shiva ramakrishna
-
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గంలోని ప్రభుత్వ భూమిని కాజేసేందుకు బూరుగుపల్లి శివరామకృష్ణ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. నకిలీ పత్రాలతో 84 ఎకరాల భూమిని కాజేసేందుకు శివరామకృష్ణ ప్రయత్నించారు. నకిలీ పత్రాలతో వేల కోట్ల విలువైన 84 ఎకరాల భూమిని కొట్టేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి పత్రాలు తెప్పించుకున్న బూరుగుపల్లి శివరామకృష్ణ.. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించాడు. బిల్డర్ మారగొని లింగం గౌడ్ సాయంతో ల్యాండ్ తనదేనంటూ క్లయిమ్ చేసుకున్నాడు. ఈ నకిలీ పత్రాలపై 2003లోనే అప్పటి ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. ఈ కేసు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. చివరకు ఈ న్యాయ పోరాటంలో ప్రభుత్వం గెలిచింది. శివరామకృష్ణవి నకిలీ పత్రాలనేని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగం గౌడ్‌పై కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు..తాజాగా వారిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. కాగా శివరామ కృష్ణ గతంలో రవి తేజ తో ‘దరువు’ మూవీతో పాటు యువత, రైడ్ లాంటి సినిమాలను నిర్మించారు. -
నాన్న వచ్చాడు.. లేచి చూడు కన్నా..
సాక్షి, రైల్వేకోడూరు(కడప) : సరదాగా స్నేహితులతో తిరిగేవాడివి... మారం చేయకుండా బడికి వెళ్లే వాడివి... ఏ పని చెప్పినా చేసేవాడివి.. అందిరితో కిలివిడిగా ఉండే నీకు అప్పుడే నూరేళ్లు నిండాయా బిడ్డా అంటూ శివరామకృష్ణ తల్లి లావణ్య బోరున విలపిస్తోంది. నిన్నే ప్రాణంగా భావించి.. నీ అభివృద్ధి కోసం కువైట్‌కు వెళ్లిన మీ నాన్న నిన్ను చూడడానికి వచ్చాడు..ఒక్క సారి లేచి చూడరా నానా అంటూ ఆ తల్లి పెట్టిన ఆక్రందన అందరి గుండెలను పిండేసింది. గుంజన ఏటిలో మంగళవారం ఈతకు వెళ్లి గల్లంతైన శివరామకృష్ణ మృతదేహం గురువారం తెల్లవారు జామున లభ్యమైంది. జాలర్లు వల సహాయం మృతదేహాన్ని గట్టుకు చేర్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. కువైట్‌లో ఉన్న మృతుని తండ్రి సుబ్రమణ్యం కూడా ఇంటికి చేరుకోవడంతో కటుంబసభ్యులు, బంధువులు స్నేహితులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికి అంత్యక్రియలు నిర్వహించారు. అంతా బంధువులే కావడంతో గుండాలపల్లె గ్రామస్తులు శోకసంద్రంలోనే ఉన్నారు. శివరామకృష్ణకు నివాళి ఏటిలో గల్లంతై మృతి చెందిన శివరామకృష్ణకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నివాళులరి్పంచారు. గురువారం ఉదయం గుండాలపల్లెకు వెళ్లి మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు, అధికారులు ఉన్నారు. ఫలించిన కొరముట్ల కృషి శివరామ కృష్ణ ఏటిలో గల్లంతయ్యాడని తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చేసిన కృషి ఫలించింది. స్థానిక రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లు గాలింపు చేసినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో జిల్లా ఎస్పీతో చర్చించారు. బోటు, జాలర్లను పిలిపించారు. గురువారం రాత్రంతా ఏటిలో జల్లెడ పట్టించారు. గుంజన ఏరు నీటి ఉధృతిని తగ్గించడానికి నాలుగు జేసీబీలతో నీటిని తగ్గించారు. విప్ కొరమట్లు దగ్గరుండి వారిని ప్రోత్సహించారు. చివరికి గురువారం తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో మృతదేహాన్ని వెలికి తీశారు. కొరముట్ల కృషికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్ని శాఖల అధికారులు, జాలర్ల పనితీరును ప్రశంశించారు. శివరామకృష్ణ మృతదేహాన్ని వెలికి తీస్తున్న జాలర్లు మృతుని తల్లిదండ్రులను ఓదారుసున్న విప్ కొరముట్ల -
నేడు హోదా కోసం గులాబీపూలతో శాంతియుత నిరసన
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ప్రజలకు అండగా నిలవాల్సిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆటలాడుతూ సంబరాలలో మునిగితేలడం విచారకరమనిహెల్పింగ్ హ్యాండ్స్ రాష్ట్ర అధ్యక్షుడు మరీదు శివరామకృష్ణ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ నాయకుల తీరుకు వ్యతిరేకంగా హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో మంగళవారం ఆటలు ఆడేం దుకు వచ్చిన ప్రజాప్రతినిధులకు గులాబీ పూలు ఇచ్చి శాంతియుతంగా ప్రజల తరుపున నిరసన తెలియజేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. -
జేసీ ఫిర్యాదు..అధికారుల వత్తాసు!
తాడిపత్రి, న్యూస్‌లైన్ : తాడిపత్రి మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మునిసిపాలిటీకి బకాయి ఉన్నారన్న కారణం చూపుతూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి రమేష్‌రెడ్డి 10, 18వ వార్డుల్లో వేసిన నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివరామకృష్ణ తిరస్కరించారు. మునిసిపల్ మాజీ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని కుట్రపూరితంగా తన నామినేషన్లను రద్దు చేశారంటూ రమేష్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. వివరాలిలా ఉన్నాయి. మునిసిపాలిటీలోని మొత్తం 34 వార్డులకు వైఎస్సార్సీపీ తరఫున 99 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో జేసీ సోదరులకు అత్యంత సన్నిహితంగా ఉన్న తాడిపత్రి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్, మాజీ కౌన్సిలర్ రమేష్‌రెడ్డి నాలుగు రోజుల క్రితం వైఎస్సార్సీపీలోకి చేరి, చురుకైన పాత్ర పోషించి అన్ని వార్డులకూ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. దీన్ని జీర్ణించుకోలేని జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులతో శనివారం నామినేషన్ల పరిశీలన సందర్భంగా 10, 18వ వార్డులో నామినేషన్ వేసిన రమేష్‌రెడ్డి మునిసిపాలిటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడని, ఆయన 2001లో జరిగిన వేలం పాటలో మునిసిపాలిటీకి రూ.లక్షల్లో బకాయిపడ్డారని లిఖిత పూర్వకంగా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. రికార్డులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్న అధికారులు ఆరు గంటల హైడ్రామా అనంతరం రమేష్‌రెడ్డి నామినేషన్లను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి అధికారులపై పదేపదే ఒత్తిడి తేవడంపై అభ్యంతరం తెలిపిన రమేష్‌రెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్ పేరం నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, అశోక్‌రెడ్డి, రజనీకాంత్‌రెడ్డి మాటలను అధికారులు ఖాతరు చేయలేదు. తాను సంజాయిషీ చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని, మీరే నోడ్యూస్ సర్టిఫికెట్ ఇచ్చి మీరే బాకాయి ఉందని ఎలా చెబుతారు అంటూ రమేష్‌రెడ్డి అధికారులతో వాదించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఒక దశలో మునిసిపల్ అధికారులు టీడీపీ నాయకులకు అమ్ముడుపోయారని ఆరోపించారు. కావాలనే తనపై కుట్ర పన్ని ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసి బయటకి వెళ్లి పోయారు.