
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ప్రజలకు అండగా నిలవాల్సిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆటలాడుతూ సంబరాలలో మునిగితేలడం విచారకరమనిహెల్పింగ్ హ్యాండ్స్ రాష్ట్ర అధ్యక్షుడు మరీదు శివరామకృష్ణ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ నాయకుల తీరుకు వ్యతిరేకంగా హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో మంగళవారం ఆటలు ఆడేం దుకు వచ్చిన ప్రజాప్రతినిధులకు గులాబీ పూలు ఇచ్చి శాంతియుతంగా ప్రజల తరుపున నిరసన తెలియజేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment