sraddha kapoor
-
స్టార్ హీరో షూటింగ్ సెట్లో భారీ అగ్ని ప్రమాదం, ఒకరు మృతి
స్టార్ హీరో షూటింగ్ సెట్లో అపసృతి చోటుచేసుకుంది. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ రంజన్’. చిన్న ముంబైలో జరిగిన ఈ మూవీ షూటింగ్లో భారీ అగ్నీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూవీ సిబ్బంది ఒకరు మృతి చెందినట్లు సమచారం. వివరాలు.. రణ్‌బీర్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ నిన్న ముంబైలోని అంధేరి చిత్రకూట్ మైదానంలో జరిగింది. చదవండి: ఒకప్పుడు సునీల్ నచ్చాడు, కానీ ఇప్పుడు కాదు: వేణు ఈ నేపథ్యంలో సెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షూటింగ్ సిబ్బంది మనీశ్ దేవాశీ(32) మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదంపై ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో హీరోహీరోయిన్లు అక్కడ లేకపోవడం వారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సోనాల్‌కు సచిన్, శ్రద్ధా, విజయ్ ప్రశంసలు
గులాబీ గుబాళిస్తోంది. సరికొత్త సొబగులతో అతిథులకు ఆహ్వానం పలుకుతోంది. వాటిని అందుకునే ప్రముఖులను ఆకర్షిస్తోంది. రోజా పువ్వులతో ప్రత్యేకమైన ‘ఫ్లవర్వలీ’ బొకేలు రూపొందిస్తున్న నగర యువతి సోనాల్ అగర్వాల్ అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించింది. ఆమెరూపొందించిన బొకేలకు ఎంతోమంది ప్రముఖులు ఫిదా అయ్యారు. అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. మైండ్ బ్లోయింగ్ వావ్.. ఈ ఫ్లవర్స్ భలే ఉన్నాయి. మైండ్‌బ్లోయింగ్ అనిపించే ఇలాంటి ఫ్లవర్స్‌ని నేనింతవరకూ చూడలేదు. సిటీకి వచ్చిన సందర్భంగా ఈ పూలతో నాకు గ్రాండ్ వెల్కమ్ పలికినందుకు సంతోషిస్తున్నాను. ఇవి మా ఇంట్లోఅందరికీ కనిపించేలా ఏర్పాటు చేస్తాను. – సచిన్ టెండూల్కర్ సాక్షి, సిటీబ్యూరో: గులాబీ పూలు గుసగుసలాడుతున్నాయి. మనసున రోజాపూల మాలలూగిస్తున్నాయి. గులాబీ బాలలు గుబాళిస్తున్నాయి. అందాల విరులు సిరులొలికిస్తున్నాయి. పుష్పశోభితమై విశ్వ రాగరంజితమవున్నాయి. మనలోని భావాలకు వారధి పువ్వు. పడతుల వాల్జెడలో పువ్వు. పరమాత్ముడి పూజకు పువ్వు. వన్నెలొలికే వెన్నెలరాగం పువ్వు. ఆనంద నందనం పువ్వు. అనుబంధాల చందనం పువ్వు. పరిమళాల గుబాళింపు పువ్వు.. ఇలా పుష్పాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఆ పుష్ప సమాగమానికి సరికొత్త సొబగులు అద్దుతూ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతినార్జిస్తోంది నగర యువతి సోనాల్ అగర్వాల్. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సహా ఎంతోమంది ప్రముఖులు ఆమెను అభినందనల్లో ముంచెత్తడం విశేషం. సోనాల్ అగర్వాల్ రూపొందించిన ‘ఫ్లవర్వలీ’ బొకేలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫంక్షన్, పార్టీ, ప్రపోజ్ ఏదైనా సరే వీటితో ఫిదా కావడం ఖాయం. అంతేకాకుండా ఇవి విదేశాల్లో సైతం ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. ‘ఫ్లవర్వలీ’ బొకేల రూపకల్పనకు ఆలోచన ఎలా అంకురించింది. వీటి కథాకమామిషుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం అంకురార్పణ ఇలా.. మియాపూర్‌నకు చెందిన సోనాల్ అగర్వాల్ హెమ్స్టెక్లో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసింది. ఆమెకు బిజినెస్‌పై ఎంతో ఆసక్తి. కళాశాల రోజుల్లోనే స్నేహితులతో కలిసి ఆర్టిస్ట్ షాఫీని ఏర్పాటు చేసింది. హ్యాండ్ మేడ్ జ్యువెలరీ, గ్రీటింగ్ కార్డ్స్, రకరకాల గిఫ్ట్ ఆర్టికల్స్ రూపొందించేది. ఇదే సమయంలో పూలపై ప్రింటింగ్ వేయాలనే ఆలోచన వచ్చింది. అలా ఎంటోజింగ్ ప్రింట్‌ని మొదలుపెట్టి.. యూనిక్ గిఫ్ట్ ఆర్టికల్స్, గ్రీటింగ్ కార్డ్స్ రూపొందిస్తూ.. ఫ్రెండ్స్ బంధువులకు ఇస్తుండేది. సిటీ టు ఇంటర్నేషనల్ గులాబీలతో ప్రత్యేకంగా తయారైన ఈ ఫ్లవర్స్ అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాం. మన సిటీతో పాటు న్యూయార్క్, ఇంగ్లాండ్, నెదర్లాండ్, సింగపూర్ వంటి ప్రాంతాల్లో నివసించే ప్రవాస భారతీయులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి ఫ్లవర్స్‌ని అక్కడి వారికి ఇచ్చి సర్ప్రైజ్ చేస్తున్నారు. ఇన్‌స్ట్రాగామ్ వేదికగా ఈ ఫ్లవర్స్‌ను విక్రయిస్తున్నాం. సిటీకి వచ్చిన సెలబ్రిటీలకు నేను ఈ ఫ్లవర్స్నే గిఫ్టŠస్‌గా ఇస్తుంటాను.– సోనాల్అగర్వాల్ కళ్లు మిరుమిట్లుగొలిపేలా.. ‘ఇంత చూడచక్కని, కళ్లు మిరుమిట్లుగొలిపే పువ్వులు ఎంతో బాగున్నాయి. ఇలాంటివి నాకెంతో ఇష్టం. నా మనసుకు నచ్చిన పూలను గిఫ్ట్‌గా ఇచ్చినందుకు ‘ఫ్లవర్వలీ’కి థ్యాంక్స్. నాకు బాగా నచ్చాయి కాబట్టి నేను నా ఫ్రెండ్ సర్కిల్‌కు ఈ ఫ్లవర్స్‌ని రిఫర్ చేస్తా.– శ్రద్ధాకపూర్, బాలీవుడ్ నటి డెకరేషన్స్.. గిఫ్ట్స్ చూడచక్కని ఈ ఫ్లవర్స్‌తో పెద్ద పెద్ద పార్టీలకు డెకరేషన్స్ కూడా చేస్తుంది సోనాల్. సిటీతో పాటు ముంబయి, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో జరిగే పెద్ద పెద్ద పార్టీలకు రోజా పూలతో డెకరేట్ చేయడం విశేషం. సిటీకి వచ్చిన సెలబ్రిటీలకు ఈ ఫ్లవర్స్‌ని ఇస్తూ వెల్కం పలుకుతున్నారు. ప్రధాని మోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, శ్రద్ధా కపూర్, సోనాక్షి సిన్హా, విజయ్ దేవరకొండ, రీతూవర్మ, రవీనా టాండన్, పింకిరెడ్డి వంటి వారు ఈ ఫ్లవర్స్‌ను అభినందించడం విశేషం. ఎనిమిది రకాలు.. హాలండ్ నుంచి దిగుమతి చేస్తున్న రోజ్ పూలు చాలా ప్రత్యేకం. వీటిలో ప్రధానంగా ‘రెడ్, వైట్, పర్పుల్, వైలెట్, బ్ల్యూ, బ్లాక్, ఎల్లో, పింక్, రెయిన్బో’ వంటి రంగుల పూలు ఉండటం విశేషం. వీటితో బొకేలను రూపొందిస్తారు. వీటిని హ్యాండీక్రాఫ్టెడ్ బాక్స్‌లో అమర్చుతారు. ఫ్లవర్వలీ పూసింది.. గత ఏడాది బంజారాహిల్స్ రోడ్‌నంబర్–1లో ‘ఫ్లవర్వలీ’ పేరుతో బిజినెస్‌ని స్టార్ట్ చేసింది సోనాల్ అగర్వాల్. హాలండ్, ఈక్విడార్, నెదర్లాండ్స్ వంటి ప్రాంతాల నుంచి రోజా పువ్వులను దిగుమతి చేసుకోవడం.. ఇక్కడ ప్రత్యేకంగా వాటితో బొకేల తయారీని ప్రారంభించింది. ప్రస్తుతం సోనాల్ రెండు రకాల ఫ్లవర్స్, ఫ్లవర్ బొకేలను అందిస్తోంది. ఒకటి తాజా..రెండోది ఇనిఫినిటీ. రెండోది ఎంతకాలమైనా ఉంటుంది. సాధారణంగా పూలు రెండు రోజుల పాటు వాడకుండా ఉంటాయి. కానీ.. ఈ పుష్పాలు నాలుగైదు రోజులైనా వాడిపోవు. ఇందుకోసం ఫ్లవర్వుడ్ నీళ్లలో వాటిని కలుపుతారు. ఇనిఫినిటీకి ఉపయోగించే పుష్పాలు ప్రాసెసింగ్‌కు పేటెంట్ ఉంది. సహజమైన నూనెల్లో ప్రిజర్వ్ చేస్తారు. ప్రొడక్షన్, ప్రిజర్వేషన్‌కు మొత్తం నెల రోజుల సమయం పడుతుంది. -
'సాహో' సుజీత్.. డబురువారిపల్లి బుల్లోడు
కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలోని ఓ కుగ్రామంలో పుట్టాడాయన. తండ్రికి వారసునిగా చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకున్న ఆయన అనూహ్యంగా సినీ రంగంవైపు మళ్లీ హాలీవుడ్ స్థాయి సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆయనే రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘సాహో’ సినిమాకు దర్శకత్వం వహించిన ఎద్దుల సుజీత్ రెడ్డి.సుజీత్ సినీ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కుగ్రామం నుంచి... అనంతపురం జిల్లాలో అత్యంత వెనుకబడిన పుట్టపర్తి నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతంలో డబురువారిపల్లి ఓ కుగ్రామం. ఇక్కడ 150 కుటుంబాలు ఉన్నాయి. గ్రామ మొత్తం జనాభా 350. ఈ గ్రామంలో ఎద్దుల వారి కుటుంబానికి చెందిన వారే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నింటా ఉన్నత స్థానంలో ఉన్నారు. సాహో చిత్ర దర్శకుడు సుజీత్‌రెడ్డి తండ్రి ఎద్దుల గోపీనాథ్‌రెడ్డి వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్. అనంతపురం, ఆ తర్వాత హైదరాబాద్‌లో పనిచేసి అక్కడే స్థిరపడ్డారు. గోపీనాథ్‌రెడ్డి, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు వినీత్‌రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. అనూహ్యంగా సినీరంగంవైపు సుజీత్‌రెడ్డి 1990, అక్టోబర్ 10న జన్మించారు. అప్పట్లో వారి కుటుంబం అనంతపురంలో ఉండేది. అక్కడే ఎల్‌ఆర్‌జీ స్కూల్లో 1 నుంచి 3వ తరగతి వరకూ చదువు. ఇంతలో తండ్రికి బదిలీ కావడంతో చెన్నైలో 4 నుంచి పదో తరగతి వరకు చదివి, ఇంటర్మీడియట్ కోసం తిరిగి అనంతపురానికి వచ్చారు. తన తండ్రి బాటలోనే తాను కూడా సీఏ చేయాలని భావించి ఇంటర్లో ఎంఈసీ పూర్తి చేశారు. తర్వాత విజయవాడ సూపర్‌విజ్ కళాశాలలో సీఏ విద్య కోసం చేరారు. దాన్ని వదిలి బీకాం ఆనర్స్ పూర్తి చేసి, తల్లిదండ్రుల అనుమతితో 2012–13లో చెన్నైలోని ఎల్వీ ప్రసాద్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో పీజీడీఎఫ్‌టీ (పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఫిలిం టెక్నాలజీ) చేశారు. తల్లిదండ్రులు ఎద్దుల గోపీనాథ్‌రెడ్డి, నాగమణి,అన్న వినీత్రెడ్డిలతో సుజీత్ లఘు చిత్రాల ద్వారా తొలి అడుగు పీజీడీఎఫ్‌టీ పూర్తి చేసిన తర్వాత 2014 నుంచి షార్ట్ ఫిలిమ్స్(లఘు చిత్రాలు)పై సుజీత్ దృష్టిసారించారు. లఘు చిత్రాలకు దర్శకత్వం వహిస్తూనే ప్రముఖ సినీ హీరోలతో పరిచయాలు పెంచుకున్నారు. 23ఏళ్ల వయస్సులోనే ‘రన్ రాజా రన్’ చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతూ నవ్వులు పూయించిన ఆ చిత్రం సుజీత్‌కు మంచి పేరు తెచ్చింది. ప్రభాస్ ఆశీస్సులతో... సుజీత్ వయస్సు ఇప్పుడు 28 ఏళ్లు. అతనిలోని దర్శకత్వ ప్రతిభను యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ గుర్తించారు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో మూడు భాషల్లో తీసిన ‘సాహో’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించారు. హాలీవుడ్ చిత్రాలను మరిపించేలా చిత్రాన్ని రూపొందించి యావత్ ప్రపంచ దృష్టిని సుజీత్ ఆకర్షించారు. అందరి అంచనాలను మించి చిత్రం విజయవంతమవుతుందని ఇప్పటికే ‘సాహో’ టీజర్లు చూసిన నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇంతటి ఖ్యాతి గడించిన సుజీత్ తమ గ్రామ వాసి కావడంతో డబురువారిపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నెల 30 సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. సుజీత్ స్వగ్రామం ఇదే -
అంత కష్టపడకురా అంటున్నారు
ప్రభాస్ ఫుల్ బిజీ...రెండేళ్లుగా ‘సాహో’ సినిమాతో బిజీ.ఇప్పుడు ‘సాహో’ ప్రమోషన్స్‌తో బిజీ.బెంగళూరు, ముంబై, చెన్నై.. అంటూ ‘సాహో’ కోసం జర్నీలు చేస్తూ బిజీ.కొడుకు ఇంత బిజీగా ఉంటే ఏ తల్లికైనా ఆనందమే.కానీ కొడుకు ఎంత స్టార్ అయినా, ‘ప్యాన్ ఇండియన్ సూపర్ స్టార్’ అయినా తల్లికి కొడుకే.మరి ఈ బిజీ సన్‌కి తల్లితో కలిసి భోజనం చేసే తీరిక ఉందా? కొడుకుకి ఇంత పేరు వచ్చినందుకు ఆ తల్లి ఫీలింగ్ ఏంటి? తనయుడు చేసిన సినిమాలన్నీ బాగున్నాయనే ఆ తల్లికి అనిపిస్తుందా? విమర్శను నిక్కచ్చిగా చెబుతారా? ఇలాంటి విశేషాలతో పాటు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలోప్రభాస్ చాలా విషయాలు చెప్పారు. ♦ మీరు చాలా మొహమాటస్తులు. ‘బాహుబలి’ నుంచి కొద్దిగా అవుట్ స్పోకెన్ అయ్యారు. ఈ మార్పుని మీరు గమనించా...? ప్రభాస్: (మధ్యలోనే అందుకుంటూ) బాగా మాట్లాడేస్తున్నాను కదా? ఎంటర్టైన్ చేసేస్తున్నాను కదా? ఇలా మాట్లాడటం నాకే అడ్వాంటేజ్. బాగా మాట్లాడితే బాగా రాస్తారు. ఇంతకు ముందు ఇంటర్వ్యూ అంటే ‘అమ్మో రేపటి నుంచి ఇంటర్వ్యూలు’ అని చిన్న టెన్షన్ వచ్చేది. కానీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. ♦ ‘బాహుబలి’ రూపంలో మీ కెరీర్లో ఓ అద్భుతం జరిగింది. ఈ అద్భుతం తర్వాత మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? ప్రభాస్:భయంకరమైన లక్ ఉంటే కానీ ‘బాహుబలి’ లాంటి సినిమాలు రావు. అది నాకు జరిగింది. ఒక అద్భుతం జరిగిపోయింది. అయితే ఇప్పట్లో మళ్లీ అంత ఒత్తిడి పెట్టుకోవాలనుకోలేదు. కానీ వెంటనే ‘సాహో’లాంటి సినిమా చేయాల్సి వచ్చింది. అన్నీ పక్కన పెట్టేసి ఇంకొక్కసారి కష్టపడదాం అని రెండేళ్లు శ్రమించాం. ‘బాహుబలి’కి ముందే నా ఫ్రెండ్స్ (యువీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్)తో సినిమా చేయాలని డిసైడ్ అయిపోయాను. ‘బాహుబలి’ వర్కౌట్ అవ్వకపోయినా నెక్ట్స్ వీళ్లతోనే అనుకున్నా. నా ఫ్రెండ్స్ నా కంటే పిచ్చోళ్లు. విపరీతంగా ఖర్చు పెట్టి ‘సాహో’ తీశారు. ♦ జీవితంలో అనుకోని ‘అద్భుతం’ జరిగినప్పుడు మన ఆలోచనా విధానం కూడా మారిపోతుంది. అలాంటి మార్పు ఏదైనా మీలో వచ్చిందా? ప్రభాస్:అలా ఏం మారలేదు. మే బీ నాకు తెలియదేమో? అది డెస్టినీ అవ్వచ్చు. అయితే అంతకుముందు ‘లక్’ అనే విషయాన్ని నేను ఎక్కువగా నమ్మేవాణ్ణి కాదు. ఒక టైమ్ తర్వాత ఉంటే ఉంటాయి. మన పని మనదే అనుకునేవాణ్ణి. కానీ ‘బాహుబలి’ తర్వాత కొంచెం నమ్ముతున్నాను. ♦ జీవితాన్ని చూసే కోణం కూడా మారిందా? ప్రభాస్:కచ్చితంగా మారుతుంది. ఇంకా కష్టపడాలి, ఇంకా తెలివిగా ఉండాలి, ప్రతిదానికి పక్కా ప్లానింగ్ ఉండాలనే మైండ్ సెట్ వచ్చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు. దానికి మించి ఏదో ఉంది అనే విషయాన్ని నమ్ముతున్నాను. ఆ ఏదో అనేది ‘ఏదో పవర్’ అని నా ఉద్దేశం. ♦ ‘బాహుబలి’ గురించి ప్రస్తావించినప్పుడల్లా ‘అద్భుతం’ అని అంటున్నాం. కానీ కెరీర్ పరంగా చూస్తే ‘రిస్క్’. ఆ తర్వాత 350 కోట్లతో ‘సాహో’ అనే మరో రిస్క్ చేశారు. రిస్క్ తీసుకుందాం అనే స్వభావం ఏర్పడిందా? ప్రభాస్:ఆ స్వభావం ఉండబట్టే ‘బాహుబలి’ చేయగలిగాను. అయితే ‘బాహుబలి’ అప్పుడు నిర్మాత శోభుగారిని చూస్తే టెన్షన్ అనిపించేది. యుద్ధ సన్నివేశాలు తీసేటప్పుడు రోజుకి పాతిక లక్షలు ఖర్చు పెట్టేవారు. అయినా ఆయన నవ్వుతూ కనబడుతుండేవారు. ‘టెన్షన్ పడడా? రోబోనా’ అనుకునేవాణ్ణి. ‘బాహుబలి’ తర్వాత శోభుగారి ఇంటికి ఫోన్ చేసి ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌తో ‘మళ్లీ ఇంత పెద్ద సినిమాలు చేయనీకండి’ అని చెప్పాను. కట్ చేస్తే.. నేనే పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేశాను. నా ఫ్రెండ్స్‌ని ఇన్వాల్వ్ చేశా. నాకెంత స్ట్రెస్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘బాహుబలి’ చేయడానికి ఫస్ట్ రీజన్ అలాంటి ప్రాజెక్ట్ చేసే అవకాశం మళ్లీ వస్తుందా? లేదా? అని. ఇప్పుడు ‘బాహుబలి’ ఇంత బాగా రిసీవ్ చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? కనీసం ప్రయత్నిద్దాం అని ‘సాహో’ చేశాను. అలా ఆరేడేళ్లు ‘బాహుబలి’, ‘సాహో’ సినిమాలకే వెచ్చించాను. ♦ ‘ప్రభాస్ సినిమా అంటే ఇంత భారీ బడ్జెట్, ఇంత రేంజ్ ఉండాలి’ అనే స్పేస్‌లో ఇరుక్కుపోయాం అనే ఫీలింగ్ ఏదైనా ఉందా? ప్రభాస్:అలా ఏం లేదు. ‘ఛత్రపతి’తో నాకు యాక్షన్ హీరో ఇమేజ్ వచ్చింది. కానీ వెంటనే ‘డార్లింగ్’ అనే సాఫ్ట్ సినిమా చేశాను. అందులో పెద్దగా ఫైట్స్ కూడా ఉండవు. అమ్మాయి, అబ్బాయి ప్రేమకథ. అదీ ఆడింది. ‘మిస్టర్ పర్ఫెక్ట్’లో బంధాలకు, బిజినెస్‌కు మధ్య డిఫరెన్స్ తెలియని ఒక క్యారెక్టర్. క్లైమాక్స్‌లో హీరో సారీ చెబుతాడు. ఫ్యాన్స్‌కి నచ్చలేదు. కానీ ఆడియన్స్ అందరూ యాక్సెప్ట్ చేశారు. మెల్లిగా అందరికీ నచ్చింది. స్టోరీని కనెక్ట్ చేయగలిగితే ఏ సినిమా అయినా వర్కౌట్ అవుతుంది. కరెక్ట్ కథ ఉంటే నన్ను పెట్టి రెండు కోట్ల సినిమా తీసినా కూడా ఆడుతుంది. ♦ ‘బాహుబలి, సాహో’ ప్యాన్ ఇండియా సినిమాలు. మీ నుంచి వచ్చే ప్రతీ సినిమా అన్ని భాషల వాళ్లు చూడాలనుకుంటారు. కానీ ప్రతి సినిమాకి అది కుదరకపోవచ్చు. దాన్ని ఎలా అధిగమిస్తారు? ప్రభాస్:ప్యాన్ ఇండియా సినిమానే చే యాలని రూల్‌గా ఏమీ పెట్టుకోలేదు. ‘బాహుబలి’ తర్వాత ఇది ఇంపార్టెంట్ టైమేమో అనిపించింది. ఒకవేళ ‘సాహో’ వర్కౌట్ అయినా నెక్ట్స్ ప్యాన్ ఇండియా సినిమానే చేస్తానని పెట్టుకోలేదు. తెలుగు సినిమానే చేస్తాను. వేరే భాషలో గెస్ట్ పాత్ర చేయొచ్చు. అంతే తప్ప ఇకనుంచి చేసే ప్రతి సినిమా అన్ని భాషలనీ దృష్టిలో పెట్టుకుని చేయాలని రూల్ అయితే పెట్టుకోలేదు. ♦ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో రాజకీయాల మీద ఆసక్తి లేదన్నారు. పొలిటికల్ మూవీ ఆఫర్ వస్తే? ప్రభాస్:పాలిటిక్స్ వేరు పొలిటికల్ ఫిల్మ్ వేరు. కథ బావుంటే చేయొచ్చు. యాక్షన్ సినిమా చేస్తూ బోలెడు మందిని చంపేస్తున్నాను. బయట చేస్తున్నానా? (నవ్వుతూ). అలాగే సినిమాలో పొలిటీషియన్‌గా చేస్తే.. నిజంగా రాజకీయాల్లోకి వస్తానని కాదు కదా. ♦ ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్లినా ‘ప్యాన్ ఇండియన్ సూపర్‌స్టార్’ అని పిలుస్తున్నారు. ఆ పిలుపుకి అలవాటు పడ్డారా? ప్రభాస్:నిజంగా నేను ప్యాన్ ఇండియన్ సూపర్‌స్టార్ అని ఫీల్ అయ్యుంటే నా ఫ్రెండ్స్‌తో ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చుపెట్టించేవాణ్ణి? 50 కోట్లతో తీయిస్తే చాలు. అప్పుడు అందరూ అంటున్నట్లు ప్యాన్ ఇండియన్ స్టార్‌ని కాబట్టి సినిమాలు ఆడేస్తాయి. అవన్నీ నేను నమ్మను. క్వాలిటీ ముఖ్యం. ‘బాహుబలి’తో తెచ్చుకున్న ఆడియన్స్‌ను సంతృప్తిపరచాలి. సరదా సమాధానాలు ♦ ‘సాహో’కి బడ్జెట్ పెరుగుతుంటూ వెళ్లినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ♦ నిద్ర పట్టేది కాదు. ♦ మీరు బయట చాలా కూల్. సినిమాల్లో ఫుల్ వయొలెంట్. ఈ మార్పు ఎలా? ♦ డబ్బులు తీసుకుంటున్నాను కదా. ♦ అందరి ప్రెషర్ మీరే తీసుకుంటున్నారు. మీ ప్రెషర్ని పంచుకునే వాళ్లు మీ లైఫ్‌లోకి ఎప్పుడు వస్తారు? ♦ ప్రెషర్ తీసుకునే వాళ్లు వస్తారో? ప్రెషర్ పెట్టేవాళ్లు వస్తారో? ♦ ట్రైలర్ చూసి మీ పెద్దనాన్నగారు (కృష్ణంరాజు) ఎలా ఫీల్ అయ్యారు? ♦ అందరూ నా గురించి చెప్పడం విని తబ్బిబ్బిపోయి.. ఇంకా లావైపోతున్నారు. ♦ మీ పాపులారిటీ దేశాలు దాటే కొద్దీ మీరింకా ‘డౌన్ టు ఎర్త్’గా మారిపోతున్నారు... ♦ మంచిదే కదా. అది నాకంటే మీకే ఎక్కువ తెలుస్తుంది. ఇలా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే విషయాన్ని మాత్రం రాజమౌళి నుంచే నేర్చుకున్నాను. ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ సాధించినా తను ఒకేలా ఉన్నాడు. ఆయన పక్కనే ఉండి గమనించాను. మనం ఎప్పుడైనా పెద్ద హిట్ సాధిస్తే ఈయనలా ఉండగలగాలి అనుకున్నాను. ♦ మళ్లీ రాజమౌళితో సినిమా ఎప్పుడు? ప్రభాస్:ఏమో తెలియదు. ‘బాహుబలి’ అప్పుడు 7–8 వెర్షన్స్లు, చాలా ఐడియాలు చెప్పాడు. ‘బాబుని పైకి లేపి తల్లి చనిపోవడం, కట్టప్పే బాహుబలిని చంపడం, కొడుకుని తల్లే చంపమని చెప్పడం’ ఇవన్నీ చెబుతున్నప్పుడే నాకు గూస్బంప్స్ వచ్చాయి. రాజమౌళి ఇలాంటి సినిమాని చంపేస్తాడు అనుకున్నాను (నవ్వుతూ). నిజంగానే చంపేశాడు. అయితే కొడుకుని తల్లే చంపేయమని చెప్పడం సీన్ విన్నప్పుడు మాత్రం ఒళ్లు గగుర్పొడిచింది. వామ్మో... అనుకున్నాను. ♦ అమ్మ టాపిక్ వచ్చింది కాబట్టి... మీ సక్సెస్‌ని మీ అమ్మగారు చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. ఆ ఫీలింగ్‌ని ఆమె మీతో షేర్ చేసుకుంటారా? ప్రభాస్:అమ్మ, సిస్టర్ చాలా హ్యాపీ. నా సిస్టర్ అయితే గాల్లో తేలిపోతుంది. వాళ్లకు ఎవరైనా నా గురించి మాట్లాడితే చాలు.. సంతోషపడతారు. నా కెరీర్ ఈ రేంజ్‌కి వచ్చినందుకు ఆనందపడుతున్నారు. అమ్మ ఎక్కువ బయటపడరు. బయటపడితే నేనెక్కడ మారిపోతానో అని భయం అనుకుంటా (నవ్వుతూ). ♦ మరి ‘రిస్కులు తీసుకోవద్దు’ అని అమ్మ జాగ్రత్తలు చెబుతుంటారా? ప్రభాస్:బేసిక్‌గా నేను బద్ధకస్తుడ్ని. కాలేజీ రోజుల్లో.. లేటుగా లేవడం, కాలేజ్‌కి వెళ్లకపోవడం చేస్తుండేవాణ్ణి. ‘బద్ధకం వదిలించుకో.. పని చెయ్యి.. పని చెయ్యి’ అని చెబుతూనే ఉండేవారు. ఇప్పుడేమో విపరీతంగా కష్టపడుతుంటే ‘అంత కష్టపడకురా..’ అంటున్నారు (నవ్వుతూ). ‘షూటింగ్లో బాగా ఎండగా ఉందా?’ అని అడుగుతారు. ‘అమ్మా.. ప్రపంచం మొత్తం ఎండలో కష్టపడుతున్నారు. నేను ఒక్కడినేనా’ అంటాను. అప్పుడేమో పని చెయ్యమని.. ఇప్పుడేమో ఇలా కష్టపడి చేస్తుంటే బాధ.. అమ్మలు అంతే (నవ్వేస్తూ). ‘సాహో’ హైలైట్స్ ♦ ‘సాహో’ ఫ్యూచర్ ఫిల్మ్ కాదు. ప్రజెంట్ టైమ్‌లో జరిగేదే. లార్జర్ దేన్ లైఫ్ అపీల్ కోసం కొన్ని గ్రాండియర్ ఎలిమెంట్స్ యాడ్ చేశాం. ‘బాహుబలి’కి పెరిగిన బరువుని ఈ సినిమా కోసం తగ్గించడానికి వెజిటేరియన్‌గా మారాను. ♦ సుజీత్ మీద ఫస్ట్ నుంచి నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ‘రన్ రాజా రన్’ తర్వాత నాతో నీ నెక్స్› సినిమా చేస్తావా? అని అడిగాను. కథ తీసుకువస్తాను అన్నాడు. అబ్బ ఏం కాన్ఫిడెన్స్రా అనుకున్నాను. ♦ యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో ఎడిట్ చేయించాం. ♦ ‘సాహో’లో నాది డ్యూయెల్ రోల్ కాకపోవచ్చు. అలాంటి క్యూరియాసిటీ ఉండాలనే ట్రైలర్‌ను అలా కట్ చేశాం. ♦ 150 కోట్లతో ‘సాహో’ చేయాలనుకున్నాం. అది 350 కోట్లు అయింది. ♦ ప్రాగ్, ప్యారిస్, జర్మనీ దేశాల నుంచి కావాల్సిన పరికరాలను తీసుకొచ్చాం. ♦ రిస్కీ యాక్షన్ సీన్స్ తీసినప్పుడు ఒక్క దెబ్బ కూడా తగలేదు. చాలా జాగ్రత్తగా చేయించారు. ఒకప్పుడు యాక్షన్ సీన్స్ అన్నీ నేనే చేయాలనుకునేవాణ్ణి. ఇప్పుడు అవసరమైనవే చేస్తున్నాను. ♦ సీక్వెల్‌కి స్కోప్ ఉన్న కథ ‘సాహో’. అన్నీ కుదిరితే చేస్తాం. అయితే ఇప్పుడప్పుడే కాదు. ♦ ఏ సినిమాకైనా కథే మాస్టర్. ఆ తర్వాత డైరెక్టర్. ♦ యాక్షన్ సినిమా అంటున్నాం కానీ సినిమాలో యాక్షన్ యాక్షన్ యాక్షనే ఉండదు. లవ్ స్టోరీ ఉంది. యాక్షన్‌లో కూడా కార్ చేజ్లు, ఎడారి దుమ్ములో ఓ ఫైట్, హీరోహీరోయిన్ రొమాంటిక్ సాంగ్‌తో ఓ ఫైట్.. ఇలా అందరూ ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేశాం. ♦ తెలుగు సినిమా మంచి ఫేజ్‌లో ఉంది. కంటెంట్ ఉన్న సినిమాలు ఆడుతున్నాయి. ‘అర్జున్ రెడ్డి, జెర్సీ..’.. ఇలా ఈ మధ్య చాలా సినిమాలు ఆడాయి. అందరూ భిన్నంగా ప్రయత్నిస్తున్నారు. ♦ నెక్ట్స్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ఓ లవ్‌స్టోరీ చేస్తున్నాను. ఈ సినిమాని గోపీకృష్ణ, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ♦ ప్రమోషన్స్ కోసం రాష్ట్రాలు తిరుగుతున్నారు. అమ్మతో కలిసి భోజనం చేసి ఎన్ని రోజులు అయింది? ప్రభాస్:నెల రోజులు అయినట్టుంది. కలిసి మాట్లాడుతున్నాను. కానీ ఈ క్వొశ్చన్ విన్నాక అమ్మతో కలిసి భోజనం చేసి ఎన్ని రోజులైందో ఆలోచిస్తున్నా. మేం కలిసి భోజనం చేసి నెల దాటి పోయింది. ♦ మీ సినిమాలను మీ అమ్మ విమర్శిస్తుంటారా? ప్రభాస్:అమ్మో! సూపర్ క్రిటిక్. మామూలుగా కాదు. ‘బాహుబలి’లో ఓ సీన్లో నీ హెయిర్ చాలా చిన్నగా ఉందిరా అన్నారు. అమ్మా.. నా కిరీటం ఉంది. కీరిటానికి చైయిన్ కూడా ఉంది. అంత యాక్షన్ సన్నివేశాల్లో కూడా జుట్టు ఎలా గమనించావు నువ్వు? ‘అమ్మ.. మదరో’ అనుకున్నాను. ఇక్కడ మేకప్ కొంచెం బాగాలేదు. కళ్లు కొంచెం డార్క్‌గా ఉన్నాయి. క్రాఫ్ బాలేదు అని చెబుతుంటారు. డైట్ అంటూ సరిగ్గా తినకపోతే తిను తిను అంటారు. మళ్లీ కొంచెం పొట్ట వచ్చినట్టుందిరా అంటారు. తినకపోతే తినమని... తింటే లావు అయ్యావని. నాకు ఇవన్నీ చాలా ఎంజాయబుల్‌గా ఉంటాయి. ♦ ఇటీవల ముంబైలో చిరంజీవిగారిని కలిశారు. ఒకరి సినిమా గురించి ఒకరు మాట్లాడుకున్నారా? ప్రభాస్:మేం ఒకే హోటల్లో ఉన్నాం. గౌరవంగా వెళ్లి కలిశాను. మా ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆయన ఫోన్ చేశారు. ఆయన తన సొంత సినిమాలా మాట్లాడారు. చిరంజీవిగారు∙మాట్లాడిన విధానం నాకు భలే సంతోషంగా అనిపించింది. సినిమాను అంతలా ప్రేమించకపోతే ఇనేళ్లు ఇండస్ట్రీలో ఉండలేరు. ♦ యాక్టర్స్‌కి చిరంజీవి ఆదర్శం అంటారు. అయితే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’కు డోర్ ఓపెన్ చేసింది ‘బాహుబలి’ అని ఆయన అన్నారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ప్రభాస్:అది నాకు తెలియదు. అదంతా రాజమౌళి. ‘బాహుబలి’ రాజమౌళి ఫిల్మ్. అది మీరు రాజమౌళినే అడగాలి. ♦ ‘బాహుబలి’ టీమ్‌కి రాజమౌళియే స్ఫూర్తి నింపారని అన్నారు. మరి ‘సాహో’ టీమ్‌కి ఆ స్థానంలో మీరు ఉండాల్సిన పరిస్థితి. ఆ అనుభవం ఎలా అనిపించింది? ప్రభాస్:మా ‘సాహో’ టీమ్‌కి కూడా ‘బాహుబలి’యే స్ఫూర్తి. యూవీ వంశీ, ప్రమోద్ మంచి ప్యాషనేట్. నేను యూవీకి, యూవీకి నేను, మాకు డైరెక్టర్ సుజీత్.. మాకన్నా సుజీత్ వయసులో చిన్నవాడు. కానీ ‘ఏం కాదు అన్నా’ అని ధైర్యం చెప్పాడు. అతని వయసు ఏంటి? మాకు చెప్పడం ఏంటీ? అనుకున్నాం (నవ్వుతూ). బట్ ‘సాహో’ టీమ వర్క్. ♦ యాక్టర్‌గా మీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి? ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు? ప్రభాస్:‘బాహుబలి’ సినిమాతో రాజమౌళి ఇండియన్ సినిమాకు ఇంకేదో చూపించారు. నెక్ట్స్ నా సినిమాలకు ఆడియన్స్ వచ్చినప్పుడు మేం ఏదో చూపించాలని ప్రయత్నం చేశామని చెప్పడానికి నానా తంటాలు పడ్డాం. ‘సాహో’ చేశాం. నెక్ట్స్ ఎలాంటి సినిమాలంటే... చూడాలి. ♦ బ్యాంకాంక్‌లో మేడమ్ తుస్సాడ్స్‌లో మీ మైనపు విగ్రహం పెట్టడం ఎలా అనిపించింది? ప్రభాస్:‘బాహుబలి’ వల్ల చాలా విషయాలు జరిగాయి. జపాన్ వెళ్లినప్పుడు అక్కడ రానాని ఫ్యాన్స్ పట్టుకుని ఏడవడం అవి అన్నీ వింటుంటే...‘బాహుబలి’ రూపంలో ఏదో ఒక అద్భుతం జరిగిపోయింది. అందులో మేడమ్ తుస్సాడ్స్ ఒకటి. ♦ ఫ్యాన్స్ అంతా మిమ్మల్ని ‘డార్లింగ్’ అని పిలుచుకుంటారు. ఎయిర్‌పోర్ట్‌లో ఓ అమ్మాయి ఏకంగా మీ బుగ్గ గిల్లి పారిపోవడం? ప్రభాస్:అది నేను ఊహించలేదు. ఎందుకంటే మేల్ ఫ్యాన్స్ కొంచెం గట్టిగా పట్టుకుని లాగడం అనుభవమే. అయితే ఒక అమ్మాయి నుంచి ఈ సంఘటనను నేను ఊహించలేదు. అప్పటికే నేను 18గంటలు ట్రావెలింగ్‌లో ఉన్నాను. అప్పుడే ఫ్లయిట్ దిగాను. ఫొటో అడిగింది. సరే కదా అని కళ్లజోడు పెట్టుకుని ఫొటో ఇచ్చాను. ఆ అమ్మాయి బాగా హైపరైపోయి నా బుగ్గ గిల్లింది. కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యా. కానీ ఇదంతా ప్రేమలో భాగమే కదా అనిపించింది (నవ్వుతూ). ♦ మీరు కనిపించినప్పుడు పెద్ద స్థాయిలో మీ చుట్టూ ఫ్యాన్స్ గుమిగూడతారు. ఫోటోల కోసం పోటీ పడుతుంటారు. అయినా మీరు సహనం కోల్పోకుండా ఎంతో ఓర్పుగా ఉంటారు... ప్రభాస్:అది ఫస్ట్ నుంచే డిసైడైపోయాను. నేనైతే అభిమానులను కొట్టలేను. తొయ్యలేను. నాకు రక్షణగా ఉన్నవారు అలా చేయడానికి ప్రయత్నించినా నాకు ఏదోలా ఉంటుంది. ఒక్క ఫ్యాన్ వస్తే చాలు అనుకున్నప్పుడు... ఇంత మంది ఫ్యాన్స్ ఉండటం అంటే హ్యాపీనే కదా. ఎలాగూ నేను బయట కనిపించేది తక్కువ. కనిపించినప్పుడు అభిమానం చూపిస్తారు. అది నాకు ఇష్టమే. ♦ ‘బాహుబలి 2’ విడుదలప్పుడు కన్నా... ‘సాహో’ విడుదలకు ఏమైనా ఎక్కువ టెన్షన్ పడుతున్నారా? ప్రభాస్:‘బాహుబలి 2’ అప్పుడు పెద్దగా టెన్షన్ లేదు. ఎందుకుంటే అప్పటికే ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలైపోయింది. యాభై శాతం సక్సెస్ వచ్చింది. ఇండియా అంతా యాక్సెప్ట్ చేశారు. ‘బాహుబలి 2’ లో కూడా మంచి కంటెంట్ ఉంది. మినిమమ్ గ్యారంటీ అనుకున్నాం. కానీ ‘బాహుబలి 1’ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడు ముంబై వెళ్లాం. తమిళనాడు వెళ్లాం. కేరళ వెళ్లాం.. మాట్లాడాం. ‘బాహుబలి’లో అది చేశాం.. ఇది చేశాం అని చెప్పాం. రేపు ఈ సినిమా చూసి.. ఇదేం సినిమారా అంటారేమోనని భయం. మళ్లీ బడ్జెట్ ఒకటి. ఆపేయాలా.. ఆగిపోవాలా? ఏమైనా తేడా జరిగితే.. ఇలాంటి ఆలోచనలతో ‘బాహుబలి 2’ అప్పుడు భయంకరమైన ప్రెజర్. ‘సాహో’ రిలీజ్ అప్పుడు ఇంకో రకమైన ప్రెజర్. ♦ హిందీలో కరణ్ జోహార్ ఓ సినిమా చేయమంటే మీరు చేయనన్నారనే వార్తలు వచ్చాయి.. ప్రభాస్:అదేం లేదు. నేను, కరణ్ జోహార్ ఇప్పటికీ మాట్లాడుకుంటాం. భవిష్యత్‌లో కరణ్‌తో సినిమా ఉండొచ్చు. ఏమో.. ఇప్పుడే చెప్పలేను. ♦ నెగటివ్ కామెంట్స్‌ని ఎలా తీసుకుంటారు? ప్రభాస్:నేను ఎక్కువగా సోషల్ మీడియాను ఫాలో అవ్వను. కానీ సక్సెస్‌లో అవి కూడా భాగం అనుకుంటాను. సక్సెస్ రోడ్ స్ట్రైయిట్‌గా ఉండదు కదా. చాలా దార్లు తొక్కి వచ్చాం. కొన్నిసార్లు నా తప్పులు ఉంటాయి. మరికొన్ని సార్లు పరిస్థితుల ప్రభావం కావొచ్చు. నెగటివ్, పాజిటివ్ సక్సెస్‌లో భాగమే. ♦ ఫైనల్లీ దాదాపు 2 కోట్లు (ఫస్ట్ సినిమా ‘ఈశ్వర్’ బడ్జెట్) నుంచి 350 కోట్ల (‘సాహో’ బడ్జెట్) వరకు చేరుకున్న మీ ప్రయాణం గురించి? ప్రభాస్:‘ఈశ్వర్’కి కోటీపాతిక లక్షలు అయింది. ఆ సినిమా అంతా రోడ్డు మీదే చేశాం. పెద్ద స్టార్స్ కూడా లేరు. అక్కణ్ణుంచి కెరీర్ ఇంతదాకా వచ్చింది. ఇది నా ఒక్కడివల్ల కాదు. నాతో సినిమాలు చేసిన అందరికీ దక్కుతుంది. – సినిమా డెస్క్ -
బాలీవుడ్‌కు కథ లేదట!
ఒకప్పుడు సలీం జావెద్, సచిన్ బౌమిక్, గుల్జార్... వంటిరచయితలనిచ్చిన బాలీవుడ్ ఇప్పుడు కథకులు లేకకలవరపడుతోంది. కథలు లేక కలత పడుతోంది.బయోపిక్‌లతో కాలం వెళ్లబుచ్చుతోంది. ఈ బాలీవుడ్‌కి ఏమయింది? రాజ్ కపూర్, కే.ఏ. అబ్బాస్ కలిస్తే డైమండ్ జూబ్లీ సినిమాలు వచ్చేవి.శక్తి సామంత, సచిన్ బౌనిక్ కలిస్తే గోల్డెన్ జూబ్లీ సినిమాలు వచ్చేవి.రమేష్ సిప్పి, జావేద్–అఖ్తర్‌లు కలిస్తే సిల్వర్ జూబ్లీ సినిమాలు వచ్చేవి.హృషికేశ్ ముఖర్జీ– గుల్జార్ కలిస్తే జూబ్లీ టు ది పవర్ ఆఫ్ జూబ్లీ సినిమాలు వచ్చేవి.పూర్వం దర్శకులు, రచయితలు జంటగా ఉండేవారు.రచయితలు కొత్త కొత్త కథలు అల్లి చెప్పేవారు.హిందీ సినిమాను చూసి దక్షిణాది సినిమా ఇన్‌స్పయిర్ అయ్యేది.సినిమా కాగితం మీద పుడుతుంది. కథ వల్ల పుడుతుంది. కథ వల్లే బతుకుతుంది.కాని ఇవాళ బాలీవుడ్లో కథ వండే వంటవాళ్లు తక్కువైపోతున్నారు. ఒరిజినల్ కథను కనిపెట్టే వాళ్లు తక్కువైపోతున్నారు. దాంతో బాలీవుడ్ మనుషుల కథల మీద పడింది. నిన్నగాక మొన్న సక్సెస్ చూసిన వాళ్ల బయోపిక్‌లను కూడా తయారుచేయడం మొదలుపెట్టింది. లేదంటే రీమేక్‌ల సుఖానికి అలవాటు పడింది.ఎంతో ఘనమైన బాలీవుడ్‌కు ఈ భావదారిద్య్రం రోజులు రావడం విషాదం.ఒక అమాయకమైన పాలనురగ లాంటి వాడు నగరానికి వస్తే అతడు కలుషితమయ్యి ఎలా మారుతాడనడానికి గుర్తుగా ‘శ్రీ 420’ కథ వచ్చింది. అలాంటి కథలు ఇప్పుడు ఏమయ్యాయి. నేరస్తులను సంస్కరించాలంటే జైలులో ఉన్న నాలుగు గోడలు కాదు కావలసింది మానవత్వం ఉన్న ఒక హృదయం అని చెప్పిన ‘దో ఆంఖే బారా హాత్’ సినిమా వచ్చింది. అలాంటి కథలు ఇప్పుడు ఏమయ్యాయి. విధి కూడా చిన్నపిల్లాడు లాంటిది... బంధాలు చెరిపేస్తుంది.. తిరిగి కలుపుతుంది అనే థీమ్‌తో విడిపోయి కలిసే అన్నదమ్ముల కథ ‘వక్త్’ వచ్చింది. ఇప్పుడు అలాంటి కథలు రాసేవారు లేరు. సిన్సియారిటీ కూడా కథే అవుతుంది అని ‘జంజీర్’ స్క్రిప్ట్ రాసిన సలీమ్–జావేద్‌ల వారసత్వం ఇప్పుడు వెతుకుతున్నా కానరావడం లేదు. కొత్త కథలను తెర మీద కన్విన్సింగ్‌గా చెప్పిన గుల్జార్, గోవింద్ నిహలానీ, మహేష్ భట్‌లాంటి దర్శకుల సంఖ్య తగ్గిపోవడంతో ఒరిజినల్ కథలను ఆలోచించలేని దర్శకులు గొప్ప క్రాఫ్ట్ తెలిసినా దిక్కులు చూడాల్సి వస్తోంది. ‘దిల్ చాహ్తాహై’ వంటి తాజా కథలు అందించిన ఫర్హాన్ అఖ్తర్లాంటి వాళ్లు హీరోలు అయిపోవడంతో కథలు అల్లే ఆ కాస్త శక్తి కూడా డైవర్ట్ అయిపోయింది. చరిత్రను తవ్వి తీసి ‘లగాన్’ వంటి స్క్రిప్ట్ రాసుకున్న బాలీవుడ్ ఇవాళ వేరే కథలు లేక హీరో సంజయ్ దత్ కథను, సెక్స్ స్టార్ షకీలా కథను బాలీవుడ్ సినిమాలు తీస్తోంది. పిచ్చి ముదిరి పాకాన పడిందన్నట్టు తన సినిమాకు తానే దర్శకత్వం వహించుకుంటానని కంగనా రనౌత్ చెప్పింది. సుదీర్ఘ జీవితం చూసే వరకూ కూడా ఆగకుండా నిన్న మొన్నటి జీవితాన్ని కథలుగా ఎంచుకునే కథా లేమికి బాలీవుడ ఎందుకు వెళ్లిందన్నది ఆలోచించాల్సిన విషయం. సిద్ధంగా ఉన్న సరుకు ఇంత పెద్ద దేశంలో ఎంతోమంది సెలబ్రిటీలు ఉంటారు. వాళ్లు పైకి రావడానికి ఎంతో స్ట్రగుల్ ఉంటుంది. పైగా వారితో దేశానికి పరిచయం ఉంటుంది. కొత్తగా కథలు అల్లడం ఎందుకు... ఆ వ్యక్తుల జీవితాలనే కథగా తీసుకుందాం అని సృజనాత్మక సుఖానికి బాలీవుడ్ అలవాటు పడింది. ‘దంగల్’, ‘సంజు’, ‘సూర్మ’, ‘గోల్డ్’, ‘‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరికోమ్’. ‘ఎమ్ఎస్. ధోని: ది ఆన్‌టోల్డ్ స్టోరీ’ ఇవన్నీ ఆ వరుసలో వచ్చాయి. విజయం సాధించాయి. ఈ ధోరణి ఎక్కడి దాకా వెళ్లిందంటే డాన్ల కథలు చాలక డాన్ల అక్కచెల్లెళ్ల జీవిత కథలను తీసే వరకు. రాజకీయ నాయకులు జీవించి ఉండగానే వారి కథలను కూడా బాలీవుడ్ వదిలి పెట్టకుండా తీయడానికి ఉవ్విళ్లూరుతోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఒక సినిమా ఇది వరకే రాగా నరేంద్ర మోడీపై సినిమా సిద్ధం కానుంది. అయితే స్పోర్ట్ పర్సనాలిటీల మీదే ఎక్కువ సినిమాలు ఇప్పుడు తయారవుతున్నాయని సమాచారం. వరల్డ్ కప్‌ను సాధించిన కపిల్ దేవ్‌పై, ఉత్తర ప్రదేశ్ షార్ప్ షూటర్స్ చండ్రో, ప్రకాషి తోమర్‌లపై, ఎయిర్ రైఫిల్ షూటర్ అభినవ్ బింద్రా పై, ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ మాజీ మేనేజర్ సయ్యద్ రహీమ్ పై సినిమాలు రెడీ అవుతున్నాయి. పెద్ద పెద్ద హీరోలు ఈ రోల్స్ చేయడానికి డేట్స్‌తో సిద్ధంగా ఉన్నారు. అలాగే సైనా మీద ఒక సినిమా ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. పీవీ సింధు కథ కూడా త్వరలో పట్టాలు ఎక్కవచ్చు. సానియా మిర్జా, మిథాలీ రాజ్‌ల గురించి సినిమాల పై కూడా కసరత్తు జరుగుతోంది. సామాన్యుల కథలు కథల కరువుతో బాలీవుడ్ అసామాన్యులైన సామాన్యుల కథలను కూడా అన్వేషిస్తోంది. తన ఇద్దరు కుమార్తెలను బాక్సర్లను చేసిన సామాన్య తండ్రి కథ ఆధారంగా ‘దంగల్’ వచ్చాక ఆ అన్వేషణ మరింత పెరిగింది. స్త్రీలకు శానిటరీ నేప్కిన్స్ అందించడానికి జీవితాన్ని వెచ్చించిన మురుగనాథమ్ స్ఫూర్తితో ‘ప్యాడ్‌మేన్’ సినిమా వచ్చింది. 2005లో యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ కథ అధారంగా ఇప్పుడు ‘చప్పాక్’ అనే సినిమా రాబోతోంది. ఒక రీమేక్ ఇవ్వండి బాబయ్యా ఒకప్పుడు హిందీ కథలు తెలుగులో రీమేక్ అయ్యేవి. ‘నిప్పులాంటి మనిషి’, ‘నేరం నాది కాదు ఆకలిది’, ‘అన్నదమ్ముల అనుబంధం’, ‘ఎదురీత’ ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి. కాని ఇప్పుడు బాలీవుడ్ కథలు లేక సౌత్ వైపు చూస్తోంది. రౌడీ రాథోడ్ (విక్రమార్కుడు), వాంటెడ్ (పోకిరి), కిక్ (కిక్)...ఈ వరుస పెరుగుతోంది. ‘టెంపర్’ను ‘సింబ’గా తీస్తే సూపర్బ్ కలెక్షన్స్ వచ్చాయి.∙‘ప్రస్థానం’ ‘ప్రస్థాన్’ గా రీమేక్ అవుతోంది. సంజయ్‌దత్, మనీషా కోయిరాల, అలీ ఫజల్, అమైరా దస్తూర్ నటిస్తున్నారు. తెలుగు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన దేవకట్టానే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం హిందీలో ‘కబీర్ సింగ్’గా తెరకెక్కుతోంది. తెలుగు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సందీప్ వంగానే ‘కబీర్ సింగ్’ను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ‘కాంచన’, ‘విక్రమ్‌వేద’, ‘ఖైదీనంబర్ 150, ‘7/ జీ బృందావన్ కాలనీ’, ‘ఆర్ఎక్స్ 100’ ఇవన్నీ బాలీవుడ్‌కు కథా భిక్ష పెట్టనున్నాయి. తీసిందే తీసి కథల లేమి వల్ల బాలీవుడ్ తాను తీసిన సినిమాలను మళ్లీ తీయాలనుకుంటోంది. 1978లో బీఆర్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన ‘పతి పత్నీ ఔర్ ఓ’ ను మళ్లీ తీస్తున్నారు. 1991లో తెలుగులో వచ్చిన ‘కూలీ నెంబర్ 1’ అదే పేరుతో హిందీలో అప్పుడే తీసి మళ్లీ ఇప్పుడు కూడా తీస్తున్నారు. 1971లో వచ్చిన ‘హాథీ మేరే సాథీ’ చిత్రం స్ఫూర్తితో సేమ్ టైటిల్‌తో హిందీలో రీమేక్ అవుతోంది. ఇందులో రానా హీరో. తెలుగులో ‘అరణ్య’ అనే టైటిల్ పెట్టారు. 1994లో వచ్చిన హిందీ చిత్రం ‘అందాజ్ అప్నా అప్నా’ (1994)ను రీమేక్ చేయనున్నట్లు జోరుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కథలు లేని బాలీవుడ్ ప్రపంచ సినిమాల నుంచి అఫీషియల్‌గా కథలు కొని రీమేక్ చేస్తోంది. ఇటీవల సూపర్ హిట్ అయిన హిందీ సినిమా ‘అంధా ధున్’, తాజాగా విడుదలైన ‘బద్లా’ ఫ్రెంచ్, స్పానిష్ భాషల కథల నుంచి స్వీకరించినవి. కొంప ముంచుతున్న కాంబినేషన్లు ఫ్యాన్సీ కాంబినేషన్ల కోసం పాకులాడి ఆ కాంబినేషన్లకు తగినట్టుగా కథలు వెతకలేక కథలు సృష్టించకలేక బాలీవుడ్ అవస్థలు పడుతోంది అనిపిస్తోంది. కథ రచయిత నుంచి పుట్టి దర్శక నిర్మాతల వద్దకు వెళ్లి ఆ తర్వాత తగిన నటీనటులను ఎంచుకోవాలి. ఇప్పుడు నటీనటులు ముందు వరుసలోకి రావడం వల్ల వారికి తగిన కథలు అల్లడం కష్టమవుతోంది. అనురాగ్ కశ్యప్, అనురాగ్ బసు, రాజ్ కుమార్ హిరాణి వంటి దర్శకులంతా ముందు రచయితలు తర్వాత దర్శకులు. ఇలా రచయితలు దర్శకులైపోయే ట్రెండ్ వల్ల కూడా సరైన కథలు తయారు కావడం లేదు. ‘డర్టీ పిక్చర్’ రాసిన రజత్ అరోరా, ‘పాన్ సింగ్ తోమార్’ రాసిన తిగ్ మన్షు ధులియా, ‘తారే జమీన్ పర్’ రాసిన అమోల్ గుప్తే, ‘పికూ’ రాసిన జూహీ చతుర్వేది వంటి రచయితలెందరో బాలీవుడ్లో ఉన్నారు. వీరి వద్ద కథలు కచ్చితంగా ఉంటాయి. కాని వినే ఓపిక, తీరికా బాలీవుడ్ పెద్దలకు ఉంటే కొత్త కథలు కొత్త సినిమాలు కచ్చితంగా వస్తాయి. అలా అని ఆశిద్దాం. – ఇన్పుట్స్: ముసిమి శివాంజనేయులు -
ఇట్స్ సాహో టైమ్!
యాక్షన్... స్పీడ్.. టైమింగ్స్‌లో ‘సాహో’ది డిఫరెంట్ స్టైల్! ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1’ వీడియో చూసిన వారికి ఈ విషయం అర్థం అవుతోంది. ఇప్పుడు ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2’ వీడియోను రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందని తెలిసింది. ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1’ను ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. వచ్చే నెల 4న మహాశివరాత్రి. 3న ‘సాహో’ చిత్ర కథానాయిక శ్రద్ధాకపూర్ బర్త్ డే. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని ‘సాహో’ బృందం చాప్టర్ 2 వీడియోను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అంటే.. ఇట్స్ సాహో టైమ్ అన్నమాట. ‘సాహో’ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు 300కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. కెన్నీ బెట్స్ వంటి యాక్షన్ కొరియోగ్రాఫర్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ‘డినో యురి 18 కెడబ్ల్యూ’ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్‌ని క్యాప్చర్ చేస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన సెట్లో జరుగుతోంది. ఈ సినిమాకు శంకర్–ఎహసన్–లాయ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ రచయిత అమితాబ్ భట్టాచార్య హిందీ లిరిక్స్‌ను అందిస్తున్నారు. ‘‘ఆల్రెడీ విడుదల చేసిన ఫస్ట్‌లుక్, ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1’కి మంచి స్పందన లభిస్తోంది. మార్చి 3న ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2’ను విడుదల చేయబోతున్నాం’’ అని చిత్ర బృందం పేర్కొంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘సాహో’ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. హిందీలో ఈ సినిమాను నిర్మాత భూషన్ కుమార్ రిలీజ్ చేయనున్నారని తెలిసింది. -
ఆ ప్రశ్న ప్రభాస్‌నే అడగండి!
‘‘మ్యాచ్‌లు కచ్చితంగా ఆడతాను. కానీ ఎప్పుడన్నది చెప్పలేను’’ అంటున్నారు శ్రద్ధా కపూర్. బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్‌లో శ్రద్ధా కపూర్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం లేదన్న ఊహాగానాలు ఈ మధ్య ఊపందుకున్నాయి. ‘‘ప్రస్తుతం ‘సాహో’ సినిమాతో బిజీగా ఉన్నాను. నేను నటిస్తోన్న హిందీ సినిమా ‘స్త్రీ’ షూటింగ్ చందేరిలో జరుగుతోంది. నా కెరీర్లో ఫస్ట్ టైమ్ చేస్తోన్న హారర్ సినిమా ఇది. సైనా నెహ్వాల్ బయోపిక్ తప్పకుండా సెట్స్‌పైకి వెళుతుంది. కానీ ఎప్పుడన్నది ఎగ్జాట్‌గా చెప్పలేను’’ అని శ్రద్ధా కపూర్ చెప్పారని బీటౌన్ సమాచారం. ‘సాహో’ చిత్రంలో తన కో–స్టార్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ –‘‘ప్రభాస్ సూపర్ యాక్టర్ మాత్రమే కాదు.. మంచి హ్యూమన్ బీయింగ్ కూడా’’ అన్నారు. మరి.. ప్రభాస్ పెళ్లి గురించి మీకేమైనా తెలుసా? అని బీ టౌన్ మీడియావారు అడగ్గా.. ‘‘నాకు తెలీదు. ఈ ప్రశ్న ప్రభాస్‌నే అడగండి’’ అని నవ్వుతూ అన్నారట. ప్రభాస్ సరసన అర్షిఖాన్? అర్షిఖాన్... హిందీ బిగ్‌బాస్ లెవెన్త్ ఎడిషన్ షోలో పాల్గొనడం ద్వారా పాపులర్ అయ్యారు. అంతేకాదు ఓ ప్రముఖ చానెల్లో ఓ ప్రోగ్రామ్‌కి ఆమె గెస్ట్‌గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అర్షిఖాన్ గురించి ఇంతగా ఎందుకు అంటే.. ప్రభాస్ సినిమాలో చాన్స్ కొట్టేశానని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘‘ప్రభాస్ నటించనున్న సినిమాకు సైన్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు అర్షిఖాన్. అది ఏ సినిమా అని మాత్రం ఆమె చెప్పలేదు. ప్రభాస్ బాలీవుడ్లో చేయబోయే నెక్ట్స్ సినిమాకా? లేక ఆల్రెడీ చేస్తున్న ‘సాహో’లో కీలక పాత్రకా? అనేది తెలియాల్సి ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఎంటర్టైన్మెంట్ విభాగంలో గతేడాది గూగుల్ సెర్చ్‌లో సన్నీ లియోన్ తర్వాత మోస్ట్ సెర్చింగ్ పర్సన్ అర్షిఖాన్నే కావడం విశేషం. -
రావణుడిగా హీరోయిన్ తండ్రి
దేశ రాజధాని ఢిల్లీలో ఏటా ఘనంగా నిర్వహించే దసరా వేడుకల్లో ఈసారి ఓ హీరోయిన్ తండ్రి రావణాసురుడి వేషం వేసి అందరినీ అలరించారు. తన అందం, అభినయంతో ప్రస్తుతం బాలీవుడ్‌ని ఊపేస్తున్న గులాబి బాల శ్రద్ధా కపూర్ తండ్రి, ప్రముఖ నటుడు శక్తి కపూర్ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరుగుతున్న దసరా వేడుకల్లో రావణాసురుడి వేషం వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఉత్తరాదిలో దసరాను ఎంతో వేడుకగా నిర్వహించుకుంటారు. ప్రధానంగా రాంలీలా మైదానంలో భారీ ఎత్తున రావణాసురుడి బొమ్మను పెట్టి.. దాన్ని దహనం చేయించడం అలవాటు. అలాగే పలువురు ప్రముఖులు కూడా వీటిలో రకరకాల వేషాలు వేస్తుంటారు. ఈసారి ఢిల్లీ ఎర్రకోట వేడుకల్లో శక్తి కపూర్ తన నటనా సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా ప్రజలకు చూపించారు. సినిమాల్లో విలన్‌గా ఎంత భయపెట్టగలడో కమెడియన్‌గా అంతే నవ్వించగల విలక్షణ నటుడు 'శక్తి కపూర్'. ఆయన ముద్దుల తనయ శ్రద్ధా కపూర్ కూడా తండ్రి బాటలోనే తన మార్క్ నటనతో బాలీవుడ్లో స్థానం సుస్థిరం చేసుకుంటోంది. -
ఎటువంటి పాత్రలోనైనా నటిస్తా: శ్రద్ధాకపూర్
న్యూఢిల్లీ: ‘ఎటువంటి పాత్రలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నా. ఫలానా పాత్రే కావాలని అనుకోవడం లేదు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయేవిధంగా నన్ను నేను మలుచుకుంటా. పరిశ్రమలో నాకంటూ ఒక స్థానం సంపాదించుకుంటా’ శ్రద్ధాకపూర్ అని తెలిపింది. ఆషిఖి 2 సినిమా హిట్ కావడంతో బాలీవుడ్లో మంచి స్థానం దక్కినట్టు నటి శ్రద్ధాకపూర్ భావిస్తోంది. సమకాలీక నటులతో పోల్చుకోవడం తప్పనిసరని అనుకుంటున్న శ్రద్ధ...అందుకు కూడా సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. పరిశ్రమలో ఏ స్థానంలో ఉన్నామనే దానికంటే తన పనితీరును మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి పెట్టాలనుకుంటోంది ఈ 24 ఏళ్ల ఈ అందాలభామ. ‘నాకు నచ్చినా నచ్చకపోయినా ఇతరులతో పోల్చుకోవడం అనివార్యం. అయితే నేను చేస్తున్న పనిపై దృష్టి పెట్టడమే ఉత్తమమనేది నా ఆలోచన. నటిగా నన్ను నేను మెరుగుపరుచుకోవడమే భావించి చిన్ననాటి కలల నుంచి బయటనపడి ఇక్కడ ఉంటున్నా. ఇక వెనక్కి తిరిగి చూడదలుచుకోలేదు’ అంటూ తన మనోభావాలను మీడియాతో పంచుకుంది. గాయని అరోహి పాత్ర పోషించిన శ్రద్ధ... అందరి మనసులను కొల్లగొట్టింది. ఇకపై తన నటనా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుకోవాలనే గట్టి పట్టుదలతో ఉంది. ఎటువంటి పాత్రలోనైనా ఇమిడిపోయేవిధంగా ఎదగాలనే తపనతో ముందుకు సాగుతున్నానంది.. కాగా నటి శ్రీదేవిని, ఆమె పనితీరును శ్రద్ధ ఆదర్శంగా తీసుకుంది.