ఉత్తమ పాత్రికేయులకు హై బిజ్‌ టీవీ మీడియా అవార్డ్స్‌–2022  | Hybiz TV Media Awards For Best Journalist 2022 | Sakshi

ఉత్తమ పాత్రికేయులకు హై బిజ్‌ టీవీ మీడియా అవార్డ్స్‌–2022 

Dec 9 2021 2:02 AM | Updated on Dec 9 2021 2:02 AM

Hybiz TV Media Awards For Best Journalist 2022 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాత్రికేయులు, ఇతర సిబ్బందికి వచ్చే సంవత్సరం జనవరి 29న అవార్డులను అందజేయాల ని హై బిజ్‌ టీవీ సంస్థ నిర్ణయించింది. గచ్చి బౌలిలోని సంధ్య కన్వెన్షన్‌ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం ‘హై బిజ్‌ టీవీ మీడియా అవార్డ్స్‌–2022’పేరుతో రూపొందించిన పోస్టర్‌ను హైదరాబాద్‌ లో ఆవిష్కరించారు.

పాత్రికేయ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30కి పైగా కేటగిరీల్లో హైబిజ్‌ టీవీ అవార్డులను అందజేస్తామని సంస్థ ఎండీ మాడిశెట్టి రాజగోపాల్‌ తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్‌ జర్నలిజంలో ఇంగ్లిష్, తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో పని చేస్తున్న పాత్రికేయులు, సిబ్బందిని సత్కరిస్తామని తెలిపారు. ప్రింట్‌ అడ్వర్టైజ్‌ మెంట్‌ (ఇంగ్లిష్, తెలుగు, ఇతర భాషలు), ప్రింట్‌ సర్క్యులేషన్‌ కేటగిరీల్లో కూడా నూతన ఆవిష్కరణల దిశగా సాగిన వ్యక్తులకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

ఆయా రంగాల్లో పని చేస్తున్న వారు www.hybiz.tv/ awards లింక్‌ ద్వారా నామినేషన్లను సమర్పించవచ్చన్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జనవరి 17. పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐ.వెంకట్‌ (డైరెక్టర్‌ – ఈనాడ్ఢు), అనిల్‌ కుమార్‌ (ఎక్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, బ్రాంచ్‌ హెడ్, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా), రంగారెడ్డి (ఎక్స్‌ రీజినల్‌ జనరల్‌ మేనేజర్‌ – ది హిందూ), సోమశేఖర్‌ (ఎక్స్‌ అసోసియేట్‌ ఎడిటర్, చీఫ్‌ బ్యూరో – ది హిందూ బిజినెస్‌ లైన్‌), సత్యనారాయణ (ఎక్స్‌ బిజినెస్‌ డైరెక్టర – ఇన్షియేటివ్‌ మీడియా), రమణ కుమార్‌ (మాజీ జనరల్‌ మేనేజర్, అడ్వర్టైజ్‌ మెంట్‌ – సాక్షి), మాడిశెట్టి రాజ్‌ గోపాల్‌ (మేనేజింగ్‌ డైరెక్టర్‌ – హై బిజ్‌ టీవీ, తెలుగు నౌ) తదితరులు పాల్గొన్నారు. హై బిజ్‌ టీవీ మీడియా అవార్డ్స్‌–2022కు సంబంధించి ఇతర వివరాల కోసం 9666796622 నంబర్‌లో సంప్రదించవచ్చు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement