Media Awards
-
వేడుకగా తెలుగు గళ పురస్కారాల ప్రదానోత్సవం
-
రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డులు లభించాయి. రవీంద్ర భారతిలో జరిగిన బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమంలో సాక్షి ఫొటోగ్రాఫర్లు యాకయ్య(సూర్యాపేట), కే.శివకుమార్(యాదాద్రి భువనగిరి), వీ భాస్కరా చారి(మహబూబ్ నగర్), శ్రీకాంత్(సిరిసిల్ల), సతీష్(సిద్ధిపేట), రాజేశ్ రెడ్డి(హైదరాబాద్), శివప్రసాద్(సంగారెడ్డి), వేణు(జనగాం), ఎస్ఎస్ థాకూర్(హైదరాబాద్) అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు పాల్గొన్నారు. యాకయ్య, సూర్యాపేట భాస్కరా చారి, మహబూబ్ నగర్ ఈ సంద్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఫోటో జర్నలిస్ట్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఒక అద్భుతమైన ఫోటో తీయడంలో డే తపన, చేసే కృషి గొప్పదని అన్నారు. ఒక్క ఫోటో ఒక చరిత్రను తిరగరాస్తుంది.. చరిత్ర సృష్టిస్తుందని చెప్పారు. ఉద్యమమైనా, సామాజిక విప్లవమైనా, చరిత్ర గతిని మార్చిన ఏ సంఘటనలో ఆయినా జర్నలిస్టుల పాత్ర కీలకమని అన్నారు. ఠాకూర్, హైదరాబాద్ నోముల రాజేశ్, హైదరాబాద్ సతీష్, సిద్ధిపేట్ శివ కుమార్, యాదాద్రి 'నాడు జాతీయోద్యమంలో జర్నలిస్టుల పాత్ర గురించి విన్నాం. నేటి తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కళ్ళ నిండా చూశాం. 14 ఏళ్ల పాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు ప్రత్యక్షంగా, ఇంత ఉత్సాహంగా పాల్గొన్న దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా ఉండదనుకుంటా. తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని గుర్తించిన ఎంతో మంది జర్నలిస్టులు నాడు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది. జర్నలిస్టులందరితో ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. అలాంటి మీడియాను, జర్నలిస్టును, ఫోటో జర్నలిస్టులను కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం భుజానికి ఎత్తుకున్నది.' అని హరీష్ రావు అన్నారు. శివ ప్రసాద్, సంగారెడ్డి శ్రీకాంత్, సిరిసిల్ల ఇదీ చదవండి: 86 స్థానాల్లో ‘కారు’ ఖరారు! -
లాడ్లీ మీడియా అవార్డులకు ఆహ్వానం.. షరతులివే
లాడ్లీ మీడియా అండ్ అడ్వర్టైజింగ్ అవార్డుల 13వ ఎడిషన్ కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. UNFPA (United Nations Population Fund) మద్దతుతో లింగ సున్నితత్వం కోసం లాడ్లీ మీడియా అవార్డులను ప్రకటిస్తుంది. మహిళా సాధికారికత, సమస్యలు, గృహ హింస, పని ప్రదేశాల్లో వేధింపులు తదితర సమస్యలను ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియాతో పాటు కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చి లింగ సమానత్వం కోసం కృషి చేసిన మీడియా ప్రతినిధులకు ఈ అవార్డులను అందజేస్తారు. అవార్డుల ఎంపిక కోసం కావాల్సిన ప్రమాణాలు • లింగ వివక్ష విధానాల గురించి అవగాహన కల్పించడం • లింగ కోణం నుంచి ప్రస్తుత సంఘటనల విశ్లేషణ • పరిశోధన, ఇతర నివేదికలు, ఇతర కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం • లింగ సమీకరణాలను పునర్నిర్వచించే వ్యక్తుల ప్రొఫైల్స్ • లింగ ఆధారిత హింస నుంచి బయటపడిన వారి అనుభవాలు, ఆందోళనలను తెలియపరచడం (కేస్ స్టడీస్) ఎప్పటినుంచి ఎంట్రీలంటే.. 1 జనవరి, 2022 నుంచి 31 డిసెంబర్, 2022 వరకు ప్రచురించబడి / ప్రదర్శింపబడి లేదా ప్రసారం చేయబడి ఉండాలి ఎంట్రీలు 1. ప్రింట్ మీడియా 2. ఎలక్ట్రానిక్ మీడియా 3. రేడియో 4. వెబ్ నుంచి ఆహ్వానం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని భాషలనుంచి ఎంట్రీలు పంపవచ్చు నిబంధనలు, షరతులు • అన్ని ఎంట్రీలు కచ్చితంగా అర్హత ప్రమాణాలను అనుసరించాలి • మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు అవార్డును పొందిన మీడియా వ్యక్తులు అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. • అసంపూర్తిగా లేదా తప్పుగా నింపిన ఎంట్రీ ఫారమ్‌లు పరిగణించబడవు. • గ్రూప్ నుంచి దరఖాస్తు చేస్తే ఒక ట్రోఫీకి మాత్రమే అర్హత ఉంటుంది మరిన్ని వివరాలకు Laadli వెబ్ సైట్ సందర్శించండి Exciting news! The Call for Entries 13th edition of the Laadli Media and Advertising Awards for Gender Sensitivity, 2023 has officially launched! Submit your entries now and showcase your passion for gender-sensitive media and advertising. Please Apply: https://t.co/w7bDhSMkNW pic.twitter.com/ntSCnK7ZRz — Laadli (@Laadli_PF) April 29, 2023 -
‘సాక్షి’ పాత్రికేయులకు హైబిజ్ పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి డెస్క్ సాగుబడి’ ఇన్చార్జి పంతంగి రాంబాబు, సాక్షి టీవీ న్యూస్ కాస్టర్ కిషోర్ హైబిజ్ టీవీ మీడియా పురస్కారాలను అందుకున్నారు. హైటెక్స్‌లో బుధవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో హోం మంత్రి మహమూద్ అలీ నుంచి రాంబాబు ఉత్తమ ప్రింట్ అగ్రికల్చరల్ జర్నలిస్ట్ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఇంటిపంటలు, సిరిధాన్యాల వ్యాప్తి దిశగా ఆయన ప్రతి మంగళవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమయ్యే ‘సాగుబడి’ పేజీని నిర్వహిస్తున్నారు. సాక్షి టీవీ న్యూస్ కాస్టర్ కిషోర్‌తో పాటు వివిధ పత్రికలు, సోషల్ మీడియా సంస్థలు, శాటిలైట్ చానళ్ల పాత్రికేయులు, ఫొటో, వీడియో జర్నలిస్టులు కూడా పురస్కారాలు అందుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ మార్కెటింగ్ కేఆర్పీ రెడ్డి, ఈవీ నర్సింహారెడ్డి – ఐఏఎస్ (వీసీ–ఎండీ టీఎస్ ఐఐసీ), నరేంద్ర రామ్ నంబుల (సీఎండీ – లైఫ్ స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్), పి.చక్రధర రావు (ప్రెసిడెంట్–ఐపీఈఎంఏ, పౌల్ట్రీ ఇండియా), ఎం.రవీందర్ రెడ్డి (డైరెక్టర్ మార్కెటింగ్–భారతి సిమెంట్స్),వి.రాజశేఖర్ రెడ్డి (జనరల్ సెక్రటరీ–క్రెడాయ్), ఎం.రాజ్‌గోపాల్ (ఎండీ– హై బిజ్ టీవీ, తెలుగు నౌ), డాక్టర్ జె.సంధ్యారాణి (సీఈవో–హై బిజ్ టీవీ, తెలుగు నౌ) తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా హైబిజ్ అవార్డుల ప్రదానం (ఫొటోలు)
-
ఉత్తమ పాత్రికేయులకు హై బిజ్ టీవీ మీడియా అవార్డ్స్–2022
సాక్షి, హైదరాబాద్: ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాత్రికేయులు, ఇతర సిబ్బందికి వచ్చే సంవత్సరం జనవరి 29న అవార్డులను అందజేయాల ని హై బిజ్ టీవీ సంస్థ నిర్ణయించింది. గచ్చి బౌలిలోని సంధ్య కన్వెన్షన్ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం ‘హై బిజ్ టీవీ మీడియా అవార్డ్స్–2022’పేరుతో రూపొందించిన పోస్టర్‌ను హైదరాబాద్ లో ఆవిష్కరించారు. పాత్రికేయ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30కి పైగా కేటగిరీల్లో హైబిజ్ టీవీ అవార్డులను అందజేస్తామని సంస్థ ఎండీ మాడిశెట్టి రాజగోపాల్ తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ జర్నలిజంలో ఇంగ్లిష్, తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో పని చేస్తున్న పాత్రికేయులు, సిబ్బందిని సత్కరిస్తామని తెలిపారు. ప్రింట్ అడ్వర్టైజ్ మెంట్ (ఇంగ్లిష్, తెలుగు, ఇతర భాషలు), ప్రింట్ సర్క్యులేషన్ కేటగిరీల్లో కూడా నూతన ఆవిష్కరణల దిశగా సాగిన వ్యక్తులకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆయా రంగాల్లో పని చేస్తున్న వారు www.hybiz.tv/ awards లింక్ ద్వారా నామినేషన్లను సమర్పించవచ్చన్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జనవరి 17. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐ.వెంకట్ (డైరెక్టర్ – ఈనాడ్ఢు), అనిల్ కుమార్ (ఎక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, బ్రాంచ్ హెడ్, టైమ్స్ ఆఫ్ ఇండియా), రంగారెడ్డి (ఎక్స్ రీజినల్ జనరల్ మేనేజర్ – ది హిందూ), సోమశేఖర్ (ఎక్స్ అసోసియేట్ ఎడిటర్, చీఫ్ బ్యూరో – ది హిందూ బిజినెస్ లైన్), సత్యనారాయణ (ఎక్స్ బిజినెస్ డైరెక్టర – ఇన్షియేటివ్ మీడియా), రమణ కుమార్ (మాజీ జనరల్ మేనేజర్, అడ్వర్టైజ్ మెంట్ – సాక్షి), మాడిశెట్టి రాజ్ గోపాల్ (మేనేజింగ్ డైరెక్టర్ – హై బిజ్ టీవీ, తెలుగు నౌ) తదితరులు పాల్గొన్నారు. హై బిజ్ టీవీ మీడియా అవార్డ్స్–2022కు సంబంధించి ఇతర వివరాల కోసం 9666796622 నంబర్లో సంప్రదించవచ్చు. -
‘సాక్షి’కి అవార్డుల పంట
-
యోగా దివస్ పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాకు ప్రాచుర్యం కల్పించినందుకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ ‘అంతర్జాతీయ యోగా దివస్ మీడియా సమ్మాన్’పురస్కారాలను 30 మీడియా సంస్థలకు ప్రకటించింది. ఆ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ అవార్డులు అందజేశారు. రేడియో, టీవీ, ప్రింట్ మీడియా కేటగిరీల వారీగా మొత్తం 30 అవార్డులు అందజేశారు. రేడియో విభాగంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి ఈ అవార్డు దక్కింది. ఆకాశవాణి హైదరాబాద్ స్టేషన్ డైరెక్టర్ మల్లాది శైలజా సుమన్ ఈ పురస్కారాన్ని మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. ప్రింట్ మీడియా విభాగంలో విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ‘సంచలన వార్త పత్రిక లీడర్’అనే తెలుగు వార్తా పత్రికకు ఈ అవార్డు లభించింది. ఈ పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు వి.వి.రమణమూర్తి.. మంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ‘యోగా దివస్’కు సంబంధించిన వార్తా కథనాలు 15 రోజులపాటు ప్రచురించడం వల్ల ఈ ఘనత దక్కిందని రమణమూర్తి తెలిపారు. 40 ఏళ్ల కిందట అనకాపల్లి ఆంధ్రజ్యోతి విలేకరిగా జర్నలిస్టు జీవితాన్ని ప్రారంభించానని, తాను స్థాపించిన ‘లీడర్’సాయంకాలం దినపత్రిక ఇటీవలే 20 ఏళ్ల ఉత్సవం జరుపుకుందని వివరించారు. -
మనం చూడని మనదేశం
చూడాలి.. తెలుసుకోవాలి.. వెలుగులోకి తేవాలి..స్ఫూర్తి చెందాలి.మనకు ఉన్నవన్నీ సవాళ్లే అనుకుంటే వీళ్ల జీవితాలు చూడాలి.. మనకు కనపడని దేశం ఇది..ఈ నెల పన్నెండున తెలంగాణ, సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో జరిగిన ‘జై చండీరాం మెమోరియల్ సెకండ్ నేషనల్ కమ్యూనిటీ మీడియా ఫెస్టివల్’లో ప్రదర్శించిన డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్‌లో మనం చూడని.. మనకు తెలియని దేశం కనిపించింది. మచ్చుకు మూడు.. సాల్ట్ ఇన్ మై విలేజ్ సముద్రపు నీటితోనే కాదు.. కొండవారగా పారే నీటితోనూ ఉప్పు తయారవుతుంది. అదే నాగాలాండ్ కథ.. సాల్ట్ ఇన్ మై విలేజ్. 1960ల్లో నాగాలాండ్‌లో జరిగిన ఘర్షణ, హింస నుంచి బతికి బయటపడ్డ మహిళలు ఇలా ఉప్పును తయారు చేసే నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా ప్హెక్ జిల్లాలోని మాతిక్రూ గ్రామంలోని ఆడవాళ్లకు ఇదే ప్రధాన ఆర్థిక వనరు. కొండ మీద నుంచి చిన్న చిన్న పాయలుగా పారుతున్న నీటిని వెదురు బుంగలు, క్యాన్లలో పట్టుకొని కడవల్లో పోసి కాస్తారు. నీరంతా మరిగి మరిగి... ఆవిరై అడుగున ఉప్పు తయారవుతుంది. వీటిని అచ్చులుగా చేసి (తాటి బెల్లంలా) చుట్టుపక్కల ఉన్న మార్కెట్లో అమ్ముతారు. డబ్బుతోపాటు ఆరోగ్యం అనీ చెప్తారు దీన్ని తయారు చేసే స్త్రీలు. మరుగుతున్న ఈ నీటి ఆవిరిని పీల్చుకోవడం వల్ల జలుబు, దగ్గు, కొన్ని శ్వాసకోశ వ్యాధులూ నయమయ్యాయని అంటారు. అంతేకాదు, ఈ ఉప్పు కూడా ఆరోగ్యకరమే అని చెప్తారు. ఉప్పు తయారీతో అల్లుకుని ఉన్న ఆ మహిళల జీవన విధానాన్ని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ట్రేడింగ్ చైల్డ్‌హుడ్ ఛత్తీస్‌గఢ్‌లోని బరిమా గ్రామం. ఊళ్లో చాలా మంది పిల్లలు బాలకార్మికులే. పశువులు కాస్తూ, పొలాల్లో పనిచేస్తూ కనిపిస్తారు. వాళ్లందరి ఇంటర్వ్యూలతో ఆ ఊరి చిత్రాన్ని చూపించిన సినిమా ఇది. పేదరికం, వాటికి కారణమైన దేశ సామాజిక, రాజకీయ స్థితిగతులను పరోక్షంగా ప్రశ్నించిన ఈ ఫిల్మ్ పెద్దల బాధ్యతను గుర్తుచేస్తుంది. సమ్ఝౌతా.. సమ్ఝౌతా .. అంటే ఒప్పందం. ఎవరితో.. శవాలతో! అవును. ఇది ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ స్త్రీల జీవన చిత్రం. స్థానిక మీడియా చూసినా.. చదివినా.. బుందేల్‌ఖండ్‌లో ఒక్క నేర వార్త కూడా కనిపించదు. అసలక్కడ క్రైమ్ రేటే ఉండదు. మరి శవాలతో సమ్ఝౌతా ఏంటీ? అదే సినిమా! వరకట్నం వేధింపులు, వాటివల్ల ఆత్మహత్యలు, ఈవ్‌టీజింగ్‌లు, రేప్‌లు, హత్యలు.. ఏం జరిగినా బాధితుల తరపు కుటుంబ సభ్యులను పిలిచి నేరస్తుల కుటుంబ సభ్యులతో సమ్ఝౌతా కుదిరిస్తారు గ్రామ సర్పంచ్‌లు, పెద్దలు వగైరా! అవును, ఖాప్ పంచాయత్లే. నేరం ఎంత పెద్దదయినా సరే.. సమ్ఝౌతానే శరణ్యం. ఫిర్యాదులు నమోదు అవడానికి వీల్లేదు. విచారణ పేరుతో పోలీసులు ఆ ఊళ్లలోకి అడుగు పెట్టడానికి ఆస్కారం లేదు. అందుకే క్రైమ్ రిపోర్ట్‌లో... పోలీసుల వైపు కెమెరా పెడితే.. ‘‘ఫిర్యాదు రాదు.. ఎఫ్ఐఆర్ నమోదు కాదు. ఫిర్యాదు వస్తే... తప్పకుండా న్యాయం చేస్తాం’’ అంటారు. ఇదే సమ్ఝౌతా! చూస్తున్న వాళ్లకు షాక్. ‘సభ్య’ సమాజానికీ అశనిపాతం. ఇవన్నీ తీసినవి ఫిల్మ్‌మేకింగ్‌లో మాస్టర్స్ కాదు. కష్టాల బడిలో ఆరితేరిన వాళ్లు. ఆ డాక్యుమెంటరీల్లో వాళ్లు అనుభవించిన సమస్యలున్నాయి. అందుకే అవి మనసును తడి చేస్తాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించిన మహిళా రైతుల గురించి చెప్పుకోవాలి. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర్లోని పస్తాపూర్‌కు చెందిన వాళ్లు. చిన నర్సమ్మ, లక్ష్మమ్మ ఇంకా కొందరు మహిళలు. బడుగు, బలహీన వర్గాలకు చెందినవాళ్లు. తమలా సమస్యల సవాళ్లతో జీవితంలో నెగ్గుతున్న వాళ్లు.. వాళ్ల కోణంలో.. వాళ్లు చూసిన సమాజాన్ని కెమెరాలో బంధించి.. డాక్యుమెంటరీలుగా.. షార్ట్ఫిల్మ్స్గా తీస్తే.. ఎందరికో స్ఫూర్తిగా ఉంటుందని ఈ బాధ్యతను చేపట్టారు. దూరదర్శన్ తొలితరం ప్రొడ్యూసర్లలో ఒకరైన మహిళ.. జై చండీరాం. ఆమె జ్ఞాపకార్థం ‘జై చండీరాం మెమోరియల్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ పేరుతో 2017లో ప్రారంభించారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుపుతున్నారు. ఇది రెండవ యేడాది. ఈ ఇద్దరూ బాల్యపు హక్కులు, ప్రత్యేకతలు, జ్ఞాపకాలు లేకుండా పెరిగారు. ‘రెలు’ కూడా వాళ్లకు అందమైన ఊహ. ఇప్పుడు ఫ్లయిట్లో ఈ ఫెస్టివల్‌కు వచ్చారు. ఆ మాటను మెరిసే కళ్లతో చెప్తారు. చిన నర్సమ్మ, లక్ష్మమ్మకు .. వాళ్ల నాయకత్వంలోని ఇతర మహిళలకూ చదువురాదు. అయితేనేం బతుకు తెలిసిన జ్ఞానవంతులు. అందుకే షూటింగ్‌కి చెందిన హై యాంగిల్, లో యాంగిల్, ఐ లెవెల్ షాట్స్ వంటి సాంకేతిక భాషకు ప్రత్యామ్నాయంగా వీళ్లు కొత్తపరిభాషను ఏర్పాటు చేసుకున్నారు. గాయ్దోళ్ల షాట్, పటేల్ షాట్, సంఘం షాట్‌గా! వాటిని కాయిన్ చేసుకోవడానికి వారి ప్రాంతపు సంస్కృతి, సామాజిక పరిస్థితులే ప్రేరణ, కారణం. దొరతనానికి బానిసలు, ఆర్థికలేమి, నిర్వాసితులుగా వాళ్లు పడ్డ కష్టాలు, అనుభవించిన బాధల్లోంచి పుట్టిన పదాలు అవి. పటేల్ అంటే దొర.. ఎప్పుడూ తన ఎదుట నేల మీద కూర్చుని ఉన్న కూలీలతో కిందకు చూసే మాట్లాడ్తాడు కాబట్టి లో యాంగిల్ షాట్‌ను తమకు అర్థమయ్యేలా పటేల్ షాట్ అని పిలుచుకుంటున్నారు. హై యాంగిల్ షాట్ గాయ్దోళ్ల షాట్ ఎందుకు అయింది? గాయ్దోళ్లు అంటే వెట్టి కూలీలు. తమ ముందు నిలబడి ఉన్న దొరకు సమాధానం ఇవ్వాలంటే పైకి చూస్తూనే మాట్లాడాలి. ఆ సన్నివేశాన్నే వాళ్లు ఊహించుకుని హై యాంగిల్ షాట్‌కి ఆప్ట్ అయ్యేలా గాయ్దోళ్ల షాట్ అని నామకరణం చేసుకున్నారు. సంఘం షాట్.. సంఘం లేదా... సమావేశంలో వాళ్లంతా ఒకచోటే కూర్చుని ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుంటారు. ఎవ్వరూ తల ఎత్తాల్సిన అవసరం లేదు. తలదించాల్సిన అగత్యం లేదు. అందుకే ఐ లెవెల్ షాట్... సంఘం షాట్లా అనిపించింది వాళ్లకు. ఇది వాళ్లు కల్పించుకున్న స్పృహ.. తెచ్చుకున్న అవగాహన. దక్కన్ రేడియోతో తెలుగు రాష్ట్రాల్లో తొలి కమ్యూనిటీ రేడియోను, వీడియో కెమెరా ఆపరేటింగ్‌తో డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్నూ తీస్తున్నారు. తమను చూసి నొసటితో వెక్కిరించిన నోళ్లకు తమ చేతలతో మర్యాద నేర్పుతున్నారు. లక్ష్మణ్ మూడి.. ‘ట్రేడింగ్ చైల్డ్‌హుడ్’ దర్శకుడు. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్న పెంచి పెద్ద చేశాడు. లక్ష్మణ్ కూడా ఒకప్పుడు బాలకార్మికుడే. తొమ్మిదో తరగతి వరకు చదివి ఆపేశాడు. పెద్దవాళ్లకు తెలియకుండా.. తెలిసిన పెద్దలను ఒప్పిస్తూ ఈ డాక్యుమెంటరీ తీశాడు. బాగా చదువుకోవాలనేది లక్ష్మణ్ ఆశయం. థెనిలో.. ‘సాల్ట్ ఇన్ మై విలేజ్’ డాక్యుమెంటరీ దర్శకురాలు. పదో తరగతితో చదువు ఆపేసింది ఆర్థిక స్తోమత లేక. ఆమె చేనేత కార్మికురాలు కూడా. ఇప్పటికే నాలుగు షార్ట్‌ఫిల్మ్స్ తీసింది. స్క్రీనింగ్ కోసం పలు ప్రాంతాలకు వెళ్లింది. ‘‘మంచి ఫిల్మ్ మేకర్ కావాలనుకుంటున్నా’’ అంటుంది. – సరస్వతి రమ -
‘మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా పాల్
న్యూఢిల్లీ: మీడియా రంగానికి చెందిన డాక్టర్ హెచ్.ఎస్.పాల్‌ను ఏసీఎస్ మీడియా కార్పొరేషన్ తాజాగా ‘మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్–2018’ అవార్డుతో సత్కరించింది. ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయంలో జరిగిన ‘కంట్రీవైడ్ మీడియా ఇంపాక్ట్ అవార్డ్స్’ కార్యక్రమంలో పాల్‌కు ఈ అవార్డును అందజేశారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు డాక్టర్(ప్రొఫెసర్) పీకే పాటసాని, ఏసీఎస్ మీడియా కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన డాక్టర్(ప్రొఫెసర్) అభిరామ్ కులశ్రేష్ఠ తదితరులు పాల్గొన్నారు. 1989 నుంచి మీడియారంగంలో ఉన్న పౌల్ ప్రస్తుతం కశ్మీర్‌లోనే అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ఇంగ్లీష్ పత్రిక ‘డైలీ ఎక్సెల్షియర్’కు ఢిల్లీ బ్యూరో చీఫ్‌గా కొనసాగుతున్నారు. -
మిషన్ కాకతీయ: సాక్షికి మీడియాకు రెండు అవార్డులు
-
ప్రజలను జాగృతపరిచేవి కళలే
ఉమ్మడి రాష్ట్రంలో కళాకారులకు అన్యాయం డిప్యూటీ సీఎం రాజయ్య రవీంద్రభారతిలో అక్కినేని మీడియా అవార్డ్స్ ప్రదానం సాక్షి మీడియా ప్రతినిధులకు రెండు అవార్డులు సాక్షి, సిటీబ్యూరో: కళలు ఎప్పుడో ఒకప్పుడు ప్రజలను జాగృతం చేస్తుంటాయని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య అన్నారు. బుధవారం రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్ అకాడమి, షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివంగత సినీ దిగ్గజం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 91వ జయంతి సందర్భంగా అక్కినేని మీడియా అవార్డ్స్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కళాకారులు వివక్షతకు గురయ్యారన్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి మాట్లాడుతూ మీడియా అవార్డ్సు ప్రదానం మంచిని ప్రభావితం చేసే కార్యక్రమమన్నారు. అనంతరం శృతిలయ, షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కినేని మీడియా అవార్డులను సాక్షి టీవీకి చెందిన బి.కల్పనకు, సాక్షి ఫిలిమ్ రిపోర్టర్ ఎస్.నాగేశ్వరరావు, ఎక్స్‌ప్రెస్ టీవీ నుంచి భవన, ఈటీవీ2 నుంచి సతీష్‌తోపాటు పలువురికి అందజేశారు. ఈ సందర్భంగా వారిని శాలువతో సన్మానించి, జ్ఞాపికతోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సమాచార హక్కు కమిషనర్ పి.విజయబాబు, శృతిలయ నిర్వాహకులు ఆర్ఎన్ సింగ్, ఆమని, దళిత సేవా అధ్యక్షులు జేబీ రాజు తదితరులు పాల్గొన్నారు.