అమెరికాలోని పోర్ట్‌లాండ్‌లో ఇటీవల ‘రోజ్ ఫెస్టివల్’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఊరూ వాడా ఎటు చూసినా గులాబీల గుత్తులతో జనాల ఊరేగింపులతో పోర్ట్‌లాండ్ హోరెత్తింది. భారీ వాహనాలను పూలతో అలంకరించి ఊరేగింపులు నిర్వహించారు. కొందరు గుర్రాలపై పూల అలంకరణలో కనువిందు చేశారు. ఆడా మగా, పిల్లా పెద్దా తేడా లేకుండా పెద్దసంఖ్యలో జనాలు ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఏటా మే నెలాఖరు నుంచి జూన్ రెండో వారం వరకు జరిగే ఈ ఊరేగింపు పోర్ట్‌లాండ్‌కి ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది. ఈసారి ఈ వేడుకల్లో దాదాపు పన్నెండు లక్షల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గులాబీల ప్రదర్శన, అందాల పోటీలు, సంప్రదాయ నృత్య సంగీత కార్యక్రమాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి.
(చదవండి: ఆటిజం ఉన్నా ఐక్యూలో ఘనం! 12 ఏళ్లకే మాస్టర్స్ డిగ్రీ)
Comments
Please login to add a commentAdd a comment