Ranbir Kapoor, Shraddha Kapoor Upcoming Luv Ranjan Film Set In Mumbai Catches Fire, One Died - Sakshi
Sakshi News home page

Fire Accident in Shooting Set: స్టార్‌ హీరో షూటింగ్‌ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం, ఒకరు మృతి

Published Sat, Jul 30 2022 10:16 AM | Last Updated on Sat, Jul 30 2022 10:49 AM

Fire Accident in Ranbir Kapoor Luv Ranjan Shooting Set, One Died - Sakshi

స్టార్‌ హీరో షూటింగ్‌ సెట్‌లో అపసృతి చోటుచేసుకుంది. బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్‌ రంజన్‌’. చిన్న ముంబైలో జరిగిన ఈ మూవీ షూటింగ్‌లో భారీ అగ్నీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూవీ సిబ్బంది ఒకరు మృతి చెందినట్లు సమచారం. వివరాలు.. రణ్‌బీర్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ నిన్న ముంబైలోని అంధేరి చిత్రకూట్‌ మైదానంలో జరిగింది.

చదవండి: ఒకప్పుడు సునీల్‌ నచ్చాడు, కానీ ఇప్పుడు కాదు: వేణు

ఈ నేపథ్యంలో సెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షూటింగ్‌ సిబ్బంది మనీశ్‌ దేవాశీ(32) మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదంపై ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా ఎనిమిది ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో హీరోహీరోయిన్లు అక్కడ లేకపోవడం వారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement