26 ఏళ్ల పాటు కారవాన్‌లో బానిసగా..ఏకంగా రూ. 3.75 కోట్లు..! | UK Man Enslaved For 26 Years In Filthy Caravan | Sakshi
Sakshi News home page

ఓ సంపన్న కుటుంబం దాష్టికం..ఏకంగా 26 ఏళ్ల పాటు..!

Aug 7 2024 11:18 AM | Updated on Aug 7 2024 11:33 AM

UK Man Enslaved For 26 Years In Filthy Caravan

సంపన్న కుటుంబాలు బలహీనులను బానిసలుగా చేసుకుని ఇష్టరాజ్యంగా వారిచేత వెట్టిచాకిరీ చేయించుకునేదని కథకథలుగా విన్నాం. అలా బానిసలుగా బంధీలై కొందరూ ప్రాణాలు కూడా కోల్పోయేవారు. అచ్చం అలాంటి దారుణమైన క్రూరత్వానికి ఓ సంపన్న కుటుంబం ఒడిగట్టింది. అందుకుగానే ఏళ్ల పాటు శిక్షలు కూడా అనుభవించింది. చాలామంది న్యాయం పొందేలోపు మరణించగా ఓ వ్యక్తి పరిహారంగా కోట్లు పొందాడు. ఈ దిగ్బ్రాంతికర ఘటన యూకేలో చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే..రెండు దశాబ్దాలుగా రూనీస్‌ అనే సంపన్న కుటుంబ బలహీన వ్యక్తులను తమ బానిసలుగా బంధీలను చూసి ఇష్టారాజ్యంగా వారి జీవితాలతో ఆడుకున్నారు. వారి అవసరాల కోసం వీళ్లని పనివాళ్లగా నియమించుకుని తక్కువ వేతనాలు ఇవ్వడమే గాక క్రూరంగా హింసించేవారు. కొంతమందిని అయితే వారి డిమాండ్లను నెరవేర్చకపోతే చంపేస్తామని బెదిరించేవారు కూడా. అలా వారి చేతిలో బానిసగా బంధీ అయ్యి ఏకంగా 26 ఏళ్లుపాటు మురికి కారావాన్‌లో చిత్రహింసలకు గురైన వ్యక్తికి ఇప్పటకీ న్యాయం లభించింది. 

ఆ సంపన్న కుటుంబం దాష్టికానికి 15 మంది వ్యక్తులు న్యాయం పొందక ముందే మరణించారు. అందుకు గాను 2017లో ఆ రూనీ కుటుంబ సభ్యులు 11 మంది ఏకంగా 79 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. కానీ ఆ బాధితుల్లో ఒకే ఒక్క వ్యక్తి ఎట్టకేలకు న్యాయం జరిగి ఏకంగా రూ. 3.75 కోట్లు నష్టపరిహారం అందుకోనున్నాడు. 

వారి హేయమైన చర్యలు ఆ బాధితుల జీవితాల్లో నీలి నీడల్లా వెంటాడుతూనే ఉండటం బాధకరం. అంతేగాదు సదరు బాధితుడు ఆ ఆర్థిక భద్రతకు తగిన సంరక్షణను పొందే అవకాశం కూడా యూకే ప్రభుత్వం అందించింది. అయితే చాలామంది ఆ బాధితుడు అపరిశుభ్రమైన కార్‌వాన్‌లో అనుభవించిన దారుణమైన నరకానికి ఈ నగదు ఏ మాత్రం సరితూగదని అనడం గమనార్హం.  

(చదవండి: మరణాంతరం భద్రపర్చడానికి ఏకంగా రూ. 1.8 కోట్లు..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement