గులాబీ గుబాళిస్తోంది. సరికొత్త సొబగులతో అతిథులకు ఆహ్వానం పలుకుతోంది. వాటిని అందుకునే ప్రముఖులను ఆకర్షిస్తోంది. రోజా పువ్వులతో ప్రత్యేకమైన ‘ఫ్లవర్‌వలీ’ బొకేలు రూపొందిస్తున్న నగర యువతి సోనాల్ అగర్వాల్ అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించింది. ఆమెరూపొందించిన బొకేలకు ఎంతోమంది ప్రముఖులు ఫిదా అయ్యారు. అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు.
మైండ్ బ్లోయింగ్
వావ్.. ఈ ఫ్లవర్స్ భలే ఉన్నాయి. మైండ్‌బ్లోయింగ్ అనిపించే ఇలాంటి ఫ్లవర్స్‌ని నేనింతవరకూ చూడలేదు. సిటీకి వచ్చిన సందర్భంగా ఈ పూలతో నాకు గ్రాండ్ వెల్‌కమ్ పలికినందుకు సంతోషిస్తున్నాను. ఇవి మా ఇంట్లోఅందరికీ కనిపించేలా ఏర్పాటు చేస్తాను. – సచిన్ టెండూల్కర్
సాక్షి, సిటీబ్యూరో: గులాబీ పూలు గుసగుసలాడుతున్నాయి. మనసున రోజాపూల మాలలూగిస్తున్నాయి. గులాబీ బాలలు గుబాళిస్తున్నాయి. అందాల విరులు సిరులొలికిస్తున్నాయి. పుష్పశోభితమై విశ్వ రాగరంజితమవున్నాయి. మనలోని భావాలకు వారధి పువ్వు. పడతుల వాల్జెడలో పువ్వు. పరమాత్ముడి పూజకు పువ్వు. వన్నెలొలికే వెన్నెలరాగం పువ్వు. ఆనంద నందనం పువ్వు. అనుబంధాల చందనం పువ్వు. పరిమళాల గుబాళింపు పువ్వు.. ఇలా పుష్పాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఆ పుష్ప సమాగమానికి సరికొత్త సొబగులు అద్దుతూ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతినార్జిస్తోంది నగర యువతి సోనాల్ అగర్వాల్. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సహా ఎంతోమంది ప్రముఖులు ఆమెను అభినందనల్లో ముంచెత్తడం విశేషం. సోనాల్ అగర్వాల్ రూపొందించిన ‘ఫ్లవర్‌వలీ’ బొకేలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫంక్షన్, పార్టీ, ప్రపోజ్ ఏదైనా సరే వీటితో ఫిదా కావడం ఖాయం. అంతేకాకుండా ఇవి విదేశాల్లో సైతం ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. ‘ఫ్లవర్‌వలీ’ బొకేల రూపకల్పనకు ఆలోచన ఎలా అంకురించింది. వీటి కథాకమామిషుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం
అంకురార్పణ ఇలా..
మియాపూర్‌నకు చెందిన సోనాల్ అగర్వాల్ హెమ్‌స్టెక్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసింది. ఆమెకు బిజినెస్‌పై ఎంతో ఆసక్తి. కళాశాల రోజుల్లోనే స్నేహితులతో కలిసి ఆర్టిస్ట్ షాఫీని ఏర్పాటు చేసింది. హ్యాండ్ మేడ్ జ్యువెలరీ, గ్రీటింగ్ కార్డ్స్, రకరకాల గిఫ్ట్ ఆర్టికల్స్ రూపొందించేది. ఇదే సమయంలో పూలపై ప్రింటింగ్ వేయాలనే ఆలోచన వచ్చింది. అలా ఎంటోజింగ్ ప్రింట్‌ని మొదలుపెట్టి.. యూనిక్ గిఫ్ట్ ఆర్టికల్స్, గ్రీటింగ్ కార్డ్స్ రూపొందిస్తూ.. ఫ్రెండ్స్ బంధువులకు ఇస్తుండేది.
సిటీ టు ఇంటర్నేషనల్
గులాబీలతో ప్రత్యేకంగా తయారైన ఈ ఫ్లవర్స్ అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాం. మన సిటీతో పాటు న్యూయార్క్, ఇంగ్లాండ్, నెదర్లాండ్, సింగపూర్ వంటి ప్రాంతాల్లో నివసించే ప్రవాస భారతీయులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి ఫ్లవర్స్‌ని అక్కడి వారికి ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఇన్‌స్ట్రాగామ్ వేదికగా ఈ ఫ్లవర్స్‌ను విక్రయిస్తున్నాం. సిటీకి వచ్చిన సెలబ్రిటీలకు నేను ఈ ఫ్లవర్స్‌నే గిఫ్టŠస్‌గా ఇస్తుంటాను.– సోనాల్‌అగర్వాల్
కళ్లు మిరుమిట్లుగొలిపేలా..
‘ఇంత చూడచక్కని, కళ్లు మిరుమిట్లుగొలిపే పువ్వులు ఎంతో బాగున్నాయి. ఇలాంటివి నాకెంతో ఇష్టం. నా మనసుకు నచ్చిన పూలను గిఫ్ట్‌గా ఇచ్చినందుకు ‘ఫ్లవర్‌వలీ’కి థ్యాంక్స్. నాకు బాగా నచ్చాయి కాబట్టి నేను నా ఫ్రెండ్ సర్కిల్‌కు ఈ ఫ్లవర్స్‌ని రిఫర్ చేస్తా.– శ్రద్ధాకపూర్, బాలీవుడ్ నటి
డెకరేషన్స్.. గిఫ్ట్స్
చూడచక్కని ఈ ఫ్లవర్స్‌తో పెద్ద పెద్ద పార్టీలకు డెకరేషన్స్ కూడా చేస్తుంది సోనాల్. సిటీతో పాటు ముంబయి, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో జరిగే పెద్ద పెద్ద పార్టీలకు రోజా పూలతో డెకరేట్ చేయడం విశేషం. సిటీకి వచ్చిన సెలబ్రిటీలకు ఈ ఫ్లవర్స్‌ని ఇస్తూ వెల్‌కం పలుకుతున్నారు. ప్రధాని మోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, శ్రద్ధా కపూర్, సోనాక్షి సిన్హా, విజయ్ దేవరకొండ, రీతూవర్మ, రవీనా టాండన్, పింకిరెడ్డి వంటి వారు ఈ ఫ్లవర్స్‌ను అభినందించడం విశేషం.
ఎనిమిది రకాలు..
హాలండ్ నుంచి దిగుమతి చేస్తున్న రోజ్ పూలు చాలా ప్రత్యేకం. వీటిలో ప్రధానంగా ‘రెడ్, వైట్, పర్పుల్, వైలెట్, బ్ల్యూ, బ్లాక్, ఎల్లో, పింక్, రెయిన్‌బో’ వంటి రంగుల పూలు ఉండటం విశేషం. వీటితో బొకేలను రూపొందిస్తారు. వీటిని హ్యాండీక్రాఫ్టెడ్ బాక్స్‌లో అమర్చుతారు.
ఫ్లవర్‌వలీ పూసింది..
గత ఏడాది బంజారాహిల్స్ రోడ్‌నంబర్–1లో ‘ఫ్లవర్‌వలీ’ పేరుతో బిజినెస్‌ని స్టార్ట్ చేసింది సోనాల్ అగర్వాల్. హాలండ్, ఈక్విడార్, నెదర్లాండ్స్ వంటి ప్రాంతాల నుంచి రోజా పువ్వులను దిగుమతి చేసుకోవడం.. ఇక్కడ ప్రత్యేకంగా వాటితో బొకేల తయారీని ప్రారంభించింది. ప్రస్తుతం సోనాల్ రెండు రకాల ఫ్లవర్స్, ఫ్లవర్ బొకేలను అందిస్తోంది. ఒకటి తాజా..రెండోది ఇనిఫినిటీ. రెండోది ఎంతకాలమైనా ఉంటుంది. సాధారణంగా పూలు రెండు రోజుల పాటు వాడకుండా ఉంటాయి. కానీ.. ఈ పుష్పాలు నాలుగైదు రోజులైనా వాడిపోవు. ఇందుకోసం ఫ్లవర్‌వుడ్ నీళ్లలో వాటిని కలుపుతారు. ఇనిఫినిటీకి ఉపయోగించే పుష్పాలు ప్రాసెసింగ్‌కు పేటెంట్ ఉంది. సహజమైన నూనెల్లో ప్రిజర్వ్ చేస్తారు. ప్రొడక్షన్, ప్రిజర్వేషన్‌కు మొత్తం నెల రోజుల సమయం పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment