Laadli Media And Advertising Awards: Call For Entries To 13th Edition - Sakshi
Sakshi News home page

Laadli Media And Advertising Awards: లాడ్లీ మీడియా అవార్డులకు ఆహ్వానం.. షరతులివే

Published Thu, Jun 15 2023 5:18 PM | Last Updated on Thu, Jun 15 2023 5:54 PM

Call For Entries For The 13th Laadli Media And Advertising Awards - Sakshi

లాడ్లీ మీడియా అండ్ అడ్వర్టైజింగ్ అవార్డుల 13వ ఎడిషన్ కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. UNFPA (United Nations Population Fund) మద్దతుతో లింగ సున్నితత్వం కోసం లాడ్లీ మీడియా అవార్డులను ప్రకటిస్తుంది. మహిళా సాధికారికత, సమస్యలు, గృహ హింస, పని ప్రదేశాల్లో వేధింపులు తదితర సమస్యలను ప్రింట్‌, ఎలక్ట్రానిక్, డిజిటల్‌, సోషల్‌ మీడియాతో పాటు కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చి లింగ సమానత్వం కోసం కృషి చేసిన మీడియా ప్రతినిధులకు ఈ అవార్డులను అందజేస్తారు. 


అవార్డుల ఎంపిక కోసం కావాల్సిన ప్రమాణాలు
• లింగ వివక్ష విధానాల గురించి అవగాహన కల్పించడం
• లింగ కోణం నుంచి ప్రస్తుత సంఘటనల విశ్లేషణ
• పరిశోధన, ఇతర నివేదికలు, ఇతర కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం
• లింగ సమీకరణాలను పునర్నిర్వచించే వ్యక్తుల ప్రొఫైల్స్ 
• లింగ ఆధారిత హింస నుంచి బయటపడిన వారి అనుభవాలు, ఆందోళనలను తెలియపరచడం  (కేస్ స్టడీస్)

ఎప్పటినుంచి  ఎంట్రీలంటే..
1 జనవరి, 2022 నుంచి 31 డిసెంబర్, 2022 వరకు ప్రచురించబడి / ప్రదర్శింపబడి లేదా ప్రసారం చేయబడి ఉండాలి
 
ఎంట్రీలు 

1. ప్రింట్ మీడియా
2. ఎలక్ట్రానిక్ మీడియా
3. రేడియో
4. వెబ్ నుంచి ఆహ్వానం
దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని భాషలనుంచి ఎంట్రీలు పంపవచ్చు

నిబంధనలు, షరతులు
• అన్ని ఎంట్రీలు కచ్చితంగా అర్హత ప్రమాణాలను అనుసరించాలి
• మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు అవార్డును పొందిన మీడియా వ్యక్తులు అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
• అసంపూర్తిగా లేదా తప్పుగా నింపిన ఎంట్రీ ఫారమ్‌లు పరిగణించబడవు.
• గ్రూప్ నుంచి దరఖాస్తు చేస్తే ఒక ట్రోఫీకి మాత్రమే అర్హత ఉంటుంది

మరిన్ని వివరాలకు Laadli వెబ్ సైట్ సందర్శించండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement