rose flowers
-
తరం నుంచి తరానికి దేశానికో సంస్కృతి
ప్రాంతాలు, జాతుల వారీగా తరతరాలుగా వస్తున్న ఆచారాలను ఎప్పటికీ వదులుకోలేరు. దేశ దేశాల్లో వేల ఏళ్లుగా వస్తున్న సంస్కృతిలో వారి మనుగడ కూడా ఉండటం విశేషం. తమ ఆచారాలను ముందు తరాలకూ పరిచయం చేస్తూతమ కమ్యూనిటీ సంప్రదాయాన్ని బతికించుకుంటున్నారు. ఈ సంప్రదాయాలన్నీ యునెస్కో వారసత్వ సంపదలోకి చేరి, ఆ దేశాల గొప్పతనాన్ని చాటుతున్నాయి. సౌదీ అరేబియాలోని తైఫ్ ప్రాంతంలో గులాబీ తోటలను విరివిగా సాగు చేస్తారు. ఇక్కడి సామాజిక, మతపరమైన ఆచారాలలో అంతర్భాగంగానూ, ముఖ్యమైన ఆదాయ వనరగానూ ఉంటుంది. మార్చిలో ప్రారంభమయ్యే పంట కాలంలో రైతులు, వారి కుటుంబాలు తెల్లవారుజామున గులాబీలను ఎంచుకొని స్థానిక మార్కెట్‌కు విక్రయించడానికి వెళతారు. కొన్ని కమ్యూనిటీలు ఈ గులాబీలతో సౌందర్య ఉత్పత్తులు, సాంప్రదాయ ఔషధం, ఆహారం, పానీయాలలో రోజ్ వాటర్, నూనెను తయారుచేస్తాయిజపాన్లో కోజి అచ్చుతో సాకే తయారీజపాన్లో పవిత్రమైన బహుమతిగా భావించే పానీయం ఒకటుంది. దానిపేరు సాకే. గింజలు, నీటితో తయారు చేసే ఆ ఆల్కహాలిక్ పానీయం జపాన్ లో పండుగలు, వివాహాలు, ఆచారాలు, ఇతర సామాజిక సాంçస్కృతిక సందర్భాలలో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. జపనీస్ సంస్కృతిలో భాగమై΄ోయిన ఈ పానీయం పిండి పదార్ధాలను చక్కెరగా మార్చడానికి కోజి అచ్చును ఉపయోగిస్తారు. ఈ అచ్చును హస్తకళాకారులు తయారు చేస్తారు. వీటిలో పదార్ధం దీనికి అవసరమైన ఉష్ణోగ్రత అందేలా జాగ్రత్తలు తీసుకుంటారు. సిరియాలోని అలెప్పో ఘర్ సబ్బు కళఆలివ్ నూనె, లారెల్ ఆయిల్‌ను ఉపయోగించి సిరియాలో సబ్బు తయారుచేస్తారు. కొంతమంది కలిసి చేసే ప్రక్రియలో తరతరాల అనుభవం ఉంటుంది. ముందుగా పదార్థాలను ఎంపిక చేసి వండుతారు. ఆపై సంప్రదాయ సబ్బు మిశ్రమాన్ని కలిపి, మిద్దెలపైన ΄ోస్తారు. మిశ్రమం చల్లబడిన తర్వాత హస్తకళాకారులు పెద్ద చెక్క బూట్లు ధరించి, తగిన పరిమాణంలో కత్తిరిస్తారు. ఆ తర్వాత ఆ సబ్బులను చేతితో స్టాంప్ చేసి, వరుసగా పేర్చుతారు.ఉత్తర ఆఫ్రికా హెన్నా ఆచారాలుఉత్తర ఆఫ్రికా, మధ్య్ర ప్రాచ్యంలోని కమ్యూనిటీలు గోరింటాకు తోటలను సాగుచేస్తారు. హెన్నా పేస్ట్‌ను సాధారణంగా మహిళల అలంకారానికి ఉపయోగిస్తారు. ఇది ఆనందానికి చిహ్నం, దైనందిన జీవితంలో, పుట్టినరోజులు, వివాహాల వంటి పండుగ సందర్భాలలో ఉపయోగించబడుతుంది. దీని ఉపయోగం శతాబ్దాల నాటి సామాజిక నియమాలు, సంప్రదాయాలతో ముడిపడి ఉంది.థాయిలాండ్ టోమ్యుమ్ కుంగ్ సూప్టోమ్యుమ్ కుంగ్ అనేది థాయిలాండ్‌లో ఒక సంప్రదాయ రొయ్యల సూప్. మూలికలతో ఉడకబెట్టి, స్థానిక మసాలా దినుసులను కలిపి ఈ రొయ్యల సూప్‌ను రుచిగా తయారుచేస్తారు. సూప్ ఒక విలక్షణమైన వాసన, శక్తివంతమైన రంగులను కలిగి ఉంటుంది. తీపి, పులుపు, కారం, క్రీము, కొద్దిగా చేదు వంటి అనేక రుచులను మిళితం చేస్తుంది. ఈ వంటకం ముఖ్యంగా వర్షాకాలంలో శక్తిని, ఆరోగ్యాన్నిప్రోత్సహిస్తుందని నమ్ముతారు. ఇది థాయిలాండ్‌లోని సెంట్రల్ ప్లెయిన్స్‌లోని బౌద్ధ నదీతీర సమాజాల పాక జ్ఞానం, పర్యావరణం, ఔషధ మూలికల గురించి వారి సాంప్రదాయ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. గుడ్లను అలంకరించే కళఉక్రెయిన్, ఎస్టోనియాలో మైనాన్ని ఉపయోగించి గుడ్డుకు సాంప్రదాయ నమూనాలు, చిహ్నాలను తీసుకువస్తారు. గుడ్లను అలంకరించే ఈ కళ ఈస్టర్‌తో అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ, మతంతో సంబంధం లేకుండా ఉక్రేనియన్ కమ్యూనిటీలకు ఈ సంప్రదాయాన్ని పాటిస్తుంటారు. (చదవండి: మాంసం ముట్టని వెజిటేరియన్ విలేజ్! అక్కడంతా శాకాహారులే..!) -
ముళ్లు లేని గులాబీలు.. కానీ..?
గులాబీలు అందంగా ఉన్నా, వాటి కొమ్మలకు ముళ్లు ఉంటాయి. ముళ్లు గుచ్చుకోకుండా మొక్క నుంచి గులాబీలు కోయడం కొంత కష్టమే! ఈ కష్టాన్ని తొలగించడానికి అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ముందుకొచ్చి, ముళ్లులేని గులాబీలను సృష్టించే ప్రక్రియను కనుగొన్నారు. గులాబీలు సహా వివిధ మొక్కల్లో పూలు, కాయలు కాసే కొమ్మలకు ముళ్లు ఏర్పడటానికి కారణమైన జన్యువును కనుగొన్నారు.ఈ జన్యువుకు వారు ‘లోన్లీ గై’ (ఎల్ఓజీ) అని పేరు పెట్టారు. గులాబీలు సహా ఇరవై జాతుల మొక్కల్లో ముళ్లు ఏర్పడటానికి ఈ జన్యువే కారణమవుతోందని గుర్తించారు. అటవీ ప్రాంతాల్లో పెరిగే వంకాయలకు ముళ్లు ఉంటాయి. తోటలు, పొలాల్లో పెంచే వంకాయలకు ముళ్లు ఉండవు. అటవీ ప్రాంతాల్లోని వంకాయల నుంచి పొలాలు, తోటల్లో పెంచే వంకాయ జాతులు వేరుపడి వేలాది సంవత్సరాలు గడిచిపోయాయి.ఈ సుదీర్ఘకాలంలో సంభవించిన జన్యు ఉత్పరివర్తనల వల్ల పొలాలు, తోటల్లో పెంచే వంకాయల్లో ముళ్లు వాటంతట అవే అంతరించిపోయాయి. మరికొన్ని రకాల ముళ్ల మొక్కల్లోనూ వేరుపడిన జాతుల్లో ముళ్లు అంతరించాయి. కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల జన్యుమార్పిడి ద్వారా కొన్ని రకాల ఎడారి మొక్కల్లో ముళ్లను మాయం చేయగలిగారు. ఇదే పద్ధతిలో గులాబీలను కూడా ముళ్లు లేకుండా పూయించవచ్చని వారు చెబుతున్నారు. ముళ్లులేని గులాబీల సృష్టి కోసం చేయవలసిన జన్యుమార్పిడి పద్ధతిని వివరిస్తూ వారు సమర్పించిన పరిశోధన వివరాలను ఇటీవల ‘సైన్స్’ జర్నల్ ప్రచురించింది. కళకళలాడే పూలచెట్లతో పెరటి తోటలను పెంచుకునేవారికి ఇది శుభవార్తే! -
గులాబీ రేకులతో స్వీట్ : బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు
గులాబీ పువ్వులు సౌందర్య పోషణ ఉత్పత్తుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. గులాబీ రేకులతో తయారు చేసిన గుల్కంద్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆయుర్వేదం చెబుతోంది.గుల్కంద్ అనే పదం గుల్ నుండి వచ్చింది. దీని అర్థం పెర్షియన్ భాషలో 'పువ్వు' అరబిక్‌లో 'కంద్' అంటే 'తీపి'. ముఖ్యంగా ఈ వేసవిలో గులాబీ రేకుల జామ్ లేదా గుల్కంద్ వల్ల ఒంటికి చలవ చేస్తుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఫిట్‌గా ఉంచే అద్భుతమైన టానిక్‌లా పనిచేసే గుల్కంద్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు.. లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు శుభ్రంగా కడిగి ఆరబెట్టిన గులాబీ రేకులు వెడల్పుమూత ఉన్న గాజు సీసా, లేదా జార్ యాలకులు గులాబీ రేకులను బాగా ఎండబెట్టాలి. ఎండిన వాటిని ఒక గాజు సీసాలో వేసి, దానికి కొద్దిగా చక్కెర, యాలకుల పొడి కలుపుకోవాలి. గాజు సీసాను ప్రతిరోజూ దాదాపు ఏడు గంటలపాటు ఎండలో ఉంచాలి. మళ్లీ రాత్రికి చెక్క స్పూన్‌తో లేదా తడిలేని గరిటెతో బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా దాదాపు నెల రోజుల పాటు ఇలా చేయాలి. దీంతో జామ్‌లాగా ఇది తయారవుతుంది. దీన్ని పలు రకాల స్వీట్లలో వాడతారు. అలాగే ఫ్రూడ్ సలాడ్లలో వాడవచ్చు. కాస్త చల్లటి పాలు తీసుకుని అందులో ఒక చెంచా గుల్కంద్ వేసి తాగవచ్చు. అలాగే దీన్ని నేరుగా లేదా తమలపాకులతో కూడా తినవచ్చు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఈ గులాబీ గుల్కంద్ ఆయుర్వేద ప్రకారం పిత్త దోషాలకు చాలా మంచిది. వేడిని పుట్టిస్తుంది. చల్లగా ఉండేలాగా కూడా పనిచేస్తుంది దద్దుర్లు, నొప్పులు ,నొప్పులు వంటి వేడి-సంబంధిత లక్షణాలను తగ్గిస్తుంది , అరికాళ్ళు అరచేతులలో ఏవైనా మంటలను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తి కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇది కాలక్రమేణా కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అందుకే దీన్ని తాంబూలంలో కూడా ఎక్కువగా వాడతారు. రక్తహీనతను నివారిస్తుంది, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారికి ఇది చాలా మంచిది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది కప్పు పాలలో వేసి రాత్రిపూట తాగితే ప్రశాంతమైన నిద్ర పడుతుంది చర్మం త్వరగా ముడతలు పడకుండా నివారిస్తుంది. మొటిమల మచ్చలను కూడా తగ్గిస్తుంది. గుల్కంద్ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తీవ్రమైన అల్సర్లు, మలబద్ధకం, గుండె మంట సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. వేసవిలో గుల్కంద్ వాడటం వల్ల వడదెబ్బ, ముక్కు కారటం, తలతిరగడం వంటివి నివారించవచ్చు. బహిష్టు సమయంలో అధిక రక్తస్రావానికి గుల్కంద్ మంచిది. ముఖ్యంగా పీసీఓడీతో బాధపడుతున్న వారికి ఇది చాలా మంచిది. థైరాయిడ్‌తో బాధపడేవారు కూడా ఈ జామ్ని చక్కగా తీసుకోవచ్చు -
ఎండిన గులాబీ పూలు కూడా ఔషదాలలో వాడుతారు
-
గులాబీ సాగు లాభదాయకం
-
రోజ్ ఫెస్టివల్..ఎటు చూసిన గూలబీ పూల గుత్తులే..!
అమెరికాలోని పోర్ట్‌లాండ్‌లో ఇటీవల ‘రోజ్ ఫెస్టివల్’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఊరూ వాడా ఎటు చూసినా గులాబీల గుత్తులతో జనాల ఊరేగింపులతో పోర్ట్లాండ్ హోరెత్తింది. భారీ వాహనాలను పూలతో అలంకరించి ఊరేగింపులు నిర్వహించారు. కొందరు గుర్రాలపై పూల అలంకరణలో కనువిందు చేశారు. ఆడా మగా, పిల్లా పెద్దా తేడా లేకుండా పెద్దసంఖ్యలో జనాలు ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏటా మే నెలాఖరు నుంచి జూన్ రెండో వారం వరకు జరిగే ఈ ఊరేగింపు పోర్ట్‌లాండ్‌కి ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది. ఈసారి ఈ వేడుకల్లో దాదాపు పన్నెండు లక్షల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గులాబీల ప్రదర్శన, అందాల పోటీలు, సంప్రదాయ నృత్య సంగీత కార్యక్రమాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. (చదవండి: ఆటిజం ఉన్నా ఐక్యూలో ఘనం! 12 ఏళ్లకే మాస్టర్స్ డిగ్రీ) -
గుచ్చదు.. ఈ గులాబీ, లిసియాంతస్ పూలతో లాభాల గుబాళింపు
తాడేపల్లిగూడెం: లిసియాంతస్.. ముళ్లులేని గులాబీ పువ్వు. నీలం.. ఆకుపచ్చ.. పసుపు.. గులాబీ.. తెలుపు.. నీలం.. పికోటీ.. చాంపేన్. ఎన్నెన్నో రంగుల్లో ఉండే ఈ లిసియాంతస్ పువ్వుల్ని చూస్తే కళ్లు ఆనందంతో విప్పారతాయి. చూపు తిప్పనివ్వని సౌందర్యం వాటి సొంతం. ఏక రేకలైనా.. బహురేకలైనా.. ఆ పుష్పాల అందాలు మనసుల్ని దూదిపింజలా మార్చేస్తాయి. స్వప్నలోకంలో విహరింపజేస్తాయి. లిసియాంతస్ పువ్వులు గులాబీ పూలను పోలి ఉంటాయి కానీ.. వీటికి ముళ్లు మాత్రం ఉండవు. రెండు నుంచి మూడు వారాలకు పైగా వాడిపోవు. వీటి సాగు ప్రయోగం మన రాష్ట్రంలో ఫలిస్తే.. కృషీవలులకు లాభాల గుబాళింపేనంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన వర్సిటీ ఉప కులపతి డాక్టర్ తోలేటి జానకిరామ్. ఈ పూల విశేషాలేమిటో.. సాగు ప్రయోగం ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దామా. సమ శీతోష్ణ వాతావరణంలోనూ.. లిసియాంతస్ సాగుకు శీతల వాతావరణం అవసరం. సమశీతోష్ణ వాతావరణంలోనూ లిసియాంతస్ పెరుగుతుందని రుజువు కావడంతో రావడంతో రక్షిత సాగు పద్ధతిలో హైటెక్ పాలీహౌస్, ఫ్యాన్, పాడ్ పాలీహౌస్, కూలింగ్, మిస్ట్ చాంబర్లలో వీటిని పెంచుతున్నారు. తమిళనాడులోని ఊటీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లోనూ ఇప్పటికే వీటిని సాగు చేస్తున్నారు. పాలీ హౌస్‌లలో సాగు చేసే ఈ పుష్పాలకు వాణిజ్య విలువలు అధికం. ఎగుమతికి అనుకూలమైనవి. అందుకే.. ఇది మంచి లాభదాయకమైన ఉద్యాన పంట. మన దగ్గరా కొన్ని ప్రాంతాలు అనుకూలమే! గులాబీ మాదిరిగా అంటు పద్ధతిలో కాకుండా విత్తనాలు చల్లి సాగు చేసుకోవచ్చు. వీటి సాగుకు మన రాష్ట్రంలోనూ కొన్ని ప్రాంతాల వాతావరణం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక విత్తన కంపెనీ ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని ఉద్యాన పరిశోధన స్థానం ద్వారా ప్రయోగాత్మకంగా సాగు చేయించేందుకు వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం సమాయత్తమవుతోంది. గతంలో చింతపల్లి కేంద్రంలో సిమ్లా యాపిల్‌ను ప్రయోగాత్మకంగా పండించారు. లిసియాంతస్ సాగుకు ఈ పరిశోధన స్థానం బాగుంటుందని సకాటా సీడ్స్ సంస్థ ప్రతినిధులు గుర్తించారు. అరుదైన ఆర్కిడ్స్ పూల సాగు కోసం ఈ కేంద్రంలో విశిష్ట రక్షిత సాగు కేంద్రం ఉంది. ఇక్కడే లిసియాంతస్ పువ్వుల సాగుకు త్వరలో శ్రీకారం చుట్టడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే గత నెలలో ఉద్యాన వర్సిటీలో ఉప కులపతి డాక్టర్ జానకిరామ్ పర్యవేక్షణలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ మెన్ అసోసియేషన్, పాలీహౌస్ ప్రతినిధులతో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ పూల సాగుపై ఔత్సాహిక రైతులకు రైతులకు అవగాహన కల్పించారు. ప్రేమకు ప్రతీకగా.. ప్రపంచంలోనే అందమైన పువ్వులుగా పేరున్న లిసియాంతస్ పుష్పాలను ప్రేమకు ప్రతీకగా భావిస్తారు. జెంటియన్ కుటుంబానికి చెందిన ఈ పువ్వును టెక్సాస్ బ్లూబెల్గా కూడా పిలుస్తారు. ఇకో, డబులిని, రోసిత, ఎక్స్కలిబర్, మరయాకి, రోసిత రోసన్నో, వోయేజ్, అబూ రోసిత పేర్లతోనూ లిసియాంతస్ను పిలుస్తున్నారు. బొకేలు, పూల అలంకరణకు అనుకూలమైన ఈ పుష్పాలు పువ్వులు ఏక, బహుళ రేకలతో గులాబీ, కామేలియా ఆకారంలో వైవిధ్యంగా ఉంటాయి. ఆసియా ఖండంలో 50 ఏళ్ల క్రితమే ప్రాచుర్యం పొందిన ఈ పువ్వులు మృదువైన రేకలతో అలరిస్తాయి. ఒకటి లేదా రెండు మూడు జతల నారు మొక్కలను కలిపి నాటుకోవచ్చు. నేల శుద్ధీకరణ, ఆవిరి శుద్ధీకరణ, హాట్ వాటర్ స్టెరిలైజేషన్ పద్ధతిలో నారు తయారీకి సమాయత్తం కావచ్చు. వీటికి ఎక్కువ ఎరువులు అవసరం లేదు. కాల్షియం నైట్రేట్ ఆధారిత ఎరువులు స్వల్పంగా వాడితే చాలు. త్వరలోనే ప్రయోగాలు అపురూపమైన లిసియాంతస్ పువ్వులను వాడుకలోకి తెచ్చే క్రమంలో వీటి సాగుకు ప్రయత్నాలు ప్రారంభించాం. ఇందుకు సంబంధించి సకాటా సీడ్స్ సంస్థతో కలిసి రైతులకు అవగాహన కార్యక్రమం చేపట్టాం. వీటి సాగుకు చింతపల్లి పరిశోధన స్థానం అనుకూలమని సీడ్స్ సంస్థ ప్రతినిధులు పరిశీలనకు వెళ్లి వచ్చిన తర్వాత చెప్పారు. పుష్పాల సైకిల్‌ను పరిశీలించడానికి ప్రయోగం చేయనున్నాం. ఈ ప్రయత్నం విజయవంతమైతే రైతులకు లాభాల పంట అందుబాటులోకి వస్తుంది. –డాక్టర్ తోలేటి జానకిరామ్, వైస్ చాన్సలర్, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ -
మీ గార్డెన్లో గులాబీలు విరగ బూయాలంటే?
ఉదయం లేవగానే బాల్కనీలోని మొక్కల పచ్చదనం చూస్తే భలే హాయిగా ఉంటుంది కదా. మరి అరవిచ్చిన మందారమో, విచ్చీవిచ్చని రోజా పువ్వు మొగ్గలు పలకరిస్తేనో.. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. పువ్వుల్లో రాణి స్థానం గులాబీదే. రెడ్, వైట్, ఎల్లో, పింక్, ఆరెంజ్, బ్లూ , గ్రీన్, బ్లాక్ రంగుల్లో గులాబీలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. గ్లాడియేటర్, సర్పంచ్, డబుల్ డిలైట్ కలర్, హైబ్రీడ్, మార్నింగ్ గ్లోరీ, సన్‌సెట్, కశ్మీర్, కాకినాడ, రేఖ, ముద్ద, తీగజాతి ఇలా పలు రకాల గులాబీలున్నాయి. అయితే నర్సరీనుంచి తెచ్చినపుడు మొగ్గలతో కళకళలాడుతూండే గులాబీ మొక్క మన గార్డెన్లో నాటిన తరువాత మొగ్గలు వేయడం మానేస్తుంది. ఆరోగ్యంగా ఎదగదు. ఒకవేళ మొక్క బాగా విస్తరించినా, పెద్దగా పూలు పూయదు. దీనికి కారణంగా మొక్కకు అవసరమైన పోషకాలు అందకపోవడమే. మరి ఏం చేయాలి. చక్కగా గుత్తులుగా గుత్తులుగా పూలతో మన బాల్కనీలోని గులాబీ మొక్క కళ కళలాడాలంటే ఏం చేయాలి. సేంద్రీయంగా ఎలాంటి ఎరువులివ్వాలి లాంటి వివరాలు తెలుసుకోవడం అవసరం. (Almonds Benefits: బాదాం ఎలా తింటే మంచిది? పోషకాలు పుష్కలంగా లభించాలంటే?) పెరటి తోటల్లో చిన్న చిన్న కుండీలలో పెంచే మొక్కలు ఏపుగా ఎదగాలన్నా, పువ్వులు విరగ బూయాలన్నా కిచెన్ కంపోస్ట్ ఎరువు, వర్మీ కంపోస్ట్ ఎక్కువగా ఉపయోగ పడతాయి. వీటితోపాటు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఫలితాలనిస్తాయి. ఫెర్మింటెడ్ ఫ్రూట్స్, బెల్లంతో కలిపి పులియ బెట్టిన పళ్లు, లేదా తొక్కలు ద్వారా తయారు చేసుకున్న లిక్విడ్ ఫెర్టలైజర్స్ వాడటం వల్ల వచ్చే ఫలితాలను గమనిస్తే ఆశ్చర్య పోక తప్పదు. మొక్కలకు నత్రజని, భాస్వరం, పొటాషియం మూడు పోషకాలలో చాలా. అవసరం. వీటన్నింటిలోకి రాణి లాంటిది ముఖ్యంగా గులాబీ మొక్కలకు బాగా ఉపయోగపడేది అరటి పళ్ల తొక్కలతో చేసే ఎరువు. ఈ లిక్విడ్‌ను మొక్కలకిచ్చిన వారంరోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది. నైట్రోజన్ ఇతర రూపాల్లో లభించినప్పటికీ ముఖ్యమైన పొటాషియం అరటి తొక్కల ఫెర్టిలైజర్ ద్వారా లభిస్తుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. బనానా పీల్ ఫెర్టిలైజర్ బాగా మగ్గిన అరటి పళ్ల తొక్కలను తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని, గిన్నెలోకి తీసుకొని ముక్కలు మునిగేలా నీళ్లు పోసుకోవాలి. దీన్ని రెండు మూడు పొంగులు వచ్చే దాకా మరిగించుకోవాలి. బాగా చల్లారిన తరువాత ఆ మిశ్రమాన్ని వడపోసుకుని కుండీకి ఒక కప్పు చొప్పున గులాబీ మొక్క మొదట్లో పోసుకోవాలి. పెద్ద కుండీ అయితే కొంచెం ఎక్కువ పోసుకున్నా ప్రమాదమేమీలేదు. కానీ మొక్కకిచ్చిన ఫెర్టిలైజర్ బయటికి పోకుండా చూసుకోవాలి. అంటే మనం అందించిన పోషకం మొత్తం వృధాకా కుండా మొక్క కందేలా చూసుకోవాలన్నమాట. వారం రోజుల్లో కొత్త చిగుర్లు, చిగుర్లతోపాటు కొత్తబడ్స్ మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. మరొక విధానంలో ముక్కలుగా కట్ చేసిన అరటి పళ్ల తొక్కల్ని 24 గంటలపాటు నీళ్లలో నానబెట్టి, ఆ తరువాత ఆ నీరును మొక్కలకు వాడవచ్చు. ఏ మొక్కకైనా పూత పిందె దశలో ఈ ఫెర్టిలైజర్‌ను అందిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే అరటి తొక్కలను మొక్క మొదట్లో పాతిపెట్టినా ఉపయోగమే.సేంద్రీయంగా పండించిన అరటి పళ్ల తొక్కలను ఉపయోగిస్తే మరీ మంచిది. పొటాషియం మొక్కలు కాండాన్ని బలంగా చేయడమే కాదు, వ్యాధుల నుండి రక్షిస్తుంది. పుష్పించే ప్రక్రియ వేగవంతం చేస్తుంది. పండ్ల మొక్కల్లో పండ్ల నాణ్యతను మెరుగు పరుస్తుంది. కాల్షియం, పొటాషియం, మాంగనీసు లాంటివాటికి అద్భుతమైన మూలం అరటి తొక్కలు. ఇవి మొక్కలు ఎక్కువ నత్రజనిని తీసుకోవడానికి, కిరణజన్య సంయోగ క్రియకు సహాయపడతాయి. -
సోనాల్‌కు సచిన్, శ్రద్ధా, విజయ్ ప్రశంసలు
గులాబీ గుబాళిస్తోంది. సరికొత్త సొబగులతో అతిథులకు ఆహ్వానం పలుకుతోంది. వాటిని అందుకునే ప్రముఖులను ఆకర్షిస్తోంది. రోజా పువ్వులతో ప్రత్యేకమైన ‘ఫ్లవర్వలీ’ బొకేలు రూపొందిస్తున్న నగర యువతి సోనాల్ అగర్వాల్ అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించింది. ఆమెరూపొందించిన బొకేలకు ఎంతోమంది ప్రముఖులు ఫిదా అయ్యారు. అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. మైండ్ బ్లోయింగ్ వావ్.. ఈ ఫ్లవర్స్ భలే ఉన్నాయి. మైండ్‌బ్లోయింగ్ అనిపించే ఇలాంటి ఫ్లవర్స్‌ని నేనింతవరకూ చూడలేదు. సిటీకి వచ్చిన సందర్భంగా ఈ పూలతో నాకు గ్రాండ్ వెల్కమ్ పలికినందుకు సంతోషిస్తున్నాను. ఇవి మా ఇంట్లోఅందరికీ కనిపించేలా ఏర్పాటు చేస్తాను. – సచిన్ టెండూల్కర్ సాక్షి, సిటీబ్యూరో: గులాబీ పూలు గుసగుసలాడుతున్నాయి. మనసున రోజాపూల మాలలూగిస్తున్నాయి. గులాబీ బాలలు గుబాళిస్తున్నాయి. అందాల విరులు సిరులొలికిస్తున్నాయి. పుష్పశోభితమై విశ్వ రాగరంజితమవున్నాయి. మనలోని భావాలకు వారధి పువ్వు. పడతుల వాల్జెడలో పువ్వు. పరమాత్ముడి పూజకు పువ్వు. వన్నెలొలికే వెన్నెలరాగం పువ్వు. ఆనంద నందనం పువ్వు. అనుబంధాల చందనం పువ్వు. పరిమళాల గుబాళింపు పువ్వు.. ఇలా పుష్పాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఆ పుష్ప సమాగమానికి సరికొత్త సొబగులు అద్దుతూ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతినార్జిస్తోంది నగర యువతి సోనాల్ అగర్వాల్. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సహా ఎంతోమంది ప్రముఖులు ఆమెను అభినందనల్లో ముంచెత్తడం విశేషం. సోనాల్ అగర్వాల్ రూపొందించిన ‘ఫ్లవర్వలీ’ బొకేలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫంక్షన్, పార్టీ, ప్రపోజ్ ఏదైనా సరే వీటితో ఫిదా కావడం ఖాయం. అంతేకాకుండా ఇవి విదేశాల్లో సైతం ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. ‘ఫ్లవర్వలీ’ బొకేల రూపకల్పనకు ఆలోచన ఎలా అంకురించింది. వీటి కథాకమామిషుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం అంకురార్పణ ఇలా.. మియాపూర్‌నకు చెందిన సోనాల్ అగర్వాల్ హెమ్స్టెక్లో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసింది. ఆమెకు బిజినెస్‌పై ఎంతో ఆసక్తి. కళాశాల రోజుల్లోనే స్నేహితులతో కలిసి ఆర్టిస్ట్ షాఫీని ఏర్పాటు చేసింది. హ్యాండ్ మేడ్ జ్యువెలరీ, గ్రీటింగ్ కార్డ్స్, రకరకాల గిఫ్ట్ ఆర్టికల్స్ రూపొందించేది. ఇదే సమయంలో పూలపై ప్రింటింగ్ వేయాలనే ఆలోచన వచ్చింది. అలా ఎంటోజింగ్ ప్రింట్‌ని మొదలుపెట్టి.. యూనిక్ గిఫ్ట్ ఆర్టికల్స్, గ్రీటింగ్ కార్డ్స్ రూపొందిస్తూ.. ఫ్రెండ్స్ బంధువులకు ఇస్తుండేది. సిటీ టు ఇంటర్నేషనల్ గులాబీలతో ప్రత్యేకంగా తయారైన ఈ ఫ్లవర్స్ అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాం. మన సిటీతో పాటు న్యూయార్క్, ఇంగ్లాండ్, నెదర్లాండ్, సింగపూర్ వంటి ప్రాంతాల్లో నివసించే ప్రవాస భారతీయులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి ఫ్లవర్స్‌ని అక్కడి వారికి ఇచ్చి సర్ప్రైజ్ చేస్తున్నారు. ఇన్‌స్ట్రాగామ్ వేదికగా ఈ ఫ్లవర్స్‌ను విక్రయిస్తున్నాం. సిటీకి వచ్చిన సెలబ్రిటీలకు నేను ఈ ఫ్లవర్స్నే గిఫ్టŠస్‌గా ఇస్తుంటాను.– సోనాల్అగర్వాల్ కళ్లు మిరుమిట్లుగొలిపేలా.. ‘ఇంత చూడచక్కని, కళ్లు మిరుమిట్లుగొలిపే పువ్వులు ఎంతో బాగున్నాయి. ఇలాంటివి నాకెంతో ఇష్టం. నా మనసుకు నచ్చిన పూలను గిఫ్ట్‌గా ఇచ్చినందుకు ‘ఫ్లవర్వలీ’కి థ్యాంక్స్. నాకు బాగా నచ్చాయి కాబట్టి నేను నా ఫ్రెండ్ సర్కిల్‌కు ఈ ఫ్లవర్స్‌ని రిఫర్ చేస్తా.– శ్రద్ధాకపూర్, బాలీవుడ్ నటి డెకరేషన్స్.. గిఫ్ట్స్ చూడచక్కని ఈ ఫ్లవర్స్‌తో పెద్ద పెద్ద పార్టీలకు డెకరేషన్స్ కూడా చేస్తుంది సోనాల్. సిటీతో పాటు ముంబయి, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో జరిగే పెద్ద పెద్ద పార్టీలకు రోజా పూలతో డెకరేట్ చేయడం విశేషం. సిటీకి వచ్చిన సెలబ్రిటీలకు ఈ ఫ్లవర్స్‌ని ఇస్తూ వెల్కం పలుకుతున్నారు. ప్రధాని మోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, శ్రద్ధా కపూర్, సోనాక్షి సిన్హా, విజయ్ దేవరకొండ, రీతూవర్మ, రవీనా టాండన్, పింకిరెడ్డి వంటి వారు ఈ ఫ్లవర్స్‌ను అభినందించడం విశేషం. ఎనిమిది రకాలు.. హాలండ్ నుంచి దిగుమతి చేస్తున్న రోజ్ పూలు చాలా ప్రత్యేకం. వీటిలో ప్రధానంగా ‘రెడ్, వైట్, పర్పుల్, వైలెట్, బ్ల్యూ, బ్లాక్, ఎల్లో, పింక్, రెయిన్బో’ వంటి రంగుల పూలు ఉండటం విశేషం. వీటితో బొకేలను రూపొందిస్తారు. వీటిని హ్యాండీక్రాఫ్టెడ్ బాక్స్‌లో అమర్చుతారు. ఫ్లవర్వలీ పూసింది.. గత ఏడాది బంజారాహిల్స్ రోడ్‌నంబర్–1లో ‘ఫ్లవర్వలీ’ పేరుతో బిజినెస్‌ని స్టార్ట్ చేసింది సోనాల్ అగర్వాల్. హాలండ్, ఈక్విడార్, నెదర్లాండ్స్ వంటి ప్రాంతాల నుంచి రోజా పువ్వులను దిగుమతి చేసుకోవడం.. ఇక్కడ ప్రత్యేకంగా వాటితో బొకేల తయారీని ప్రారంభించింది. ప్రస్తుతం సోనాల్ రెండు రకాల ఫ్లవర్స్, ఫ్లవర్ బొకేలను అందిస్తోంది. ఒకటి తాజా..రెండోది ఇనిఫినిటీ. రెండోది ఎంతకాలమైనా ఉంటుంది. సాధారణంగా పూలు రెండు రోజుల పాటు వాడకుండా ఉంటాయి. కానీ.. ఈ పుష్పాలు నాలుగైదు రోజులైనా వాడిపోవు. ఇందుకోసం ఫ్లవర్వుడ్ నీళ్లలో వాటిని కలుపుతారు. ఇనిఫినిటీకి ఉపయోగించే పుష్పాలు ప్రాసెసింగ్‌కు పేటెంట్ ఉంది. సహజమైన నూనెల్లో ప్రిజర్వ్ చేస్తారు. ప్రొడక్షన్, ప్రిజర్వేషన్‌కు మొత్తం నెల రోజుల సమయం పడుతుంది. -
'రోజ్' ఇలాగే వెళ్లండి
గుంటూరు(లక్ష్మీపురం) : ఆదివారం మధ్యాహ్నం. నగరంలోని వాహనాలు హడావుడిగా ముందుకు కదులుతున్నాయి. లక్ష్మీపురం ప్రధాన కూడలి వద్ద ట్రాఫిక్ సిబ్బంది ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. తలకు హెల్మెట్, వాహనాలకు పత్రాలు ఉన్నా ఎందుకో కొద్దిగా అనుమానంతో బ్రేక్‌పై కాలు పడింది. అనుకున్నట్లుగానే ట్రాఫిక్ సిబ్బంది వాహనాలను ఆపారు. కాగితాలు ఎక్కడ అని గట్టిగా ప్రశ్నించే గొంతులు.. ఈ సారి మౌనంగానే ఉన్నాయి. చేతిలో గులాబీతో మోముపై చిరునవ్వులు చిందించాయి. ‘వెరీ గుడ్.. ఇలాగే హెల్మెట్ ధరించాలి’ అంటూ భుజం తట్టాయి. ప్రయాణికుల్లో ఎక్కడలేని ఆనందం. ఈసారి ఎక్సలేటర్‌పై కాలు పడడంతో వాహనాలు రయ్యిమంటూ దూసుకెళ్లాయి. అర్బన్ ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీఎస్పీ పాపారావు ఆధ్వర్యంలో నగరంలోని పలు కూడళ్లతో ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ధారణతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ గులాబీలు పంచారు. హెల్మెట్ లేకుంటే కలిగే అనర్థాలపై హెచ్చరించారు. కార్యక్రమంలో ఈస్ట్ ట్రాఫిక్ సబ్ డివిజన్ సీఐ పూర్ణచంద్రరరావు, ఎస్సైలు రాజకుమారి, శివరామకృష్ణయ్య, జేఆర్ మోహన్‌రావు, కే సత్యనారాయణ పాల్గొన్నారు. -
రంగుల రోజా
రామభద్రపురం (బొబ్బిలి) : ఊసరవల్లిలా రంగులు మార్చుతున్న పుష్పం‘గులాబీ పువ్వై నవ్వాలి వయసు.. జగాన వలపే నిండాలిలే’ అయు ఒక కవి రాశాడు. ప్రేమజంటల చేతిలో ఈ పూలను చూస్తుంటాం.. అసలు గులాబీ పువ్వుని ప్రేమించకుండా.. ఆరాధించకుండా ఎవరుంటారు. అరవిరిసిన గులాబీ వర్ణం అద్భుతం.. అది విభిన్న వర్ణాలను సంతరించుకుంటే అపూర్వం. అలాంటి గులాబీ రామభద్రపురం చొక్కాపువీధిలోని చొక్కాపు సత్యవతి ఇంటి ఆవరణలో అందాలు చిందిస్తోంది. మొగ్గ దశలో పసుపు రంగులో.. పూర్తిగా వికసించే సరికి గులాబీ రంగులోకి మారిపోతూ కనువిందు చేస్తోంది. ఈ విషయాన్ని ఉద్యానశాఖాధికారి ఎస్ వెంకటరత్నం వద్ద ప్రస్తావించగా హైబ్రిడ్ రకానికి చెందిన మొక్కలే ఇలాంటి పూలు పూస్తాయని తెలిపారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించేవారికి గులాబీలు
గుంటూరు: ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు సూచించారు. నిబంధనలు పాటించే వాహన చోదకులకు గులాబీ పూలు, స్వీట్లు అందజేసి అభినందించాలన్నారు. అలా చేస్తే తోటి వాహనదారుల ఆలోచనా విధానంలో త్వరగా మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు. అర్బన్ జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులతో తన కార్యాలయంలో ఎస్పీ విజయరామారావు మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాలను పటిష్టంగా కొనసాగించి ప్రజల్లో ట్రాఫిక్ నిబం ధనలు తదితర అంశాలపై అవగాహన పెంపొందించాలని చెప్పారు. గుంటూరు నగర పరిధిలో ఇస్టానుసారంగా వాహనాలు నడుపుతున్న కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపధ్యంలో అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ నిబం ధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయడంతో పాటు మైనర్లు నడిపే వాహనాలను సీజ్ చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించే వారిని ప్రోత్సహించడంతో పాటు డ్రంకెన్ డ్రైవ్ కారణంగా ఇప్పటికే ఎందరో ప్రాణాలు కోల్పోయారని, ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్న ఘటనలను ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తీసుకు వచ్చేలా కృషి చేయాలని చెప్పారు. అదనపు ఎస్పీలు వై.టి. నాయుడు, సుబ్బరాయుడు, డీఎస్పీలు సరిత, మూర్తి, శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలి నగరంపాలెం(గుంటూరు): సురక్షిత ప్రయాణానికి లారీ డ్రైవర్లు రహదారి భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలనీ జిల్లా ఉప రవాణా కమిషనర్ జి.సి.రాజరత్నం సూచిం చారు. 29వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆటోనగర్‌లోని లారీ యజమానుల సంఘ కార్యాలయంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై నిర్వహించిన సదస్సు డీటీసీ రాజరత్నం ప్రసంగించారు. గత ఏప్రిల్ నుంచి మార్చి చివరి నాటికి జిల్లాలో 592 రహదారి ప్రమాదాలు జరిగాయని తెలిపారు. వాటిలో 372 ప్రమాదాలు లారీల కారణంగానే జరి గాయని వివరించారు. డ్రైవర్ల అజాగ్రత్త, అతివేగం, ఓవర్లోడింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిరంతరం తనిఖీలు జరుగుతాయని, నిబంధనలు పాటించిన డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎంవీఐ శివనాగేశ్వరరావు మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోన్లో మాట్లాడితే ఏకగ్రత లోపించి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎంఎంవీఐ నాగలక్ష్మి మాట్లాడుతూ లారీ డ్రైవర్లు అధిక శాతం మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారని పేర్కొన్నారు. సదస్సు అనంతరం లారీ డ్రైవర్లుతో రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తామని రవాణా శాఖ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. లారీ యజ మానుల సంఘం అధ్యక్షుడు సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ట్రాఫిక్ సిబ్బందికి టోపీలు పంపిణీ గుంటూరు: ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బంది వేసవిలో అప్రమత్తంగా వుంటూ విధులు నిర్వహించాలని రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పల నాయుడు సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం తన కార్యాలయంలో ట్రాఫిక్ సిబ్బందికి టోపీలు, కళ్లజోళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వెంకటప్పల నాయుడు మాట్లాడుతూ ఈ నెల 30 వరకు కొనసాగే వారోత్సవాల్లో హెల్మెట్ ప్రాముఖ్యత, డ్రవర్లకు, విద్యార్థులకు రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ లోడింగ్ వాహనాలపై స్పెషల్ డ్రైవ్, అర్హులైన వారికి ఎల్ ఎల్ ఆర్ మేళాలను కొనాసాగిస్తామని వివరించారు. అదనపు ఎస్పీ వరదరాజు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ హృదయరాజు పాల్గొన్నారు. -
నేడు హోదా కోసం గులాబీపూలతో శాంతియుత నిరసన
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ప్రజలకు అండగా నిలవాల్సిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆటలాడుతూ సంబరాలలో మునిగితేలడం విచారకరమనిహెల్పింగ్ హ్యాండ్స్ రాష్ట్ర అధ్యక్షుడు మరీదు శివరామకృష్ణ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ నాయకుల తీరుకు వ్యతిరేకంగా హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో మంగళవారం ఆటలు ఆడేం దుకు వచ్చిన ప్రజాప్రతినిధులకు గులాబీ పూలు ఇచ్చి శాంతియుతంగా ప్రజల తరుపున నిరసన తెలియజేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. -
చూచెద"రెమ్మ"!.. వింత
తెల్లగులాబీ శాంతికి, సమైక్యతకు చిహ్నం. ఈ పూవును ఒకదానిని చూస్తేనే మనసు పులకిస్తుంది. అలాంటిది ఒకేసారి మూడు పూలు.. అదీ ఒకే రెమ్మకు పూస్తే.. వాటిని చూసిన కనులకు పండగ కాదా.. మనసు పరవళ్లు తొక్కదా.. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలోని పఠాన్ అజ్గర్ వలీ(నన్నా) ఇంటి పెరట్లోని చెట్టుకు గులాబీ పూలు విరగబూశాయి. వీటిలో ఒకే రెమ్మకు మూడు తెల్ల గులాబీలు ఉన్నాయి. ఇవి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. అన్నట్టు అజ్గర్ వలీ దంపతులకు ముగ్గురు కవల పిల్లలు(ట్రిప్లేట్స్). ఈ నేపథ్యంలో ఒకే రెమ్మకు మూడు గులాబీలు పూయడం విశేషం. – జంగారెడ్డిగూడెం రూరల్ -
అబ్బుర పరుస్తున్న గులాబీ అందాలు
-
'అలరించిన రోజ్ షో'