సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గంలోని ప్రభుత్వ భూమిని కాజేసేందుకు బూరుగుపల్లి శివరామకృష్ణ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. నకిలీ పత్రాలతో 84 ఎకరాల భూమిని కాజేసేందుకు శివరామకృష్ణ ప్రయత్నించారు. నకిలీ పత్రాలతో వేల కోట్ల విలువైన 84 ఎకరాల భూమిని కొట్టేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ నుంచి పత్రాలు తెప్పించుకున్న బూరుగుపల్లి శివరామకృష్ణ.. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించాడు. బిల్డర్ మారగొని లింగం గౌడ్ సాయంతో ల్యాండ్ తనదేనంటూ క్లయిమ్ చేసుకున్నాడు.
ఈ నకిలీ పత్రాలపై 2003లోనే అప్పటి ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. ఈ కేసు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. చివరకు ఈ న్యాయ పోరాటంలో ప్రభుత్వం గెలిచింది. శివరామకృష్ణవి నకిలీ పత్రాలనేని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగం గౌడ్‌పై కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు..తాజాగా వారిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. కాగా శివరామ కృష్ణ గతంలో రవి తేజ తో ‘దరువు’ మూవీతో పాటు యువత, రైడ్ లాంటి సినిమాలను నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment