుతమైన ఫోటో తీయడంలో డే తపన, చేసే కృషి గొప్పదని అన్నారు. ఒక్క ఫోటో ఒక చరిత్రను తిరగరాస్తుంది.. చరిత్ర సృష్టిస్తుందని చెప్పారు. ఉద్యమమైనా, సామాజిక విప్లవమైనా, చరిత్ర గతిని మార్చిన ఏ సంఘటనలో ఆయినా జర్నలిస్టుల పాత్ర కీలకమని అన్నారు.
ఠాకూర్, హైదరాబాద్
నోముల రాజేశ్, హైదరాబాద్
సతీష్, సిద్ధిపేట్
శివ కుమార్, యాదాద్రి
'నాడు జాతీయోద్యమంలో జర్నలిస్టుల పాత్ర గురించి విన్నాం. నేటి తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కళ్ళ నిండా చూశాం. 14 ఏళ్ల పాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు ప్రత్యక్షంగా, ఇంత ఉత్సాహంగా పాల్గొన్న దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా ఉండదనుకుంటా. తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని గుర్తించిన ఎంతో మంది జర్నలిస్టులు నాడు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది. జర్నలిస్టులందరితో ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. అలాంటి మీడియాను, జర్నలిస్టును, ఫోటో జర్నలిస్టులను కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం భుజానికి ఎత్తుకున్నది.' అని హరీష్ రావు అన్నారు.
శివ ప్రసాద్, సంగారెడ్డి
శ్రీకాంత్, సిరిసిల్ల
ఇదీ చదవండి: 86 స్థానాల్లో ‘కారు’ ఖరారు!
Comments
Please login to add a commentAdd a comment