![Honours for Sakshi Saagubadi Rambabu and Sakshi TV Anchor Kishore](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/05/4/saguybadi.jpg.webp?itok=wO0Tupur)
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి డెస్క్ సాగుబడి’ ఇన్‌చార్జి పంతంగి రాంబాబు, సాక్షి టీవీ న్యూస్ కాస్టర్ కిషోర్ హైబిజ్ టీవీ మీడియా పురస్కారాలను అందుకున్నారు. హైటెక్స్‌లో బుధవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో హోం మంత్రి మహమూద్ అలీ నుంచి రాంబాబు ఉత్తమ ప్రింట్ అగ్రికల్చరల్ జర్నలిస్ట్ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఇంటిపంటలు, సిరిధాన్యాల వ్యాప్తి దిశగా ఆయన ప్రతి మంగళవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమయ్యే ‘సాగుబడి’ పేజీని నిర్వహిస్తున్నారు.
సాక్షి టీవీ న్యూస్ కాస్టర్ కిషోర్‌తో పాటు వివిధ పత్రికలు, సోషల్ మీడియా సంస్థలు, శాటిలైట్ చానళ్ల పాత్రికేయులు, ఫొటో, వీడియో జర్నలిస్టులు కూడా పురస్కారాలు అందుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ మార్కెటింగ్ కేఆర్పీ రెడ్డి, ఈవీ నర్సింహారెడ్డి – ఐఏఎస్ (వీసీ–ఎండీ టీఎస్ ఐఐసీ), నరేంద్ర రామ్ నంబుల (సీఎండీ – లైఫ్ స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్), పి.చక్రధర రావు (ప్రెసిడెంట్–ఐపీఈఎంఏ, పౌల్ట్రీ ఇండియా), ఎం.రవీందర్ రెడ్డి (డైరెక్టర్ మార్కెటింగ్–భారతి సిమెంట్స్),వి.రాజశేఖర్ రెడ్డి (జనరల్ సెక్రటరీ–క్రెడాయ్), ఎం.రాజ్‌గోపాల్ (ఎండీ– హై బిజ్ టీవీ, తెలుగు నౌ), డాక్టర్ జె.సంధ్యారాణి (సీఈవో–హై బిజ్ టీవీ, తెలుగు నౌ) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment